6, ఆగస్టు 2017, ఆదివారం

సమస్య - 2430 (మాంస మిష్టపడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మాంస మిష్టపడు సుమా ద్విజుండు"

83 కామెంట్‌లు:

 1. గురువుగారూ నిన్నటి పూరణ.

  ఘనుడా వాలి హిరణ్యగర్భు వరమున్ గర్వించి మోహాన వం
  చనజేసెన్ దహరుండు నిక్కమనుచున్ సత్యంబు శోధింపక
  న్ననుజన్మున్ దన బాహు ఘట్టనలచే న్బాధించి శోకించు త
  మ్మునిపత్నిన్ గొనిపోయి చచ్చెను గదా మోహాంధుఁడై యాజిలో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విందు భోజనమున వెలగపండునుగాని
   లేత దబ్బ కాయ చేత గాని
   మనసు తోనచేయ మంచి పోపున ఱాతి
   మాంస మిష్టపడు సుమా ద్విజుండు

   తొలగించండి
  2. ఫణికుమార్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   దాదాపుగా అందరూ 'రాముని పత్ని'తో పూరణలు చెప్తే మీరు వైవిధ్యంగా 'తమ్ముని పత్నిని గొనిపోయిన వాలి' గురించి పూరణ చెప్పారు. ప్రత్యేక ప్రశంసలు!

   తొలగించండి
  3. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
 2. నా పూరణలు....
  (1)
  విపినమందు దిరిగి వేటాడు వ్యాధుండు
  మాంస మిష్టపడు సుమా! ద్విజుండు
  వేదములఁ బఠించి వేల్పుల కృప సర్వ
  జనులు పొందఁ జేయు జన్నములను.
  (2)
  చెరువు చెంతకు పిలిచెనట వ్యాఘ్రము నర
  మాంస మిష్టపడు సుమా! ద్విజుండు
  స్వర్ణకంకణమ్ము సాధించు నాసతో
  దాని వాతఁ బడు కథ తెలిసినదె!
  (3)
  వివిధములగు వేద వేదాంగ సదుపని
  షత్పురాణ కావ్య సాంఖ్య తర్క
  సాంగములగు సర్వ శాస్త్రమ్ములందు మీ
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు.
  (4)
  సంతసమున గొప్ప షడ్రసోపేతమౌ
  విందొసంగఁ దలఁచి పిలిచి తృప్తి
  కలుగ భక్ష్య భోజ్యములు పెట్టినను రాతి
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు (రాతిమాంసము=రోటిపచ్చడి)
  (5)
  వాయుపుత్రుఁ డాంజనేయుఁ డాతని వేల్పు
  సతము పూజ చేసి సంతసించు
  చూపుఁ ద్రిప్పనీని రూపమ్ములో నతి
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు (అతిమాంసము=పిక్క/తొడ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకరార్యా ! మీ 5 పూరణలూ బాగున్నవి ! అభినందనలు !
   మాకేమీ మిగల్చకుండా అన్నీ మీరే తినెయ్యడం మాత్రం బా లేదు !

   తొలగించండి
  2. (6)
   గోడపైనఁ గలవు గొప్ప చిత్రము లెన్నొ
   యాజనేయ చిత్ర మందొకండు
   రామ లక్ష్మణులు విరాజిల్లు హనుమ భీ
   మాంస మిష్టపడు సుమా ద్విజుండు.
   (భీమ+అంసము=గొప్పనైన భుజము)

   తొలగించండి
  3. ఇది చాలా అన్యాయం !
   ఆరవ మారవ మాంసం కూడా భోంచేసేసారు !
   చాలా బావుంది ! అభినందనలు !

   తొలగించండి
  4. (7)
   అడవిలోని క్రూరమైన మృగములకుఁ
   దినుట కేపదార్థ మనినఁ బ్రీతి?
   బ్రాహ్మణునకుఁ గల్గు పర్యాయ పదమేది?
   మాంస మిష్టపడు సుమా; ద్విజుండు.

