22, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4566

23-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లలితాలంకారము లవలక్షణములగున్”
(లేదా...)
“లలితములౌ నలంకృతులు లక్షణదూరములౌను కైతలో”

10 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      సలలిత భావము దెలుపఁగఁ
      గలిపింప జనులు వొగడరె కవనమునందున్
      విలయములన్ వర్ణింపగ
      లలితాలంకారము లవలక్షణములగున్


      చంపకమాల
      సలలిత భావమాధురులు సక్కగ దీర్చగ పాటవమ్మునన్
      భళి! భళి! యంచు పండితులు పట్టము గట్టరె సాహితీ సభన్
      విలయము దెల్పు భావనల విజ్ఞత వీడుచుఁ గూర్చినంతటన్
      లలితములౌ నలంకృతులు లక్షణదూరములౌను కైతలో



      తొలగించండి
  2. వలపున నా పరమాత్మకు
    పలురక సింగారములిడ వాడుక యయ్యెన్
    నలవాటు మాని జేసిన
    లలితాలంకారము లవలక్షణములగున్

    రిప్లయితొలగించండి
  3. పలువురు కవివర్యులచే
    సలలితముగ పొదుగబడిన చక్కగతోచున్
    కొలదుల కైతల నిమడని
    లలితాలంకారము లవలక్షణములగున్

    లలితములౌ నలంకృతులు లక్షణ యుక్తములౌను కైతలో
    పలువురికైతలందుగన వచ్చును వన్నెలు పుష్కలంబుగన్
    కొలదులు కూర్పులందు మరి కొప్పరమొప్పెడు రీతివైచినన్
    లలితములౌ నలంకృతులు లక్షణదూరములౌను కైతలో

    రిప్లయితొలగించండి
  4. సలలిత భావనలవి కవి
    తల కాయువు పట్టు శాశ్వతముగను భువిలో
    నిలుపుట తథ్యముగద మరి
    లలితాలంకారము లవలక్షణములగున్ ?


    వలదని చెప్పిన చిరిగిన
    వలువల ధరియించి బిగువు పరువాలనిటుల్
    పలువురకు చూపు విధమున
    లలితాలంకారము లవలక్షణములగున్.
    ( అన్న చెల్లెలగు లలితతో చెప్పుమాట లలిత అలంకారమవలక్షణమని)


    సలలిత మైన భావనలె సాహితి సంపద యంచు చెప్పిరే
    పలువురు పండితుల్, బుధులు పామరు లెల్ల మెచ్చినన్
    విలసిత మౌను వాఙ్మయము విశ్వ ప్రదీపిత మౌను మరియా
    లలితములౌ నలంకృతులు లక్షణదూరములౌను కైతలో ?

    రిప్లయితొలగించండి
  5. విలవిల లాడెను హృదయము
    చెలువపు పెనిమిటి మరణము చింతలు గూర్పన్
    దెలియక నొకర్తె చేసిన
    లలితా లంకా రము లవ లక్ష ణ ము లగు న్

    రిప్లయితొలగించండి
  6. కలువలఱేని కౌముదులు కన్నె హృదిన్ చెలరేగు భావనల్
    సలలితమౌ నలంకృతుల సౌరుగ వర్ణనసేయ లగ్గగున్
    కలహమునందు నొండొరుల గర్హణముల్ విశదీకరించగన్
    లలితములౌ నలంకృతులు లక్షణదూరములౌను కైతలో

    రిప్లయితొలగించండి
  7. కలహమ్ములు తల్లడములు
    విలయములాభీలములను వేదనలఁ గవుల్
    పొలుపుగ వర్ణించుటలో
    లలితాలంకారము లవలక్షణములగున్

    రిప్లయితొలగించండి
  8. చం.

    కులమత భేదమే వలదు గొప్పగ వ్రాయుచు పాట గేయముల్
    పలువురు ఛందమున్ విడువ, వాడుక భాషను పద్య రూపముల్
    మలచిన యాస బాసలను మాండలికమ్ములు తెల్గు వెల్గులై
    *లలితములౌ నలంకృతులు లక్షణదూరములౌను కైతలో.*

    రిప్లయితొలగించండి
  9. వలువలుగట్టుచునంబకు
    వెలగలనాభరణములనువేడుకతోడన్
    తిలకమ్ము నిడక చేసెడు
    “లలితాలంకారము లవలక్షణములగున్”*

    రిప్లయితొలగించండి