23, మార్చి 2017, గురువారం

సమస్య - 2316 (భార్యను గాంచిన పెనిమిటి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్"
లేదా...
"భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

60 కామెంట్‌లు:

  1. డా.పిట్టా
    కార్యమకార్యం బెరుగదు
    భార్యకునున్ మించు పద్య భావము గోరన్
    ఆర్యుని గని ట్యాబును గొను
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      లేచిన వెంటనే ట్యాబుతో గడుపుతుంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. అది లాక్కోడానికి వచ్చే భార్యను చూసి భర్త పరుగులు పెట్టడం సహజమే. చక్కని పూరణ. అభినందనలు.
      'భార్యకు, భార్యకున్, భార్యకును' అంతే... షష్ఠి మీద ద్వితీయ ఎందుకు? "భార్యామణి మించు..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  2. డా.పిట్టా
    "సూర్యుని గాంచవా బయట చుక్కలు లేచిన నైన జూడ వీ
    కార్యము పద్య విద్య యని గంటలు గంటలు వ్రాయుచుందు వా
    క్రౌర్యము మానవా సుగతి గానవు లెమ్మని కమ్మ జించు నా
    భార్యను గాంచినట్టి పతి పర్వుల వెట్టెను భీతచిత్తుడై

    రిప్లయితొలగించండి
  3. క్రౌర్యము జూపుచు నుండగ
    నార్యుడవా నీవటంచు నా రోకలితో
    మర్యాద మరచి వచ్చెడి
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్.


    క్రౌర్యము జూపుచుండి బహు కాలము నుండియు మద్యపానుడై
    కార్యవిహీనుడై దిరుగు కాంతుని జూచుచు దండధారియై
    యార్యుడ వెట్టు లౌదువని యాగ్రహ మూనుచు వచ్చు నట్టి దౌ
    భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. డా.పిట్టా
    ఆర్యా ,భార్య ఒకవైపు,పద్య కవితా భావము మరొకవైపు నిల బెట్టినామనుకొండి.ఇప్పుడు కొలత వేస్తే భార్యను గూడా మించింది ప.క.తా భావం."నున్ ,కూడా, అనే అర్థం రావాలని అలా నోటికి వచ్చింది.మీ సవరణను తీసుకున్నాను.

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    "నోట బల్కితి చేత నొనరంగ వ్రాసితి........నే కవీశ్వరుడగాను"శిద్దప్ప వరకవి పద్యం జ్ఞాపకం వచ్చింది,ఆర్యా

    రిప్లయితొలగించండి

  6. నిన్నే కంది వారు మెచ్చుకున్నారు, నా కందం చూడండని మా అయ్యరు గారితో అంటే :)


    ఆర్యా ! అయ్యర్వాళ్! ఆ
    శ్చర్యము ! నే వ్రాయు పద్య సౌరభమును, చా
    తుర్యము గన రమ్మనియను
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ఏదో.. భార్యలు టివి సీరియల్స్ చూసుకుంటూ భర్తను అతని మానాన అతణ్ణి వదిలేయాలి కాని పద్యాలు వినండని వెంటబడితే గురుడు పరుగులు పెట్టక ఏం చేస్తాడు పాపం!
      చక్కని పూరణ. అభినందనలు!

      తొలగించండి


    2. కంది వారు

      నమో నమహ్ :) మీరు కూడా జిలేబి ప్రతిపక్షమేస్మీ :) జేకే

      నెనర్లు

      తొలగించండి
  7. ఆర్యులమాటలువినక య
    కార్యములనుచేయుచుండకాంతలతోడన్
    చర్యలకై యేతెంచిన
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  8. భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై,
    నార్యుల గాంచె,రాజువలె నా గుజరాతును నేలె, నేతయై
    సౌర్యము, గట్టి వాక్పటిమ, చక్కగ నందరితో సమాఖ్య, చా
    తుర్యము జేర్చి దేశమును తుంగము జేసె,జిలేబి మోదుడై !

    హర హర మోడి :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      బాగున్నది మీ పూరణ. అభినందనలు.
      'తుంగము జేసె'...?

      తొలగించండి


    2. దేశాన్ని కొండ వలె జేసాడన్న అర్థం లో వ్రాసా నండి


      భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై,
      నార్యుల గాంచె,రాజువలె నా గుజరాతును నేలె, నేతయై
      శౌర్యము, గట్టి వాక్పటిమ, చక్కగ నందరితో సమాఖ్య, చా
      తుర్యము జేర్చి దేశమున దూకొనె గాద జిలేబి మోదియై !

