21, ఏప్రిల్ 2024, ఆదివారం

సమస్య - 4742

22-4-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి”
(లేదా...)
“అంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో”

37 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

బిల్హణుండునుగురువునైపిలువబడగ
యామినీపూర్ణతిలకంబుహద్దునుండె
శిష్యురాలికివినిపించెచిత్రకవిత
పూర్ణచంద్రుసౌందర్యమున్పొగడెగ్రుడ్డి

BMahalakshmi చెప్పారు...

సంధానంబునతండ్రియాజ్ఞగొనిసంభావసచ్ఛాత్రియై
అంధండైననుగౌరవించెనతనిన్యామంబువిద్యార్హతన్
విందున్జేసెనుబిల్హణుండునచటన్పేర్కొంచుపూర్ణేందునిన్
అంధుండాకసమందుశోభిలెడుపూర్ణేణాంకువర్ణంచెబో

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
మత్తుగొల్పెడు సైగల మదిరఁగొనుచు
నాట్యశాలకు రమ్మను నటనకయ్యె
మత్స్య రాజు మోహాంధుండు, మాలిని ముఖ
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి!

శార్దూలవిక్రీడితము
అందంబొల్కెడు జాణగన్ మదిర మోయంగన్ మహారాణికిన్
ముందున్ నిల్వఁగ మాలినీ లలనయే మున్ముందుకేతెంచుచున్
బొందున్గోరుచుఁ జేరి సింహబలుడున్, మోమందునన్ గాంచి మో
హాంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో!

gsnatp చెప్పారు...

తే.గీ:
వెన్నెల యననెట్లుండునొ వినదలిచెను
పుట్టు గ్రుడ్డి పాపము, కవి పుంగ వుండు
పాడె పున్నమి సొబగుల పాటను, విని
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి.

gsnatp చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
gsnatp చెప్పారు...

సహదేవుడు గారు, పూరణలు అద్భుతంగా వున్నవి.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చంద్రు సొబగులు దెలియగా చతురు డైన
కవిని గోరగా వర్ణించె కమ్ర ముగను
పూర్ణ చంద్రుని సౌందర్యమున్ : పొగడె గ్రుడ్డి
కవి వత o శుని ప్రజ్ఞ ను ఘనము గాను

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అంధుండా కవిపుంగవుండు, కవితావ్యాసంగమందున్ గడున్
స్పందించున్ హృదయాంతరాళము సతంబా భావనల్ ప్రోదిగాఁ
నందంబౌ పదగుంఫనమ్ములు యెడందన్ రూపు దిద్దంగనా
యంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో

Sitharamayya Solasa చెప్పారు...

పుట్టు గ్రుడ్డిగ పుడమిన పుట్టి , యతడు
చెలిమరి కనులు గాంచెడు చెన్నులన్ని
తెలుసుకొనుచు నానందించు తెలివికలుగ
బూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి

విరించి చెప్పారు...


కాంచ లేకున్న నేమిరా కథలనెన్నొ
శ్రద్ధతో నాల కించిన బుద్ధిజీవి
వీడు భావతరంగాలు పెల్లుబుకగ
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి.


పొందున్ గోరుచు నింతిచెంతజని యా మూర్ఖుండు శంపాణి నీ
సౌందర్యమ్మది రంభకేది? కుచముల్ క్ష్మాభృత్తులే కాంచగా
మందారమ్ములు బూసె చెక్కిలిని భామా నీదు మోమంచు కా
మాంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో.

M.B.G.TILAK చెప్పారు...

గ్రుడ్డి వాడయినను పుట్టు గ్రుడ్డి కాదు
పండు వెన్నెల నెఱుగును మెండుగాను
చిత్తమందు స్థిరముగ నిక్షిప్తమైన
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి

విందుల్జేసెడి నీదు చక్కదనమే విశ్వప్సు కౌ సాటి నీ
సౌందర్యానికి ముగ్దుడన్ తొలుత నీ సంకోచమున్ ద్రుంచి నీ
పొందున్గోరెడు నావ్యథన్ రయమునన్ పోకార్చుమా యంచు కా
మాంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో

Zilebi చెప్పారు...