   తొలగించండి
  5. (8)
   దుడుకుతనము తోడ దుష్టసాంగత్యము
   చేత భ్రష్టుఁడైన శిష్టుఁ డొకఁడు
   గుణనిధి వలెఁ గడుఁ గుత్సితుండుగ మారె
   మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

   తొలగించండి
  6. అయ్యో ! ఏడవ మాంసం కూడానా !
   క్రమాలంకారముతో మీ పూరణ ప్రశస్తముగా నున్నది

   తొలగించండి
  7. గుణనిధితో మాంస భక్షణ చేయించిన మీ 8 వ పూరణ అద్భుతముగా నున్నది !

   తొలగించండి
  8. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “మీమాంసము” ప్రయోగమునొక సారి పరిశీలించ గోర్తాను.

   తొలగించండి
 3. ఇందు గలడు, అచట, ఎచ్చోట నైనను
  గలడు శివుడు, భక్తి గలిగి పూజ
  సలుపు చున్న శివుడు సంతసించు, ననుమీ
  మాంస మిష్ట పడు సుమా ద్విజుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గలడు+అచట=గల డచట' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. "ఇచ్చట గల డచట నెచ్చోట..." అనండి.

   తొలగించండి

 4. వేటను విధిగభావించు విభుడు వాడు
  రణమున యరి విరిచి రాణకెక్కు
  కండబలమును బెంచగ కద్దుగాదె
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు!

  కద్దు= సబబు; ద్విజుడు= క్షత్రియుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   1,2 పాదాలు తేటగీతి పాదాలు. సవరించండి.

   తొలగించండి
  2. వేట ధర్మబద్ధ విధిగాగ ప్రీతిని
   జింక,దున్న,యెలుగు జీల్చగాను
   పుష్టినిచ్చునంచు తుష్టిగ భుజియింప
   మాంస మిష్టపడు సుమా ద్విజుండు!

   ద్విజుడు= క్షత్రియుడు

   తొలగించండి
  3. గురువుగారికి నమస్సులు! ఒక చిన్న విన్నపము! ఈ మనవి యిదివరలో యెవరైనా చేశారేమో తెలియదు! సమస్యలను అర్ధరాత్రి అమెరికా సమయంలో కాకుండా ప్రొద్దున్న సూర్యోదయ సమయంలో యిచ్చిన పూరణలకు బుద్ధి సరిగా యుండునని నాభావన! వీలయున దయచేసి పరిశీలించ గలరు! ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  4. నాబోటి నిశాచరులకు అర్ధరాత్రియే సరి. ప్రశాంతముగా తీరుబడిగా ఏకాంతముగా నిశ్శబ్దముగా...

   "యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సమ్యమీ..."

   తొలగించండి


  5. నాబోటి నిశాచరులకు
   పూబోడీ ! యర్ధరాత్రి పువ్వారు సమ
   స్యా పూరణలౌ సుమ్మీ !
   రాభస్యము శంకరాభ రణకొల్వుననౌ :)

   జిలేబి

   తొలగించండి
  6. జిలేబిగారూ నమోనమః!
   రాభస్యము, రాధనము, రన్తృ ఆహా! యేమి పదప్రయోగమండీ! మీ పద్యాలు నిత్యనూతనంగా అలరిస్తాయి!
   ధన్యవాదములు!🙏🙏🙏🙏

   తొలగించండి


  7. కందంబౌ మూలమిదం
   బృందా వనమందు లేమ, బృందిష్టముగన్
   విందార గింప శంకరు
   డందంబగు రమ్యమైన రంగమొనర్చెన్ :)

   జిలేబి

   తొలగించండి
 5. బ్రాహ్మణులకు వోలె భాసిల్ల జంద్యమ్ము
  రెండు మార్లు పుట్టుచుండు రాజు...
  రాజ భోజనమ్ము రాజసికమ్మౌను...
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు

  ద్విజుడు = బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాజసికము'...?

   తొలగించండి
  2. సాత్త్విక, రాజసిక, తామస ... ఆహారములు.

