25, ఆగస్టు 2017, శుక్రవారం

సమస్య - 2446 (ఎలుక వడఁకె...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఎలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు"
లేదా...
"ఎలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్"

81 కామెంట్‌లు:

  1. శంకరాభరణము కవులకు వినాయక చవితి శుభాకాంక్షలు నేను వ్రాసిన రధ బంధ సీస గణేష స్తుతి అవీ ఇవీ ఇవి వర్గములో పెట్టారు శ్రీ గురువు గారు. మీ అందరికి శుభాకాంక్షలు పరిశీలించి మీ అమూల్యమైన అభిప్రాయములు చెప్పగలరు. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  2. తాను నమ్మిన తనస్వామి తనను వీడి
    యొరులు కల్పించు భ్రమలకు నొదిగిపోయి
    యాంత్రికంబైన ఎత్తైన యానము గని
    ఎలుక వదకె వినాయకు డెక్కుననుచు.

    రిప్లయితొలగించండి
  3. కలుగులోనుండి వెలువడి వెలుగు నందు
    వీధినూరేగు రథమున వెలుగుచున్న
    ఖైరతాబాదు మూర్తిని పార జూచి
    ఎలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు!

    రిప్లయితొలగించండి
  4. కవి మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు
    నేను వ్రాసిన రధ బంధ సీస గణేష స్తుతి
    (రధ బంధ సీసము)
    శం శాంకరి కొమరా, చంద్ర చూడ శుభ తనయ, బొజ్జ దేవర , నాగ సూత్ర
    ధర, వారణంపు వదన, నిత్య మోదక వాంఛితా, పరమేష్టి భావుక, గణ
    నాధా,ఎలుక వాహనా,కుమారాగ్రజా విల సితంపు వదనా, విఘ్న రాజ
    సుప్ర దీపాయ, శుభ ప్రదా, జిష్ణవే, యేకదంతా, సర్వలోక నాధ ,

    చదిర వీక్షితా, భువిజన సమ్మతి విత
    రణ, శుభ ప్రదాత,వ్యాస భారత విధాత ,
    యెపుడు కాంచుచు,తప్పుల నెప్పుడు క్షమ
    చూపి దీనుల బాధలు బాపు మయ్య
    ఇది రధ బంధములో అవీ ఇవీ వర్గములో పెట్టుట జరిగినది. ఈ పద్యములో దాగిన సందేశము రధ బంధములో ఉంది. (శంకరాభరణము కవులకు వినాయక చవితి శుభాకాంక్షలు అని ఉంటుంది ) చూచి మీ అమూల్యమైన అభిప్రాయములు చెప్పగలరు. బ్లాగులో పెట్టు సమయములో గురువుగారు అస్వస్తత వలన నా పేరు వ్రాయటము మర్చి పోయినారు. మీ యొక్క అమూల్యమైన సలహాల కొరకు నిరీక్షిస్తూ పూసపాటి కృష్ణ సూర్య కుమార్

    రిప్లయితొలగించండి
  5. తే.గీ. ఎదురు వచ్చి నంతనె పిల్లి; యేమి జరిగె?
    ఎలుక వాహనముగ గల్గు నెవడతండు?
    బండి నిలిపెను సారథి ; పాంథుడొకడు
    ఎలుక వడకె వినాయకు డెక్కు ననుచు.

    రిప్లయితొలగించండి
  6. పిండి వంటలు భుజియించి మెండు గాను
    మంది రమ్మున గణపతి మత్తు గాంచి
    యల్ప ప్రాణిని నాకెట్లు సాధ్య మగును
    నెలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు

    రిప్లయితొలగించండి
  7. పూజ్య గురువులకు, సోదర సోదరీ , మణులకు ,
    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి

  8. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలతో

    కొత్త బండ్లను వాటి సోకులను చూడ,
    ఎలుక వడఁకె, వినాయకుఁ డెక్కు ననుచు,
    వాహనములన్నటునిటుల వరుస బెట్టి
    మార్చు యువత వలె తనను మానివేసి !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. మలుపుల వేగ వేగముగ మారుతి కైపు జిలేబి బండ్ల, హా!
    కులుకుల తేలియాడి, మజ, గొల్లని కెవ్వు మటంచు బోయెడు
    న్నెలతుక లెల్ల గాంచి, భళి, నేర్చెద నూతన వాహనమ్మనన్,
    ఎలుక వడంకె ,విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

