11, అక్టోబర్ 2023, బుధవారం

సమస్య - 4555

12-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవినీతికి నాటపట్టు లయ్యెను గుడులే”
(లేదా...)
“నెలకొనె నాలయమ్ము లవినీతికిఁ జూడఁగ నాటపట్టులై”

28 కామెంట్‌లు:

  1. కందం
    స్తవమొనరించియు భక్తి భ
    గవంతునకనఁగ నొసంగు కాన్కలు కోట్లై
    చవులూర ధర్మకర్తల
    యవినీతికి నాటపట్టులయ్యెను గుడులే

    చంపకమాల
    కలగుచు నీచ కార్యముల పాప నివృత్తికి హుండినందునన్
    వెలయఁగ కోట్లరూప్యముల విత్తము భక్తులొసంగ ధర్మక
    ర్తలకది దోచెడున్ భ్రమలు దల్పులరేప వినాశకాలమై
    నెలకొనె నాలయమ్ము లవినీతికిఁ జూడఁగ నాటపట్టులై

    రిప్లయితొలగించండి
  2. నవయుగమున ప్రతి రంగము
    నవకాశ మొసగును ధనము నార్జించుటకై,
    చివరకు గుడులను విడువరు,
    అవినీతికి నాటపట్టు లయ్యెను గుడులే!

    రిప్లయితొలగించండి
  3. వివిధపు రూపున నొసగిన
    నవిరళ ముడుపుల ధనంబు నవ కాశ ము గా
    జవమున నపహ రించు ట గన
    నవి నీతికి నాటపట్టు ల య్యె ను గుడు లే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      అవిరళ ముడుపులు... దుష్ట సమాసం
      మూడవ పాదంలో గణభంగం
      సవరించండి

      తొలగించండి
    2. నవిరళ మగు ముడుపులీయ నవకాశము గా
      జవమున హరించు టను గన అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  4. అవగాహన లేక యనిరి
    "అవినీతికి నాటపట్టు లయ్యెను గుడులే"
    జవముగ దానిని మారుగ
    సవరణ జేయనగు జనులు సత్యము నెరుగన్

    రిప్లయితొలగించండి
  5. కం॥ భవ బాధలఁ దీర్చుననుచు
    ధవుని గుడికి వెడలి కొలచి ధనము నొసఁగఁగన్
    సవము కబళించ ఘనులఁట
    అవనీతికి నాటపట్టు లయ్యెను గుడులే!

    చం॥ కలతలు కష్టనష్టముల గాసిలి దీన జనాళి యెంతయో
    కలవర మొంది బాధలకు కాచు నటంచు ధవుండు భక్తితో
    మెలఁగుచు నిచ్చు కానుకలు మేయు ప్రబుద్ధులు నెక్కువై చనన్
    నెలకొనె నాలయమ్ము లవినీతికి జూడఁగ నాట పట్టులై!

    రిప్లయితొలగించండి
  6. వివరింప ధర్మ కర్తల
    వ్యవహారపు కేంద్రములయి బాహాటముగా
    ద్రవిణము దోచు పసారము
    లవినీతికి నాటపట్టు లయ్యెను గుడులే.



    విలసిత హిందు ధర్మమది విశ్వమనోజ్ఞ విరాజితంబుగా
    నిలుపుటె ధ్యేయమై నిలిచి నిత్యమకాయుని గూర్చి తెల్పెడిన్
    పలువురి సుప్రలాపములు భక్తుల జాగృత పర్చనెంచుచున్
    నెలకొనె నాలయమ్ము లవి , నీతికిఁ జూడఁగ నాటపట్టులై.

    రిప్లయితొలగించండి
  7. చివరకుపాలక మండలిఁ
    బ్రవేశమొందిన ఖలులను పరికింపంగా
    నెవరైనను తలతురుకద
    'అవినీతికి నాటపట్టు లయ్యెను గుడులే'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఖలులను నిర్ణయించి గుడి కంపగఁ గాంతుము కార్యవర్గమున్
      విలువలు శూన్యమై కడకు విత్తముపై తమ దృష్టినిల్పి యా
      తులువలు నీతిబాహ్యముగ తుచ్ఛపు కార్యము లందు మున్గగా
      నెలకొనె నాలయమ్ము లవినీతికిఁ జూడఁగ నాటపట్టులై

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి
      అభినందనలు

      తొలగించండి
  8. అవగుణులే పాలకులై
    యవలీలగ దేవళముల యాస్తుల మ్రింగన్
    వ్యవహారము నడుప తులువ
    లవినీతికి నాటపట్టు లయ్యెను గుడులే

    రిప్లయితొలగించండి
  9. తలపక పాపపుణ్యముల దైవముపై గురి లేనివారు దే
    వళముల కార్యనిర్వహణ బాధ్యతలన్గొని దైవ మాన్యముల్
    విడువక హుండి కానుకలు భీతివహింపక మ్రింగు దుస్థితుల్
    నెలకొనె నాలయమ్ము లవినీతికిఁ జూడఁగ నాటపట్టులై

    రిప్లయితొలగించండి
  10. వివిధాంశములను గూర్చుచు
    నవివేకులుగా తిరిగెడునారాసుతుకున్
    వివరముగా దెల్పినకథ
    *“లవి,నీతికి నాటపట్టు లయ్యెను గుడులే”*

    రిప్లయితొలగించండి
  11. పలువురురాజులీ భువిని వాసిగ పాలనచేయు వేళలన్
    గెలువ గయుద్ధ మందిడిరిగెల్పు కుగుర్తు గకట్టగాగుడుల్
    వెలవెలబోవుచయ్యవియు వింతగు కార్య పుమందిరమ్ములై
    *నెలకొనె నాలయమ్ము లవినీతికిఁ జూడఁగ నాటపట్టులై”*

    రిప్లయితొలగించండి
  12. భవ హరుడౌ పరమాత్ముడ
    భవము నొసంగునని నమ్ము భక్తులకిల ని
    క్కువగా విరివిగ వెలసిన
    వవి, నీతికి నాటపట్టు లయ్యెను గుడులే.

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ప్రవచనముల చెప్పుదురు న
    నవరతమున్ భక్తి భావనములను పెంచన్
    స్తవముల జేసెడు నిలయము
    లవి; నీతికి నాటపట్టులయ్యెను గుడులే.

    రిప్లయితొలగించండి