23, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4567

24-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె”
(లేదా...)
“పొడిచెను ప్రొద్దుటూరున నభోమణి రాతిరి దివ్యకాంతులన్”

16 కామెంట్‌లు:

  1. పసిడి కాంతుల జిమ్మిరి పడతులెల్ల
    ధగధగల తోడి నగరమంతటను మెరిసి,
    ఏమి జెప్పవలెను పురమెంత వెలిగె
    ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె.

    రిప్లయితొలగించండి
  2. నగర మీనవరాత్రుల నాడు మిగుల
    కాంతి వంతమౌ విద్యుత్తు ప్రభలచేత
    వెలుగు చుండెను ధగధగ వింత గొలుపు
    ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె

    రిప్లయితొలగించండి
  3. పర్వ దినమున న చ్చో ట భాస మయ్యె
    దీప కాంతులు నగరాన దివ్య మగుచు
    వెలుగు లీన గ దోచె ను వింత గాను
    ప్రొద్దు టూరున రాతిరి ప్రొద్దు వొడి చె

    రిప్లయితొలగించండి
  4. నక్తమున మొగ బెట్టిరి నాటకమును
    దాని నిడివి పెద్దదయిన తలము వలన
    ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె
    నాటకము ముగియు సరికి, నమ్ముమయ్య

    రిప్లయితొలగించండి
  5. సభలు గోష్ఠుల నెదురైరి సన్నిహితులు
    సమయమే మృగ్యమైశక్తి సన్నగిల్లె
    లిప్త కాలము విశ్రాంతి లేక గడిచె
    ప్రొద్దుటూరున రాతిరి, ప్రొద్దు వొడిచె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గడచెను సర్వమూషకము కన్నుల ముందర జోరుజోరునన్
      విడువక సల్పు భాషణపు వేసటఁ రాత్రిగతించి నింగిలో
      పొడిచెను ప్రొద్దుటూరున నభోమణి, రాతిరి దివ్యకాంతులన్
      బడసిన కౌముదీపతి వివర్ణతనొందెను తెల్లవాఱుటన్

      తొలగించండి
  6. గురుదేవులకూ కవిమిత్రలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలతో...

    తేటగీతి
    విజయదశమి పర్వమ్మున వేడ్కలనఁగ
    కదిలె బంగారు తేరున కన్యకాంబ
    మెరయు కనుల రేఱేనితో మేళవించి
    ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె!

    చంపకమాల
    పుడమిని పేరుఁగాంచెనదె ముచ్చటగా దసరా మహమ్ములన్
    గడివెడు సంబరాల కనకంపు రథమ్మున కన్యకాంబయే
    బుడిబుడి నడ్కలన్ గదల మోమున కన్నులఁ గూడి చంద్రునిన్
    బొడిచెను ప్రొద్దుటూరున నభోమణి రాతిరి దివ్యకాంతులన్!

    రిప్లయితొలగించండి
  7. (సి వి సుబ్బన్న పుట్టింది ప్రొద్దుటూరు, రాత్రివేళ పుట్టాడో లేదో కాని నేను రాత్రివేళ జన్మించి యుంటాడని ఈ పద్యం వ్రాస్తున్నాను, వారు రాత్రికాక పగలే జన్నించినట్లైతే క్షమించగలరు.)


    పాటవమ్మును జూపుచు పండితులను
    తాను మెప్పించి చేసె వధానములన
    టంచు చదువరులు పలికి రంట యిటుల
    ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె.


    వడివడిగా వధానముల పండిత శ్రేణియె మెచ్చురీతిగా
    కడు చతురత్వమున్ నెఱపి గరవ మందిన సుబ్బనార్యుడై
    పుడమిని సాహితీ జగతి పోసనమౌచు వెలుంగు లీనగా
    పొడిచెను ప్రొద్దుటూరున నభోమణి రాతిరి దివ్యకాంతులన్.

    రిప్లయితొలగించండి
  8. వడివడి నిర్జరుల్ తరలి వచ్చిరి ధాత్రికి వీడి స్వర్గమున్
    కడు కుతుకమ్మునన్ గనఁగ కన్యకమాత రథోత్సవంబు నె
    ల్లెడలను నిండె దీధితులు హేలగ హేళి మహోత్కటంబుగా
    పొడిచెను ప్రొద్దుటూరున నభోమణి రాతిరి దివ్యకాంతులన్

    రిప్లయితొలగించండి
  9. పురమునందున నూరేగ తరలి వచ్చు
    కన్యకాంబను గాంచఁగ గగనచరులు
    భువికి దిగివచ్చు తరుణాన ఛవియెసంగి
    ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె

    రిప్లయితొలగించండి
  10. సమూహ సభ్యులకు నమస్కారం
    పరమభక్తితో ప్రజలంత పురము నందు
    నిరతమున్ పూజ దుర్గకునెరిపినంత
    చింతలనెడిచీకట్లను చీల్చివేసి
    ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె”

    రిప్లయితొలగించండి
  11. పడతులు గర్బ నాడుచును బాడుచు

    నందరు రాత్రి వేళలో

    గడుపుచునుండ వేకువయె కాలము

    నెర్గక నాడు చుండగా

    పొడచెను ప్రొద్దుటూరున నభోమణి,

    రాతిరి దివ్య కాంతులన్

    పుడమిని జిమ్మినట్టి శశి పూర్తిగ

    వెన్కకు తగ్గె నత్తరిన్.



    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఊరి యందు కోటీశ్వరు డొక్కరుండు
    లేక లేకపుత్రుండు కలిగిన రోజు
    దీపముల నలంకారము తేజరిల్ల
    కాల్చగా బాణసంచాల కాంతి మెఱయ
    ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె.

    రిప్లయితొలగించండి
  13. పెద్దకాపుయింటనుపెండ్లి వేడ్కతోడ
    జరుగుచుండబంధుజనులుసంతసించ
    దీపకాంతులునాలుగుదెసలునిండ
    *ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె*

    రిప్లయితొలగించండి
  14. పెద్ద బహిరంగ సభపెట్టి ఎన్నికలకు
    సిద్ధమౌతున్న పార్టీల శిష్య గణపు
    టద్దుమీరిన అర్భాట మవనినంట
    ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె

    రిప్లయితొలగించండి