    2. కంది వారు

      ధన్యవాదాలు. ఆరోగ్యం మెరుగయ్యిందను కుంటాను

      జిలేబి

      తొలగించండి
  10. గౌరి పెట్టిన కుడుములన్ గడుపు నిండ
    యారగించిన గణపతి యవని తలము
    తిరిగి వత్తుము పదమంచు పలికి నంత
    యెలుక వడికె వినాయకు డెక్కుననుచు

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు

    పదము సోకిన ముదమంది పైకి లేచి
    భక్తు నాశీర్వదించెడు ప్రతిమలోన
    పొట్టిగాకను తనసామి పొడవునుండ
    నెలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు!
    (ఈ వీడియో వాట్సప్ లో హల్ చల్)

    రిప్లయితొలగించండి
  12. ...పూజ్య గురుదేవులకు ,కవిమిత్రులందరకూ వినాయకచవితి శుభాకాంక్షలు.......

    భాద్రపద శుద్ధ చవితిని భక్తజనము
    భక్తితో సమర్పించెడు భారి లడ్లు
    కుడుము లుండ్రాళ్ళు మోదకుల్ కడుపునిండ
    నారగించెడు స్వామిని పాఱజూచి
    ఎలుక వడకె వినాయకుఁ డెక్కుడనుచు!!!

    రిప్లయితొలగించండి
  13. కుడుములమను మెక్కె గ ణ ప తి కుక్షీనిండ
    బరువు పెరగగ మోయు ట వలను గాక
    ఎలుక వడ కెవినాయకు డెక్కన ను చు
    భయ ము నిండిన మతి తోడ పరుగు దీ సె

    రిప్లయితొలగించండి
  14. పంటల జెరచెడి తనను పట్టుననుచు
    యెలుక వడకె, వినాయకు డెక్కుననుచు
    మురిసె ముదమున మోదకమ్ములను గొనుచు
    విందులివ్వగ భక్తులనింద్యు డనుచు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు వందనములు! మీ సమీక్ష చూసి చాల సంతోషమయినది! మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము!🙏🙏🙏🙏

      తొలగించండి

  15. పరగభాద్రపదపుశుక్లపక్షమందు
    భక్తిశ్రధ్ధలతోడనపత్రిపూజ
    నేకదంతునకిలజేయనీశుడైన
    చవితిచంద్రుడుశుభములసర్వమొసగు

    రిప్లయితొలగించండి
  16. మీకు మీకుటుంబ సభ్యులకు అందరికీ
    వినాయక చవితి శుభాకాంక్షలు.
    సీ:
    సూక్ష్మ దృష్టి గలిగి చూడగావలెనంచు
    చెప్పుచుండునుమాకు చిన్నికనులు
    వినగమంచిచెడుల వేరుజేయు విధము
    చెరగమనుచు జెప్పు చేటచెవులు
    సన్మార్గములజేర జాగ్రత్తగా వెదకు
    చుండుమంచు దెలుపు తొండమెపుడు
    అక్షరములతోడ కుక్షినింపుచునుండ
    పెరుగువిద్యలనును పెద్దపొట్ట
    ఆ.వె:
    శుభ్రత దగుననుచు శుక్లాంబరము దెల్పు
    నగవు నగయనునుగ నవ్వుముఖము
    నీదు రూపుదలచి నేడువేడెద స్వామి
    సిద్ధిబుద్ధి నిమ్ము శివుని సుతుడ.

    రిప్లయితొలగించండి
  17. కుడుములుండ్రాళ్ళు తృప్తిగా కడుపు నిండు
    గా గుడిచి వచ్చు చున్నట్టి గజగమనుని
    కరమగు భయముతోడుతఁ గాంచి చిట్టి
    యెలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు

    రిప్లయితొలగించండి
  18. కవి మిత్రులకు నమస్కృతులు. వినాయక చవితి శుభాకాంక్షలు!
    ఇంకా జ్వరం తగ్గలేదు. మరింత నీరసపడ్డాను. ఏ పని చేద్దామన్నా ఉత్సాహం, ఓపిక లేవు.
    దయచేసి ఈ రోజు కూడా పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పూజ్య గురుదేవుల కారోగ్యము త్వరగా కుదుట పడవలెనని కోరుకుంటున్నాము.

      తొలగించండి
    2. త్వరగా కోలుకోవాలి ! పూర్తి విశ్రాంతి తీసుకొనండి. కొన్ని వారాలవరకు దూర ప్రయాణాలు వద్దు !

      తొలగించండి
    3. శ్రావణ, భాద్ర పదాలు కొత్త నీరు తెస్తాయి కదా ! కొత్త జబ్బులూ తెచ్చే అవకాశం ఉంది.!

