7-10-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కరమె యుద్ధరించె ధరణి నెపుడొ”(లేదా...)“కరమే ధారుణి నుద్ధరించె నెపుడో గంగాధరా! శంకరా!”
ఆటవెలదిరయమునన్ జెలఁగి హిరణ్యాక్షుడు విసరచాపవలెను జుట్టి సంద్రమందునాదుకొనఁగ వచ్చి హర్యవతార సూకరమె యుద్ధరించె ధరణి నెపుడొ
మత్తేభవిక్రీడితమువరగర్వాంధుడు దైత్యుఁడున్ జెలగి నిర్వాకాన సంద్రంబునన్ధరణిన్ జాపగఁ జుట్టివైచ రయమే దామోదరుండంతటన్దురితున్ గూల్చి వరాహరూపమున సంతోషమ్మునందించె సూకరమే ధారుణి నుద్ధరించెనెపుడో గంగాధరా! శంకరా!
రుక్మిణి మను వాడె రూపసి గృష్ణుని,చంద్రగుప్తమౌర్య చక్రవర్తిగూడెను గద గ్రీకు కోమలిని, కులసంకరమె యుద్ధరించె ధరణినెపుడు.
స త్ప్రవర్త నమున సత్సంగముల తోడపుడమి మేలు గోరు బుద్ధి చేతపూత చరితు లైన ముని వరే ణ్యు ల శుభoకరమె యుద్ధ రించె ధరణి నెపు డొ
భయపడకుము భువికి పాటు కలుగునంచుసంకటముల నుండి శరణు నొందువిఖురుడపుడు పుడమి విసరి వేయంగ సూకరమె యుద్ధరించె ధరణి నెపుడొ
తండ్రిమాటనువినక తా దలచె హరినిఉఘ్రడయిచంప యత్నించె నొచ్చిమనసుస్తీర్వి పడని ప్రహ్లాదుని శ్రీహరి కనికరమె యుద్ధరించె ధరణి నెపుడొ
లోకమందుపుట్టి రూపాంతరముచెందినాదిమానవునిగ నవతరించియంచలంచలెదిగి యభివృద్ధిఁ బడయు నాకరమె యుద్ధరించె ధరణి నెపుడొ
పరుగుల్వెట్టిరి నిన్నుజేర దివిజుల్ వైక్లవ్యమేపారగన్గరుణా సాగరమౌ మనస్సు నరయన్ గాపాడు దైవంబువై మరి హాలా హలమున్ గ్రసించితివిగా మల్లారి నీదౌ శుభంకరమే ధారుణి నుద్ధరించె నెపుడో గంగాధరా! శంకరా!
ఆ॥ ధర్మమునకు ముప్పు ధాత్రియందు కలుగనవధరించి ధరణి నాదు కొనుచుధర్మ రక్షఁ జేయు దక్షుఁడు శ్రీపతికరమె యుద్ధరించె ధరణి నెపుడొమ॥ ధరణిన్ ధర్మము దారి తప్పఁగను సంధానించె నాధర్మమున్గరమున్ జాచుచు మాధవుండు ఘనుఁడున్ కారుణ్య రూపుండునౌపరమాత్ముండిల ధర్మరక్షణను సంప్రాప్తించు శ్రీనాథుదౌకరమే ధారుణి నుద్ధరించె నెపుడో గంగాధరా శంకరా
మ॥ లో కారుణ్య ను గారుణ్య గా పరిగణించ వలెనని వినతి
చాప వోలె చుట్టి సంద్రమందు భువినిముంచదలచు వేళ పూజ్యుడైన యవ్యయుని తృతీయ యవతార మైన సూ కరమె యుద్ధరించె ధరణి నెపుడొ.వరుణున్ యుద్ధము చేయమంచు పిలువన్ వారించి శ్రీనాథుడే సరియౌ నీకని తెల్ప నాస్రపుడు తా శౌరిన్ గవేశించుచున్ వరగర్వాంధుడు చుట్టచుట్టి వసుధన్ పాథోనిధిన్ ద్రోయ సూకరమే ధారుణి నుద్ధరించెపుడో గంగాధరా! శంకరా!
