31, ఆగస్టు 2017, గురువారం

సమస్య - 2454 (గురువారమ్మని పిలువఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

30, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2451 (సరసీరుహనేత్ర కొక్క...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా"
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథం నుండి)

29, ఆగస్టు 2017, మంగళవారం

సమస్య - 2450 (గాజులు గల్లనగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్"
లేదా...
"గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై"

28, ఆగస్టు 2017, సోమవారం

సమస్య - 2449 (ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

27, ఆగస్టు 2017, ఆదివారం

సమస్య - 2448 (వరమే పదితలలవాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

26, ఆగస్టు 2017, శనివారం

సమస్య - 2447 (పార్థసారథి పరిమార్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పార్థసారథి పరిమార్చెఁ బాండవులను"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

25, ఆగస్టు 2017, శుక్రవారం

రథబంధ గణేశ స్తుతి

రచన - పూసపాటి కృష్ణ సూర్యకుమార్
ఇది రధ బంధ సీస పద్యము. 'శం' నుంచి మొదలు పెట్టి 'శాంకరి' నుంచి చదివి మరల 'కొమరా' నుంచి చదువు కోవాలి. ఎడమ నుంచి కుడి, కుడి నుంచి ఎడమకు చదువుకోవాలి. నిలువుగా ఉన్న మధ్య అక్షరములు కలిపి చదువుకున్న (ఎర్ర అక్షరములు) "శంకరాభరణం కవులకు వినాయక చవితి శుభాకాంక్షలు" అన్న సందేశము వచ్చును.

గణేశ స్తుతి (రధ బంధ సీసము)
శం శాంకరి కొమరా, చంద్ర చూడ శుభ త
          నయ, బొజ్జ దేవర, నాగ సూత్ర
ధర, వారణంపు వదన, నిత్య మోదక
          వాంఛితా, పరమేష్టి భావుక, గణ
నాధా, ఎలుక వాహనా, కుమారాగ్రజా
          విలసితంపు వదనా, విఘ్న రాజ
సుప్రదీపాయ, శుభప్రదా, జిష్ణవే,
          యేకదంతా, సర్వలోక నాధ,

చదిర వీక్షితా, భువిజన సమ్మతి విత
రణ, శుభ ప్రదాత, వ్యాస భారత విధాత,
యెపుడు కాంచుచు, తప్పుల నెప్పుడు క్షమ
చూపి దీనుల బాధలు బాపు మయ్య! 

సమస్య - 2446 (ఎలుక వడఁకె...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఎలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు"
లేదా...
"ఎలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్"

24, ఆగస్టు 2017, గురువారం

సమస్య - 2445 (రామభద్రునకున్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రామభద్రునకున్ ధర్మరాజు సుతుఁడు"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

23, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2444 (పాలిచ్చిన తన జనకుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

22, ఆగస్టు 2017, మంగళవారం

సమస్య - 2443 (హింసకుఁ బాల్పడెడివాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హింసకుఁ బాల్పడెడివాఁడె హితమును గూర్చున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

21, ఆగస్టు 2017, సోమవారం

సమస్య - 2442 (మానవుఁడే దానవుఁడును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

20, ఆగస్టు 2017, ఆదివారం

సమస్య - 2441 (వనమా సాహస మింత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వనమా సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా"
కొప్పరపు సోదర కవుల పూరణము...
ధనమానంబులఁ గొల్లవెట్టి కులగోత్రవ్యక్తి బోదట్టి దు
ర్వనితాసంగమ మెచ్చఁబెట్టి పవలున్ రాత్రుల్ నను న్మోహపా
శ నిబద్ధాత్ము నొనర్చె దేమిటికి? నీ సౌభాగ్య మెన్నాళ్ళు యౌ
వనమా! సాహస మింత చెల్లదు సుమా! బాగోలు లూహింపుమా.

19, ఆగస్టు 2017, శనివారం

సమస్య - 2440 (మత్తుమందు సేవించుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మత్తుమందు సేవించుట మంచిదె కద"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

18, ఆగస్టు 2017, శుక్రవారం

సమస్య - 2439 (గురువుల పదసేవ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

17, ఆగస్టు 2017, గురువారం

సమస్య - 2438 (విజయసారథి జన్మించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విజయసారథి జన్మించె విపినమందు"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

16, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2437 (కాముఁడు వెన్నెలలు గురిసె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్"

15, ఆగస్టు 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 46 (స్వ-తం-త్ర-ము)


అంశము- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఛందస్సు- తేటగీతి
స్యస్తాక్షరములు...
మొదటి పాదం మొదటి గణం మొదటి అక్షరం 'స్వ'
రెండవ పాదం రెండవ గణం మొదటి అక్షరం 'తం'
మూడవ పాదం మూడవ గణం మొదటి అక్షరం 'త్ర'
నాల్గవ పాదం నాల్గవ గణం మొదటి అక్షరం 'ము'

14, ఆగస్టు 2017, సోమవారం

సమస్య - 2436 (కుంతీపుత్రుఁడు...)

