10, అక్టోబర్ 2023, మంగళవారం

దత్తపది - 203

11-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
బెండ - బీర - దోస - కాకర
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
మహాభారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. బెండ గిల్లెను త్తరుడుతా వీరుడనని
    బీరములుపలి కెనుగాని పార జొచ్చె
    చేత కాకర యముగను, చిన్న వాడు
    దోస మెరుగడ తడుకడు దుర్బలుండు.

    రిప్లయితొలగించండి
  2. కురుక్షేత్ర సంగ్రామములో శ్రీకృష్ణపరమాత్మ:

    తేటగీతి
    వీడకుండగ మోహము బెండగిలుదె
    పార్థ! బీరములేమయె? వరుసమారె
    దోసములనంటనీయక దూకుమనిని
    తాకవె మిము పరాభవాల్ కాకరగుల

    రిప్లయితొలగించండి
  3. శకుని కర్ణుని తో ------
    బీరములు పల్క వల ద య్య వీరు ని గని
    కాక రగులును మదిలోన కర్ణ నీకు
    బెండ పడి పోవు దువు గద వెరచి నీవు
    దోస మగు పని చేయకు దురము నందు

    రిప్లయితొలగించండి
  4. నేను కాక రణమ్మున నిల్చు నెవడు
    బెండగిలపడరే యెంత వీరుడైన
    నింక వలదోసడిల నేల యేగ వలయు
    వేగ, యని యుత్తరుడు పల్కె బీరములను.

    రిప్లయితొలగించండి
  5. ఉత్తర గోగ్రహణమునకు బయలు దేరుట

    తే॥ బెండగిలె నర్జునుండును బీరములను
    బలికెడుత్తరునిఁ గలసి పశువులను మ
    రల్చ దోసమెంచకఁ దేరు రయముగ నడు
    పఁగ మనమున కాకరగులఁ బగుతులఁ గన

    బెండగిలు ప్రయాణమగు (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  6. శ్రీకృష్ణునికి రుక్మిణి సందేశము...

    వెన్నదొంగ! హుటాహుటిఁ [బెండ]గిల్లు
    సమయ మేతెంచె [బీర]ము చాటిచెప్ప
    [దోస] కారులన్ వేగాన తూల్చ వలయు
    త్వరిత మరుదెంచి కన్య[కా కర]ము పట్టు

    రిప్లయితొలగించండి
  7. మరొక పూరణ (శ్రీకృష్ణుని బోధ అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామారంభంలో)

    ఉ॥ బీరము లాడఁగా దగున వీరులఁ ద్రుంచెద నంటివే యనిన్
    బోరును వీడ దోసమగు బుద్ధిని నిల్పవొ క్షాత్ర ధర్మమున్
    మీరక శత్రుసేనలను మేటిగఁ జెండవొ బెండరిల్లఁగన్
    బోరవొ నీవు కాక రయమున్ బగ వారల గూల్చశక్యమే

    రిప్లయితొలగించండి
  8. దుర్యోధనుడు ..

    త్వర నే'దో స'మయమున దన గురువగు
    రేవతిపతి 'బీర'మున హలిని బొడగని
    పాండవుల ' కాక ర' ణము నా పయన ననగ
    బుగులు గొని కాలి ' బెండ'ర మును తొడిగితి

    రిప్లయితొలగించండి
  9. ఉత్పలమాల:
    *బీర*ములాడెదేల నిటు వీరుడనంచు సుయోధనా మహా
    భీల దురంబునందు నిను *బెండ*గిలంబడ జేతు మున్ను పే
    రోలగమందు నెల్లరును రోయగ *దోస*మనైన నెంచకన్
    ఘోరములెన్నొ సల్పితివి కూళుఁడ *కాక ర*గిల్చి నామదిన్

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె.

    బెండగిల్లు వీర భీముఁ బ్రోవ హనుమ
    దోస మంచుఁ గోరెఁ దోక జరుప
    బీరము వెలిపుచ్చి వేసరి వేడెను
    సూటికా కరముల జోడ్చి కపిని.

    ...డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీకృష్ణుడు దుర్యోధనునితో.....

    తేటగీతి:
    బీరముల నాపి రారాజ వీడులైదు
    బంచ దోసమ్ములన్నియు నెంచబోరు
    కాక రణమును గోరగా గలుగు మీకు
    పాండు వీరులు బెండాడ పరిభవమ్ము.

    ---గోలి🙂

    రిప్లయితొలగించండి
  12. విజయ మందు వేళ *బెండ* గిల్లకుపార్థ
    *బీర*ములను పలుకు వీరినిపుడు
    దునుమ లెమ్ము వడిగ *దోస*మంటగబోదు
    కదన రంగ మందు *కాకర*మ్ము



    భీరువట్లుగమానసమ్మున*బెండ*గిల్లకు పార్థు డా
    *బీర*ముల్ పలురీతులాడెచు భేదముల్ యనునిత్యమున్
    తీరుగానటచేయుగన్ వడిదీక్ష బూనుచు*దోస*ముల్
    భూరిగాతెలియంగజేయుచు పోరు*కాకర*మెత్తుమా

    రిప్లయితొలగించండి