9, ఏప్రిల్ 2024, మంగళవారం

సమస్య - 4731

10-4-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వరము లేని గానమున రసమ్ములూరు”
(లేదా...)
“స్వరదూరమ్మగు గానమందు రసవిస్తారమ్ము దోరంబగున్”
(న.చ. చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

21 కామెంట్‌లు:

  1. తే.గీ:
    మధుర కంఠస్వరము గల్గి మంచి పాట
    స్వర నియంత్రణ లేకుండ పాడరాదు
    రాగ యుక్తమై ధారగా సాగెడి యప
    స్వరము లేని గానమున రసమ్ములూరు.

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    అన్నమయ్య సంకీర్తనలద్భుతమ్ము
    నచ్చతెలుగున పండిన యమృతమనగ
    భాష నుచ్చరించు గమక దోషమయఁపు
    స్వరము లేని గానమున రసమ్ములూరు


    మత్తేభవిక్రీడితము
    వరగానంబున నన్నమయ్య యొలుకన్ భక్త్యాత్ముడై కీర్తనల్
    పరమానందము సెందె గాదె విని సద్భావాన వెంకన్న! శ్రీ
    ధరు లీలామృతమచ్చతెన్గుకృతమై తాధాత్మ్యమౌ! యా యప
    స్వరదూరమ్మగు గానమందు రసవిస్తారమ్ము దోరంబగున్!

    రిప్లయితొలగించండి
  3. ఆలయమ్ములందునభక్తులార్తితోడ
    పర్వదినమునచేరుచువాసిగాను
    నాలపించుచునుండగానచ్చటనప
    *“స్వరము లేని గానమున రసమ్ములూరు

    రిప్లయితొలగించండి
  4. గీతి నెంతగ నేర్చిన గృహమునందు
    చల్లదనమెక్కువగ నుండ జలుబు చేయ
    కలికి పాడమొదలిడగ గార్దభముల
    స్వరము లేని గానమున రసమ్ములూరు

    రిప్లయితొలగించండి
  5. గాన సభ యందు పెక్కురు గాయ కాళి
    తమదు నైపుణ్య ములు జూపు తరుణ మందు
    గార్ధ బౌ చిత్య రీతి గా కటువు నైన
    స్వరము లేని గానమున ర సమ్ము లూరు

    రిప్లయితొలగించండి

  6. అచట గానకచేరియటంచు తెలిసి
    నంత సంగీత ప్రియులెల్లరాల కించి
    దూరిరి, యపశ్రుతులనుచు, దోష సహిత
    స్వరము లేని గానమున రసమ్ములూరు.


    భరియింపంగను లేక ప్రేక్షకులె యాప్రాంతమ్మునే వీడి సు
    స్వరగానంబది కానిచో జనులకే శాపంబదే యంచు, లా
    గరి విందై యలరించు గానమదియే గాంచంగ గాత్రమ్మప
    స్వరదూరమ్మగు గానమందు రసవిస్తారమ్ము దోరంబగున్.

    రిప్లయితొలగించండి
  7. తే॥ గాన కళకు సుస్వరములు గమకములును
    సూత్రముఁ గని రసమయ సంశోభితమ్ముఁ
    జేయు చుండఁ దడబడకఁ జేయు తప్పు
    స్వరము లేని గానమున రసమ్ములూరు

    మ॥ పరమాత్ముండును బ్రీతిఁ జెందుఁ గన సంభారమ్ముతోఁ గీర్తనల్
    పరమానందము నొంది భక్త జనులున్ బాడంగ సంప్రీతినిన్
    గరిమన్ బాడఁగ సంతసం బొదవి సాకారంబుగా నాయప
    స్వరదూరమ్మగు గానమందు రస విస్తారమ్ము దోరంబగున్

    సంభారము స్వరపూర్ణత్వము నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  8. రక్తి కల్పించు గంభీర యుక్తమైన
    స్వరము లేని గానమున రసమ్ములూరు
    నా! స్వరము వినువారికి నచ్చవలయు
    సుస్వరమిడు గాయకునికి సుప్రతిష్ఠ

