30-10-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను” (కపిశ = చీమ)(లేదా...)“చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్”
రక్కసుడు మహాకాయుడు రాళ్ళు విరుగునడచిన, తనకై తాను జేయడెవరికిని హాని, ధర్మమెరిగిన వాడతడు సుమ్ముత్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను.
దాన వత్వము గల్గియున్ దయను జూపికీడొ నర్ప క గాచు దా కీట క ములననుచు సహ చర రాక్షసం డ నె నిట్లు" త్రొ క్కి చంపడు కుంభ కర్ణుడు గపి శను "
మూడవ పాదంలో రాక్షసుం డని యె నిట్లు అని సవరణ చేయడమైనది
శా.శ్రీవాణీ కరుణా కటాక్ష ఫలమే చిత్రించె జిహ్వాగ్రమున్ఆ వాగీశుని రావణానుజుడు బాహాటమ్ముగా నిద్రయేనీవాకంబగుటన్ సుషుప్తి నెగులౌ నిర్వాహకుండయ్యెనే*చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్.*
తేటగీతిసీతఁ దెచ్చిన రావణు చేష్టనెంచితప్పుఁ బట్టియు శ్రేయము సెప్పెఁ గాదె?తనదు జోలికి రాకుండ దారినేగద్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశనుశార్దూలవిక్రీడితమునీవా సీతను దెచ్చుటే తగదనెన్ నీచాత్ముఁ బౌలస్త్యునిన్జేవన్ గల్గియు జాలినంతఁ దినుచున్నిద్రింపగాఁ జూచు నేజీవైనన్ దన జోలిరాదనిన తాఁ జే తాకగా నొప్పడున్జావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్
మూడవ పాదము మెదట, జీవమ్మున్ అని చదువుకొన ప్రార్థన.
తనకు సాటి నిలువ లేని దస్యునణగత్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు ; గపిశనునణచ తనను గాక పరుని నంప నొప్పుననుచు నెరుక బరచె దన యన్న కతడు
మ్రెక్కి బండెడు కుడుములు మిక్కుటముగగ్రక్కున నిదురోగ గరిచె కపిశ మొకటిఎక్కడ నిదుర భంగమౌ నోక్కొయంచుత్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను
రావణుని సోదరుడు కదా రాజసముగనిద్ర బోయిన లేవడు నిక్కముగనుఎవ్వరెంత బాధించిన సవ్వడైనత్రొక్కి చంపడుకుంభకర్ణుడు గపిశను.
శక్తి గలిగిన నేమిరా శయ్య పైనగాఢ నిదురలో మునిగెడు కాశ్యపేయుడాద మరచి నిద్రించిన నట్టి వేళత్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను.రావంబచ్చట చేయబోకు మట నిద్రాలోలుడుండెన్ గదానీవారీతిని జేసినన్ దనుజుడే నిన్ జంపు వాడంచనన్ నీవాభీతిని వీడు సంతతము తానిద్రించు నవ్వేళలో చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్.
శాపవశమున దనుజుఁగా జననమొందినిద్ర యందు విగాహించు నిరతమతఁడుపరుల కెపుఁడు హానిని తలపంగ బోడుత్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను
మిక్కిలి ఘనశరీరుడు మేరువతడురక్కస సమూహ తేజో విరాజితుండుమెక్కి నిద్రించు సౌఖ్యాన మిక్కుటముగత్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను
భావించెన్ దన సోదరుండు పరులన్ బాలార్చు శస్త్రంబుగారావించెన్ దశకంఠుడే రణమొనర్పన్ రామ సైన్యంబుతోచావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్భావించన్ డట హానిగూర్చ నెపుడున్ బౌలస్తమేలేనిచో
భావోద్వేగములన్ వహింపడు సదా స్వాపమ్ము నందుండు నాప్రావేల్పే కఱివేల్పు భృత్యుఁడు గతంబందున్ హరిధ్యానమందా వైకుంఠమునన్ వసించె హరి పాదాంభోజముల్ గొల్చుచున్చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్
శార్దూలము.ఆవాసంబున దాను వైభవముగా నత్యంత సంసక్తతో బ్రేవంచున్ గడుపార మెక్కనెలమిన్ వేంచేయు కన్మోడ్పులోనావేశమ్మును గూడ వీడునటులన్ హ్లాదమ్ముతో దూగుచున్ *జావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్*
తే॥ అమిత భారీకాయము జతకమిత మైననిద్రతో నచేతనుఁడగు నిత్యమతఁడుఘన సుషుప్తిలో నుండఁగఁ గలలయందుఁద్రొక్కి చంపడు కుంభకర్ణుఁడు గపిశనుశా॥ సేవాభావము నిల్పి యగ్రజునిపై సేవించఁ గాంక్షించినన్గావేషంబుకు దూర మాతఁడెపుడున్ గన్మోడ్పుతోఁ గాంచఁగన్భావావేశము లేకనుండు నిటులన్ భారీ శరీరమ్ముతోఁజావంద్రొక్కడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్
డా బల్లూరి ఉమాదేవి కాలమెల్లయు నిదురలో గడుపు వాడుశత్రు మూకల నెల్లయు చంపలేని దానవుడుమరపునగానిధరణియందు*“త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను”*
రక్కసుడు మహాకాయుడు రాళ్ళు విరుగు
రిప్లయితొలగించండినడచిన, తనకై తాను జేయడెవరికిని
హాని, ధర్మమెరిగిన వాడతడు సుమ్ము
త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను.
