వసంత కిశోర్ గారూ, క్త్వార్థమైన ఇత్తు తరువాత ఎట్టి సంధి కార్యం జరుగదు. సరళాదేశం కాని, గసడదవాదేశం కాని జరుగదు.కనుక "..గొనిపోయి చచ్చెను" అనే ఉంటుంది. రాత్రి పీతాంబర్ గారు పంపిన సమస్యను కాపీ, పేస్ట్ చేసినపుడు గమనించలేదు. సవరించాను. ధన్యవాదాలు!
సూర్యకుమార్ గారూ, క్రమాలంకారంలో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు. "వనిలో యాచకుడై.. వేగమ్ముగ నేమి... హనుమంతుడును సింగిళీకముల" అనండి. 'తచ్చనగొండి'ని 'తచ్చన్నగొండు' అన్నారు.
తన దౌర్భాగ్యము,విష్ణుపావన పదద్వంద్వంబు చేరంగ చ
రిప్లయితొలగించండియ్యన పౌలస్త్యుడు,రావణాసురుడు బాహాటంబుగా నీతి బా.
హ్య,నికృష్టంబు నధర్మ మార్గచరుడత్యతోగ్రుడై,పూన్కి,రా
ముని,పత్నిన్ గొనిపోయిఁజచ్చెనుగథా మోహాంధుడై యాజిలో
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చరు డత్యంతోగ్రుడై.." అనుస్వారం టైపు కాలేదు.
ధన్యవాదాలు
తొలగించండి
రిప్లయితొలగించండిఘనుడా రావణరాక్షసప్రవరుడే గాధేయుసచ్చాత్రుడౌ;
జనులన్ గన్నులబెట్టి చూచుకొను ధీచాతుర్యధుర్యుండునౌ;
వినుతిన్ గాంచిన నీలమేఘతనుడౌ; వేదాంతవేద్యుండు రా
మునిపత్నిన్ గొనిపోయి జచ్చెనుగదా మోహాంధుడై యాజిలో.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దనుజాధీశుఁడు, పంక్తి కంఠుఁడు, సదా దాక్షాయిణీనాథ నా
రిప్లయితొలగించండిద నినాదాంతర మానసుండు, సురరాట్ ధర్మేద్ర ధూళిధ్వజా
ర్థనిధీశాగ్ని జలాధినాథ ఘన దీర్ఘానాథ నిర్ణేత, రా
మునిపత్నిన్ గొనిపోయి జచ్చెను గదా మోహాంధుడై యాజిలో!!
సత్యనారాయణ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
'ధర్మేంద్ర' అని ఉండాలనుకుంటాను. అష్టదిక్పాలకులలో నిరృతి, ఈశానుడు తప్పినట్టున్నారు!
గురువుగారికి ప్రణామములు
తొలగించండి'ధర్మేంద్ర' అని ఉండాలి. టైపాటు
దీర్ఘానాథగ (దీర్ఘాదేవి భర్తగా) నిరృతి వచ్చాడు.
దాక్షాయిణీనాథుడుగా ఈశానుడు కూడ వచ్చాడు
దనుజాధీశుఁడు, పంక్తి కంఠుఁడు, సదా దాక్షాయిణీనాథ నా
ద నినాదాంతర మానసుండు, సురరాట్ ధర్మేంద్ర ధూళిధ్వజా
ర్థనిధీశాగ్ని జలాధినాథ ఘన దీర్ఘానాథ నిర్ణేత, రా
మునిపత్నిన్ గొనిపోయి జచ్చెను గదా మోహాంధుడై యాజిలో!!
👏👏👏👏👏
తొలగించండిసత్యనారాయణ గారు సురరాట్ +ధర్మేంద్ర = “సురరాడ్ ధర్మేంద్ర” అవుతుంది. “ధ” మృదు వ్యంజనము కాబట్టి.
