25, అక్టోబర్ 2023, బుధవారం

సమస్య - 4568

26-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిల యయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁ డయో”
(లేదా...)
“శిలగా నయ్యె నహల్యనుం గని వనిన్ శ్రీరామచంద్రుం డయో”

16 కామెంట్‌లు:

  1. అలనాడు శాపవశమున
    శిల యయ్యె ; నహల్యనుఁ గని శ్రీరాముఁ డయో
    యిలనింత బెడిదమా యని
    విలపించె జరిగినదంత విశదబరచగన్

    రిప్లయితొలగించండి
  2. బలమైన శాప వశమున
    శిలయయ్యెన ;హల్యను గని శ్రీ రాముడయో
    తలిగించియు తన పాదము
    లలితాంగిగమరల మార్చ రమణి స్తుతించెన్


    రిప్లయితొలగించండి
  3. ఇలలోోవిధివక్రింపగ
    శిలయయ్యెనహల్యను, గనిశ్రీరాముడయో
    చెలువంబునసతిగాంచుచు
    పలికెనుహితకరవచనముభావింపంగా

    రిప్లయితొలగించండి
  4. తలఁపున జడుఁడగు ఛాత్రుఁడు
    కలగాంచెనహల్య శాప కథనము నందు
    త్తలపాటున నూహించెను
    శిల యయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁ డయో

    రిప్లయితొలగించండి
  5. చెలరేగి శాప మీయగ
    శిల య య్యె నహల్య ను గని శ్రీరాము డ యో
    శిల పై పాదము నుంచగ
    తొలగగ శాపమ్ము నామె తోష o బందె న్

    రిప్లయితొలగించండి

  6. పలు ప్రాంతమ్ముల గనుచును
    తలమున కదలెడు తరుణము తన పాదము సో
    కి లతాంగిగ కలు మారగ
    శిల యయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁ డయో!


    తలమున్ దాపసి వెంట లక్ష్మణునితో తానేగు నవ్వేళలో
    కలయో వైష్ణవ మాయయో కనగనా కాఠమ్మదే మారె తొ
    య్యలిరూపంబును దాల్చు పాళమున తానాశ్చర్య మున్ బొందుచున్
    శిలగా నయ్యె నహల్యనుం గని వనిన్ శ్రీరామచంద్రుం డయో!

    రిప్లయితొలగించండి
  7. అలిగినపతి శపియింపగ
    శిల యయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁ డయో
    లలనా యనుచున్ బలికెను
    తొలగెను దోషంబు నేడు తొయ్యలి కనుమా

    రిప్లయితొలగించండి
  8. అలగౌతమ వృత్తాంతము
    శిలరాజమ్మున యలరగ శిల్పులు ఉలితో
    మలచగనాదృశ్యమ్మున
    శిలయయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁడయో

    రిప్లయితొలగించండి
  9. శిలగా మారిన వైనము
    విలపించుచునాఅహల్య వివరించంగన్
    పలుకేమీరాక క్షణము
    శిలయయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁడయో

    రిప్లయితొలగించండి
  10. ఎలమిన్ గౌతమమౌని శాపకథనం బెంతేని యిష్టంబుగా
    పలుమారుల్ మననమ్మొనర్చి మదిలో పాఠమ్మె యూహించుచున్
    కలగాంచెన్ కలయందు బాలకుడు తాగాంచెన్ విచిత్రంబుగా
    శిలగా నయ్యె నహల్యనుం గని వనిన్ శ్రీరామచంద్రుం డయో

    రిప్లయితొలగించండి
  11. కందం
    వలకాడు నింద్రుడనియున్
    దెలిసినఁ గూడి పతిశాప తీక్ష్ణమునన్ ని
    శ్చల భస్మశాయి యన ముని,
    శిలయయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁ డయో!

    మత్తేభవిక్రీడితము
    వలకాడా తెలిమావురౌతు పతి రూపంబందు వేంచేసెనన్
    దెలివిన్ గల్గియు సంగమించెనని యుద్రేకంబునన్ గౌతముం
    డల శాపంబిడ భస్మశాయినిగ మీకైవేచెనన్ వాక్కులన్
    శిలగా నయ్యె నహల్యనుం గని వనిన్ శ్రీరామచంద్రుం డయో!

    రిప్లయితొలగించండి
  12. కం॥ అలిగిన గౌతముఁడాలిని
    శిలఁ జేసిన విషయమరసి స్త్రీ నిజరూపున్
    గలిగించుచు క్షణ కాలము
    శిల యయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁడయో!

    మ॥ అలుకన్ బూనుచు గౌతముండు సతినే యత్యంత ఛీత్కారమున్
    శిలగా మార్చుట విన్న తక్షణము నాస్త్రీ శాపమున్ బాపుచున్
    గలతన్ జెందఁగ బాధనొందుచు తనాక్షణంబు నిశ్చేష్టుఁడై
    శిలగానయ్యె నహల్యనుం గని వనిన్ శ్రీరామచంద్రుండయో!

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    తెలివిగ నింద్రు డహల్యను
    మలినము జేయ పతి గౌతమ ముని శపించెన్
    చలియింపగ నా కథ విని
    శిలయయ్యె నహల్యను గని శ్రీరాముడయో!

    రిప్లయితొలగించండి
  14. చెలువముతోనొప్పారెడు
    లలనామణికి పతి కుపితుడైశాపమిడన్
    నిలనిటులయెననివినగా
    శిలయయ్యెనహల్యనుగని శ్రీరాముడయో

    రిప్లయితొలగించండి