9, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4554

10-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్తవముం జేయంగనొప్పు సత్కృతికి ఖలున్”
(లేదా...)
“స్తవముం జేయగనొప్పు ధూర్తుని ఖలున్ సత్కారసంసిద్ధికిన్”
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

11 కామెంట్‌లు:

  1. అవనిని ఖలులు న్ననసలు
    లవలే శముమా నవత్వ రహితులు గారే,
    అవసరమున మేల్జేసిన
    స్తవముం జేయంగనొప్పు సత్కృతికి ఖలున్”

    రిప్లయితొలగించండి
  2. "చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు' అని సామెత వినియే యుంటారు. ఆ కవి యటువంటివారె. కాని వారి కావ్యానికి యెంతో పేరు వచ్చింది. ఆ పుస్తకాన్ని పొగడడం తప్పుగాదుకదా సన్మాన సభలో....

    కందం
    అవహీనపు వ్యక్తిత్వము
    నవనిని శ్రీరంగనీతులందఁగ పరులున్
    గవియన వ్రాసిన పొత్తపు
    స్తవముం జేయంగనొప్పు సత్కృతికి ఖలున్


    మత్తేభవిక్రీడితము
    అవహీనంబగు వర్తనంబు దెలుపున్ వ్యక్తిత్వమేపాటిదో
    చెవులూరన్ రచియించెఁ గూర్చి చదువన్ శ్రీరంగ నీతుల్ మనన్
    గవియై లోకపు సన్నుతిన్ గనఁగ సత్కావ్యమ్ముగన్ దత్సభన్
    స్తవముం జేయగనొప్పు ధూర్తుని ఖలున్ సత్కారసంసిద్ధికిన్

    రిప్లయితొలగించండి
  3. అవసరమీ జగమందున
    సవినయముగ సత్కరించు సద్గుణ వర్యుల్
    కవివర లేరీవేళను
    స్తవముంజేయంగనొప్పు సత్కృతికి ఖలున్

    రిప్లయితొలగించండి
  4. అవసరమగు సమయంబున
    నెవరైనను మేలుచేయ నిందింపక వా
    స్తవమును కనుగొని తప్పక
    స్తవముం జేయంగనొప్పు సత్కృతికి ఖలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎవరేమన్నను లక్ష్యపెట్టడట తానెచ్చోటనైనన్ భళా
      లవలేశంబగు శంకలేక సలుపున్ లాంగూలముంబోలుచున్
      వివరింపంగ ఖలుండు చేసిన పనిన్ వేనోళ్ళ కీర్తించ సం
      స్తవముం జేయగనొప్పు ధూర్తుని ఖలున్ సత్కారసంసిద్ధికిన్

      తొలగించండి
  5. కం॥ భువినిఁ గని సజ్జనులను
    స్తవముం జేయంగనొప్పు సత్కృతికి, ఖలున్
    సవరించఁగ దండించవొ
    భువినిఁ దనదు బాధ్యతఁగని బుద్ధిగ మనఁగన్

    మ॥ భువిలో సజ్జనులన్ గురూత్తముల యామోదమ్ముతో గొప్పగా
    స్తవముం జేయఁగనొప్పు, ధూర్తుని ఖలున్ సత్కార సంసిద్ధికిన్
    సవరించం దగు దండనన్ గని కుసంస్కారమ్ముఁ బోనాడుచున్
    భువిలో బుద్ధిగ మాన్యుఁడై బ్రదుకఁ బెంపొందించి యిచ్ఛాదులన్!

    రిప్లయితొలగించండి
  6. అవగుణు డైనను గవియై
    భువి మెచ్చె డి పొత్త మొకటి పొల్పు గ వ్రాయన్
    కవులిల సంకో చిం పక
    స్తవ ముంజేయంగ నొప్పుసత్క్రతి కి ఖలు న్

    రిప్లయితొలగించండి
  7. అవమానంబనుచు దలచ
    క వశన్ గాపాడుకొనగ కంసుండా ప్ర
    త్యవరుని వసుదేవుడపుడు
    స్తవముం జేయంగనొప్పు సత్కృతికి ఖలున్.


    అవివేకమ్మున నుగ్రసేన సూతుడే యర్ధాంగినే చంపగన్
    జవమున్ దీయగ మండలాగ్రమునటన్ సంత్రాసమున్ బొందగా
    నవమానంబనుచున్ దలంపకనె తా నర్థించె దుష్టుండనే
    స్తవముం జేయగనొప్పు ధూర్తుని ఖలున్ సత్కారసంసిద్ధికిన్.

    రిప్లయితొలగించండి
  8. జవగనె దలంచినది వా
    స్తవముం జేయంగనొప్పు ; సత్కృతికి ఖలున్
    నవకాశముండి కూడను
    లవముగ నైనను దలంచ రాదన నొప్పున్

    రిప్లయితొలగించండి
  9. కందం:
    కవితల్లజు పలు తెరగుల
    స్తవముం జేయంగనొప్పు సత్కృతికి, ఖలున్
    కవితా చౌర్యము సలుపగ
    నవివేకముగాదె వాని నభినందించన్

    మత్తేభము:
    కవితావేశము పొంగి సత్కవివరుల్ కావ్యంబులన్ వ్రాయగన్
    స్తవముం జేయగనొప్పు, ధూర్తుని ఖలున్ సత్కారసంసిద్ధికిన్
    కవితా చౌర్యమొనర్చి మేటికవిగా గర్వాంధతన్జూపుచో
    అవనింబుట్టును తెల్లచీమగనతం డాగామి జన్మంబునన్

    రిప్లయితొలగించండి
  10. కవితలు చక్కగ వ్రాసిన
    స్తవముం జేయంగనొప్పు సత్కృతికి, ఖలున్”*
    జవముగ నదుపున నిడనన
    నవరతముశుభమ్ములవిమనకగు వినుమా

    రిప్లయితొలగించండి