      జిలేబి

      తొలగించండి
  9. "కార్యేషు దాసి" యన విని
    సూర్యోదయ కాలమందు సురుసుర్రనుచున్
    మిర్యాల చారు తెచ్చిన
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పొద్దున్నే కాఫీకి బదులు మిరియాల చారు తెస్తే ఏ భర్త భయపడకుండా ఉంటాడు? మంచి పూరణ. అభినందనలు.

      తొలగించండి
  10. ఆర్యుడు కార్యదక్షుడు మహాగుణవంతుడు నాదు భర్తకున్
    కార్యములుండబోవు పరకాంతలతో యను భార్య చూచి సౌం
    దర్యపురాశితో మగని త్రాచువలే బుసగొట్టి పైబడే
    భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుడై

    అయ్యా నమస్తే. నా పూర్తి పేరు నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు. పాశ్చాత్యదేశంలో స్థిరపడ్డ తరువాత దాన్ని చిన్నదిగా చేయాల్సింది, ఇక్కడ వాళ్లకి పలకడం కోసం కాస్త సులభతరం చేద్దామని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేమాని సోమయాజులు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'వలే, పైబడే' అని వ్యావహారికాలను ప్రయోగించారు. "త్రాచువలెన్ బుసగొట్టి పైబడన్" అందామా?

      తొలగించండి
    2. తప్పకుండానండీ. ధన్యవాదములు.

      తొలగించండి
  11. శౌర్యము చేత యుద్ధమున శత్రుల గూల్చుచు వారిచేవ ని
    ర్వీర్యము జేసి మేటి సరి వీరులు లేరని చాటిచెప్పి యా
    శ్చర్యము గొల్పురీతి బలజంబున నిల్చిన వీరభద్రునిన్
    భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై

    వీరభద్రుడు = చాళుక్య వీరభద్రుడు, పతి = రాజు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ తాతా గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      మీవల్ల 'బలజము' అన్న పదం కొత్తగా తెలిసింది.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  12. బిర్యాని,మందు,మగువ స
    పర్యల రంజిల్లి జూద వశుడై యుండన్
    కార్యార్థిగఁ జని వచ్చిన
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్

    రిప్లయితొలగించండి

  13. కార్యార్ధియై జనగ నని
    వార్యంబైన నెడబాటు బాధించంగన్
    మర్యాద మరచి ప్రేమపు
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్!

    రిప్లయితొలగించండి
  14. కార్యాతుతురత మనము వి
    పర్యయమై మైకమున నపస్మారమునం
    బర్యంకము పైన పడిన
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్


    శౌర్యము జూపగా వలయు సంకట వేళల వెఱ్ఱివానిగం
    గార్యము లందయిష్టులయి గంతులు వేసిన లాభ ముండునే
    ధైర్య మొకింత చూపకయె, దయ్యము సత్వర మావహింపగన్
    భార్యను, గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      'కార్యాతుతురత'...?

      తొలగించండి
    2. కార్యాతురతన్ మనము... అని నాభావము ఒక “తు” అధికముగా పడింది గమనించ లేదు. ధన్యవాదములు.

      కార్యాతురతన్ మనము వి
      పర్యయమై మైకమున నపస్మారమునం
      బర్యంకము పైన పడిన
      భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్

      తొలగించండి
  15. భార్యా బాధిత సంఘపు
    కార్యాలయ గడపను విడి కాలిడి నంతన్
    పర్యవసానము దలచుచు
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      హాస్యస్ఫోరకంగా చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గురువు గారికి వందనములు మఱియు ధన్యవాదములు.

      తొలగించండి
  16. క్రౌర్యము జూపెను పతి యని
    ఫిర్యాదున నిన్ను ఖైదు పెట్టించ గలన్
    మర్యాదగ నగ కొనమను
    భార్యను గాంచిన పెనిమిటి పరువులు పెట్టెన్

    రిప్లయితొలగించండి
  17. తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. ఆర్యా లాలన జేయును
    భార్యను గాంచిన పెనిమిటి, పరుగులు వెట్టెన్
    భార్యా భర్తలు సమముగ
    సూర్యోదయ మగుట తోడ జూడగ శివునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద్యం చదవగానే మొన్న రామేశ్వరంలో స్ఫటికలింగాన్ని దర్శించడానికి భార్యాభర్తలం పరుగెత్తిన విషయం గుర్తుకు వచ్చింది. సంతోషం!

