27, ఆగస్టు 2017, ఆదివారం

సమస్య - 2448 (వరమే పదితలలవాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

95 కామెంట్‌లు:

 1. సుర నర నాయకులందరి
  పరిచర్యలనందినానుభళిరాయనుచన్ తిరుగుచు వదరెడు బలు కా
  వరమే పదితలలవాని ప్రాణముఁదీసెన్

  రిప్లయితొలగించండి
 2. వరమును బొందగ విధిచే
  నరవానరుల కరములను నాశనమొందన్
  న్నెరుగక వారల బలమును
  వరమే పదితలలవాని ప్రాణము దీసెన్!

  రిప్లయితొలగించండి
 3. ధరణిజ సొగసులు వినగనె
  మరువగ ధర్మము నయమును మరియాదలనున్,
  పరసతిపై వాంఛల కల
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 4. వరగర్విత మానసమున
  నెరుగక పరిమితి విహితము నెంచక నుధృతిన్
  పరదారాపహరణ కా
  వరమే పదితలలవాని ప్రాణము దీసెన్

  రిప్లయితొలగించండి
 5. వరమద మధికమగుచు ధర
  సురనర మునివర ప్రముఖుల శుక్కులు గూర్పన్
  పర భార్యా సంగమ కా
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శుక్కులు'? 'సంగమ కావరము' దుష్ట సమాసం.

   తొలగించండి
  2. శంకరార్యులకు నమస్సులు. సంగపు కావరమే అని వ్రాసికున్నది Tying లో సంగమ అని పడినది. ఇందు దోషమున్న చెప్ప మనవి.
   శుక్కులు=దుఃఖములు, శోకములు,మనోవ్యథలు

   వరమద మధికమగుచు ధర
   సురనర మునివర ప్రముఖుల శుక్కులు గూర్పన్
   పర భార్యా సంగపు కా
   వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

   తొలగించండి
 6. నరయక్షోరగఖగఖే
  చరముఖ్యాజేయశౌర్యసంజాతమదో
  ద్ధురవృత్తి యేల? జితి స్థా
  వరమే? పదితలలవాని ప్రాణముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 7. పురపుర పొక్కుచు రక్కసి
  చెరచెర తనయన్న జేరి చేయన్ బోధన్
  చురచుర గను రావణు దీ
  వరమే పదితలలవాని ప్రాణము దీసెన్.

  రిప్లయితొలగించండి
 8. హరునకు భక్తుoడయ్యు ను
  నిరుప మ శాస్త్ర ము లు నేర్చి నీతివిదు oడై
  వర లు చునున్న న్ ద న కా
  వ ర మే ప ది త ల ల వా ని ప్రాణ ము దీ సె న్

  రిప్లయితొలగించండి

 9. ధరణిజను చెరగొనంగన్
  పడిహారుల యెన్కటి దిన బాళిని దీర్చన్
  నరుడై విష్ణువు గాన్పడ
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగు బాగు!

   రెండవ పాదములో "అచ్చు తుప్పు? " :)

   లేక ర డ ల ప్రాసయా?

   🙏🙏🙏
   తొలగించండి

  2. పడిహారులు - ద్వారపాలకులు

   ర డ మరీ రగడ జిలేబి‌:)

   జిలేబి

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి


  4. డ, ర కున్ ప్రాస కుదరదా !
   మురిసితి కొత్త పదమొకటి ముద్దుగ గానన్
   వరమయ్యెనని జిలేబి రె
   పరెపయని హృదయము తూగె పద్యపు రమణీ :)

   జిలేబి

   తొలగించండి
  5. యతులను ప్రాసల గణముల
   ప్రతి నిమిషము వల్లెవేయ వలదుర రాజా!
   అతి మధురమైన పద్యము
   మితిమీరును బంధనముల మృతసూత్రములన్

   తొలగించండి

  6. అద్భుతం !- జిలేబీయం :)

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  7. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో ప్రాస తప్పింది. 'యె(ఎ)న్కటి'?