వరగర్వమ్మున రక్కసుండు ధరణిన్ పాథోనిధిన్ ముంచ సూకరమే ధారుణి నుద్ధరించెనెపుడో గంగాధరా! శంకరా!ధరణిన్ పాపులు భూబకాసురులయౌద్ధత్యంబు పెంపాయె సత్వరమే రమ్మిక శంకరా పృధివిపై పాపాత్ములన్ ద్రుంచగా.
తండ్రిమాటనువినక తా దలచె హరినిఉఘ్రడయిచంప యత్నించె నొచ్చిమనసుస్తీర్వి పడని ప్రహ్లాదున శ్రీహరి కనికరమె యుద్ధరించె ధరణి నెపుడొ
మ.కరుణన్ జూపితి వీవు లోకములకున్ గాట్రేడు దిక్కందురేశరణంబిచ్చుట దేవదానవులకున్ సంద్రంబు ద్రచ్చంగలన్ గరళంబందుచు గంఠమున్ నిలుపగన్ గాపాడి వీక్షించ, నీ*కరమే ధారుణి నుద్ధరించెనెపుడో గంగాధరా! శంకరా!*
గరువమతిశయించె వరముల బడసినకన్ను మిన్ను కానకున్న ఖలుఁడుధరణిఁ సంద్రమందు దనుజుఁడు ద్రోయ సూకరమె యుద్ధరించె ధరణి నెపుడొ
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. సాగరమున, భువిని చాపవలెను చుట్టిరక్కసుండు ముంచ రక్ష చేయనాదుకొనగ హరియె యవతార మెత్తె సూకరమె యుద్ధరించె ధరణి నెపుడొ.
నీటి యందు దాచ నేలనా దనుజుండుదివిజ వరులు వేడ తీరుగానువారి కోర్కె దీర్చ వచ్చిన శ్వేతసూ*"కరమె యుద్ధరించె ధరణి నెపుడొ”*
ఆటవెలది
రిప్లయితొలగించండిరయమునన్ జెలఁగి హిరణ్యాక్షుడు విసర
చాపవలెను జుట్టి సంద్రమందు
నాదుకొనఁగ వచ్చి హర్యవతార సూ
కరమె యుద్ధరించె ధరణి నెపుడొ
మత్తేభవిక్రీడితము
తొలగించండివరగర్వాంధుడు దైత్యుఁడున్ జెలగి నిర్వాకాన సంద్రంబునన్
ధరణిన్ జాపగఁ జుట్టివైచ రయమే దామోదరుండంతటన్
దురితున్ గూల్చి వరాహరూపమున సంతోషమ్మునందించె సూ
కరమే ధారుణి నుద్ధరించెనెపుడో గంగాధరా! శంకరా!
రుక్మిణి మను వాడె రూపసి గృష్ణుని,
రిప్లయితొలగించండిచంద్రగుప్తమౌర్య చక్రవర్తి
గూడెను గద గ్రీకు కోమలిని, కులసం
కరమె యుద్ధరించె ధరణినెపుడు.
స త్ప్రవర్త నమున సత్సంగముల తోడ
రిప్లయితొలగించండిపుడమి మేలు గోరు బుద్ధి చేత
పూత చరితు లైన ముని వరే ణ్యు ల శుభo
కరమె యుద్ధ రించె ధరణి నెపు డొ
భయపడకుము భువికి పాటు కలుగునంచు
రిప్లయితొలగించండిసంకటముల నుండి శరణు నొందు
విఖురుడపుడు పుడమి విసరి వేయంగ సూ
కరమె యుద్ధరించె ధరణి నెపుడొ
తండ్రిమాటనువినక తా దలచె హరిని
రిప్లయితొలగించండిఉఘ్రడయిచంప యత్నించె నొచ్చిమనసు
స్తీర్వి పడని ప్రహ్లాదుని శ్రీహరి కని
కరమె యుద్ధరించె ధరణి నెపుడొ
లోకమందుపుట్టి రూపాంతరముచెంది
రిప్లయితొలగించండినాదిమానవునిగ నవతరించి
యంచలంచలెదిగి యభివృద్ధిఁ బడయు నా
కరమె యుద్ధరించె ధరణి నెపుడొ
పరుగుల్వెట్టిరి నిన్నుజేర దివిజుల్ వైక్లవ్యమేపారగన్
తొలగించండిగరుణా సాగరమౌ మనస్సు నరయన్ గాపాడు దైవంబువై
మరి హాలా హలమున్ గ్రసించితివిగా మల్లారి నీదౌ శుభం
కరమే ధారుణి నుద్ధరించె నెపుడో గంగాధరా! శంకరా!