కవిమిత్రులారా,
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కుంతీపుత్రుఁడు వినాయకుఁడు గద శిష్యా!"

13, ఆగస్టు 2017, ఆదివారం

సమస్య - 2436 (ద్రోహుల శిక్షించుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

12, ఆగస్టు 2017, శనివారం

సమస్య - 2435 (తమ్ముని కొడుకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తమ్ముని కొడుకు పెండ్లికిఁ దగదు చనగ"

11, ఆగస్టు 2017, శుక్రవారం

దత్తపది - 121 (అరిసె-గారె-పూరి-వడ)

అరిసె - గారె - పూరి - వడ
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
ఈ దత్తపదిని పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

10, ఆగస్టు 2017, గురువారం

సమస్య - 2434 (జారులఁ జూచి భక్త...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో"
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.

9, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2433 (రూపసినిఁ జూచినట్టి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

8, ఆగస్టు 2017, మంగళవారం

సమస్య - 2432 (భారతము వ్రాసి వాల్మీకి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భారతము వ్రాసి వాల్మీకి వాసికెక్కె"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

7, ఆగస్టు 2017, సోమవారం

సమస్య - 2431 (నవమినాఁడు రక్షా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నవమినాఁడు రక్షాబంధనమ్ము వచ్చు"

6, ఆగస్టు 2017, ఆదివారం

సమస్య - 2430 (మాంస మిష్టపడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మాంస మిష్టపడు సుమా ద్విజుండు"

5, ఆగస్టు 2017, శనివారం

సమస్య - 2429 (మునిపత్నిన్ గొనిపోయి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మునిపత్నిన్ గొనిపోయి చచ్చెను గదా మోహాంధుఁడై యాజిలో"
ఈ సమస్యను పంపిన మంద పీతాంబర్ గారికి ధన్యవాదాలు.

4, ఆగస్టు 2017, శుక్రవారం

సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రము (తెనుఁగు సేఁత)

రచన : మధురకవి గుండు మధుసూదన్

"క్షమ నొసంగుము భగవతీ! కమల లక్ష్మి
శుద్ధ సత్త్వస్వరూపిణీ శోభితాంఘ్రి
కోపపరివర్జితా సృత్వరీ పరాత్ప
రీ క్షమాశీలి తాపహంత్రీ నమోఽస్తు!

సర్వ సాధ్వులలో సాధ్వి, సర్వ రూప
వతులలో రూపవతివి నీవమ్మ! నీవు
లేనిచో జగమంతయుఁ బ్రేత సమమ
గుచును నిష్ఫలమ్మగునమ్మ! కూర్మినిమ్మ!

సకల సంపత్స్వరూపవు, సర్వరూప
వీవె! రాసేశ్వరుల యధిదేవి వీవె!
సకల సతులందు నీ కళ సంక్రమించు!
లేరు నిను మించు దేవత లిజ్జగమున!

నీవె కైలాసమున శివానివిగఁ, బాల
కడలిలో సింధుసుతగ, స్వర్గమ్మునందు
స్వర్గ లక్ష్మిగా, భూతలోపరిని మర్త్య
లక్ష్మిగా వెలుఁగుదువమ్మ! రాఁగదమ్మ!

నీవె వైకుంఠమున లక్ష్మి! వీవె దేవ
దేవి, తులసి, సరస్వతీదేవి, గంగ;
వీవు సావిత్రివే గద విశ్వసృజుని
లోకమునఁ గన, నో తల్లి, నీకు నతులు!

నీవె కృష్ణుని ప్రాణాధిదేవతగను,
ప్రధిత గోలోకమున స్వయం రాధికగను
ధన్యత నిడియు, వెలయ బృందావనమున
బృంద; రాసాన రాసేశ్వరివయితీవె!

నవ్య భాండీరముననుఁ గృష్ణప్రియవయి,
చందన వనానఁ జంద్రవై, చంపకవన
మందు విరజవై, శతశృంగమందు నీవె
సుందరివయి వెల్గితివమ్మ సుకరముగను!

పద్మవనమున నవ పద్మవయ్యు, మాల
తీ వనమ్మున నవ మాలతివయి, కుంద
వనమునం గుందదంతివై తనరి, మిగుల
స్థిరతఁ గేతకీ వనిని సుశీలవైతి!

తగఁ గదంబ వనమునఁ గదంబమాల,
రాజగృహమున ఘన రాజలక్ష్మి, యటులె
ప్రతి గృహమ్మున గృహలక్ష్మి వలెను నిలిచి
పూజలను గొనుచుందువు పుడమిపయిని!