   తొలగించండి
 10. [27/08, 05:12] Nvn Chary: కవిమిత్రులారా,

  ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

  "వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్"
  [27/08, 05:24] Nvn Chary: డా.ఎన్ .వి.ఎన్. చారి9866610429
  పరకాంతను చేపట్టగ
  పరువును సిగ్గెగ్గు లన్ని వదలచు సీతన్
  గొర గొర నీడ్చిన మద కా
  వరమే పది తలలవానిప్రాణము దీసెన్

  రిప్లయితొలగించండి
 11. విరించిః

  వరగర్వితుడై లోకో
  త్తర వీరుడనని మదించి ధరణిజ యౌ యా
  పరకాంతను కోరిన కా
  వరమే పదితలలవాని ప్రాణము దీసెన్

  రిప్లయితొలగించండి
 12. దురితమ్మున్ బాసి హరిన్
  త్వరితమ్ముగఁ జేర వైరభక్తి నసురుడై
  తరియించు జన్మఁ గోరిన
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్.

  రిప్లయితొలగించండి
 13. హరుని వరముల దన్నున
  పరసతి హరియించి కరము వంచనతోడన్
  దురమున చచ్చెను, కడుఁ గా
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 14. పరమేశుని భక్తుడయిన
  దరుమమును విడచి తనరుచు దౌర్జన్యముగన్
  ధరణిజను చెరనిడిన గా
  వరమే పదితలలవాని ప్రాణము దీసెన్!!!

  రిప్లయితొలగించండి
 15. నర వానరు లల్పులు, హరి
  హరాది సుర శ్రేష్ఠులు దన యాయువు తీయన్
  జరుగదు మహిలో యనుకా
  వరమే పదితలల వాని ప్రాణము దీసెన్

  రిప్లయితొలగించండి
 16. గురువు ల కు నమోవాకములు.పద్య పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.
  త ర గ ని మోహ ము వీ డ ని
  పరకా o త ప్రియుడు లo కా పతికిన్ బుద్ధిన్
  సరిపడని న సు ర బల కా
  వ ర మే పదితలల వా ని ప్రాణము దీసెన్
  వo దన ము లు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   రెండవ పాదంలో గణదోషం. 'బల కావరము' దుష్ట సమాసం. సవరించండి.

   తొలగించండి
 17. పరలోక గమనము బడుగు
  నర వానరుల వలనన్ దనకు భువనమునన్
  జరుగ దనెడు మనోశా
  ర్వరమే పదితలల వాని ప్రాణము దీసెన్

  రిప్లయితొలగించండి
 18. సురలను గెలిచితి సులువున
  నరునకు వెఱువంగనేల నను గెలువగనా
  హరునకు తరమా యను కా
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 19. వరవంశజాతు డయ్యును
  సురలను నొప్పించ గలుగు శూరుం డయ్యున్
  పరసతిని గోరు నా పల
  వరమే పదితలలవాని ప్రాణము దీసెన్.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 20. శరములచే తల తెగినను
  మరల మరల మొలువ దైత్య సంహారముకై
  గుఱిగొన బ్రహ్మాస్త్రమె స
  త్వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్ ౹౹

  రిప్లయితొలగించండి
 21. నరవరుడు ధర్మనిలయుడు
  పరహితమును గోరువాడు పావన సాకే
  తరఘువరుండను యిందీ
  వరమే పదితలలవాని ప్రాణము దీసెన్!

  రిప్లయితొలగించండి
 22. వరములు శివుడే యీయగ
  గరువముతో సురల మునుల గాసిలి వెటుచున్
  పరకాంతా మోహపు కా
  వరమే పదితలలవాని ప్రాణము దీ సెన్

  రిప్లయితొలగించండి
 23. నరులున్ వాలము గల వా

  నరులేమియు జేయలేరు నన్నోడింపన్

  తరమే వారికి యను కా

  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వారికి నను" అనండి.

   తొలగించండి
 24. కం. పర కాంతా వ్యామోహము
  నరులు, సురుల సురులకైన నాశము దెచ్చు
  న్నరయరు జనులది ; తమికా
  వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.

  రిప్లయితొలగించండి
 25. ధర, వరగర్వితభర, దశ
  శిరవరు, బల దురభిమాన చేష్టల తీరున్
  పరిమార్చెడు కారణమై
  వరమే పదితలల వాని ప్రాణము దీసెన్

  రిప్లయితొలగించండి
 26. వరమడుగడు లంకేశుడు
  మరణము తా నొందకుండ మనుజులచేతన్
  పరమాత్మను జేర్చినదా
  వరమే పది తలల వాని ప్రాణము దీసెన్

  రిప్లయితొలగించండి
 27. …………………………………………… గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  సరసిజగర్భుని చేతన్

  వరమును పొ౦దియు వరమగు ఙ్ఞానియు

  నయ్యున్

  పరకా౦తా సురతా స౦

  వరమే పదితలలవాని ప్రాణము దీసెన్

  ( 2 వపాద౦ యతి న = ఙ్ఞ ;

  స౦వరము = స౦బరము ; )

  రిప్లయితొలగించండి
 28. క్రొవ్విడి వెంకట రాజారావు:

  నిరతము శివపూజలతో
  నురళించుచు భక్తులందు నున్నతుడైనన్
  మరులకు లొంగిన గుణ కా
  వరమే పదితలల వాని ప్రాణము దీసెన్
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గుణ కావరము' దుష్ట సమాసం.

