2, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4548

3-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట”
(లేదా...)
“ఇతఁడొక బ్రహ్మచారి యఁట యిద్దఱు భార్యల భర్త సూడఁగన్”

21 కామెంట్‌లు:

  1. జగమె రుగునత డొకబ్రహ్మ చారి యగుట,
    గుణగ ణములలె క్కనతన కునుగ లరట
    సిద్ధి బుద్ధియ నుసతులు చోద్యముగద
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట”

    రిప్లయితొలగించండి
  2. బ్రతుకుచున్న సంఘము పయి వలపునొంద,
    తాను జేయు జీవిక యందు దగులముండ,
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట
    మనువు జరుగగ నతనికి మరొకరంట

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    లంపటమ్ములు లేని విరాగునివలె
    స్వార్థచిత్తమై ధూర్తుడు స్వామియయ్యె!
    మతకరిఁ బరిశోధింపఁగ మాధ్యమములు
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట!

    చంపకమాల
    హితములు సెప్పు స్వామియన నెంచగ యోగుల రీతి దోచుచున్
    నతజనులెల్లరిన్ దమరి నామము వాడఁగ స్ఫూర్తి నింపఁగన్
    మతకరి నైజమున్ దెలియ మాధ్యమ శోధనలెత్తి చూపఁగా
    నితఁడొక బ్రహ్మచారి యఁట! యిద్దఱు భార్యల భర్త సూడఁగన్! !

    రిప్లయితొలగించండి
  4. తారకాసురునివధింప తానుపుట్టె
    శరవణ భవుడు కాంతుడు శక్తి ధరుడు
    పార్వతీ నందయంతుడు బ్రహ్మచారి
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సతతము తారకాసురుడు శాంతికి భంగము కల్గజేయగా
      శతధృతిజూప వేల్పులకు చంపునుపాయము జన్మమొందెగా
      నతులిత శక్తి ఖేచరుడు హర్షమునొందగ కార్తికేయుడై
      యితఁడొక బ్రహ్మచారి యఁట యిద్దఱు భార్యల భర్త సూడఁగన్

      తొలగించండి
  5. డా బల్లూరి ఉమాదేవి

    భార్య యుండబోదువినుమా వసుధ యందు
    సతతముహరినిమరువకసన్నుతించు
    బ్రహ్మచారికి ,నిద్దరు భార్యలంట
    హరిహరు లిరువురకునందురాలకించు

    రిప్లయితొలగించండి

  6. నలుబ దేడుల వరకు తాలలన ముఖము
    గాంచకను గడ్పెకాలము కాంతలెల్ల
    నడ్గ సిగ్గుచే పెండిలి యాడె నిపుడు
    బ్రహ్మ చారికి నిద్దరు భార్యలంట.

    రిప్లయితొలగించండి
  7. చం.

    సతమతమయ్యె పెండ్లి యని స్మార్తుడు బ్రహ్మగ బూజసేయునే
    *ఇతఁడొక బ్రహ్మచారి, యఁట యిద్దఱు భార్యల భర్త సూడఁగన్*
    గ్రతువులనొందు శ్రీహరియె గమ్యము జేర్చు ననాథనాథుడే
    కుతకుతలాడు కోరికలు కొన్ని సమస్యలె గోచికట్టుకున్.

    రిప్లయితొలగించండి
  8. పిలిచి స్కంద షష్టికి పూజ సలుపుదురు గ
    బ్రహ్మ చారికి :: నిద్దరు భార్య లంట
    శ్రీ ని వాసు ని కని యండ్రు చెలువ మలర
    ననుచు భక్తులు పల్క రే యవని యందు

    రిప్లయితొలగించండి
  9. ములుగు కర్ర,కమండలములు ధరించి
    విప్రవరుడేగ పట్టణవీధులందు
    పెక్కు జనులెల్ల రెంటిని వెక్కిరింప
    "బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట"

    రిప్లయితొలగించండి
  10. వల్లియును దేవసేనలు పడతు లిరువు
    రంట సేనాని స్కందుఢా యగ్గిచూలి
    శరవణోద్భవు డైనట్టి శక్తి ధరుడు
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట.


    అతులిత గండరీడునసమాక్షుని పుత్రుడు క్రౌంచ భేది పా
    ర్వతి సుతుడైన స్కందునకు వల్లియొ కతియు దేవసేనయున్
    సతులుగ గల్గియుండెకద షణ్ముఖు డీతడె జ్ఞాన దాతయే
    యితఁడొక బ్రహ్మచారి యఁట యిద్దఱు భార్యల భర్త సూడఁగన్.