   ..శ్రద్ధాత్రయ విభాగ యోగము (గీత ౧౭ - ౧౬ )

   తొలగించండి
 6. వేటగాడు చూడ విరివిగ నేతిండి
  నారగింప నెంచు? నారు రుచుల
  నోగిరమ్ము దినెడి యుత్సాహి యెవ్వండు?
  మాంస మిష్టపడు సుమా! ద్విజుండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. పచ్చిరక్తమైన పడిత్రాగు వారలు
  జుఱ్ఱుకొనెదరేమి జుంటితేనె?
  మాంసమిష్టపడు సుమా!ద్విజుండు
  చారుశీలి!మెలగు సత్వబుద్ధి@

  రిప్లయితొలగించండి
 8. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  క్షత్రియుఁడు :

  01)
  _______________________

  శక్తి వలయు మించి - క్షత్రియులకు నెప్డు
  శక్తి గలుగు మాంస - భుక్తి వలన !
  ఇర్రి , యెద్దు , వేట - యిత్యాది మెకముల
  మాంస మిష్టపడు సు - మా ద్విజుండు !
  _______________________
  ద్విజుఁడు = బ్రాహ్మణుఁడు; క్షత్రియుఁడు; వైశ్యుఁడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వైశ్యుఁడు :
   (ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సాలలో వీరిని కళింగ కోమట్లందురు)

   02)
   _______________________

   కోమటీండ్లు కూడ - కొన్ని ప్రాంతములలో
   అది యిది యని లేక - యన్నియు తిను !
   గన, కళింగ దేశ - గ్రామ గ్రామము లందు
   మాంస మిష్టపడు సు - మా ద్విజుండు !
   _______________________
   ద్విజుఁడు = బ్రాహ్మణుఁడు; క్షత్రియుఁడు; వైశ్యుఁడు.

   తొలగించండి
  2. బ్రాహ్మణుఁడు :

   03)
   _______________________

   కర్మ ఙ్ఞాన మిచ్చు - కర్మ మీమాంసను
   యిష్ట పడును - మిగుల - కష్ట మనక
   బ్రహ్మ ఙ్ఞాన మిచ్చు - బహుళమౌ, బ్రహ్మ మీ
   మాంస మిష్టపడు సు - మా ద్విజుండు !
   _______________________
   ద్విజుఁడు = బ్రాహ్మణుఁడు; క్షత్రియుఁడు; వైశ్యుఁడు.
   (మీమాంస : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
   వేదార్థము ఇట్టిది అని నిశ్చయింపఁదగిన న్యాయమును తెలుపునట్టి శాస్త్రము.
   ఇందు కర్మకాండము పూర్వమీమాంస అనియు, బ్రహ్మకాండము ఉత్తర
   మీమాంస అనియు ద్వివిధము అయి ఉండును.
   వీనినే కర్మమీమాంస, బ్రహ్మమీమాంస అని అందురు.)

   తొలగించండి
  3. ఏ మాంసం ?

   04)
   _______________________

   వ్యాఘ్ర ,సింహ, భేర - భల్లూక, వానర
   పాము, దోమ, మిడుత, - చీమ, కప్ప
   లేడి, మేక. మత్స్య. - కోడి, శుకముల నే
   మాంస మిష్టపడు సు - మా ద్విజుండు !
   _______________________

   తొలగించండి
  4. ఎక్కడ ???

   05)
   _______________________

   ఇల్లు, పబ్బు, క్లబ్బు, - నే సందు, నే యూర
   జూచి తీవు ? జాడ - జూప గలవె ?
   తెలుగు తమిళ సింధు - దేశములను నేడ
   మాంస మిష్టపడు సు - మా ద్విజుండు !
   _______________________

   తొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
   క్షత్రియులను గురించిన మొదటి పూరణ, కళింగ వైశ్యులను గురించిన రెండవ పూరణ, మీమాంసముపై మూడవ పూరణ, ఏది, యెక్కడ అంటూ ప్రశ్నించిన నాల్గవ, ఐదవ పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మూడవ పూరణలో కర్మజ్ఞాన, బ్రహ్మజ్ఞానము లన్నపుడు ర్మ, హ్మ గురువులై గణదోషం. 'మీమాంసను+ఇష్టపడు = మీమాంస మిష్టపడు' అవుతుంది. యడాగమం రాదు.

   తొలగించండి
  6. మీమాంస ఆ కారాంత స్త్రీ లింగము. తత్సమమున “మీమాంస” యే కాని మీమాంసము కాదు.
   మీమాంసమిపుడు సాధువు కాదు.