    స్వరరాగంబులపైన పట్టు వలనన్ సాధ్యంబు సంకీర్తనల్
    స్వరమే గొప్పవరమ్ము గాదె మహిలో సంగీత సామ్రాట్టుకున్
    స్వరమే భాసురమై రహించ వలయున్ సంహర్షణంబై! యప
    స్వరదూరమ్మగు గానమందు రసవిస్తారమ్ము దోరంబగున్

    రిప్లయితొలగించండి
  9. నిరతిన్ సాధనసల్పుచున్ నియమముల్ నిగ్గించుచున్ బాళిగా
    స్వరమే ప్రాణముగా దలంచి తన నిశ్వాసమ్మె గానమ్ముగా
    నిరతంబా స్వరరాణి యంఘ్రియుగమున్ నీమంబుగా బట్టి య
    స్వరదూరమ్మగు గానమందు రసవిస్తారమ్ము దోరంబగున్

    రిప్లయితొలగించండి
  10. వరమమ్మాయికి బిడ్డలన్గనుటయున్ బాలింత చూలింతయై
    కరువుల్దీరగ ముద్దుసేసి పెనుపున్ గారాబమున్ మప్పు లే
    తరనవ్వారెడు మోముఁ జూసి మురిపెమ్మాడంగ పాపాయి సు
    స్వరదూరమ్మగు గానమందు రసవిస్తారమ్ము దోరంబగున్

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:అడవి బాపిరాజకవి గేయమ్ము లన్ని
    గ్రంథమున జదివితి,సరిగమల గూర్చి
    పాడు వారు లే రైరిగా!పాడ కున్న
    స్వరము లేని గానమున రసమ్ములూరు”

    (ఆ పాటలు పాడకున్నా చదివితే నే ఆనందం కలిగించాయి.)

    రిప్లయితొలగించండి
  12. మ: స్వరముల్ నిశ్చిత రీతి నున్నయదియే సంగీత మై యొప్పుచున్
    సరసమ్మై విబుధాళి మెప్పు బడయున్, స్వచ్ఛమ్ము గా నట్టి వౌ
    స్వరముల్ వేయుము, రాగ భిన్న మెపుడున్ సాగింపమిన్,వర్జిత
    స్వరదూరమ్మగు గాన మందు రసవిస్తారమ్ము దోరమ్మగున్
    (వర్జితస్వరదూర మైతే రసమయం గా ఉంటుంది. )

    రిప్లయితొలగించండి
  13. స్వరము సుస్వరమైన నశ్వరము గాదు
    నిలచిపోవును నిత్యమై నిఖిలముగను
    మధుర భావన పెనఁగొని మదిని కలఁచు
    స్వరము లేని గానమున రసమ్ములూరు

    రిప్లయితొలగించండి
  14. వాద్య ఘోషమ్ముల నభమ్ము పగులకుండ
    హావభావమ్ము లవి యసహ్యములు గాక
    విన్న చెవులు బ్రద్దలు గాని పెన్నెలుంగు
    స్వరము లేని గానమున రసమ్ము లూరు


    హరినామాంకిత కీర్తనమ్ములను నభ్యాసమ్ము వర్ధిల్లఁగా
    నిరతం బింపుగఁ బాడ సత్సభలలో నిష్ఠాత్ములై గాయకుల్
    పరమోద్వేగ విహీనమై రుచురమై భాసిల్ల నిక్కం బప
    స్వర దూరమ్మగు గాన మందు రస విస్తారమ్ము దోరం బగున్

    రిప్లయితొలగించండి
  15. సరిగమలు పలికించి రసహృదయులను
    ఓలలాడించు నమృతఝరులను వీణ
    మాటలాడక నొలకించ మధురరవము
    స్వరము లేని గానమున రసమ్ములూరు

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    వినుట కిష్టము జూపరు విసుగు చెంది
    స్వరము లేని గానమున; రసమ్ములూరు
    స్వరమునందు మాధుర్యము సడలుచుండ
    ప్రక్క వాద్యముల్ మిగుల తోడ్పాటునివ్వ.
    (సడలు = జారు)

    రిప్లయితొలగించండి