15, ఆగస్టు 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 46 (స్వ-తం-త్ర-ము)


అంశము- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఛందస్సు- తేటగీతి
స్యస్తాక్షరములు...
మొదటి పాదం మొదటి గణం మొదటి అక్షరం 'స్వ'
రెండవ పాదం రెండవ గణం మొదటి అక్షరం 'తం'
మూడవ పాదం మూడవ గణం మొదటి అక్షరం 'త్ర'
నాల్గవ పాదం నాల్గవ గణం మొదటి అక్షరం 'ము'

74 కామెంట్‌లు:

  1. స్వర్ణ భారత దేశాన సకల రాష్ట్ర
    ప్రజలు తండోప తండాలు గజమ కూడి
    జరుపు కొనెడుస్వా తంత్ర్యపు సంబరాలు
    మొగిలుత్రోవను తాకెను ముదము తోడ

    రిప్లయితొలగించండి
  2. స్వర్ణ యుగమని స్వాతంత్ర్య సంత సమున
    వీణ తంత్రులు మీటిన వేడు కనుచు
    దొరల పాలన త్రచ్చన దురిత ములను
    మొదలు నరుకగ కూలెను మురియు దనుక

    రిప్లయితొలగించండి

  3. జై భారత్ !

    స్వరమిది జిలేబి సుమధుర సమరస జయ
    గాత్రి తంత్రుల మీటుచు కవన మధురి
    మలను జేర్చుచు త్రచ్చుచు మహతి మోద
    ము గను భారత మాతకు ముద్దుగుమ్మ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. స్వర్గసీమనుబోలెడి స్వర్ణభూమి
    పరులతంత్రముబాపినభాగ్యభూమి
    వేదములు విచిత్రముగాను వెలుగుభూమి
    మూడురంగుల కేతన ముగ్ధభూమి.

    రిప్లయితొలగించండి
  5. *స్వ*యముగా గాంధి సమరము సాగ నిలచె.
    మనకు *తం*డ్రిగ శాంతి సమాన్యుడయ్యె.
    ఔర!కడు విచి*త్ర*మునగు నట్టి చర్య.
    మోక్షదాయక!వందన *ము*లనుఁగొనుము

    రిప్లయితొలగించండి
  6. స్వంత మైనట్టి రాజ్యాన సౌరులొలుకు
    స్వీయ తంత్రంబు చేపట్టి జేయటంచు
    శక్తి నీజగత్త్రయమున చాటు ధ్వజము
    మూడు వన్నెల తోనిండి మురియు చుండె.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  7. స్వ ర ము ల బెంచి ని న దించు భ ర త జాతి
    వీణ తంత్రు లసవ్వడు ల్ వె ల్లివి రి య
    గాంధి యొక్క తంత్ర oబుల ఘనత పొ గ డి
    మురియు దేశా న ప్రజలంతముద ము తోడ

    రిప్లయితొలగించండి
  8. స్వకపు రాజ్య సాధనకు నిస్వార్థముగను
    పరుల తంత్రము చాలించు భాగ్యమునకు
    కదలె పారతంత్ర విముక్త కాంక్ష తోడ
    మురిసె భారతావని నేడు ముదముతోడ

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులందరకు 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

    స్వపరిపాలన గోరుచు భరతజాతి
    రాగ తంత్రీస్వరాలౌచు రమ్యగీతు
    లాలపించి పాత్రతతోడ కాలమందు
    మోదమలరగ స్వాతంత్ర్యమును బడసిరి!

    రిప్లయితొలగించండి
  10. స్వనములు చేయు చుండెను సైన్య క్రోవి,
    శోభి తంబుగను నడచు చుండె దేశ
    రక్షక భట త్రయoబులు , రమ్య గతిన
    మూడు వన్నెల కదళి సముద్గ మించె

    రిప్లయితొలగించండి
  11. స్వచ్ఛ భారత దేశమై సంత రి oప
    జేయు తంత్ర ము నెల్ల రూ చిత్త మ ల ర
    స్వాగతి oచిస్వతంత్ర పుపర్వ మందు
    మో ది యాశ య సిద్దియే ము ద ము నొ స గు

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    స్వపరిపాలనమ్మును బొందు స్వచ్ఛమైన
    భావ తంత్రంబు తోడుత పవరు లంత
    పోరి మన స్వతంత్రతకెల్ల బూని నారు
    మురిపెముగ వారినిట నెంచ ముదము నిచ్చు

    రిప్లయితొలగించండి
  13. స్వజన జన గణ పాలిత పర జన నిచ
    య పరతంత్ర నిర్మూల నాయత దృఢాంత
    రంగ భరిత యంత్రణ సత్కృ తాంగ తుష్ట
    చిత్తుల మయి జరపు కొంద ముత్తమముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడు పాదాల సుదీర్ఘసమాసంతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. అద్భుతమైన రచన! పద్యపు నడక "బాల కనకమయ చేల" కృతిని గుర్తుతెచ్చింది!🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    4. డా. సీతా దేవి గారు ధన్యవాదములు నమస్సులు. మహానుభావులు త్యాగరాజు వారి కీర్తనను దలపింప చేయడము నా యదృష్టమే.

