3, అక్టోబర్ 2023, మంగళవారం

సమస్య - 4549

4-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు”
(లేదా...)
“పెన్ను కొనంగ సిద్ధపడ వెఱ్ఱితనంబె యగున్ దలంచినన్”

19 కామెంట్‌లు:

  1. మన్నుదినెడు వాడు మహనీయుడాతడు
    గన్నుకొనెడి వాడు గట్టివాడు
    దున్ననెక్కు దేవుడు భయము గలిగించు
    “పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు”

    రిప్లయితొలగించండి
  2. కాలమెంతొ మారె, కలములేకుండనె
    పనులు జరుగు నిలను, వలయు నొక్క
    సెల్లు, రాయవచ్చు సెల్లుతో చక్కగ
    “పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు”

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    నిష్ఠగలిగి చదువ నిపుణత్వమబ్బెడున్
    మట్టి లోన దిద్ది మాన్యులైరి
    భ్రమసి వెండి, కుందనములతో పలకయుఁ
    బెన్ను కొనెడువాఁడు వెఱ్ఱి వాఁడు

    ఉత్పలమాల
    తిన్నగ నిష్ఠతోఁ జదువ దిట్టలునైరి గతాన పెక్కురున్!
    మన్నునదిద్ది యక్షరము మాన్యులు గా వెలుగొందలేదె? సం
    పన్నులు మంచు వెండిగొని పల్కలు వ్రాయఁగ కుందనమ్ముదౌ
    పెన్ను కొనంగ సిద్ధపడ వెఱ్ఱితనంబె యగున్ దలంచినన్

    రిప్లయితొలగించండి
  4. పనికొరకు ధననిధి వైపు బోయినపుడు
    చెంత పెన్ను జూచి చెయ్యి జాచి
    యడిగిన జనులివ్వ రది తిరిగి గనుక
    "పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు”

    రిప్లయితొలగించండి
  5. మార్పు జర్గుచుండె మహిలోన నిత్యము
    తెలసి కొనుచు సతము మెలగవలయు
    సరస మైన నేటి జ్ఞాన మెరుంగుక
    పెన్ను కొనెడు వాడు వెర్రివాడు

    రిప్లయితొలగించండి
  6. సెల్లునందుజగముచేరి
    యు నుండగా
    పెద్దవ్రాతలేలపెన్నుతోడ
    మెచ్చుకోలుగాదెమెఱపులవ్రాతలు
    పెన్నుగొనెడివాడువెఱ్ఱివాడు

    రిప్లయితొలగించండి
  7. డా బల్లూరి ఉమాదేవి


    చిన్న ఫోను లోనె యన్ని వ్రాసెడువీలు
    పిల్ల వారి తోడ పెద్దలకును
    కలుగుచుండ మరల కాసులొసగి కొత్త
    *“పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు”*

    రిప్లయితొలగించండి
  8. అన్ని పనులు జరుగు నవలీల గా నేడు
    చేత నున్న సెల్లు చేయు నన్ని
    యేమి యవ స రమనియీ నాడొక డని యె
    "పెన్ను గొనెడు వాడు వె ఱ్ఱి వాడు "

    రిప్లయితొలగించండి
  9. కలమువచ్చి నాడు గంటమ్ము పోయెను
    సెల్లువచ్చి పెన్ను సెలవు గొనెను
    పలికినంత వెసను పదములు ముద్రింప
    పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు

    రిప్లయితొలగించండి
  10. తొడవు పోయె దలుపు తొలగియుండగ రాత్రి
    సమయమందు,నటుల జరిగి యుండ
    తానె కారణముగ తానుసలిపిన త
    ప్పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు

    రిప్లయితొలగించండి
  11. నీతి లేని వాడు నేతగా గెలిచిన
    ప్రజల కుండ బోదు భద్రతికను
    వానికేలనోటు వలదాపు నీదలం
    పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు.

    (దలంపు +ఎన్నుకొనెడు =దలం/ పెన్నుకొనెడు)


    ఎన్నగ ధూర్తలక్షణము లెన్నియొ గల్గిన దుష్టశీలు డీ
    యెన్నిక లోననిల్చి ధన మెంతయొ పంచెనటంచు వాడు నీ
    యన్న సముండటన్న పరిహాసము సేయరె యాపు నీ దలం
    పెన్ను కొనంగ సిద్ధపడ వెఱ్ఱితనంబె యగున్ దలంచినన్.

    (దలంపు+ఎన్నుకొనంగ= దలం/ పెన్ను కొనంగ)

    రిప్లయితొలగించండి
  12. లిపికరుండు తాను లిఖితము చేయగ
    కలము కాగితమ్ము కాన రాక
    లభ్యపడనపుడు సిరా బిందువంతైన
    పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కన్నుల ముందుమార్పులను కానకయుండిన వెన్కబాటు కా
      కున్న నధోగతేయనుచు కొందరు విజ్ఞులు చెప్పుచుందురే
      నిన్నటి పద్ధతిన్ దొడరి నిప్పురగుల్చగ కర్రలందు రా
      పెన్నుకొనంగ సిద్ధపడ వెఱ్ఱితనంబె యగున్ దలంచినన్

      తొలగించండి
  13. మొన్నటి ఘంటమున్ కలము పోవిడనాడగఁ జేసి నంతటన్
    నిన్నటి పెన్ను జూడనది నేడొక జ్ఞాపిక యయ్యె నక్కటా!
    యెన్నఁగ నెల్లవారు కడు నింపుగ వ్రాయగ సెల్లుఫోనుతో
    పెన్ను కొనంగ సిద్ధపడ వెఱ్ఱితనంబె యగున్ దలంచినన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పెన్ను లనగ నింకు పెన్నులే యొకనాడు
    కాని ప్రతి మనుజుని కడను నేడు
    *బాలు పెన్ను కలదు పరికించ, నేడింకు
    పెన్ను కొనెడి వాడు వెఱ్ఱి వాడు.
    (*బాల్ పెన్ను)

    రిప్లయితొలగించండి
  15. ఆ॥ మగువ మనసు నరయ మాధవునికిఁ గాదు
    భార్య మాట వినెడి భర్త ఘనుఁడు
    పరిణితిఁ గన కుండ భావమరయ తల
    పెన్ను కొనెడు వాఁడు వెఱ్ఱి వాఁడు

    ఉ॥ మిన్నగు రాజకీయమున మేటిగ పల్కుదు రెన్నియో వినన్
    దిన్నగ వాటి యర్థమును దేటగఁ దెల్పుట సాధ్యమా సఖా
    విన్నవి మర్చిపోవుట వివేకము భావమెరుంగగన్ దలం
    పెన్నకొనంగ సిద్ధపడ వెఱ్ఱితనంబె యగున్ దలంచినన్

    రిప్లయితొలగించండి