20, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4564

21-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శాంతుఁ డఖిలసద్గుణుఁడు కీచకుఁడు సుమ్ము”
(లేదా...)
“శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి కీచకుం డగున్”

16 కామెంట్‌లు:

  1. తేటగీతి
    పొగడ బలమందు మత్స్యాధిపుండు వెలిగె
    సింహబలుడన్న పేరొందె చెల్లునటులఁ
    జెలఁగి సైరంధ్రి మోజునఁ జిక్కకున్న
    శాంతుఁ డఖిలసద్గుణుఁడు కీచకుఁడు సుమ్ము

    ఉత్పలమాల
    కంత జయంతులున్ బొగుడు కంజదళాక్షుడు నందమందుఁ దా
    నంతము సేయు సింహబలుడై యరివర్గము గాలుదువ్వినన్
    గాంతను మాలినిన్ దనదు కౌగిటఁ గోరి నశించె లేదనన్
    శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి కీచకుం డగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన వృత్తము:

      ఉత్పలమాల
      కంతు జయంతుజయంతునిన్ దెగడు కంజదళాక్షుడు నందమందుఁ దా
      నంతము సేయు సింహబలుడై యరివర్గము గాలుదువ్వినన్
      గాంతను మాలినిన్ దనదు కౌగిటఁ గోరి నశించె; లేదనన్
      శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి కీచకుం డగున్

      తొలగించండి
  2. కాంత మోజున పడినట్టి కామి తుండు
    మదము గల్గియు నెవ్వారి మాట వినక
    కోరె సైరo ద్రి పొందును గుటిలు దెటు ల
    శాంతు డఖిల సద్గుణు డు కీచకు డు సుమ్ము

    రిప్లయితొలగించండి
  3. తే॥ “శాంతుఁడఖిల సద్గుణుఁడు కీచకుఁడు సుమ్ము”
    విహితమగునా పలుకనిట్లు విరటు బావ
    మఱఁది గుణహీనుఁడు మదిరా మగువ లోల
    తఁ గని నడయాడు తుచ్ఛుఁడు మృగముఁ గాద

    ఉ॥ చింతన సర్వదా యనఘు చిన్మయ రూపుని పైన నిల్పుచున్
    జెంతన యున్న వారలకు సేదను దీర్చెడి సద్గుణాఢ్యుఁడే
    శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి, కీచకుండగున్
    బంతముఁ బూని క్రొత్తడులఁ బల్లట పెట్టెడి ధూర్తఁడే సదా

    రిప్లయితొలగించండి
  4. తమ్ముడడిగిన వెంబడి దప్పకుండ
    "శాంతుఁ డఖిలసద్గుణుఁడు కీచకుఁడు సుమ్ము"
    యనుచు దన సోదరునిగూర్చి యనువుగ నుడి
    కారమున సుధేష్ణయు వాని కడకు పంపె

    రిప్లయితొలగించండి
  5. చూడ చక్కని ద్రోవదిన్ జూచినంత
    మోహ వశుడౌచు వాంఛించె పొందు గాని
    కోరలేదంతకు మునుపే కోమలినని
    చెప్పె త్రాగుబోతొకరుండు స్నేహితునకు
    శాంతుఁ డఖిలసద్గుణుఁడు కీచకుఁడు సుమ్ము.


    చింతలు దీర్చువారమని చెప్పుచు నోటుల పొందనెంచుచున్
    ముంతెడు కల్లువోసి వసి భోగ్యము బంచుచు నడ్డుకొన్నచో
    యంతము జేయు చారపతులందరి తోడ పోల్చినన్
    శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి కీచకుం డగున్.

    రిప్లయితొలగించండి
  6. వ్యాస భారత మందున పాత్రలైన
    తెలుగు భారతమందైనఁ దెలియునొకటె
    నాకు చూపబడిన వీధి నాటకమున
    శాంతుఁ డఖిలసద్గుణుఁడు కీచకుఁడు సుమ్ము

    కాంతుము వ్యాసభారతము కమ్మని పాత్రల శోభితంబుగా
    కాంతుము తెల్గులోన మరి క్రమ్మరి పాత్రలు వర్ణనీయమై
    భ్రాంతిని వీడుమా కడకు రాతిరి గాంచిన నాటకంబునన్
    శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి కీచకుం డగున్

    రిప్లయితొలగించండి
  7. సింహబలుడతండు విరటు క్షేమ మరసి
    కొండవలె బావ కండగా నుండువాడు
    మగువ మదిర మత్తు మదిని తగులకున్న
    శాంతుఁ డఖిలసద్గుణుఁడు కీచకుఁడు సుమ్ము

    రిప్లయితొలగించండి
  8. పంతముబూని వీరులగు పాండుకుమారుల పత్ని ద్రోవదిన్
    చెంతకుఁ జేరరమ్మనుచు సేకము వెట్టుచు వెంబడించుచున్
    క్షాంతిని వీడినట్టి పరకాంత విలోలుడు నీచుడెవ్విధిన్
    శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి కీచకుం డగున్

    రిప్లయితొలగించండి
  9. బావ కొసగె రాజ్యమ్మును వాసిగాను
    అక్క ఎన్న తనకు ప్రేమ యత్యధికము
    శాంతు డఖిల సద్గుణుడు కీచకుడు సుమ్ము
    ముదిత పై మోహమాతని ముంచివైచె

    రిప్లయితొలగించండి
  10. శాంతు డఖిల సద్గణుడు కీచకడు సుమ్ము
    కాని సైరేంద్రి మోహంపు కారణమున
    వలలునిపిడిగుద్దులచేత వదలె జీవి
    కష్టములగల్గు బరకాంత కాముకులకు

    రిప్లయితొలగించండి
  11. ఉ.

    భ్రాంతము బుజ్జగింత రహి బాల్యము వర్ధిలు లక్షణాలతో
    *శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి,.. కీచకుం డగున్*
    కాంతల వన్నియల్ కనుచు గామము హెచ్చగ యౌవనమ్మునన్
    వింతగ చిత్రసీమ గురి, వేదన నొందురు తల్లిదండ్రులే.

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పాండవాగ్రజుడౌ ధర్మజుండు కనగ
    శాంతు డఖిల సద్గుణుడు; కీచకుడు సుమ్ము
    ద్రౌపదిని గాంచి పరుల భార్య యని తలచ
    కుండ మోహించి పొందును కోరినాడు.

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పాండవాగ్రజుడౌ ధర్మజుండు కనగ
    శాంతు డఖిల సద్గుణుడు; కీచకుడు సుమ్ము
    ద్రౌపదిని గాంచి పరుల భార్య యని తలచ
    కుండ మోహించి పొందును కోరినాడు
    దుర్గుణమ్ములు కలిగిన దుష్టుడితడు.

    రిప్లయితొలగించండి