27, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4570

28-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్”
(లేదా...)
“కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్”

22 కామెంట్‌లు:

  1. హారకుడు రక్షక భటుల
    తీరును కొంచెముగ నైన దెలియక వారిన్
    చేరువ నందున గల యధి
    కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్

    రిప్లయితొలగించండి
  2. భీరులు గారు పాండవులు, ప్రేమను బంచుచు రాయబారిగా
    వారిటు బంప వచ్చితిని బావ! సుయోధన! యుద్ధ మేలనో?
    వారల నాదరింపు, పరివారము గావు మనంగఁ, గృష్ణు నా
    కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్.

    రిప్లయితొలగించండి
  3. నా బాల్యంలో పొరుగూరి సర్పంచ్ పాలనలో నకృత్యాల నేపథ్యంలో....

    కందం
    నేరక యయోగ్యడని యధి
    కారమునిడ యుక్తమెంచు జ్ఞాన రహితుడై
    మీరెనె! యున్మాదికి నధి
    కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్!

    ఉత్పలమాల
    నేరక యోగ్యుడంచు ప్రజ నేతఁగ నందలమప్పగింపగన్
    మీరుచు యుక్తముల్ గనక మేయుట నేర్చెనెనైచ్యమైన సా
    కారమునయ్యె నున్మధిత! జ్ఞానవిహీనుఁడనంగ నుచ్ఛ సం
    స్కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్


    రిప్లయితొలగించండి
  4. నేరపు తత్త్వము గల్గియు
    దారుణ కృత్యములు బెక్కు దానవు భంగిన్
    ధారుణి లో సలుపు న హం
    కారము గనక యొనరించె వి కారపు చేష్ట ల్

    రిప్లయితొలగించండి
  5. నేరుపుతో దాచె నొకడు
    ఊర నెవరెరుగని రీతి వోరుపు మీరన్,
    చోరుడు దోచగ నపుడు 'ల'
    కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్”

    రిప్లయితొలగించండి

  6. మారడు వాడు దురాత్ముడు
    పేరిమితో చెంతజేరి పిలిచిన వేళన్
    దూరి తొలగె సోదరి మమ
    కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్.

    రిప్లయితొలగించండి
  7. ఉ.

    కోరిన భామ వచ్చునని కొంచెము ధైర్యము నాశనొందుచున్
    జీరను చించి ధోవతిగ చిత్రముగా ధరియింప హాస్యమై
    దూరపు కొండలే నునుపు, దుర్భర కార్యము, పెండ్లి, యంగసం
    *స్కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్.*

    రిప్లయితొలగించండి
  8. దారుణ కృత్యంబుల నల
    రారు నికృష్టుడు మరచెను రాజ్యాంగంబున్
    దూఱెడు జనావళి తిర
    స్కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్

    వారుణిపైన యుద్ధమని పల్కిన వాడగు మూర్ఖనేత తాఁ
    దారుణ వైఖరిన్ కపట తంత్రపు చేష్టల దుష్ప్రవృత్తితో
    ఘోరపు కృత్యముల్ సలిపి కుచ్చితకాడను పేరుతో తిర
    స్కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్

    రిప్లయితొలగించండి
  9. కోరికలకు బానిసయై
    తీరక నేరములఁ జేయ తెగియించి తుదన్
    ఘోరములకు బాల్పడి సం
    స్కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్

    రిప్లయితొలగించండి

  10. వారలు పాండు పుత్రులట వాజజ మందున భక్తితోడ కం
    సారిని గారవించి కడు సంస్తుతి జేసెడు పాళమున్ దురా
    చారుడు చేదిరాజుకట శత్రువు కందెడు మేటియైన స
    త్కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్.

    రిప్లయితొలగించండి
  11. కోరికలుప్పతిల్లగను కుప్పలు తెప్పలుగా మనంబునన్
    నేరములెన్నియో సలిపి నిత్యము దుర్జన సంగతమ్మునన్
    ఘోరపు దుష్క్రియల్ నెరపు క్రూరుడు సభ్య సమాజమందు సం
    స్కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్

    రిప్లయితొలగించండి
  12. మారక సద్వచనమ్ముల
    జారలు వారల గుణమ్ము చపలము గానా
    కూరిమితో చేసిన సహ
    కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్

    రిప్లయితొలగించండి
  13. కం॥ తీరని కోర్కెల సతతము
    నేరక పతి ధనవనరుల నిష్ఠుర పగిదిన్
    దూరుచు నొకసతి పతి మమ
    కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్

    ఉ॥ మారక మద్యపానమును మానక భార్యను సర్వవేళలా
    భూరిగఁ గష్టపెట్టుచును మూర్ఖత వీడక నున్న పత్ని సం
    సారము నీదలేక తగు సాయముఁ గానక బోధసేయ ధి
    క్కారము నిచ్చగించక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్

    రెండూ సర్వ సాధారణమేనండి

    రిప్లయితొలగించండి
  14. మారుతచూలియాలి వరమానిని ద్రౌపది పొందుగోరుచున్
    వీరుడనంచు రౙ్జనలు బీరములాడెడు కోచగాడు నా
    జారుడు ఉత్తరుండు మదిచంచలమొందగ కామమున్ తిర
    స్కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్

    మారుతచూలి : భీముడు

    రిప్లయితొలగించండి
  15. బీరములాడుచుసతతము
    మీరుచుహద్దులను క్రిందుమీదెరుగకహం
    కారముతోడఖలుడుసం
    *“*స్కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్*

    రిప్లయితొలగించండి
  16. భీకర పేదరికముచే
    శోకములో మ్రగ్గి యున్న సుజనుని గనితా
    బ్రాకటముగ జేసిన సహ
    కారము గనక యొనరిచెవికారపు చేష్టన్

    రిప్లయితొలగించండి
  17. దూరము సేయ దు:ఖమును దోరపు
    పేదరికంపు భారమున్
    పేరిమితో నొకండు కడు పేదకు
    సాయము సేయ దల్చి తా
    జేరియు వానిచెంతకును జెప్పను,
    మూర్ఖడు వాడు, వాని హాం
    కారము నిచ్చగింపక వికారపు జేష్టలొ
    నర్చె మందుడున్.

    రిప్లయితొలగించండి