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    బ్రహ్మచారి నామము గల పైడి ఱేడు
    పెండ్లి యాడె యిర్వుర మభ్యపెట్టి, బంధు
    జనులకు విదితంబవగ కజ్జమున యనెను
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి

    రిప్లయితొలగించండి
  12. తండ్రి ధర్మయ్య బహుకోపధారి యతఁడు
    మాత శాంతమ్మ జగడాలమారి యామె
    బ్రహ్మచారి కొడుకు పేరు బాగుబాగు
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట

    రిప్లయితొలగించండి
  13. ఇతఁడొక బ్రహ్మచారి యఁట యిద్దఱు భార్యల భర్త సూడఁగన్
    సతతము బుద్ధి సిద్ధియను సాధ్వులఁ లీలగ నిల్పుకున్న కా
    మితములఁ దీర్చు విఘ్నపతి మేదినిలో నొక బ్రహ్మచారియే
    నతులనుసల్పు భక్తుల మనంబుల నియ్యవి గూర్చు గావుతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇతఁడొక బ్రహ్మచారి, యఁటయిద్దఱు భార్యల భర్త సూడఁగన్
      సతము గవాక్షమందు సరసమ్ములతో మతి చంచలించగా
      సతమతమాయె నర్భకుఁడు సత్వరమేగెను స్వంత యూరికిన్
      సుతుని మనోగతంబెరిఁగి చువ్వన జేసిరి పెండ్లి వానికిన్

      తొలగించండి
  14. సతతము బ్రహ్మచర్యమున సాఁగుచు నుండెడి వాఁడు నంజనా
    సుతుఁ డిట మంత్రిసత్తముఁడు ౘక్కఁగ నార్కికి నింక నార్కియో
    సతులుగ తారయున్ రుమయు సంభవమైన విభుండు సత్కవీ!
    యితఁడొక బ్రహ్మచారి. అట యిద్దఱు భార్యల భర్త సూడఁగన్.

    (సమస్యలో సూక్ష్మ మైన మార్పు చేశాను. క్షంతవ్యుఁడను)

    రిప్లయితొలగించండి
  15. బ్రహ్మచర్యమునందు నా బ్రహ్మ మొకటి
    బ్రహ్మమే సర్వ మనుకొను భావ మొకటి
    సాఁగు నాతఁ డీ రెంటనే సతత మెన్న
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట.

    రిప్లయితొలగించండి
  16. మూలమాధారమునుగాగమౌనియయ్యె
    పచ్చపచ్తనియాకులవలపుగోరు
    సిద్ధిబుద్ధియునాతనిచెంతయుండ
    బ్రహ్మచారికినిద్దఱుభార్యలంట

    రిప్లయితొలగించండి


  17. తల్లి శాంతమ్మ బహుకోపి‌ తగువు‌లమ్మ‌
    తండ్రి‌ ధర్మయ్య పిసినారి తప్పు మనిషి‌
    వారి‌ కొడుకునామంబది‌ బ్రహ్మ చారి‌
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    (బ్రహ్మచారి అను పేరుగల యువకుడు)

    పిల్లలు కలుగ లేదని పెండ్లి యైన
    పిదప కొన్ని వత్సరములు వేచి చూచి
    మరల మరదలినె వివాహమాడగాను
    బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట.

    రిప్లయితొలగించండి
  19. తే॥ కుత్సితుఁడు బ్రహ్మచారిగ గొప్ప నటనఁ
    జేసి వధువు నెంచుకొనఁగఁ జేరె జైలు
    బ్రహ్మచారికి నిద్దరు భార్యలంట
    యని యెరిగి పోలీసుల కప్ప గించ

    చం॥ పతితుఁడు కట్నకానుకల వాంఛను మోసముఁ జేసి యిద్దరిన్
    సతులుగఁ బొందియున్ బరుచ జాలము నాతఁడే జైలుఁ గాంచెరో
    యతులిత చాక చక్యముగ నమ్మడు శోధనఁజేసి తెల్పఁగా
    నితఁడొక బ్రహ్మచారి యఁట యిద్దరు భార్యల భర్త సూడఁగా!

    రిప్లయితొలగించండి