   తొలగించండి
 9. కట్టు బాట్ల వెనుక పెట్టె నీమములెన్నొ
  బాప డైన గాని ప్రాణి గాదె ?
  కోరి తినగ నతడు పోరుబెట్టెద రంత
  మాంస మిష్ట పడుసుమా ద్విజుండు

  రిప్లయితొలగించండి
 10. బ్రహ్మ మిట్లు పలికె భావికాలంబున
  క్షితిని జీవనంపు గతులు దప్పు
  శూద్రజనుడు గొప్ప శ్రోత్రియుండై వెల్గు
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

  మద్య పాను డొకడు మత్తెక్కి జనులతో
  పలుకుచుండె నిట్లు వదరుబోతు
  మాన్యులార! వినుడు మాగ్రామ మందున
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

  పాఠ్య బోధనంబు బాగైన రీతిలో
  చేసినట్టి గురుడు శిష్యు నొకని
  నడుగు ప్రశ్న కాత డాడె కాతరుడౌచు
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 11. సంధ్య వార్చ బోడు సన్నుతుల్ గొను రీతి
  వేద పఠన మైన లేదొకింత
  గోత్ర మెరుగడయ్యె కువలయంబున నింక
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ నాలుగు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. కోరిసంతనుండి గోంగూరనే దెచ్చి
  భార్యకిచ్చె నతడు వండ మనుచు
  రోట నూరి జేసె రుచిగ పచ్చడి రాతి
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు

  వింతయేమి కలదు వేటాడు మృగయుడు
  మాంస మిష్టపడు సుమా, ద్విజుండు
  ముద్దపప్పు చారు మురుకులు భక్ష్యాలు
  ఘృతమె యున్న యతని బ్రతుకు గడుచు.

  రిప్లయితొలగించండి
 13. సకల శాస్త్రములను చదివిన వాడయ్యె
  శాస్త్రిగారి సుతుడు చక్కగాను
  కోరునాతడెపుడు గోష్టులు వేదమీ
  మాంస మిష్టపడుసుమా ద్విజుండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉన్నవి. బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో 'ఘృతమె యున్న నతని...' అనండి.

   తొలగించండి
 14. ప్రాణి హింస జేయు పాత కు డ గు వాడు
  మా oసమి ష్ ట ప డు ను సు మా :ద్వి జుoడు
  శా క పాక ము ల ను చ వు లూ ర భుజియిoచి
  సాత్వికు డన oగజ గ తి మించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. కట్టుబాట్లు వీడి కలికిని బొందగన్
  మ్రుచ్చలించినట్టి మూటతోడ
  మగువగూడి యచట మద్యమ్ము సేవించె
  మద్యమిష్టపడుసుమా ద్విజుండు.

  రిప్లయితొలగించండి
 16. శాస్త్ర మెరుగు వారు శాస్త్రులేయందఱున్
  తత్వ మందు నిలిచి సాగు వారు
  సత్య శోధనమున సరియగు తర్క మీ
  మాంస మిష్ట పడుసుమా ద్విజుండు
  కొరుప్రోలురాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 17. కర్మ యోగ మన్న కడలిన్ నీదురు
  పుర హితము గద కలి పుణ్య ఫలము
  ధర్మ న్యాయ ఛంద తర్కము నిలమీ
  మాoస మిష్టపడు సుమా ద్విజుoడు
  నమస్సుల తో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి, మూడవ పాదాలలో గణదోషం. 'న్యాయ+ఛంద' మన్నపుడు తుగాగమ సంధి వల్ల 'న్యాయచ్ఛంద' మవుతుంది.

   తొలగించండి


 18. సంధ్య వేళ లందు సహృదయత గనుచు
  సర్వ జనుల హితము శాంతి గోరి,
  హృదయ మాదిలక్ష్మి గృహమను చును యగ్ర
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు

  సర్వేజనాః సుఖినోభవంతు
  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. గురువు గారు నమస్కారము. మీరు యిచ్చిన సమశ్య వృత్తములోకి నేను మార్చి పూరణము చేశాను సలహా ఈయండి తపులున్న సూచించండి .