తొలగించండికఠోర వ్యంజనము పరమైతే రాట్ అవుతుంది “మృగరాట్కిశోరము” వలె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికామేశ్వర రావు గారికి ధన్యవాదములు
తొలగించండిసవరించిన పద్యము:
దనుజాధీశుఁడు, పంక్తి కంఠుఁడు, సదా దాక్షాయిణీనాథ నా
ద నినాదాంతర మానసుండు, సురరాడ్ ధర్మేంద్ర ధూళిధ్వజా
ర్థనిధీశాగ్ని జలాధినాథ ఘన దీర్ఘానాథ నిర్ణేత, రా
మునిపత్నిన్ గొనిపోయి జచ్చెను గదా మోహాంధుడై యాజిలో!!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
పౌలస్త్య వధ :
01)
_______________________
అనిలో రాముని గెల్వలేని గతి, మా - యా చిత్ర చీనంబు గా
వనిలో రాముని మాయ జేయ, ననిపెన్ = పౌలస్త్యుడా టక్కరిన్ !
వెను వెంటన్ జని మారువేషమున, తా - విన్నాణిగా మారి, రా
ముని పత్నిన్ గొనిపోయి జచ్చెను గదా - మోహాంధుడై యాజిలో
తన తమ్మ్లుల్, కొడుకుల్, సహా మిగత భృ - త్యానీక , సర్వంబహో/(సర్వంసహా) !
_______________________
చీనము = జింక
పౌలస్త్యుడు = రావణుడు
విన్నాణి = యతి
అనీకము = సైన్యము
సర్వంసహా = భూమి(రాజ్యము)
శంకరార్యా ! చిన్న సందేహం
తొలగించండిగొనిపోయి + చచ్చెను
ద్రుతప్రకృతికము లేని యెడ సరళాదేశ మగునా ?
వసంత కిశోర్ గారూ,
తొలగించండిక్త్వార్థమైన ఇత్తు తరువాత ఎట్టి సంధి కార్యం జరుగదు. సరళాదేశం కాని, గసడదవాదేశం కాని జరుగదు.కనుక "..గొనిపోయి చచ్చెను" అనే ఉంటుంది.
రాత్రి పీతాంబర్ గారు పంపిన సమస్యను కాపీ, పేస్ట్ చేసినపుడు గమనించలేదు.
సవరించాను. ధన్యవాదాలు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనుగుంజెల్లికి ముద్దు తీర్చుటకు నన్యాయంబుగా జానకిన్
రిప్లయితొలగించండిగొని తెచ్చెన్ గద! మోహ దగ్ధుడయి తా గోల్పోయె ప్రాణంబులే!
జనులీరీతిగ చెప్పుకొందురిటు - రాజద్రావణుండిట్లు రా
ముని పత్నిన్ గొనిపోయి జచ్చెను గదా మోహాంధుడై యాజిలో
విజయకుమార్ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
జనకుండిచ్చిన మాటకై వదలె రాజ్యశ్రీని,వెన్వెంట ల
రిప్లయితొలగించండిక్ష్మణుడేతెంచ వనానికేగె సతితో కాపాడగా ధర్మమున్
వనవాసంబున రావణుండు యతియై వాచాలతన్ జూపి రా
మునిపత్నిన్ గొనిపోయిజచ్చెనుగదా మోహాంధుడై యాజిలో !!
పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవధాని శ్రీ అయాచితం నటేశ్వర శర్మగారి పూరణ
రిప్లయితొలగించండి"అనిశంబుద్యమ శీలుడై సమరసస్వాధీన ధీమంతుడై
కొనియెన్ ధర్మము పత్నిబోల్కిజనద క్ష్యో భ్యత్ సుధర్మస్థితిన్
నినదల్ శౌర్యపరాక్రమోన్నతుని సన్నీతోరు సంగ్రామ భా
మునిపత్నిన్ గొనిపోయి చచ్చెనుగదా మోహాంధుడై యాజిలో!!
ధన్యవాదాలు!
తొలగించండిఘనుడై విక్రమమందు దైత్యజన సంఘ త్రాతయై వెల్గుచున్
రిప్లయితొలగించండివనజాతోద్భవ వంశసంభవుడునై భక్తుండునై శంభునిన్
మనసారన్ జపియించు చుండి ఖలుడై మాన్యన్ సుఖంబంద రా
మునిపత్నిన్ గొనిపోయి చచ్చెను గదా మోహాంధుడై యాజిలో.
