24, అక్టోబర్ 2023, మంగళవారం

దత్తపది - 204

25-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
కృత్యము - నిత్యము - ముత్యము - సత్యము
పై పదాలను ప్రయోగిస్తూ
ఆదర్శ పురుషుడెలా ఉండాలో వివరిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. సత్యము పాటించుచునే,
    నిత్యము దర్మము విడువక నెవ్వడు తనదౌ
    కృత్యము సఫలము జేయునొ
    ముత్యము వలె వెలు గుసంఘ మున జనప్రియుడై.

    రిప్లయితొలగించండి
  2. కృత్యము లందున స్వచ్చత
    నిత్యము సత్యములు బల్కు నీమము దోడన్
    ముత్యము వలె భాసించుచు
    ప్రత్య ణు వు న వెల్గు చుండు ప్రావీ ణ్యo బు ల్

    రిప్లయితొలగించండి
  3. కందం
    కృత్యములందున విజ్ఞత
    నిత్యము గనిపించ మసలి నెగడుచునుండన్
    సత్యము జనులటఁ గడిగిన
    ముత్యమనుచు ననుసరింప ముందుకు రారే!

    రిప్లయితొలగించండి

  4. నిత్యము పదుగురికి మేలు నెక్కొనంగ
    కృత్యములను సలుపుచుండి కీర్తి నొంది
    సత్యమునె పలుకుచునుండ జగతినందు
    ముత్యమువలె నాదర్శపు పురుషుడుండు

    రిప్లయితొలగించండి
  5. నిత్యము పాదపూజ జననీజనకుండ్రకొనర్చుచున్ సదా
    సత్యము పల్కుచుందు రగచాట్లకు భీతిల బోవరె ప్పుడున్
    మృత్యువు లెక్కజేయరిల మేలిమిముత్యము వంటి వారు స
    త్కృత్యము లాచరింతురను కీర్తిని పొందిన వారె సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
  6. కృత్యములెల్లవారలకు క్షేమము గూర్చుచు నుండగావలెన్
    నిత్యము నీమబద్ధుడయి నీతికి పట్టము గట్టగావలెన్
    ముత్యమువోలె స్వచ్ఛతకు మూలముగావలె నెల్లవేళలన్
    సత్యము ధర్మమున్ నిలుపు సద్గుణ లక్షణ దర్పణంబుగా

    రిప్లయితొలగించండి
  7. నిత్యము నిర్మల మదితో
    కృత్యములను జేసినపుడె గెలుపు లభించున్
    సత్యము వలికిన నెప్పుడు
    ముత్యమువలె మెరియగలవు
    పుడమిని సతమున్

    రిప్లయితొలగించండి
  8. కందం:
    సత్యము వక్కాణించును
    నిత్యము సజ్జనులఁగూడి నియతిగ మెలఁగున్
    ముత్యమువలె మనసుండును
    కృత్యములన్ దరిమివేయు వృత్రములు వెసన్

    రిప్లయితొలగించండి
  9. ఉ॥ కృత్యములన్ని సర్వజన క్షేమముఁ గోరుచుఁ జేయుచున్నచో
    నిత్యము నీతిఁ బాయకను నేర్పున మిన్నగ బుద్ధిశాలియై
    ముత్యము వంటి పుత్రుఁడని మోదము మీరఁగ లోకులన్నచో
    సత్యముగా నతండిలను సంస్మరణీయుఁడు సజ్జనుండగున్

    రిప్లయితొలగించండి
  10. నిత్యము మానవుండు గడు నిశ్చల
    మైన మనస్సుతోడ దా
    కృత్యము సేసినన్ దొలగు గ్లేశము
    దక్కను సత్ఫలంబులున్
    సత్యము వల్కుచున్ సతము సాగిన
    ముందుకు జీవనంబిలన్
    ముత్యము వోలె వెల్గు మరి భూజను
    లెల్ల స్తుతింతురాతనిన్.

    రిప్లయితొలగించండి
  11. సత్యము వీడకతాస
    త్కృత్యమ్ములనాచరించ పృథ్వినిజనముల్
    నిత్యంబీతనిగనుచును
    ముత్యమువంటిమనుజుడని మ్రొక్కుదురెపుడున్

    రిప్లయితొలగించండి
  12. ఉత్పలమాల:
    సత్యముఁ వల్కు నెన్నడును సద్గుణవంతుల సంగతమ్మునన్
    నిత్యము తామెలంగు నవనీత సుకోమల సౌమనస్వియై
    ముత్యమువోలె స్వచ్ఛమగు మోమున లాస్యము తాండవించు నే
    కృత్యమునందుఁ గాననగు హృద్యపు పోకడ యగ్రగణ్యుకున్

    రిప్లయితొలగించండి
  13. ఉ.

    కృత్యము దైవమున్ గొలిచి కీర్తన సేయుచు భక్తి మార్గమున్
    నిత్యము దల్లిదండ్రులకు నీతిగ గౌరవ మిచ్చి ప్రేమతో
    ముత్యముగా ప్రకాశమును మోమున బూనుచు లక్ష్యవేధయై
    సత్యముఁ బల్కి మానవుల జాడ్యము దేర్చుచు మేలు జేసెడిన్.

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సత్యమునె పలుక వలయు సంతతమ్ము
    నిరతమున్ కృత్యములు చేసి నియతి తోడ
    పర హితము కోరి నిత్యము పాటుపడుచు
    ముత్యమున్ బగిది ప్రకాశమొంద వలయు.

    రిప్లయితొలగించండి
  15. సత్యమునే పలుకుచు ప్రతి
    నిత్యము ధర్మాచరణము నియమముగా స
    త్కృత్యములుసల్పి కడిగిన
    ముత్యమువలె యున్నవాడె ముక్తిని బొందున్

    రిప్లయితొలగించండి