  మాంసంబెప్పుడు గోరుచుండు నిలలో మాన్యుల్, సు సాత్విక్కులున్

  ఘాసం బెప్పుడు గోరుచుండు గద ఖేంఖాణంబు సౌఖ్యంబుగన్,
  కీశం బెప్పుడు గోరుచుండు నిలలో కేళంబు, శార్దూలమున్
  మాంసంబెప్పుడు గోరుచుండు నిలలో, మాన్యుల్ సుసాత్విక్కులున్
  దోషం బేమియు లేని శాక ,ఫలముల్ తోషమ్ముతో తిందు రే

  రిప్లయితొలగించండి
 20. ……………………………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  విప్ర లక్షణములు వెదకిన కనరావు |

  నేతిబీరకాయ నిగమశర్మ |

  పరమ దుర్గుణావకరుడు , స్త్రీ రతుడును ,

  మా౦స మిష్టపడు సుమా ద్విజు౦డు ! !

  రిప్లయితొలగించండి
 21. మొదటి పాదము మరియు మూడవ పాదము ఈ దిగువ
  తెలిపిన విధంగా పూరణ చేర్చబడింది.
  కర్మ యోగ కళలు కలిమిని దెచ్చును
  పుర హితము గదకలి పుణ్య ఫలము
  ధర్మ న్యాయ గాఢ తపములు నిలమీ
  మాoస మిష్టపడు సుమా ద్విజుoడు..

  రిప్లయితొలగించండి
 22. నిత్య హోమ కృత వినీతుండు ధర్మాచ
  రణ రతోత్తమ వితరణుఁ డధర్వ
  ణప్రవరుఁడు సుర గణ నిషేవణప్రథ
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు

  [వినీతుఁడు = జితేంద్రియుఁడు ; ప్రథమ+అంసము = ప్రథమాంసము; అంసము = వంతు]

  రిప్లయితొలగించండి

 23. పిన్నక నాగేశ్వరరావు.

  పుక్కిట న్నిలుపగ పెక్కు పురాణాలు

  వేద శాస్త్రములను విధిగ చదివి

  జ్ఞాన వృద్ధికనుచు చర్చలు తర్క‌ మీ

  మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

  రిప్లయితొలగించండి
 24. ధ్వంసరచనవలదుధరణికిచేటను
  హింసకూడదనుచుహితవుబల్కు
  ప్రాణిప్రాణిలోనపరమాత్మనుగను యే
  మాంసమిష్టపడుసుమాద్విజుండు?

  రిప్లయితొలగించండి 25. వనమునందు దిరుగు వ్యాధుండు సతతము

  మాంస మిష్టపడు సుమా !ద్విజుండు.

  నిష్టపడుచు నుండు నిలశాకములతోడ

  వండినట్టి సకల వంటకముల.


  కాననమ్ము నందు కంఠీరవాదులు

  మాంస మిష్టపడు సుమా ద్విజుండు.

  నాలయమ్ములందు నర్చనలొనరించి

  గడుపు చుండు బ్రతుకు ఘనము గాను.


    వసుధయందు జూడ పాతకాలపు రాతి

   మాంసమిష్టపడు సుమా ద్విజుండు

   దాని రుచిని దెల్ప తరమా యటంచును

  సతము దెల్పుచుండు సకలురకును.


  వసుధ యందు నేది వ్యాధునకిష్టంబు?.

  శాకపాకములను చక్కగాను.

  నెల్లపుడును నెవరు  నింపార భుజియించు

  మాంసమిష్టపడు సుమా ద్విజుండు.

  రిప్లయితొలగించండి 26. మాంస మిష్టపడు సుమా ద్విజుండు
  కాని కట్టు బాట్ల కట్ట డింక
  సాగు చుండె దినెడి శాకంబు పైనను
  సంఘ జీవుల కివె సంకటములు

  రిప్లయితొలగించండి
 27. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గ్రంథముల ననిశము కైపుగ జదువుచు
  విషయము లొరకొనుచు విదుల తోడ
  వాసి గూర్చి నెగడు పరిశుద్థ శాస్త్ర మీ
  మాంస మిష్టపడు సుమా! ద్విజుండు

  రిప్లయితొలగించండి
 28. పాలు,నీరువేరు బరచు హంసవలె|మీ
  మాంసమిష్టపడు సుమాద్విజుండు
  కంది శంకరయ్య కళలసమస్యలు
  కవుల పూరణలన?కాంక్ష లట్లు|
  2.నేతి బీర యందు నేతిని వడ్డించి
  తి.కలకండనుంచి తినమనంగ?
  స్పూర్తి గలిగినొకడు”పోకిరి”చిన్ని మీ
  మాంసమిష్టపడు|సుమాద్విజుండు {మరదలహాస్యము}


  రిప్లయితొలగించండి
 29. తల్లి దండ్రి కుడువ తనయుడును సతము
  మాంస మిష్ట పడు సుమా! ద్విజుండు
  పరవశమున దినును పప్పు దప్పళముల,
  పంచ భక్ష్యములను, పాయసముల!