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారికి, జనార్దన రావు గారికి ధన్యవాదాలు. ఇప్పుటికీ జ్వరం తగ్గలేదు. కాకుంటే నిన్న, మొన్నటి కంటె కాస్త నయం!

      తొలగించండి
  19. గుడపు లడ్డులు భుజియించె గోరిగోరి
    కుడుము లుండ్రాళ్ళు గడుపారఁ గూరి గూరి
    వడిగ కైలాస మునకేగ వచ్చి నపుడు
    ఎలుక వడcకె వినాయకుడెక్కు ననుచు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  20. ఇలకరుదెంచి ఖాద్యములనింపుగఁ గ్రోలి కరమ్ముతృప్తితో
    బిలబిల వచ్చుచుండగను భీముని పుత్రుడు, భీతితోడుత
    న్నెలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్
    తలచిమనమ్మునందుమహితాత్ముని సాగెనువాహనమ్ముగా

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులు శ్రీ శ o క ర య్యు గా రి కి న మ స్కృ తు లు. మీకు మరియు క వుల కు వినా య క చ వి తి శుభాకాంక్షలు.మీరు త్వర గా కోలుకోవాలని మ న సా రా ఆ కా o క్షి స్తు న్నా ను.వo ద న ములు.

    రిప్లయితొలగించండి
  22. మూడు చక్రముల నడుపు మోడు జీవి
    రేయి వగలు ద్రొక్కుఁ దనదు వాయి నింప
    నంత వచ్చె భూరి తనుఁడు వింత గొలుప
    నెలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు


    వలపటి చేతి యంకుశము వామ కరంపుఁ బరశ్వథమ్మునుం
    దల గన సామజేంద్రునిది దర్శన మీయఁగ భీతి లేకయే
    సలలిత సర్పసూత్రమునఁ జక్కగఁ గన్పడఁ బన్నగేంద్రుఁ డా
    యెలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉరువిఘ్న వినాశక! శుభ
      కర! వక్రకర! శశివర్ణ! కాకోదర సూ
      త్ర! రజత నగాధిపాత్మజ!
      కరుణాంతఃకరణ! మమ్ము గావఁగ రావే


      కైలాసంబున నుండి భూగతి సుసౌకర్యంబునం జేసితే
      ఫాలాక్షభ్రమణక్రియా రతుఁడవై పాపఘ్న! విఘ్నేశ్వరా!
      లీలానింధ్య వరోందు రాంగన! సుకాళింగాస్య! లంబోదరా!
      శైలేంద్రాత్మజ నందనా! శరణయా సర్వామ రైకాధిపా!

      [ఉందురము = ఎలుక; అంగనము = వాహనము; కాళింగాస్య = ఏనుఁగు ముఖము కలవాఁడు ]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు, వాటి ననుసరించి వ్రాసిన వినాయక స్తుతి పద్యాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ధన్యవాదాలు!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు

      తొలగించండి
  23. కొలువగ భక్తమానవులు కోర్కెలు దీర్చెడు విఘ్ననాథునిన్
    నిలిపిరి వీధివీధి, భువినేలెడు స్వామియె తాను వారివే
    డ్కలగన పోదలంపగ, బిడాలము లుండెడి లోకమంచు నా
    యెలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచ గాంచియున్.

    రిప్లయితొలగించండి
  24. కోట్ల కుడుములు తిన్నను, కూర్మి మీర
    మోయగల వాహనమ్మొక మూషికమ్మె,
    విఘ్నపతి పాదమిడ గద్దె విరుగుననుచు
    నెలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు

    ఫలములు మోదకమ్ములును పానకమున్ వడపప్పు లన్నియు
    న్నులుకును పల్కు లేకతిని యుబ్బిన పొట్టను మోయుచుండి తా
    కులుకగ , పెద్ద గద్దెలను కుంభిని మానవులుంచి కోరగా
    యెలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్

    నిన్నటి సమస్యకు నా పూరణలు

    చిత్రమగు సమస్యలనీయ చిక్కునబడి
    పండితుడనని గర్వించు వాడొకండు
    మతి చలించగ నవధాన మందు బలికె
    రామభద్రునకున్ ధర్మరాజు సుతుఁడు

    యతులు ప్రాసలు చూచుటే ప్రతి కవితను
    ప్రధమ కర్తవ్యమని దల్చు పండితుండు
    మన పురాతన గాధల మరచి బలికె
    రామభద్రునకున్ ధర్మరాజు సుతుఁడు

