28, అక్టోబర్ 2023, శనివారం

సమస్య - 4571

29-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్”
(లేదా...)
“వన్నెల్ మార్చెను భాస్కరుండు శశియై ప్రాక్పర్వతాగ్రంబుపై”

29 కామెంట్‌లు:

  1. కన్నుల ముందర దృశ్యము
    లెన్నియొ, దోబూచు లాడె లేతకిరణుండు
    మిన్నగ మేఘమ్ములతో,
    వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్”

    రిప్లయితొలగించండి
  2. పిన్నలొక చోట కూడిరి
    మిన్నున సూర్యని గ్రహణము మెక్కొను జుండన్
    జిన్ని యవధి నుండిగనగ
    వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్

    రిప్లయితొలగించండి
  3. కన్నులవిందుగ నభమున
    పన్నుగ మేఘశకలములు పరిగొను వేళన్
    వెన్నెల విరిసిన తెరఁగున
    వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్

    రిప్లయితొలగించండి

  4. విన్నువెలుంగుగ రణమున
    విన్నందెడు ఫల్గుణుండు వేడబమున తా
    నన్నువు జేరగ మునియై
    వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్.

    రిప్లయితొలగించండి
  5. కన్నుల ముందున్న రవిని
    దన్నున చూచితిని చిత్ర దర్శని గుండా
    పున్నమి వెన్నెల గాంచితి
    వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నల్ పూచినవేళ పొంచి విడువన్ బుష్పాస్త్రుడే బాణముల్
      కన్నుల్ ముందర కాననైన మదనున్ గావించెనే బూదిగా
      వన్నెల్ చిన్నెల గౌరినే కనుగొనన్ వ్యామోహముప్పొంగగా
      వన్నెల్ మార్చెను భాస్కరుండు శశియై ప్రాక్పర్వతాగ్రంబుపై

      భాస్కరుడు = శివుడు

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. 'నెరవున్' గా సవరిస్తున్నాను గురూజీ

      తొలగించండి
  6. మిన్నున మబ్బులు గ్రమ్మియు
    గ్రన్న న రవి నా క్ర మించ కాంతిని బాయ న్
    కన్నుల విందుగ న య్యె డ
    వన్నెలు మార్చెను రవి శశి వలె బ్రా గ్వీ ధి న్

    రిప్లయితొలగించండి
  7. మిన్నున ధూమస్తోమము
    ఉన్నమితాగ్నిశిఖలెగయ పూర్వాచలమున్
    కన్నుల కగుపించెనిటుల
    వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్

    పూర్వాద్రి పైన పొగ క్రమ్మి సూర్యుడు చంద్రునివలె కనిపించాడు అనే భావంలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      రెండవ పాదంలో యతి తప్పింది. *స్తోమం బున్నమితాగ్ని* అనవచ్చు. అఖండయతి దోషం కాదు

      తొలగించండి
  8. విన్నున్ జేరును భానుడే తొలిదెసన్ విశ్వమ్ము నే యేలగన్
    మన్నున్ జీల్చుచు పుట్టనేమి గననా మార్తాండుడే మండినన్
    చెన్నౌరూపము తోడ తామనుతరిన్ జిత్రంబదే గాంచగన్
    వన్నెల్ మార్చెను భాస్కరుండు శశియై ప్రాక్పర్వతాగ్రంబుపై.

    రిప్లయితొలగించండి
  9. శా.

    కన్నుల్ దేహము గాలె దైత్య గణముల్ కందించె మార్తాండుచే
    కన్నీరే ప్రవహించ సంజ్ఞ విడచెన్ గంధర్వమై భూమిపై
    *వన్నెల్ మార్చెను భాస్కరుండు,.. శశియై ప్రాక్పర్వతాగ్రంబుపై*
    విన్నాణంబనిపించు రోహితముగా బింబమ్ము నాభాసయే.

    రిప్లయితొలగించండి
  10. మిన్నున్ మన్నునభిన్నమైనవియనన్ మేఘావృతంబై వెసన్
    కన్నుల్ విందొనగూర్చుచున్ చినుకు లాకాశంబునన్ తుట్రిలన్
    వన్నెల్ మార్చెను భాస్కరుండు శశియై  ప్రాక్పర్వతాగ్రంబుపై
    కన్నారన్ కనుగొంటినీ యుదయ రాగంబున్ దివంబందునన్

    రిప్లయితొలగించండి
  11. కం॥ ఎన్నగ హేమంతమునను
    మిన్నగు హిమపాతమందు మేలిమి పగిదిన్
    సన్నని కాంతుల నిమ్ముగ
    వన్నెలు మార్చెను రవిశశివలెఁ బ్రాగ్వీథిన్

    శా॥ కన్నుల్ విచ్చికొనంగ నుద్భటుని సంక్రాంతంబు నొప్పారఁగన్
    మిన్నౌరీతిగ మంచుకొండ శిఖరమ్ మీదన్ మయూఖమ్ములున్
    వన్నెల్ మార్చుచు నీటిబిందువులపై భాసిల్లె నిప్పాటునన్
    “వన్నెల్ మార్చెను భాస్కరుండు శశియై ప్రాక్పర్వతాంగ్రంబుపై”

    రిప్లయితొలగించండి
  12. కందం
    పెన్నేటి తీరమందున
    సన్నటి జలతారు మబ్బు చాటున సాగన్
    కన్నుల విందొనరించెడు
    వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్!

    శార్దూలవిక్రీడితము
    పెన్నాతీరమునందు వర్షమునకై వేచంగ దోబూచులా
    డెన్నెన్నో జలతారు సన్నని మెయిల్లేపార నాచాటునన్
    గన్నుల్విందుగొనంగ సాగుచును నాకాశాన దివ్యాకృతిన్
    వన్నెల్ మార్చెను భాస్కరుండు శశియై ప్రాక్పర్వతాగ్రంబుపై

    రిప్లయితొలగించండి
  13. బల్లూరి ఉమాదేవి

    మిన్నున వెలిగెడు భానుని
    గ్రన్నన స్వర్భాను మ్రింగ కదలినయంతన్
    పిన్నలుపెద్దలు కనగా
    వన్నె లు మార్చెను రవి శశివలె బ్రాగ్వీధిన్

    రిప్లయితొలగించండి