8, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4553

9-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుజనులతో మైత్రి మిగుల క్షోభను గూర్చున్”
(లేదా...)
“సుజనులతోడి మైత్రి కడు క్షోభను గూర్చునటంద్రు విజ్ఞులే”

18 కామెంట్‌లు:

  1. విజయము కొరకై దుష్టుల
    భజనలు జేసి పనిగడుపు భ్రష్ఠులకెపుడున్
    నిజమునె నమ్ముచు వెఱవని
    సుజనులతో మైత్రి మిగుల క్షోభను గూర్చున్”

    రిప్లయితొలగించండి
  2. ప్రజలకు మేలొ న గూ ర్చు చు
    రుజు వర్త న మున మెలంగు రూ ఢి జను ల తో
    కుజనులు కలిసిన వారికి
    సుజనుల తో మైత్రి మిగుల క్షోభ ను గూ ర్చు న్

    రిప్లయితొలగించండి
  3. ప్రజలెపుడు మెచ్చు చుందురు
    సుజనులతో మైత్రి ; మిగుల క్షోభను గూర్చున్
    కుజనుల మిత్రత నేలన
    నిజముల గోపనమె వారి నిజమని దెలియన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    భుజబలము దానగుణముల
    నజరామరమైన కీర్తి నందిన నా సూ
    ర్యజుఁడున్ దుర్జన సఖుడన
    సుజనులతో మైత్రి మిగుల క్షోభను గూర్చున్

    చంపకమాల
    భజబలమూర్తి యీవిగుణ వంద్యుఁడునై యలరారు చుండి కుం
    తిజుఁడజరామరంబగు ప్రతిష్టయు గల్గియు ధార్తరాష్ట్రునిన్
    భజనల నంగదుండనెడు భావన దుర్జన సఖ్యతన్ మనన్
    సుజనులతోడి మైత్రి కడు క్షోభను గూర్చునటంద్రు విజ్ఞులే




    రిప్లయితొలగించండి

  5. సుజనుడు, సద్గుణ సాంద్రుడు
    ప్రజలను రక్షించు నట్టి రఘురాము డధి
    ప్రజుడగు తరి చనె వని యీ
    సు జనులతో మైత్రి మిగుల క్షోభను గూర్చున్.



    కుజనుల ద్రుంచి ధర్మమును క్షోణిని నిల్పెడు రామభద్రునిన్
    ప్రజలను గన్నతండ్రివలె పాలన జేసెడు వాడటం చధి
    ప్రజునిని చేయు పాళమున రాజ్యము వీడి యరణ్యమేగె నీ
    సు జనులతోడి మైత్రి కడు క్షోభను గూర్చునటంద్రు విజ్ఞులే.

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. కం॥ కుజనులు వ్యసనములఁ గరప
      సుజనులు పద్ధతి నడవడి సూక్ష్మముఁ గనఁగన్
      నిజముగ శ్రమింపఁ జేతురు
      సుజనులతో మైత్రి మిగుల క్షోభను గూర్చున్

      చం॥ కుజనులతోడి స్నేహమున గొప్పగ దుర్వ్యసనమ్ములన్ గనన్
      సుజనుల మైత్రి పద్ధతిని సూక్ష్మము రీతినిఁ బొందఁ దోడ్పడున్
      నిజముగఁ గష్ట మీవిధము నేర్పును సంయమనమ్ముఁ గావలెన్
      సుజనులతోడి మైత్రి కడు క్షోభను గూర్చునటంద్రు విజ్ఞులే

      తొలగించండి
  7. నిజమని నమ్మిన విషయము
    సుజనులతోమైత్రి మిగుల శుభములు గూర్చున్
    ఋజువయ్యిన విషయము కూ
    సు జనులతో మైత్రి మిగుల క్షోభను గూర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుజనులతోడి మైత్రి కడు శోభన మంచు వచింత్రు విజ్ఞులే
      నిజమని నమ్ముచుంద్రుగద నిర్మల చిత్తము తోడ పామరుల్
      ఋజువులు చూపలేని నుడి రిక్తము శాస్త్రములెంచిచూడ 'కూ
      సు జనులతోడి మైత్రి కడు క్షోభను గూర్చునటంద్రు విజ్ఞులే'

      తొలగించండి
  8. వ్రజజననాథుడు కృష్ణుడు
    నిజజనులనుకూడి వెన్న నెత్తుకబోవన్
    సుజనుడు తల్లికి జెప్పెను
    సుజనులతో మైత్రి మిగుల క్షోభను గూర్చున్

    రిప్లయితొలగించండి
  9. ఋజుమార్గము చూపించును
    సుజనులతో మైత్రి, మిగుల క్షోభను గూర్చున్
    కుజనుల సహవాసమెపుఁడు
    భుజి సాంగత్యమునఁ గట్టె బుగ్గగు భంగిన్
    (భుజి=అగ్ని)

    రిప్లయితొలగించండి
  10. సుజనుల సంగతమ్మెపుఁడు శోభనముల్ సమకూర్చు, త్రాటికిన్
    నిజ పొలపమ్మొసంగు కరణిన్ కుసుమంబులు, నెమ్మి గూర్చుగా
    సుజనులతోడి మైత్రి, కడు క్షోభను గూర్చునటంద్రు విజ్ఞులే
    కుజనులతోడి మైత్రి దరికొన్న సుకాష్ఠము బుగ్గియౌ విధిన్

    రిప్లయితొలగించండి
  11. నిజముగ జర్గుమేలుసుమి నెయ్యము

    సేసిన నెల్ల వేళలన్

    సుజనులతోడ , మైత్రి కడు క్షోభను

    గూర్చునటంద్రు విజ్ఞులున్

    కుజనులతోనొనర్చినను, గూరిమి

    చేయుట యొప్పునెప్పుడున్

    రజతమువోలె తెల్లగను రాజిలు

    మానసమున్నవారితోన్.

    రిప్లయితొలగించండి
  12. నిజముగ మేలు నొసంగును
    సుజనులతో మైత్రి ,మిగుల క్షోభను గూర్చున్
    కుజనులతోడను స్నేహము
    విజయా! సజ్జనులవాక్కు వినవలె సతమున్.

    రిప్లయితొలగించండి
  13. నిజముగ మేలు నొసంగును
    సుజనులతో మైత్రి; మిగుల క్షోభను గూర్చున్
    కుజనుల సాంగత్యమ్మది;
    విజయమ్ము వరింపజేయు విజ్ఞత నరయన్!



    నిజము! వచింతు రీ పగిది
    నిత్యము సత్య మనంత ధర్మమై
    ప్రజలకు మేలొసంగెడి స్వ
    భావ ప్రభావము విస్తరింపగన్
    విజయ పథమ్ములం దునుచు
    ప్రేరణ నొందగలేరు.... లేనిచో
    సుజనులతోడి మైత్రి.... కడు
    క్షోభను గూర్చునటంద్రు విజ్ఞులే!

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    నిజమరయగ మేలు కలుగు
    సుజనులతో మైత్రి; మిగుల క్షోభను గూర్చున్
    కుజనులతో మిత్రత్వము
    స్వజనులె దూరమ్మగుదురు సఖ్యత కరవౌ.

    రిప్లయితొలగించండి
  15. విజయము చేకూర్చునిజము
    సుజనులతో మైత్రి, మిగుల క్షోభన్ కూర్చున్
    కుజనుల సహవాస మెపుడు
    త్రిజగములనటండ్రుబుధులు ధీమతితోడన్.

    రిప్లయితొలగించండి