హ.వేం.స.నా.మూర్తి
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనుడా కోటిరు డెవ్వరిన్ వలచె, లంకాధీసుడా జానకిన్
రిప్లయితొలగించండివనమున్ యాచకుడై విడంబనము తో వాల్గంటి మూర్చిల్లగా
తను వేగమ్ముగ యేమి చేసెనట, సీతా వల్లభుం డప్పుడున్
హనుమంతాదిగ సింగిళీకములు సాయంబున్ తటస్తించగన్
తన యస్త్రాలను దీటుగా నిడగ యాతచ్చన్నగొండే మయెన్,
ముని పత్నిన్,గొనిపోయె, చచ్చెనుగదా మోహాందుడై యాజిలో
సూర్యకుమార్ గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
"వనిలో యాచకుడై.. వేగమ్ముగ నేమి... హనుమంతుడును సింగిళీకముల" అనండి. 'తచ్చనగొండి'ని 'తచ్చన్నగొండు' అన్నారు.
రిప్లయితొలగించండిమనుజుండే యనుకోకు ! దాశరథి సామాన్యుండు గాదయ్య ! ప
ద్మిని ఱేడౌ ! వినుమయ్య యన్న వినకన్, ధీమంతుడంచున్నహో
మనువాడన్ యతనమ్ము జేసెనకటా, మారాకు హత్తించె రా
ముని పత్నిన్ గొనిపోయి, చచ్చెను గదా మోహాంధుఁడై యాజిలో!
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివనిలో నుండిన సీత చక్కదము నాప్రాదయ్యమా చుప్పనా
తి నుతించన్ విని రావణాసురుడు నీతిన్ గాంచకాటోపమున్
ముని వేషంబున కాడుకున్నరిగి వ్యామోహమ్ము క్రమ్మంగ రా
ముని పత్నిన్ గొనిపోయి చచ్చెను గదా మోహాంధుడై యాజిలో
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివనిలో నుండగ రామల క్ష్మణులు నా వైదే హితోబా టునున్
ననయం బున్నొక చోటను న్నతరి మాయాజోగి యైవచ్చె నా
ఘనుడా దైత్యుడు పంక్తి కంఠుడిల లో కారుణ్య మున్ వీడి రా
మునిపత్నిన్ గొనిపోయి జచ్చెను గదా మోహాంధుడై
యాజిలో
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనభక్తుండగు రావణుండు కరమౌ కామమ్ముతోనంధుడై
రిప్లయితొలగించండిచని కాంతారముఁ గాంచి యచ్చటను దుష్టంబైన యాకాంక్ష రా
మునిపత్నిన్ గొనిపోయి చచ్చెనుగదా మోహాంధుడై యాజిలో
మనమందున్ చెడు కోర్కెలున్నపుడు సంప్రాప్తంబగున్ నష్టముల్
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కనలె న్ సోదరి గాంచి రావణుడు శోకం బెల్లపోగొట్టుచున్
రిప్లయితొలగించండితన దౌమాయలు మంత్ర విద్య వలన న్ దైత్యు oడుమో స oబున న్
కనిపించేన్ గద జంగముం డ గు చుతా కాంక్షించి కామి oచిరా
ముని పత్ని న్ గొని పో యిచచ్చే న్ గ దా మో హా oధుడైయా జి లో
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వనవాసంబున నున్న రాముని సతిన్ వంచించి , రామానుజుం
రిప్లయితొలగించండిడని వార్యంబుగ పర్ణశాల విడుచున్నాంక్ష న్విధించంగ , గూ
డని దైన న్నసురుండు కాన వనిత న్నన్నార్థి గా బిల్చి రా
మునిపత్నిన్ గొనిపోయి చచ్చెను గదా మోహాంధుఁడై యాజిలో
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనిశమ్మున్ పతిసేవ జేయగ నరణ్యమ్మున్ నివాసింపగా
రిప్లయితొలగించండిజనియెన్ జానకి సాధుశీల సతినిన్,సద్ధర్మ సంచారి రా
మునిపత్నిన్ గొని పోయి చచ్చెను గదా మోహా0ధుడై యాజిలో ,
"వినుమా కామపిశాచి పాల్బడినచో విధ్వంసమౌ వంశమే"
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కౌరవ సభలో ద్రౌపది ఆక్రందన:
రిప్లయితొలగించండికనగన్ మీరెటు లోర్తురే విబుధు లీకాంతన్ వివస్త్రన్నహో!