   తొలగించండి
 29. పర దార సుప్రధర్షణ
  మరవింద భవప్రసాది తామోఘ వరో
  త్కర గర్వమ్ము కలిమి కా
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు!
   చిన్నసందేహము!
   ప్రధర్షణ యనగా అత్యాచారము(Assault)
   యని ఆంధ్ర భారతి చెబుతున్నది!
   సుప్రధర్షణ యనే మాట సరియైనదేనా?
   వివరించగలరు.🙏🙏🙏🙏

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు

   డా. సీతా దేవి గారు నా మనస్సును మథించిన సందేహాన్నే మీరు వెలిబుచ్చారు. నిజానికి చాలాసేపు తటపటాయించి యీ పద ప్రయోగము చేసాను.
   “సు” ఉపసర్గ మంచి, మిక్కిలి యన్న యర్థములలో వాడబడుతుంది. యిక్కడ మిక్కిలి యర్థమును గ్రహించితిని. “ప్ర” కూడా సమానార్థములోనే వాడబడుతుంది.

   అయితే సీతాదేవిని మహా భయంకరముగా తర్జించిన విషయము మదిలో తలచి యాయన ధర్షణము మిక్కిలి మిక్కిలి యెక్కువ యని నా భావన.
   దుష్ప్రధర్షణ కు వ్యతిరేకము సుప్రధర్షణ.

   ఇటువంటి ప్రయోగమును కావ్యములలో చూచినట్టు గుర్తు. లభ్యమైనపుడు తెలుప గలను.

   రాక్షసీవశమాపన్నా భర్త్స్యమానా సుదారుణమ్.
   చిన్తయన్తీ సుదుఃఖార్తా నాహం జీవితుముత్సుహే৷৷5.26.4৷৷

   సుదారుణము, సుదుఃఖార్తా ఇటువంటివే.
   ఈ విషయమున గురువు గారి యభిప్రాయము నాశిస్తున్నాను.

   తొలగించండి
  4. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! మీరు చెప్పిన మిక్కిలి యనే అర్ధము గ్రహించిన యెడల సమంజసమే యని తోచుచున్నది! ధన్యవాదములు!🙏🙏🙏🙏

   తొలగించండి
  5. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! ఇప్పుడే తోచినది! లలితా సహస్రనామాలలో "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా!" యనుటలో కూడ మిక్కిలి దుర్లభమైనదనే యర్ధమును శ్రీ సామవేదమువారు చెప్పియున్నారు!🙏🙏🙏🙏

   తొలగించండి
  6. భగవద్గీత అధ్య.7 నం. 19 లోయిలా ఉన్నదని మా చిన్నాయనగారు చెప్పారు:
   బహూనాం జన్మనామంతే
   జ్ఞానవాన్మాం ప్రపద్యతే
   వసుదేవః సరవమితి
   సమహాత్మా సుదుష్కరం!
   🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  7. డా. సీతా దేవి గారు చక్కటి యుదాహరణల నిచ్చారు.
   నా సందేహము “సు” మరియు “ప్ర” ఉపసర్గలు రెంటి ప్రయోగము గురించి.
   ప్ర ప్రయోగ మొక సారి మిక్కిలి యను యర్థమును మరియొక చోట విశేషార్థము నొసగును.
   ఇక్కడ మిక్కిలి యనుట కంటే ధర్షణమనగా బెదరించుట యను సామాన్యార్థమునకు ప్ర చేరగానే దౌర్జన్యము దాడి చేయు నను విశేషార్థములు కల్గును.
   దానికి సు చేరగానే మిక్కిలి దౌర్జన్యమని యర్థము వచ్చును గావున సమంజసమే యని భావించి ప్రయోగించితిని.