ఆ॥ ధర్మమునకు ముప్పు ధాత్రియందు కలుగ
రిప్లయితొలగించండినవధరించి ధరణి నాదు కొనుచు
ధర్మ రక్షఁ జేయు దక్షుఁడు శ్రీపతి
కరమె యుద్ధరించె ధరణి నెపుడొ
మ॥ ధరణిన్ ధర్మము దారి తప్పఁగను సంధానించె నాధర్మమున్
గరమున్ జాచుచు మాధవుండు ఘనుఁడున్ కారుణ్య రూపుండునౌ
పరమాత్ముండిల ధర్మరక్షణను సంప్రాప్తించు శ్రీనాథుదౌ
కరమే ధారుణి నుద్ధరించె నెపుడో గంగాధరా శంకరా
మ॥ లో కారుణ్య ను గారుణ్య గా పరిగణించ వలెనని వినతి
తొలగించండిచాప వోలె చుట్టి సంద్రమందు భువిని
రిప్లయితొలగించండిముంచదలచు వేళ పూజ్యుడైన
యవ్యయుని తృతీయ యవతార మైన సూ
కరమె యుద్ధరించె ధరణి నెపుడొ.
వరుణున్ యుద్ధము చేయమంచు పిలువన్ వారించి శ్రీనాథుడే
సరియౌ నీకని తెల్ప నాస్రపుడు తా శౌరిన్ గవేశించుచున్
వరగర్వాంధుడు చుట్టచుట్టి వసుధన్ పాథోనిధిన్ ద్రోయ సూ
కరమే ధారుణి నుద్ధరించెపుడో గంగాధరా! శంకరా!
వరగర్వమ్మున రక్కసుండు ధరణిన్ పాథోనిధిన్ ముంచ సూ
రిప్లయితొలగించండికరమే ధారుణి నుద్ధరించెనెపుడో గంగాధరా! శంకరా!
ధరణిన్ పాపులు భూబకాసురులయౌద్ధత్యంబు పెంపాయె స
త్వరమే రమ్మిక శంకరా పృధివిపై పాపాత్ములన్ ద్రుంచగా.
తండ్రిమాటనువినక తా దలచె హరిని
రిప్లయితొలగించండిఉఘ్రడయిచంప యత్నించె నొచ్చిమనసు
స్తీర్వి పడని ప్రహ్లాదున శ్రీహరి కని
కరమె యుద్ధరించె ధరణి నెపుడొ
మ.
రిప్లయితొలగించండికరుణన్ జూపితి వీవు లోకములకున్ గాట్రేడు దిక్కందురే
శరణంబిచ్చుట దేవదానవులకున్ సంద్రంబు ద్రచ్చంగలన్
గరళంబందుచు గంఠమున్ నిలుపగన్ గాపాడి వీక్షించ, నీ
*కరమే ధారుణి నుద్ధరించెనెపుడో గంగాధరా! శంకరా!*
గరువమతిశయించె వరముల బడసిన
రిప్లయితొలగించండికన్ను మిన్ను కానకున్న ఖలుఁడు
ధరణిఁ సంద్రమందు దనుజుఁడు ద్రోయ సూ
కరమె యుద్ధరించె ధరణి నెపుడొ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
సాగరమున, భువిని చాపవలెను చుట్టి
రక్కసుండు ముంచ రక్ష చేయ
నాదుకొనగ హరియె యవతార మెత్తె సూ
కరమె యుద్ధరించె ధరణి నెపుడొ.
నీటి యందు దాచ నేలనా దనుజుండు
రిప్లయితొలగించండిదివిజ వరులు వేడ తీరుగాను
వారి కోర్కె దీర్చ వచ్చిన శ్వేతసూ
*"కరమె యుద్ధరించె ధరణి నెపుడొ”*