దాన వత్వము గల్గియున్ దయను జూపి
రిప్లయితొలగించండికీడొ నర్ప క గాచు దా కీట క ముల
ననుచు సహ చర రాక్షసం డ నె నిట్లు
" త్రొ క్కి చంపడు కుంభ కర్ణుడు గపి శను "
మూడవ పాదంలో రాక్షసుం డని యె నిట్లు అని సవరణ చేయడమైనది
తొలగించండిశా.
రిప్లయితొలగించండిశ్రీవాణీ కరుణా కటాక్ష ఫలమే చిత్రించె జిహ్వాగ్రమున్
ఆ వాగీశుని రావణానుజుడు బాహాటమ్ముగా నిద్రయే
నీవాకంబగుటన్ సుషుప్తి నెగులౌ నిర్వాహకుండయ్యెనే
*చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్.*
తేటగీతి
రిప్లయితొలగించండిసీతఁ దెచ్చిన రావణు చేష్టనెంచి
తప్పుఁ బట్టియు శ్రేయము సెప్పెఁ గాదె?
తనదు జోలికి రాకుండ దారినేగ
ద్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను
శార్దూలవిక్రీడితము
నీవా సీతను దెచ్చుటే తగదనెన్ నీచాత్ముఁ బౌలస్త్యునిన్
జేవన్ గల్గియు జాలినంతఁ దినుచున్నిద్రింపగాఁ జూచు నే
జీవైనన్ దన జోలిరాదనిన తాఁ జే తాకగా నొప్పడున్
జావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్
మూడవ పాదము మెదట, జీవమ్మున్ అని చదువుకొన ప్రార్థన.
తొలగించండితనకు సాటి నిలువ లేని దస్యునణగ
రిప్లయితొలగించండిత్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు ; గపిశను
నణచ తనను గాక పరుని నంప నొప్పు
ననుచు నెరుక బరచె దన యన్న కతడు
మ్రెక్కి బండెడు కుడుములు మిక్కుటముగ
రిప్లయితొలగించండిగ్రక్కున నిదురోగ గరిచె కపిశ మొకటి
ఎక్కడ నిదుర భంగమౌ నోక్కొయంచు
త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను
రావణుని సోదరుడు కదా రాజసముగ
రిప్లయితొలగించండినిద్ర బోయిన లేవడు నిక్కముగను
ఎవ్వరెంత బాధించిన సవ్వడైన
త్రొక్కి చంపడుకుంభకర్ణుడు గపిశను.
రిప్లయితొలగించండిశక్తి గలిగిన నేమిరా శయ్య పైన
గాఢ నిదురలో మునిగెడు కాశ్యపేయు
డాద మరచి నిద్రించిన నట్టి వేళ
త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను.
రావంబచ్చట చేయబోకు మట నిద్రాలోలుడుండెన్ గదా
నీవారీతిని జేసినన్ దనుజుడే నిన్ జంపు వాడంచనన్
నీవాభీతిని వీడు సంతతము తానిద్రించు నవ్వేళలో
చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్.
శాపవశమున దనుజుఁగా జననమొంది
రిప్లయితొలగించండినిద్ర యందు విగాహించు నిరతమతఁడు
పరుల కెపుఁడు హానిని తలపంగ బోడు
త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను
మిక్కిలి ఘనశరీరుడు మేరువతడు
రిప్లయితొలగించండిరక్కస సమూహ తేజో విరాజితుండు
మెక్కి నిద్రించు సౌఖ్యాన మిక్కుటముగ
త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను
భావించెన్ దన సోదరుండు పరులన్ బాలార్చు శస్త్రంబుగా
తొలగించండిరావించెన్ దశకంఠుడే రణమొనర్పన్ రామ సైన్యంబుతో
చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్
భావించన్ డట హానిగూర్చ నెపుడున్ బౌలస్తమేలేనిచో
భావోద్వేగములన్ వహింపడు సదా స్వాపమ్ము నందుండు నా
రిప్లయితొలగించండిప్రావేల్పే కఱివేల్పు భృత్యుఁడు గతంబందున్ హరిధ్యానమం
దా వైకుంఠమునన్ వసించె హరి పాదాంభోజముల్ గొల్చుచున్
చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్
శార్దూలము.
రిప్లయితొలగించండిఆవాసంబున దాను వైభవముగా నత్యంత సంసక్తతో
బ్రేవంచున్ గడుపార మెక్కనెలమిన్ వేంచేయు కన్మోడ్పులో
నావేశమ్మును గూడ వీడునటులన్ హ్లాదమ్ముతో దూగుచున్
*జావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్*
తే॥ అమిత భారీకాయము జతకమిత మైన
రిప్లయితొలగించండినిద్రతో నచేతనుఁడగు నిత్యమతఁడు
ఘన సుషుప్తిలో నుండఁగఁ గలలయందుఁ
ద్రొక్కి చంపడు కుంభకర్ణుఁడు గపిశను
శా॥ సేవాభావము నిల్పి యగ్రజునిపై సేవించఁ గాంక్షించినన్
గావేషంబుకు దూర మాతఁడెపుడున్ గన్మోడ్పుతోఁ గాంచఁగన్
భావావేశము లేకనుండు నిటులన్ భారీ శరీరమ్ముతోఁ
జావంద్రొక్కడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్
డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండికాలమెల్లయు నిదురలో గడుపు వాడు
శత్రు మూకల నెల్లయు చంపలేని
దానవుడుమరపునగానిధరణియందు
*“త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను”*