  గురువర్యులుకు నమస్సులు. నిన్నటి, మొన్నటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదములు.
  కనగా నాటి సుబాహు చావుకు ప్రతీకారాగ్ని వేధింపులన్
  వినగన్ సోదరి పొందు వేదనల నావేశమ్ముగా దూలుచున్
  కనులన్ గానని యాగ్రహమ్ము రగులంగా రావణుండంత రా
  ముని పత్నిన్ గొని పోయి చచ్చెను గదా మోహాంధుడై యాజిలో!

  శుభము లిచ్చును సిరులతో శోభ గూర్చు
  క్రమము దప్పక పూజింప శ్రావణమున
  వాసితోడ శుక్లపు శుక్ర వారమందు
  రంగులలరు నిందిరను వరముల గోరి!

  రిప్లయితొలగించండి
 30. పులుసు పప్పు కూర పులిహోర బూరెలు
  కమ్మనైననేయి గడ్డపెరుగు
  నయము గాను నున్న నంచుకొనగ ఱాతి
  మాంసమిష్ట పడు సుమా ద్విజుండు!!!


  సకల శాస్త్రములను చదివిన భువిలోన
  కర్మ జ్ఞాన సిద్ధి గలుగ జేయు
  వేద ధర్మములను విపులీకరించు మీ
  మాంసమిష్ట పడుసుమా ద్విజుండు!!!

  రిప్లయితొలగించండి
 31. యజ్ఞసమయమందు నంచితముగఁ బ్రీతి
  నమరులకిడినట్టి యారగింపు
  గాతలంచి కరము కాంక్ష నైవేద్యపు
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు

  రిప్లయితొలగించండి
 32. ఆ౦క్ష బెట్టిరి కద అర్చన జేసెడి
  ద్విజులు పలలములను తినగరాద
  టంచు,కోర్కె యినుమడించగనే,నేడు
  మాంస మిష్ట పడు సుమా ద్విజుండు

  రిప్లయితొలగించండి
 33. మాంసమిష్టపడుసుమాద్విజుండనుటను
  నొప్పుకోలుకాదు పప్పు శర్మ!
  కొంతమందియుండ్రు కుజనులుపుడమిని
  నిష్టమగునునేమొమాంసమకట

  రిప్లయితొలగించండి
 34. వినుత శీలి వేద వేద్యుండు విప్రుండు
  అనవరతము చర్చ నభిలషించు
  తర్కశాస్త్ర గతుల తనరారు నట్టి మీ
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 35. మాటఁ దప్పనంచు మౌనిని సేవించి
  తన సతీ సుతులను తానె వీడె
  లేశమెంచకనె హరిశ్చంద్రుఁడోర్చి !మీ
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు !!

  రిప్లయితొలగించండి
 36. కవిమిత్రులు మన్నించాలి..
  ఈరోజు బంధువుల ఇంట ఒక కార్యక్రమానికి వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. అలసట, తలనొప్పితో ప్రస్తుతం మీ పూరణలను సమీక్షించలేను. వీలైతే రేపు ఉదయం చూస్తాను.

  రిప్లయితొలగించండి
 37. గురుదేవా
  మీరు చేస్తున్న సాహితీ సేవ అనన్య సామాన్యము.నా లాoటి వారికి నొక ఆశా జ్యోతి.

  రిప్లయితొలగించండి
 38. మాటఁ దప్పనంచు మౌనిని సేవించి
  తన సతీ సుతులను తానె వీడె
  లేశమెంచకనె హరిశ్చంద్రుఁడోర్చి !మీ
  మాంస మిష్టపడు సుమా ద్విజుండు !!

  రిప్లయితొలగించండి