      తొలగించండి
  19. భార్యకు పిచ్చియెక్కగను బంపగ వైద్యము జేయన త్తరిన్
    భార్యను గాంచినట్టి పతిపర్వులు వెట్టెను భీత చిత్తుడై
    భార్య పరిస్ధితిన్గనుచు బావురు మంచును నేడ్వగా మరి
    న్నార్యులు వచ్చి రయ్యెడను హాయిని గొల్పెడు మాటలా డెసూ

    రిప్లయితొలగించండి
  20. కార్యము వీడియు మధ్యన
    మర్యాదను విడచి కల్లు మండువ కరిగెన్
    ధైర్యముగ ద్రాగ కల్లట
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. ఆర్యుల సంస్కరణంబులె
    భార్యకు పట్టింపులేక బాధించుటచే
    కార్యముజెడుననియే యా
    భార్యను గాంచినపెనిమిటి పరుగులు వెట్టెన్|
    2.ధైర్యము ధర్మవర్తన విధానమునందున మంచిబెంచు|నా
    ధైర్య మదర్మమున్ దిరుగ?తగ్గును|దుర్వెసనాలుజేరగా
    ఆర్యసమాజమందు వెలయాలియు పొందుపసందుజూడగా
    భార్యను గాంచినట్టి పతి పర్వులువెట్టెనుభీత చిత్తుడై|
    23.3.17.పద్యరచన

    రిప్లయితొలగించండి
  22. ధైర్యము వీడుచు వేగ,న
    వార్యపు దయ్యంబు పూన,పటు భీకరమై
    క్రౌర్యముఁజూపెడు వికృతపు
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్

    రిప్లయితొలగించండి
  23. కౌర్యము క్రోధము పలు దు
    శ్చర్యలె దినదినము సలుప ,సహచరి యిక నా
    చర్యలు దుర్గగ గను మన
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ధరను తనపరభేదంబు తాను మరచి
    కరముపరులను ప్రేమించగలుగు వాడు
    పరుల మేలు గోరు నతడు; పతితుడు గద
    పరుల సంపద తనదిగా బ్రతుకు వాడు

    రిప్లయితొలగించండి
  24. ఆర్యుల కూర్చినట్టి వివహమ్మున కైకొని భార్యవీడి తా
    సూర్యకుమారిఁ గాంచి కడుఁ జొక్కుచు నింటికి రాకయుండినన్
    దుర్యశుడైన భర్తఁగని దూరుచు రాగ స్వపత్నియుగ్రయై
    భార్యను గాంచినట్టి పతి పర్వుల వెట్టెను భీతచిత్తుడై

    రిప్లయితొలగించండి
  25. ఫిర్యాదులేవి జూపని
    భార్యామణి కళ్ళుదిరిగి బడిపోవంగన్
    కార్యమ్ములన్ని వదలుచు
    భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్!!!

    రిప్లయితొలగించండి
  26. Vijaya Durga‎
    to
    అచ్చంగా తెలుగు
    3 hrs ·

    సమస్య -
    తమన్నా - సమంతా - త్రిష - కాజల్

    భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో

    తేటగీతి:

    తాతమన్నన బొందిన ధన్యుడీవు
    దోసమంతగ నెంచడు - కాశి రాజ
    పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
    గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము

    👆🏻తెలుగు భాషాభిమానులందరికి👆🏻

    రచయిత ఎవరో తెలియదు

    రిప్లయితొలగించండి
  27. విజయ దుర్గ‎
    to
    అచ్చంగా తెలుగు
    3 hrs ·

    సమస్య - దత్తపది
    తమన్నా - సమంతా - త్రిష - కాజల్

    భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో

    తేటగీతి:

    తాతమన్నన బొందిన ధన్యుడీవు
    దోసమంతగ నెంచడు - కాశి రాజ
    పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
    గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము

    👆🏻తెలుగు భాషాభిమానులందరికి👆🏻

    రచయిత ఎవరో తెలియదు
    తెలుగు దూరదర్శిని న్యూశ్ రీడర్ శ్రీమతి విజయ దుర్గ గారిచే ఫేస్ బుక్ లో పోస్ట్ చేయబడినది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ దత్తపదిని మన కవిమిత్రుడు మాచవోలు శ్రీ ధర రావు గారు, గత సంవత్సం ఉగాది ముందు జరిగిన ములుగు అంజయ్య గారి అష్టావధానంలో యిచ్చారు.

      తొలగించండి
    2. ఈ పద్య రచయిత మన కవిమిత్రులు శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారు .

      .... గుండా వేంకట సుబ్బ సహదేవుడు

      తొలగించండి
  28. సూర్యుడు లేవకుండగనె స్రుక్కుచు సోలుచు నిద్రలేచుచున్
    కార్యము లందునన్ విరివి కక్షగ దక్షత నాస్వదించుచున్
    మిర్యపు చారునున్ వడిగ మిక్కిలి శ్రద్ధను నిచ్చుచుండెడిన్
    భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై :)

    రిప్లయితొలగించండి