30, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4573

31-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై”
(లేదా...)
“మన్ననఁ బొందునే మనుజమాత్రుఁడు సద్గుణపూర్ణుఁడైనచో”

28 కామెంట్‌లు:

  1. ఎన్నికనొందిరి సంపద
    దన్నుగ, తమకె మరియాద దక్కెను జనులం
    దన్ని విధముల ఖలులకిక
    మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై”

    రిప్లయితొలగించండి
  2. అన్నగ జెప్పెద వినవలె
    “మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై"
    యన్న యనుమాన మొందకు,
    యెన్నడయిన జరుగునదియె యెంచగ జగతిన్

    రిప్లయితొలగించండి
  3. ఎన్నుచునితరులలొసగును
    కన్నునుమిన్నునుగనకనుక్రౌర్యముతోడన్
    భిన్నమగుపనలుచేసిన
    *“మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై

    రిప్లయితొలగించండి
  4. సన్నతి జేయుదు రెల్లరు
    నెన్నగ సంపన్నులైన నిజ్జగమందున్
    విన్నార యెప్పుడైనను
    మన్నన బొందునొకొ !మనుజ మాత్రుడు
    గుణియై.

    రిప్లయితొలగించండి
  5. ఉన్నత విద్యాజ్ఞానము
    కన్నను పదవీవిభవము కనకపురాశుల్
    మిన్నను ఈలోకమ్మున
    మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై

    రిప్లయితొలగించండి
  6. ఎన్నడు సంఘము నందున
    మన్నన బొందు నొ కొ మనుజ మాత్రుడు :: గుణియై
    చెన్నగు గౌరవ మందుచు
    మిన్నగ రాణించు గాదె మేదిని యందున్

    రిప్లయితొలగించండి
  7. ఉ.

    సన్నుతి జేసె ధర్మజుడు చావడి గృష్ణుని రాజసూయమున్
    *మన్ననఁ బొందునే మనుజమాత్రుఁడు సద్గుణపూర్ణుఁడైనచో*
    భిన్నముగా ప్రవర్తనయు భీకర రూపముతోడ నిందలన్
    బున్నమి కాంతి జక్రమును బూన్చెను చంపెను చేదిరాజునే.

    రిప్లయితొలగించండి
  8. మిన్నగ నవినీతి పరులె
    దన్నుగ నిలిచినను చాలు ధన్యమనుచు తా
    మెన్నెడి వారల చెంతన
    మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై.?


    ఎన్నగ లేడెవండిలను హీనుల సంపద గోరి కుట్రలన్
    పన్నెడు దుష్టచిత్తులను వాస్తవ మియ్యది యెంచి చూడగా
    నెన్నడసత్యమాడకమహీతల మందు చరించు నాతడే
    మన్ననఁ బొందునే, మనుజమాత్రుఁడు సద్గుణపూర్ణుఁడైనచో.

    (సద్గుణపూర్ణుడే మన్నన పొందును)

    రిప్లయితొలగించండి
  9. ఎన్నికలందున పాల్గొని
    పన్నుగ గెలుపొందునేత పదవిని గొనడా!
    యెన్నికలందు గెలిచినన్
    మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై?

    పన్నుల సొమ్ముపైనగురి పంపకమేతమ వృత్తిధర్మమై
    తన్నుకుచావరే జనులు తామస చిత్తులు పెత్తనంబుకై!
    యెన్నికలందునన్ గెలిచి యెప్పటి కప్పుడు మేలుకూర్చినన్
    మన్ననఁ బొందునే మనుజమాత్రుఁడు సద్గుణపూర్ణుఁడైనచో



    రిప్లయితొలగించండి
  10. ఎన్ని యవాంతరముల కిం
    కెన్నియొ శోధనలకైన నెదురొడ్డి ధృతిన్
    మిన్నగ సుహితము సలుపక
    మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై

    రిప్లయితొలగించండి
  11. ఎన్ని యవాంతరమ్ము లెదురేగిన వీఁగక సత్య నిష్ఠతో
    నన్నిట దీటుగా నిలచి యందరి శ్రేయముఁ గోరి వారికిన్
    దన్నుగ నిల్వకున్న నిరతంబు మహత్తరుడంచు పేరిమిన్
    “మన్ననఁ బొందునే మనుజమాత్రుఁడు సద్గుణపూర్ణుఁడైనచో”

    రిప్లయితొలగించండి
  12. కం॥ మిన్నని హోదా ధనమున
    కెన్నఁగ విలువ లధికముగ నెటులన్ గనఁగా
    నున్నత గుణములు మెరయున్
    మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై

    ఉ॥ ఎన్నిరి మానవుల్ సుగుణ మేలని సంపద కారుబారులన్
    మిన్నగు సంపదల్ బదవి మేటియటంచును సద్గుణమ్ములన్
    గ్రన్నన వీడిరే జనులు గాంచవొ మేదినిఁ గాలదోషమై
    మన్ననఁ బొందునే మనుజమాత్రుఁడు సద్గుణపూర్ణుఁడైనచో

    రిప్లయితొలగించండి
  13. కందం
    ఎన్నెనె రారాజు విదురు?
    నన్నిట నా దుష్ట శకుని నారాధించెన్
    భిన్నమనస్తత్వులతో
    మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై?

    ఉత్పలమాల
    ఎన్నెనె పూజ్యుఁడౌ విదురునెంచఁగ మంచిని రాజరాజు? తా
    నన్నిట దుష్టుడౌ శకుని నంతరమందుననమ్మి కూలెనే!
    భిన్నమనంబుతోఁ జెలఁగి విజ్ఞులనొప్పని వారి మధ్యనన్
    మన్ననఁ బొందునే మనుజమాత్రుఁడు సద్గుణపూర్ణుఁడైనచో?

    రిప్లయితొలగించండి
  14. వన్నెలుచిన్నెలన్నిటినివాడుచులౌక్యమునంతజూపుచున్
    మిన్నగప్రాపకంబుననుమెప్పునుబొందుచుధాత్రియందునన్
    మన్ననబొందునే, మనుజమాత్రుడుసద్గుణపూర్ణుడైనచో
    క్రన్ననకామితార్థములగాంచగవచ్చునుపారమార్థుడై

    రిప్లయితొలగించండి
  15. సన్నుతి జేయుచుంద్రుసిరిసంపద
    లుండిన భోగ భాగ్యముల్
    దన్నుగ నిల్చి వారలకు దాస్యము
    సేయుదు రిద్ధరా స్థలిన్
    అన్నివిధాల నీతి నియమంచిత
    భావపు పేదవాడిల్
    మన్నన జెందునే మనుజ మాత్రుడు
    సజ్జన పూర్ణుడైనచో

    రిప్లయితొలగించండి
  16. ఎన్నుచునితరులలొసగును
    కన్నునుమిన్నునుగనకనుక్రౌర్యముతోడన్
    భిన్నమగుపనలుచేసిన
    *“మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై”*

    రిప్లయితొలగించండి