    ధరను నల్వురు పుత్రులే దశరధునకు ,
    రామ రాజ్యముగా నాడు రాముడేల
    తగిన రీతినె క్షితినేలె ధర్మసుతుడు
    రామభద్రునకున్ ధర్మరాజు సుతుఁడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణలు నేటివి, నిన్నటివి అన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. భక్తి చేతనువంటలనొండబోక
    దూరదర్సన మందున దొరలునట్టి
    వంటకాలొండ?పసలేని కంటకాన
    ఇచ్చు నైవేద్యముల్ దినినచ్చుకొంటి
    అరుగబోకను నిలువగ?నగ్రపూజ్యు
    నెలుకవడకె వినాయకు డెక్కుననుచు|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వంటల వండబొక' అని కదా ఉండవలసింది? అలాగే "వంటకా ల్వండ.." అనండి. వండుటను ఒండుట అన్నారు.

      తొలగించండి
  26. చవితి నాడున తుష్టిగా స్వామితోడ
    కుడుములుండ్రాళ్ళు కడుపార గుడిచి కదల
    లేక మూలన నక్కిరాలేకయున్న
    ఎలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు.

    రిప్లయితొలగించండి
  27. వరము లి చ్చువినాయకు వాంఛ దీర్ప
    పూజ జేసి యు నైవేద్యము ల నొసoగ
    బొజ్జ నిం డ గ తిన్నట్టీ గుజ్జు రూపు
    డెలు క వ డ కె వినాయకు డెక్కుననుచు

    రిప్లయితొలగించండి
  28. ఎలుక వడకెవి నాయకు డెక్కుననుచు
    మూషికపువడ కుసహజ ముగద యరయ
    యంట బరువుగ ల్గునతని వింతగాదె?
    మోయ నేరికై ననుధర మురళి! చెపుమ!

    రిప్లయితొలగించండి
  29. దూర్వములు పత్రి పూజకు తోషితుడయి
    కుడుము లుండ్రాళ్ళు యనటులు కుడిచి,భక్త
    జనుల కోర్కెలు దీర్చ పయనమవ౦గ
    నెలుక వడకె వినాయకు డెక్కు ననుచు

    రిప్లయితొలగించండి

  30. పిన్నక నాగేశ్వరరావు.

    భక్తిగా పూజ చేసిన వారలింట

    కుడుము లుండ్రాళ్ళు బూరెలు కడుపు
    నిండ
    తృప్తిగా తిని యాశీర్వదించి వచ్చు

    చున్న గణపతి రూపమున్ జూచినంత

    నెలుక వడకె వినాయకు డెక్కుననుచు.

    ****************************

    రిప్లయితొలగించండి
  31. కలుగు గణాధి పత్యమది గ్రక్కున నెవ్వరు మూడులోకముల్
    పొలుపుగఁ దిర్గి తీర్థముల మున్గుచు వచ్చిన వారిదేననన్
    యెలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ! గాంచినన్
    దెలివిగ నెగ్గె షణ్ముఖుని దీర్చి ప్రదక్షిణలమ్మనానకున్!

    రిప్లయితొలగించండి
  32. నెమలి పై కుమారుండెక్కి నెనరు మీర
    నగ్రజుని బిల్వ నతని వాహనము కాన
    ఎలుక వడకె వినాయకుఁ డెక్కు ననుచు"
    నెమలినే తన భక్తినిన్ నెనరు వదలి

    రిప్లయితొలగించండి


  33. అంబ యిడిన మోదకముల వారగించి

    కడుపు బరువుచే నటునిటు కదల లేక

    నడచి వచ్చుచున్న గణేశు నచట గాంచి

    ఎలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు

    రిప్లయితొలగించండి
  34. ఖైరతాబాదు వినాయక నిమర్జన:

    కలుగుననున్న మూషికమొకండు కిచిక్కుమటంచు చూచుచున్
    వెలుపలరాగ భీతిలి దభేలు గుభేలుమటంచు శబ్దమున్
    మలుపునజూడ నేనుగు సమమ్ము ముఖమ్ము రథమ్ము నేగుచు
    న్నెలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్

    రిప్లయితొలగించండి
  35. తెలుపుగ జేయు తోలునని తెల్పగ చాకలి ఖైర్తబాదులో
    కులుకుచు లీవు బెట్టకనె కొంచెము సేపని పారిపోవగా...
    అలుగుచు ఘీంకరించుచును హైరన నొందుచు లేటు కేటనన్...
    ఎలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్ :)

    రిప్లయితొలగించండి