      తొలగించండి
    5. మీ సౌకర్యార్థము నా పద్య భావమును తెలియ జేస్తున్నాను. యీ భావ ప్రకటనలో సఫలుఁడ నైనది లేనిది మీకే తెలియాలి.

      స్వజనములైన జనసమూహము (మంత్రి మండలి) చే పాలితమై, శత్రుజన సమూహాధీనత నిర్మూలనము విశాల దృఢ మనస్సులో నిండి రక్షణము చేయు నుపాయముల వలని తృప్త చిత్తములతో నుత్తమముగా (ఉత్సవము) జరపు కొందము.

      తొలగించండి
    6. పూజ్యులు కామేశ్వరరావు గారికి సమస్సులు!
      అడగకుండానే పద్యభావాన్ని వివరించినందులకు ధన్యవాదములు!
      పద్యమునలె మీ గద్యముకూడ యేకధారగా సాగింది! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  14. స్వయపు పరిపాలనమ్మును సలుప నభిమ
    తము సతంబు వేదించగ తలపులందు
    వైరిమూకల త్రచ్చి బవరమునందు
    పుణ్యధాత్రినిఁ గని ప్రజ ముదముగొనిరి

    రిప్లయితొలగించండి
  15. “స్వరబరచ గాంధి నుడి వివాదరహిత
    శాంతి తంత్రము”| దొరలకశాంతి నింప?
    వెడలిరట విచిత్రముగాద|విశ్వమందు
    ముక్త భారత స్వాతంత్ర్య ముడుపుమనకు
    గలుగ?సంతోష మంతట కలలపంట|

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులకు మరియు కవిమిత్రులందరకి 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  17. స్వచ్ఛ భారత కిదియున్ సహిత ధాత్రి
    ధర్మ తoత్రము నెరిగిన ధన్య భూమి
    స్వపరిణితితoత్రమునకున్ వయసు యేడు
    దశములన్ నిoడె, దేశమున్ ముదిమి నొoదు.
    వoదనములతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముదము నొందు' అనండి. 'ముదిమి' అంటే ముసలితనం.

      తొలగించండి
  18. స్వర్ణ మయముగ జేయంగ సాహసించి
    యరుల తంత్రాలు పసిగట్టి యడ్డువైచి
    వాహబహువిచి త్ర ముగను వరములిచ్చి
    మోడి వర్యులు బ్రజలకు ముదము గూర్చె

    రిప్లయితొలగించండి
  19. స్వ-పర భేదము లెంచక భరతజాతి
    పారత౦త్రము బాపగ పాటు పడగ
    ఘనముగా స్వతంత్రము నేడు తనరె నింక
    మూడురంగుల ధ్వజ మదే ముదల నెగిరె

    రిప్లయితొలగించండి
  20. గురువు గారు నేను చేసిన పూరణ లో 4 వ పాదము మొదటిఅక్షరము ద. యతి లో త, థ, ద, ధ ,న కూ డా రావచ్చని నా మనవి.కావున పద్య పూరణ మరల చేయడమైనది.
    స్వచ్ఛ భారత కిదియున్ స్వర్ణ భూమి
    ధర్మ తoత్రము నెరిగిన ధన్య భూమి
    స్వపరిణితతoత్రమునకున్ స్పర్థ జనులు
    మువ్వె న్నలజెండ దేశమున్ ముదము నొoదు.
    పరిశీలిoప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  21. మొదటి పూరణ 4 వ పాదము మొదటి పదము దశము ల్ యతి నoదు ముదము వ్రాసినాను.తప్పని నా భావన.
    క్రొత్త పురణ సవరిoప మనవి.

    రిప్లయితొలగించండి
  22. స్వర్గధామము బోలెడు సదనమిదియె
    సర్వతంత్రయై బరగెడు జాతిగనరె
    కుటిల మెంతమాత్రములేని కూటమిగను
    ముందడుగిడును ఘనముగా ముదమునిడగ!

