1, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4547

2-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీతావల్లభుఁడు చంద్రశేఖరుఁ డయ్యెన్”
(లేదా...)
“సీత మగండు చూడ శశిశేఖరుఁడయ్యె జనుల్ స్తుతింపఁగన్”

16 కామెంట్‌లు:

  1. కందం
    ప్రీతిగ పౌరాణికముల
    రీతిగ నటియింప నొప్ప ప్రియనటుఁడగు న
    య్యాతడె గతచిత్రమునన్
    సీతావల్లభుఁడు, చంద్రశేఖరుఁ డయ్యెన్


    ఉత్పలమాల
    ప్రీతిఁ బురాణ చిత్రముల పేరును గాంచెడు పాత్రలందునన్
    రీతి నటించు వాడనుచుఁ బ్రేరణమీయగ ప్ర్రేక్షకాళియున్
    జాతి భళీయనన్ మెరసి సాగెనహో! గతచిత్రమందునన్
    సీత మగండు, చూడ శశిశేఖరుఁడయ్యె జనుల్ స్తుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  2. ఖ్యాతివహించిన సిరయాళ్
    శ్రోతలుమెచ్చిన మిగుల సుశోభితమౌ యా
    రాతిరి నాటకమందున
    సీతా వల్లభుడు, చంద్ర శేఖరడయ్యన్

    రిప్లయితొలగించండి

  3. ఆ తారకాసురుని యా
    ఘాతించు కుమారుని గన కామారియె నా
    మాతాంగి కపుడు వినవే
    సీతా! వల్లభుఁడు చంద్రశేఖరుఁ డయ్యెన్


    యాతుడు తారకాసురుని నంతము జేసెడు శక్తిమంతుడౌ
    ఖ్యాతి వహించినట్టి సుతుడా శిఖి వాహను బొంద నెంచి జై
    వాతృక ధారి పార్షవతి వాంఛను దీర్చుచు నాలకింపుమా
    సీత ! మగండు చూడ శశిశేఖరుఁడయ్యె జనుల్ స్తుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  4. చేతన్ధనువునువిరచెను
    సీతావల్లభుడు, చంద్రశేఖరుడయ్యెన్
    కోతన్బెట్టెననంగుని
    పూతాత్ముగగౌరిమనసుపొందుటకొఱకై

    రిప్లయితొలగించండి
  5. ఆ తాటకిని సరిగొనెను
    సీతావల్లభుఁడు; చంద్రశేఖరుఁ డయ్యెన్
    మాత పార్వతికి పతిగ
    ప్రతీక్ష్యులె యిరువురు మానవకులము కెపుడున్

    రిప్లయితొలగించండి
  6. చేతో మోదమున నొకడు
    బ్రీతిగ నటియింప నెంచె ప్రియము గ శివు డై
    యాతని గని మిత్రులనిరి
    సీతా వల్లభు డు చంద్ర శేఖరు డయ్యె న్

    రిప్లయితొలగించండి
  7. ఆతాపసి తపమును గని,
    ప్రీతి గలుగ పార్వతిని పరిణయమ్మాడెన్,
    జ్యోతి వలె చంద్రుడుండగ,
    సీతా! వల్లభుఁడు చంద్రశేఖరుఁ డయ్యెన్.

    రిప్లయితొలగించండి
  8. త్రేతాయుగమున శ్రీహరి
    సీతావల్లభుఁడు, చంద్రశేఖరుఁ డయ్యెన్
    వాతాత్మజునిగ రాక్షస
    జాతమ్ముల సంహరించి జగతిని గావన్

    రిప్లయితొలగించండి
  9. జాతమునైనపౌరుషముచాలగగల్గినవిష్ణురూపుడై
    చేతనుబట్టెకార్ముకముజీవులనాథుడుసంతసింపనా
    సీతమగండుజూడ, శశిశేఖరుడయ్యెజనుల్నుతింపగన్
    పాతముగానినిగ్రహముభావజుద్రుంచియుప్రేమశంభుడున్

    రిప్లయితొలగించండి
  10. రాతిని నాతిగ జేసెను
    సీతావల్లభుఁడు; చంద్రశేఖరుఁ డయ్యెన్
    శీతాచలపుత్రి విభుడు
    పాతకులఁదునిమిరిరువురు పావనమూర్తుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూతురు కావ్యముఖ్యులను సుందరమౌ యుగకర్తలన్ సదా
      బ్రాతిమెసంగఁ ద్రేతమున రావణుఁ జంపిన లోకమాన్యుడే
      సీత మగండు; చూడ శశిశేఖరుఁడయ్యె జనుల్ స్తుతింపఁగన్
      బ్రీతినిపొంది హాహలముఁ మ్రింగిన వీరుడు సత్యయుగ్మమున్

      తొలగించండి
  11. పాతకులైన రక్కసుల బాయక పీచమడంచు దీక్షతో
    భూతలమందు రామునిగ బుట్టిన శ్రీహరిమూర్తి కాదెపో
    సీత మగండు? చూడ శశిశేఖరుఁడయ్యె జనుల్ స్తుతింపఁగన్
    ఖ్యాతినిగొన్న మారుతిగ కన్గొని సీతను స్వర్ణలంకలో

    రిప్లయితొలగించండి
  12. సేతువుకట్టెనువడిగా
    *“సీతావల్లభుఁడు ,చంద్రశేఖరుఁ డయ్యెన్”*
    భూతేశుడుతాసిగలో
    ప్రీతిగ ధరియించిశశిని వెలుగులు పంచెన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ప్రీతిగ పలు నాటకముల
    సీతా వల్లభుడు; చంద్రశేఖరుడయ్యెన్
    సీతయ్య వేసి పాత్రలు
    ఖ్యాతిని గడియించినాడు కౌశలమొప్పన్.

    రిప్లయితొలగించండి


  14. తాతారావదిబహుముఖ‌
    చాతుర్యంబుననటించె‌ సంభ్రమమదియే‌
    పూతన విష్ణువు రావణ‌
    సీతావల్లభుఁడు చంద్రశేఖరుఁ డయ్యెన్”

    రిప్లయితొలగించండి
  15. కం॥ దైతేయుల వైరి కనఁగ
    సీతా వల్లభుడు, చంద్రశేఖరుఁ డయ్యెన్
    బ్రీతిగఁ గొలువఁగ నిజ వర
    దాతయు భక్త సులభుండు దైతేయులకున్

    ఉ॥ చేతనుఁ డౌచు రాఘవుఁడు చేయఁగ భిన్నము నీశు చాపమున్
    బ్రీతినిఁ బెండ్లియాడఁగను వేచిన జానకి రాముఁడాయెగా
    సీత మగండు చూడ, శశిశేఖరుఁ డయ్యె జనుల్ స్తుతింపఁగన్
    దాత వరమ్ము లిచ్చుచును దైత్యుల కైనను భక్తి నిల్పఁగన్

    రిప్లయితొలగించండి