అంబుజాస నాతిచ రాబ్ధి జామ లేంది
రేశ్వరీ కమలాలయా శ్రీద విష్ణు
వల్లభా రమా మాధవీ వాహినీశ
నందినీ మారజననీ వినమ్ర నతులు!"

అనుచు దేవతల్, మునులును, మనుజులంత
నమ్రవదనులై భక్తితో నతులు సేసి,
శుభ్రకంఠోష్ఠతాలువుల్ శోభిలంగఁ
బ్రార్థనము సేసి తరియించ్రి రమణమీఱ!

ఇట్టి లక్ష్మీస్తవమ్మును నెవ్వఁ డుదయ
మునను భక్తిఁ బఠించు, నతనికి నెపుడు
ధ్రువముగాఁ బుణ్యములు శుభా లొదవునట్లు
తల్లి లక్ష్మియే కరుణించుఁ దనివితీఱ!

ఆహ్వానము!


న్యస్తాక్షరి - 45 (శు-క్ర-వా-రం)


అంశము- వరలక్ష్మీవ్రతము
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శు - క్ర - వా - రం" ఉండాలి.
ఈ న్యస్తాక్షరిని పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

3, ఆగస్టు 2017, గురువారం

సమస్య - 2428 (మాధవుఁడే కీర్తి నందె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై"
ఈ సమస్యను పంపిన గుర్రం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

2, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2427 (కాంతుఁడు లేనివేళ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో"