   తొలగించండి
 30. హరదేవుడిడిన వరమే
  తిరస్కృత విశేష నిజ సతి హిత స్వరమే
  నెర కావరమే కామ
  జ్వరమే పది తలల వాని ప్రాణము తీసెన్

  రిప్లయితొలగించండి
 31. ధరణిని దేశము లెంచుచు
  పరమత సహనమ్ము వీడి పాల్పడ దాడుల్
  తెరఁగొన జిహాది యని కా
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

  రిప్లయితొలగించండి


 32. ధరణిజ కోపు! గవనికా
  పరులకు సల్పినటి హామి, బాళిని దీర్చన్
  నరుడై విష్ణువు గాన్పడ
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. 'సల్పినటి'?

   తొలగించండి
 33. కం. నరులేమిసేయగలరని
  వరమడిగెనురావణుండు బ్రహ్మను దొలుతన్
  సురులవలన జావక తన
  వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి

 34. ఈరోజు అయ్యవారు ముకుదాడు బట్టి లాగి వదలకుండా ఉన్నారు :) ఆఖరి యత్నం :)

  ధరణిజ కోపు! గవనికా
  పరులకొనర్చినటి హామి, బాళిని దీర్చన్
  నరుడై విష్ణువు గాన్పడ
  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ! సల్పిన లేదా యెనర్చిన లో దోషములేదని నటి లోనే దోషమున్నదని తోచుచున్నది! నట్టి యుండవలెనను కొంటున్నాను!

   తొలగించండి
 35. నరునియరదమ్ము చక్కగా నడిపెనెవడు?
  ఏమిజేసెను తా మేనమామ నపుడు?
  తోడు వీడకరక్షించె వాడెవరిని?
  పార్థసారథి-పరిమార్చె- పాండవులను.

  రిప్లయితొలగించండి
 36. నరవానరులను వదలుచు
  పరులెవ్వరు చంపలేని వరమునుబొందెన్
  చరియించకామమున కా
  వరమే పది తలల వాని ప్రాణము దీసెన్.

  రిప్లయితొలగించండి
 37. పూరణ ను స్వల్ప ము గ స వ రి o చి నా ను.
  తర గ ని మో హ పు వాo చ లు
  పరి పాటిగదా లo కా పతికిన్ మతులే
  సరిపడని న సుర మద కా
  వ రమే పదితలల వా ని ప్రాణము దీ సె న్
  గురువు గారు పూరణ ను సవరి o పు డు. టైపింగు లో
  కొన్ని త ప్పు లు దొర్లుతున్నాయి. వందనములు.

  రిప్లయితొలగించండి
 38. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 39. మధ్యాక్కర
  27.8.17.హరునివరము లందుకొనగ?నాత్మసాక్షిని నెంచ బోక
  కరుణ లేకను సీత నెత్తుక వెడల? రాముడు లంక
  కరిగిహనుమరాగలంక కంటక మయ్యు “యుద్దమున
  వరమే పదితలల వాని ప్రాణము దీసెన్ విధాత|

  రిప్లయితొలగించండి

 40. పిన్నక నాగేశ్వరరావు.

  వర గర్వముచే తనకిక

  మరణము లేదనుచు నమ్మి మరులను
  గొనుచున్
  పర సతినే దెచ్చిన కా

  వరమే పది తలల వాని ప్రాణముదీసెన్.

  రిప్లయితొలగించండి

 41. మరణమొకటి దప్ప మరొక

  వరమును వేడుకొనుమనగ  పంక్తిగళుండున్

  నరవానరులను విడ నా

  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్"  పరసతి వ్యామోహంబున

  ధరణీసుతనపహరించి దశకంఠుండున్

  నరుడేమొనరించనుకా

  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్


  నరులేమిచేయగలరని

  గరువము తోనపహరించి కాకుత్సుసతిన్

  చెరపట్టుకు నేగిన కా

  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్.


  వరగర్వముచే సురలను

  నరులను  తేలికపరచుచు నాసీతమ్మన్

  హరియించ మదంబున నా

  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్


  నరులొక లెక్కాయనుచును

  వరగర్వమునుచూపి వనితను దాయన్

    నరుడౌ   రాముని తోడ బ

  వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 42. ధరలో నే బలవంతుడు
  సరిలే రెవరంచు బ్రేలు శంభు సుభక్తున్
  వర గర్వితు డగతని కా
  వరమే పది తలల వాని ప్రాణము తీసెన్

  రిప్లయితొలగించండి