    రిప్లయితొలగించండి
  23. స్వచ్ఛ మనముతో నెదిరించ సకల జనులు
    కు పరతంత్ర పాలన కూలె కోరి నటుల
    వారిదౌ స్వతంత్రము దక్కె వారికిపుడు
    మూడు రంగుల ధ్వజమెగ్రె ముచ్చటగను.

    రిప్లయితొలగించండి
  24. గురుదేవులకు, కవిమిత్రులందరకూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

    స్వర్గధామము జేయఁగ సైన్యమగుచు
    నా స్వతంత్ర యోధులుఁ జింద నమరమగుచు
    స్వేచ్ఛను గణతంత్ర ములిడి వేడి రక్త
    ములవె జెండాకు మువ్వన్నె ముదముఁ బులిమె!


    రిప్లయితొలగించండి
  25. స్వప్నము గనిరి పూర్వజుల్ స్వంత గడ్డ
    కై, కుతంత్రముల్ కులములు కల్మషములు
    వీడి, యేక సూత్రముగను “విడచి పోవు
    మో దొరా” యంచు పోరాటము సలిపిరట

    రిప్లయితొలగించండి
  26. స్వర్గసీమనుబోలెడి స్వర్ణభూమి
    పరులతంత్రముబాపినభాగ్యభూమి
    వేదములు విచిత్రముగాను వెలుగుభూమి
    మూడురంగుల కేతన ముగ్ధభూమి.

    రిప్లయితొలగించండి
  27. కవిమిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ..

    స్వపరిపాలనసంతోషజనకమయ్యె,
    పలుకుతంత్రాలుగతకాలభాగమయ్యె,
    ప్రజలశాంతిమంత్రమ్ముసౌభాగ్యమయ్యె,
    ముద్దులొలుకుపతాకమే ముదముగొలిపె..

    రిప్లయితొలగించండి
  28. కవి మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
    స్వయముగా పరిపాలన సాగ దీయ
    పార తంత్ర్యపు గొలుసుల పగుల గొట్టి
    యింపుగా స్వతంత్రత నంది రిచటి జనులు!
    ముదమగును స్వతంత్ర దినపు ముచ్చట లన!
    గురువర్యులుకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.
    సుంతయు నాలోచించక
    ముంతల కొలదిగ మధువును ముదముగ గ్రోలన్
    వింత గొలుపగ గురువనియె
    కుంతీ పుత్రుడు వినాయకుడు గద శిష్యా!

    రిప్లయితొలగించండి
  29. స్వజన జాతీయ గీతంపు స్వరలహరుల
    భారతంబున వేడుకల్ పరిఢవిల్ల
    పంచశీల సూత్రమ్ముల భవితఁ గూర్చి
    ముందు కేగ ప్రతిన బూనె ముదమునంది

    రిప్లయితొలగించండి
  30. *స్వ,పర,పాలన భేదపు సారమెరిగి*
    *పారతంత్ర్యము పోరుతో పారద్రోలి*
    *దేశభక్తి మంత్రమునుమదిని నిలుపుచు*
    *ముగ్దులైరి జనగణము ముదము విరిసి*

    రిప్లయితొలగించండి

  31. పిన్నక నాగేశ్వరరావు.

    "స్వ"పరిపాలనే లక్ష్యమై భరత జాతి

    పార"తం"త్ర్యము నిటనుండి పార ద్రోలి

    తెల్లవారి తం"త్ర"ములను త్రిప్పి కొట్టి

    తుదకు పొంది స్వరాజ్యము "ము"దము
    నందె.

    రిప్లయితొలగించండి
  32. స్వజనులహితము కాంక్షించి సతము వారి

    పార తంత్ర్యము నిలలోన బాప దలచి

    తాను పోరాడి త్రపనందె ధరణి యందు

    భారతీయులు ముందుగాను ముదము నంద.

    త్రప=కీర్తి

    స్వంతపాలనమును గోరి వసుధయందు

    పారతంత్ర్యము నటద్రోలి భారతీయ

    ప్రజల కిలస్వతంత్రమ్నుము వాంఛతోడ

    పోరు నుసలుపుచును జయముకలిగించె


    స్వర్ణ ధీధతులు వెలిగె భారతాన

    పారతంత్ర్యము తొలగెను వాసిగాను

    శాంతి సహనంపు త్రమ్మటగని సత్వరమున

    భువిని స్వతంత్ర మొసగిరి ముదము తోడ

    రిప్లయితొలగించండి
  33. స్వరములును గూర్చి పాడెద స్వయము గాను
    వీణ తంతిని మీటుచు విమల చరిత
    గాంధి నెహ్రు పాత్రల మెప్పుగాను పొగడి
    మూడు రంగుల జండాల ముదురు జోడ్చి

    రిప్లయితొలగించండి