సెల్ ఫోను దండకము

రచన : పూసపాటి కృష్ణ సూర్య కుమార్
శ్రీమన్మహాదేవి! సెల్‍ఫోను దేవీ!  విశాలంబుగా విశ్వవిఖ్యాతి గైకొన్న యంత్రమ్ముగా నీవె యెచ్చోట కేవేళనైనన్ సువార్తల్ కడున్ వేగ శ్రావ్యమ్ముగా చేర్తువే యంతదూరాన మేమున్న నేతావు లోనున్న నేతీరమందున్న నేకొండపై నున్న నేబండ క్రిందున్న నేచెట్టు పైనున్న నేగట్టు పైనున్న నేపుట్టలో నున్న నేహాలులో నున్న నేచాలులో నున్న నేదిక్కు  లోనున్న నేపక్క మీదున్న నే తల్లితో నున్న నే పిల్ల తోనున్న నే గల్లిలో నున్న నే రోడ్డు మీదున్న నే దేవి తోనున్న నేభామ తోనున్న  నేబైకు మీదున్న నే కారులోనున్న నే బస్సులోనున్న నే మిస్సు తోనున్న నే రైలులో నున్న నే రైతు తోనున్న నే యాటలోనున్న నే పాట తోనున్న, నిచ్చోట నచ్చోట నెచ్చోటలోనైనన్ విభేదాలు లేకుండ స్విచ్చేసి నొక్కంగ వేగాన వేంచేసి   మాతోటి  ముచ్చట్లు గుప్పించి మాయొక్క సందేశ సంక్షిప్త  రూపాలు  పంపించి  కోపాలు తెప్పించి తాపాలు తప్పించి  వేదాలు గుప్పించి స్తోత్రాలు మాచేత  చెప్పించి  పాపాలు వీక్షించి లోపాలు చూపించి సంగీత సాహిత్య నాట్యాలు    కోరంగ  నెట్‍లోన  శోధించి సాధించి యందించి  సాయమ్ము నీయంగ  నానాడు మార్టిన్ను కూపర్ ప్రపంచాన సంతోష మొప్పంగ మేధస్సు పుష్పించ  మోట్రోల రీసెర్చి భాగాన  సృష్టించి నీకెంతయో ఖ్యాతి కల్పించ విశ్వాన విఖ్యాతితో నీవు నాట్యంబు లాడంగ నేపుణ్య కాలాన నిచ్చోట చేరంగ భూమండలమ్మందు మైమర్చి మేమెల్ల సంప్రీతితో మోజు కల్గంగ హస్తాలలో భూషణంబయ్యి  మాచెంత చేరంగ నీసేవ  లెన్నింటినో  మేము పొందంగ  నేరీతిలో నిన్ను నే స్తోత్రపాఠాలతో గొల్తు మిచ్చోట నీధాత్రి  యూజర్ల కెల్లప్డు సిగ్నల్సు వీకైన  నిత్యమ్ము నాటంకము ల్లేక నందించి నెట్వర్కు  రక్షించి  క్రొంగ్రొత్త   ప్యాకేజి లిప్పించి టచ్ ఫోనుతో త్రీజి  వేగాన మాచెంత  నేతెంచి దేశాన  గోతాలతో పాత నోట్లన్ని రూపాలు లేకుండగా మోడి చేయంగ  రూపాయ లేకుండ రూపేల ఖాతాలు చూపించి వ్యాపార ప్రాంతాన దూకంగ నీపైన  నిత్యమ్ముగోకంగ తాకంగ పంపించి వంటంటి సామాగ్రి కుద్దండ పిండానివే నిన్ను నేమంచు కీర్తింతు నీగొప్ప, యన్నంబు లేకున్న మేమంత  యీడ్వంగ నేర్చాము, ప్రాణాల నాపంగ లేమంట లేకున్న నీవింట, ప్రొద్దున్నె మేల్కొల్పు మోదాన నీ రింగు టోన్లన్ని, పూజింతు  మెల్లప్డు దేవుళ్ళ స్తోత్రాలు వల్లించగా నీవు, వంటింటిలో నీవు సూచించు మార్గాన  కాఫీల నుప్మాల నిడ్లీల  పెళ్ళాలు చేయంగ విందారగించంగ సంతోష మొప్పంగ నాకీర్తి  నీదే గదా దేవి, చాటింగు లెన్నెన్నియో  నీవు సాగించి లవ్వర్సుగా చేసి మ్యారేజి  బ్యూరోవుగా నీవు పేరొంది నావంట, పెళ్ళాలకు న్నట్టి దృశ్యాలు చూపించి డైవర్సు లిప్పించి న్యాయమ్ము చేసేటి నీ బోటిమేధావులం మేము కాలేము,  మా యోట్లు  కోరంగ పార్టీల కేజెంటు వైనీవు ఎన్నెన్ని సందేశముల్ బంపి ప్రార్ధించి మెప్పించి  గుప్పించి రప్పించి గెల్పించి సాయమ్ము చేసేటి  నీప్రజ్ఞకే  రోజుతూగంగ లేమమ్మ, లైన్లందు నిల్చోక  సిన్మాల టిక్కట్లు, ఆర్టీసి టిక్కెట్లు, రైళ్ళందు టిక్కెట్లు,దేవాలయాలందు  టిక్కెట్లు ఫ్లైట్లందు టిక్కెట్లు, క్లబ్లోన టిక్కెట్లు పబ్లోన టిక్కెట్లు ఇప్పించు నీసేవ గుర్తించి దేశమ్ము పద్మా ఆవార్డిచ్చి నిన్నెప్డు కీర్తించు భాగ్యంబు కల్పించి యానంద పుయ్యాలలో నీవ యూగంగ నీగొప్ప నేరీతి కీర్తింతు, లంచాల బాబుల్ని పట్టించి  జైళ్ళందు  తోయించి దేశాన్ని సౌఖ్యాన నుంచేటి నీగొప్ప తెల్పంగ లేమమ్మ, నీకీర్తిపై మచ్చలే వచ్చు ముచ్చట్ల నిచ్చోట చూపించి దూషింతు, మార్గంబుపై బండ్లు తోలేటి డ్రైవర్ల వెన్నంటి నీవుండ  స్వర్గాన చేర్చేటి నీతప్పు చూపంగ శక్యంబు కాదమ్మ, నీపొందు విద్యార్ధులుం జేర నీలోన కాపీల నుంచంగ  వ్రాయించి ఉత్తీర్ణులయ్యేట్టు మార్గంబు ప్రాప్తించు నీబుద్ధి నేరీతి  ఖండింతు, దేశాన్ని దోచేటి య యుగ్రవాదంపు మార్గాలలో చేరి దేశాన్ని క్లేశంబులో త్రోయు  నీదుష్ట సాoగత్య మేరీతి గర్హింతు, కోరంగ వేగాన  నగ్నంపు దృశ్యాలు  శోధించి గుప్పించి చూపించి  ప్రాయంబు నిర్వీర్యమౌనట్లు చేసేటి నీ చేష్టలేనాడు గర్హిoచ లేమమ్మ, లోపాల నెంచంగ స్వల్పంబు, నీ కీర్తి యాకాశమున్ దాక  నిత్యంబు నిన్గోరి మా గుండెలో దాచి  పూజింతు మెల్లప్డు చల్లంగ నీదృష్టి మాపైన చూపించి యాహ్లాద మొప్పంగ శ్రేయస్సు నందించి మేలైన ప్రోగ్రాములం జూపి సర్వత్ర మాబోటి వారందరిన్ నీవు రక్షించి బ్రోవంగ రావమ్మ సెల్ ఫోను దేవీ నమస్తే నమస్తే నమస్తే నమః.

1, ఆగస్టు 2017, మంగళవారం

సమస్య - 2426 (కాంతకై తపింతురు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాంతకై తపింతురు వార్ధకమున మిగుల"