యనగన్ నోరెటు లాడదో తగదిదన్యాయమ్ముగా దల్చ? రా
మునిపత్నిన్ గొనిపోయి చచ్చెను గదా మోహాంధుఁడై యాజిలో
దనుజుండై దశకంఠుఁ డాపగిది క్రోధాగ్నుల్ విజృంభించవే?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జన సంత్రాస రతుండు రావణుఁడు దుస్సాధ్యుండు ధాత్రిన్ దశా
రిప్లయితొలగించండినన విభ్రాజిత విగ్రహుండు దనుజామ్నాయాధి నాథుం డటన్
జనకాత్మోద్భవ నుత్త మాంగనను సచ్ఛారిత్రఁ గాకుత్స్థు రా
ముని పత్నిం గొనిపోయి చచ్చెను గదా మోహాంధుఁడై యాజిలో
కామేశ్వర రావు గారూ,
తొలగించండిగంగాప్రవాహం వంటి చక్కని ధారతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఘనుడౌ రావణ దానవేంద్రుడు దగన్ మాయావిరూపంబునన్
రిప్లయితొలగించండికనకాంగిన్ వనవాటికన్ బొడగ నేకాంతమ్మునందొప్పగా
జనవందారుడు లక్ష్మణాగ్రజుడు సౌజన్యాంతరంగుండు రా
ముని పత్నిన్ గొనిపోయి చచ్చెనుగదా మోహాంధుడై యాజిలో
డా. సీతా దేవి గారు రామున్ని జనవందిఁతుడన సమంజసము గాని జనవందారుఁ డన బాగుండదు. జనపూజార్హుఁడు సమంజసము.
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు కామేశ్వరరావుగారికి నమస్సుల! పొరపాటు పడ్డాను! జనము చేత నమస్కరించబడువాడని భావించాను!
తొలగించండిజనపూజార్హుడని సవరిస్తాను! ధన్యవాదములు!🙏🙏🙏🙏
ఘనతన్ బెంచిన కామసత్వ గుణ సంకల్పంబురక్షించెనా?
రిప్లయితొలగించండితనలో గర్వము నాశనంబెగద?సంధానంబు నూహించగా?
ధనమా?రాజ్యబలంబ?కావరమ?నత్యాసందు భోగంబ?రా
మునిపత్నిన్ గొనిపోయి చచ్చెనుగదామొహాంధుడై యాజిలో|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారు / కామేశ్వర రావు గారు
రిప్లయితొలగించండి"పూష వెలుంగు" సమాసము సాధువేనా?
సత్యనారాయణ గారు పూషుఁడు న కారాంత పుం. సంస్కృతము. వెలుఁగు ఆచ్చికము. సమసించరాదు. పూషువెలుంగు సాధు సమాసము.
రిప్లయితొలగించండికామేశ్వర రావు గారికి ధన్యవాదములు
తొలగించండికనగా నాటి సుబాహు చావుకు ప్రతీకారాగ్ని వేధింపులన్
రిప్లయితొలగించండివినగన్ సోదరి పొందు వేదనల నావేశమ్ముగా దూలుచున్
కనులన్ గానని యాగ్రహమ్ము రగులంగా రావణుండంత రా
ముని పత్నిన్ గొని పోయి చచ్చెను గదా మోహాంధుడై యాజిలో!
గురువర్యులుకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
ధన్యవాదములు.
శుభము లిచ్చును సిరులతో శోభ గూర్చు
క్రమము దప్పక పూజింప శ్రావణమున
వాసితోడ శుక్లపు శుక్ర వారమందు
రంగులలరు నిందిరను వరముల గోరి!
కనగన్ కైపద మియ్యదిన్ బడబడన్ కాట్లాడి పోట్లాడుచున్
రిప్లయితొలగించండిధనధన్ మంచును మెప్పు గోరుచునహా ధట్టించి రెట్టించుచున్
తనివిన్ దీరగ పండితుల్ వదరిరే తందాన తానంచు: "రా
మునిపత్నిన్ గొనిపోయి చచ్చెను గదా మోహాంధుఁడై యాజిలో" :)