-
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి
కాలు లేని వాడు నడచె కష్టపడక
కరము లసలు లేని మనిషి గాంచె శక్తి
ఓ ప్రభూ ! నీదు దయని ముప్పోకలాడ!


ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఒంటిగానున్న జవ్వని కంటఁబడఁగ
కామమాతని కన్నులఁ గప్పివైచె
వ్యర్థమౌ మాటలాడుచు వగలు జూపి
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'గుంఫనమ్ములు + ఎడంద' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పుడమిని' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు. (మూకం కరోతి వాచాలం!)

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏కవివరులు శ్రీ ప్రసాద్ గారికి, గురుదేవులకు ధన్యవాదములు🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:క్రొత్త రచయిత యొక్కడు చెత్త నవల
వ్రాయ,పాత్రచిత్రణ బొరపాటు వచ్చె,
అంథపాత్రను సృష్టించె,నట్టి కథన
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి”

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ తాను జూడక పోయినఁ దలచి తలచి
మదిని పూర్ణచంద్రు సొబగు మక్కువ నిడి
తన కవితలందున లిఖించె తగిన పగది
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి

శా॥ అంధుడైనను దాను శ్రద్ధఁ గని శాస్త్రాదుల్ పఠించంగనే
సంధానించెను జ్ఞాన సంపద లవిశ్రాంతంబునౌ సాముతో
సంధానించిన జ్ఞాన సంపదలతో సారించి మోదమ్ముతో
నంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైనాంకు వర్ణించెఁ బో

పూర్ణ చంద్రుని కాంతుల శోభలు సముద్రము మధ్యనైతే వర్ణనాతీతమండి. సూర్య రస్మితో జరిగే మాయలు కూడ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ధన్యవాదములు గురువుగారూ 🙏 సవరిస్తాను.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అంధుండా కవిపుంగవుండు, కవితావ్యాసంగమందున్ గడున్
స్పందించున్ హృదయాంతరాళము సతంబాభావనల్ ప్రోదిగాఁ
నందంబౌ పదగుంఫనమ్ములను డెందంబందు నూహించి యా
యంధుండాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కనగలిగినట్టిమదియున్నకాంచగలడు
నంధుడవనిలోనన్నియు నరయకున్న
రవియు గాంచనివెల్లయు కవిదెలుపగ
*“పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి”*

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:అంథుండౌ ధృతరాష్ట్రు పై కరుణ తో నా వాసుదేవుండు మో
హాంధత్వమ్మును విశ్వరూపమున సంహారమ్ము జేయంగ నా
కున్ ధన్యత్వము గల్గె నంచు ,వదలన్ గోర్కెల్ రవిన్ మ్రొక్కి యా
అంధుం డాకసమందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో”
(శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపగా ధృతరాష్ట్రుడు సూర్యునికి నమస్కరించాడు.చంద్రుని వర్ణించాడు. )

Sitharamayya Solasa చెప్పారు...

🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అక్షులకు నున్న యంధత్వ మవని నరయ
మానసమ్ముల కుండునె మనుజులార!
యందముగను వర్ణింప భార్య నిజ పతికిఁ
బూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి


గంధంబింపుగ నద్ది గాత్రమున శంకా హీన చిత్తుండునై
గంధేభప్రతిమాన గామి నలినీ కాంతోపయంతృప్రభా
బాంధవ్యుండు నిరంతరోగ్ర మదనవ్యాపార వారాశి మ
గ్నాంధుం డాకస మందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

పగిది (తేగీ 3వ పాదంచివరండి) పొరపాటున పగది అని వ్రాసాను

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

కనులు లేకున్నను కవుల కావ్యములను
వినుచు ప్రకృతి వర్ణనలను వీనులార
కనుల గాంచిన యట్టులే కచ్చితముగ
పూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి.