4, అక్టోబర్ 2023, బుధవారం

నిషిద్ధాక్షరి - 56

5-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఏదైనా దైవస్తుతి పద్యాన్ని మీకు నచ్చిన ఛందంలో వ్రాయండి
నిషిద్ధాక్షరాలు - ఇ, ఈ అనే అచ్చులు, ఈ అచ్చులతో కూడిన హల్లులు

23 కామెంట్‌లు:


  1. వందనములు విఘ్ణేశ్వర
    వందనములు వక్రతుండ పార్వతి పుత్రా!
    వందనములు మోదక ప్రియ
    వందనములుగొనుముదేవ వరదాయకుడా!

    రిప్లయితొలగించండి
  2. తాట కాంత మహల్యకు తాప శమము
    శంభు చాపభంజనమును చాన తోడ
    వనుల వాసము రావణ వధయు జెల్లు
    భూసుతావరునకె చూడ భూతలమున.

    రిప్లయితొలగించండి
  3. మరువక చేసెద నే నన
    వరతముగను రామ నామ పారాయణమున్
    శరణార్థుల బ్రోచెదవట
    కరుణను జూపు రఘురామ కావగ రారా!

    రిప్లయితొలగించండి
  4. తనయుడు జెప్పగ తనతో,
    కనుగొనె నంగన యశోద, కణ్ణా తెరు నో
    రనుచును లోకము లెల్లన్,
    తనకొడు కేనా యనుకొనె తన్మయురాలై!

    రిప్లయితొలగించండి
  5. పురహరశంభుడ! శంకర!
    వరగుణశోభనుహరహర! పరమాత్ముంఢా
    మరువకకృపతోగనుమా!
    పెరవారలులేరునాకుపేదనుతలపన్

    రిప్లయితొలగించండి
  6. కరములు మోడ్చు చు మ్రొ క్కె ద
    మరలుగమమ్ములను బ్రోవ మాహే శ్వ రు నే
    వరదా యనుచు జపమున
    పుర హరుమన మున దలతు ను పొంక ము తోడన్

    రిప్లయితొలగించండి
  7. వానరాగ్రుఁడు రామగాధను వాకొనంగను లంకలో
    మానసంబునఁ దాప మారఁగ మన్ననన్ దలపోయుచోఁ
    బ్రాణనాథు మహానురాగ పరంపరన్ వదనాన నౌ
    జానకమ్మ సుమందహాసపు జాలు నెంచఁ బ్రమోదమౌ.

    రిప్లయితొలగించండి
  8. కరిముఖ పూజను జేసెద
    కరముగ సంపదను బెంచు కాపాడు మయా!
    గిరిజా నందన భక్తుల
    వరదా వందనముగొనుము బ్రార్థనజేతున్

    రిప్లయితొలగించండి
  9. ఏనుగు ముఖము, తొండము, ఏక పన్ను,
    బుడుగు మెడ, బాన కడుపు, పాము నడు కట్టు,
    నైదు కరముల, ముయ్యేరు, హైమ వతుల
    పుత్రుడ కలకాలము మమ్ము బ్రోవుమయ్య

    రిప్లయితొలగించండి
  10. భద్రాచలవాసా మము
    భద్రముగా కావుమయ్య పావన రామా
    రౌద్రాకారముతో న
    ల్లద్రావుల మదమడంచు లవకుశజనకా

    రిప్లయితొలగించండి
  11. కందం
    దేవాగణేశ నన్నున్
    బ్రోవగ జాగేలనయ్య పురహర తనయా
    భావనఁ సేతు మనంబున
    పావన నామా సరగున వరములొసఁగుమా

    రిప్లయితొలగించండి
  12. పుంగవ కేతువ కద్రూ
    జాంగడ సతతము కొలుతుము శంభువటంచున్
    జంగమ దేవర పురహర
    గంగాధర నాగభూష కావగ రారా!

    రిప్లయితొలగించండి
  13. ఉ॥ సాధన సేతు నయ్య భవ సాగర శోకము దాఁటఁ బూనెదన్
    మాధవ భావతత్పరత మన్నన మక్కువ తోడఁ గొల్చెదన్
    బాధలుఁ దొల్గగా ననఘ ప్రార్థన సేతును సర్వవేళలా
    శోధన సేయకయ్య నను శోభగఁ బ్రోవవె భక్తపాలకా!

    రిప్లయితొలగించండి
  14. తరళము:
    దయను జూడఁగ వేడుకొందును త్ర్యంబకా నను బ్రోవరా
    భయముఁ బాపు మనంబునందున భక్త రక్షక శంకరా
    నయముగా జగదంబతో నటనంబు సల్పెడు వేళలో
    శ్రయమొసంగఁగ గోరు భక్తుఁడ సత్పథంబును జూపరా

    రిప్లయితొలగించండి
  15. రామా రఘుకుల సోమా!
    హే మాధవ! హే శశాంక శేఖర వంద్యా!
    సోమేశచాపఖండన!
    రామ! భవచ్చరణములను ప్రార్థన జేతున్

    రిప్లయితొలగించండి
  16. తేటగీతి
    పూతనాదుల ఘాతుండు పుణ్య మూర్తి
    భువన భాండమ్ములను నోట పొలుచు పఱచు
    పావనుడు కన్నడు, పరమ వరుడు మాకు
    వేల వేల దండములయ్య వెన్న దొంగ.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి

    రిప్లయితొలగించండి
  17. కం.

    గురువుల దలచుచు గొల్తును
    సురలను భూసురుల వేడు స్తోత్రము జేతున్
    బరమాత్మను నోంకారము
    శరణము గోరగ మనమున సర్వమె కృష్ణా!

    రిప్లయితొలగించండి
  18. కందం
    గరళము గ్రోలఁగఁ బూన్చెడు
    తరళేక్షణ సగము తనువుఁ దాల్చగ నోర్చన్
    సురగంగజూటమందెన్
    పరవశమున సతులమోయు భవుడా! నమసుల్

    రిప్లయితొలగించండి
  19. మరువకమముబ్రోవుమామధుసూధనా
    భక్తవత్సలుడన వసుధయందు
    మ్రొక్కుచుందుమయ్యముదముతోమాధవా
    మమత పంచు మయ్యమారజనక

    నంద నందన కావము నన్ను సతము
    మురహరాముకుందా హరీమ్రొక్కుచుందు
    కరుణచూపుము కంసారి కంజనాభ
    వరములసగంగరావయ్యపద్మనాభ.

    రిప్లయితొలగించండి