గురువు గారికి నమస్సులు. వ్యాహారమిచ్చునొజ్జకు సూహారాచ్ఛాదితమే సుమధుర కవికిన్ Sr yaa హ్వా శ్రీలనగకుకవి ద్రోహులశిక్షిoచుట g h a n a దోషము గాదే? మొదటి పర భాష పదము పద్మశ్రీ భావము టైపు చేయుట కొన్ని గుణిoతాలు రావడo లేదు. సాఫ్ట్ వేర్ నo దు కొన్ని పదాలు చేర్చలేదు. మన్నిoచoడి.
కవిమిత్రులారా, నమస్కృతులు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని ఇంతకు ముందే నెలవు చేరాను. ప్రయాణపు బడలిక వల్ల మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి. రేపు ఉదయం వీలైతే సమీక్షిస్తాను.
సాహసమగునెవ్విధి వి
రిప్లయితొలగించుద్రోహుల శిక్షించుట; ఘన దోషముఁగాదే
స్నేహము చేసెడు వారల,
గేహములో నున్నవారికిన్ పగఁజూపన్
ప్రసాద రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించుఆహుతియై పోలీసుల
రిప్లయితొలగించుదాహమునకు దాడులకును దారుణములకున్,
సాహసము లేని కల్లల
"ద్రోహుల" శిక్షించుట ఘనదోషము గాదే!
"12 years later, 10 acquitted in Hyd suicide bombing case"
...Times of India Headline August 11, 2017
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మోహము లేకయె ధర్మము
రిప్లయితొలగించుద్రోహుల శిక్షించుట; ఘనదోషము గాదే
త్రాహియని శరణు గోరగ
సాహసవంతుడు తడబడి సంకోచింపన్
సీతాదేవి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ధర్మపు ద్రోహుల" అనండి.
మోహము లేకయె విధియగు
తొలగించుద్రోహుల శిక్షించుట; ఘనదోషము గాదే
త్రాహియని శరణు గోరగ
సాహసవంతుడు తడబడి సంకోచింపన్
పై పద్యము విభీషణ శరణాగతి సందర్భమున శ్రీరామ ఉవాచ!
తొలగించు
రిప్లయితొలగించుమోహాంధకారుల, జిలే
బీ, హానిని జేయు జనుల, భీకరులగుచున్
సౌహార్దృత విడు మనుజుల్,
ద్రోహుల, శిక్షించుట ఘనదోషము గాదే.
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సౌహార్ద్రత విడు సంఘపు ద్రోహుల..." అంటే బాగుంటుందేమో?
ఆహా యేమది చిత్రము
రిప్లయితొలగించుద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే
ఈహా మృగముల చందము
సౌహార్ధము లోన ముంచి సముచిత మనుచున్ .
అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ద్రోహులు రాజ్యంబేలుచు
రిప్లయితొలగించుద్రోహులె న్యాయంబు జెప్పు దుష్పాలనలో
సాహసులు దేశ భక్తులు
ద్రోహుల శిక్షించుట ఘన దోషము కాదే
విజయ కుమార్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఓహో యని మెచ్చవలయు
రిప్లయితొలగించుధ్రో హు ల శి క్షిoచుట ;ఘ న దోష ము గా దే
స్నేహి తు ల ను వంచి oచుచు
ద్రోహ ము త ల పెట్టి మ ను ట దుర్వ్య శ న oబై
రాజేశ్వరరావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"దుర్వ్యసనుండై" అనండి.
ఆహుతి జేసి ప్రజలఁ దా
రిప్లయితొలగించుబాహాటమ్ముగ దొరికిన పాపిని యురికై
ద్రోహియన నేల నాన్చుడు?
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే!!
సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పాపిని నురికై" అనండి.
ఆహుతి జేసి ప్రజలఁ దా
తొలగించుబాహాటమ్ముగ దొరికిన పాపిని నురికై
ద్రోహియన నేల నాన్చుడు?
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే!!
ఆహుతి జేసి ప్రజలఁ దా
తొలగించుబాహాటమ్ముగ దొరికిన పాపిని నురికై
ద్రోహియన నేల నాన్చుడు?
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే!!
తాహతును మించి ఖర్చుల
రిప్లయితొలగించుకై హిత వచనముల మరచి కాసుల కొరకై
స్నేహితులను వంచించెడు
ద్రోహుల శిక్షించుట ఘన దోషము గాదే.
తాహతును మించి ఖర్చుల
రిప్లయితొలగించుకై హిత వచనముల మరచి కాసుల కొరకై
స్నేహితులను వంచించెడు
ద్రోహుల శిక్షించుట ఘన దోషము గాదే.
తాహతు గల చట్టము విధి
రిప్లయితొలగించుద్రోహుల శిక్షించుట,ఘన ద్రోహము గాదే
సాహసమును జూపుచు ను
త్సాహము పోరాడువారి దండించంగన్
తాహతు గల చట్టము విధి
రిప్లయితొలగించుద్రోహుల శిక్షించుట,ఘన ద్రోహము గాదే
సాహసమును జూపుచు ను
త్సాహము పోరాడువారి దండించంగన్
ద్రోహులు భువి శిక్షార్హులు
రిప్లయితొలగించుద్రోహుల శిక్షించుట ఘన దోషము గాదే
బాహాటముగా జెప్పుదు
దోషుల శిక్షించుట దియ తోరము మేలే
యీ హల పతిహక్కు గదా
రిప్లయితొలగించుద్రోహుల శిక్షించుట, ఘనదోషము గాదే
యా హేమపతి పొగరుతో
ద్రోహిని కాచి సుజనులను ద్రోహులనంగన్
రిప్లయితొలగించుపిన్నక నాగేశ్వరరావు.
స్వాహా చేయుచు నిధులను
బాహాటముగ పలు నీతి వాక్యమ్ములతో
నాహా!యనిపించెడు వి
ద్రోహుల శిక్షించుట ఘన దోషము గాదే?
ద్రోహమె సత్కార్యం బను
రిప్లయితొలగించుద్రోహాత్ముల మతమునందు ద్రోహం బనినన్
దేహి కలంకారం బిక
ద్రోహుల శిక్షించుట ఘన దోషము గాదే.
హ.వేం.స.న.మూర్తి.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించువ్యాహారమిచ్చునొజ్జకు
సూహారాచ్ఛాదితమే సుమధుర కవికిన్
Sr yaa హ్వా శ్రీలనగకుకవి
ద్రోహులశిక్షిoచుట g h a n a దోషము గాదే?
మొదటి పర భాష పదము పద్మశ్రీ భావము
టైపు చేయుట కొన్ని గుణిoతాలు రావడo లేదు. సాఫ్ట్ వేర్ నo దు కొన్ని పదాలు చేర్చలేదు.
మన్నిoచoడి.
పద్మశ్రీ లనగ కుకవి భావము.
రిప్లయితొలగించుమోహాంధతతో బాలల
రిప్లయితొలగించుబాహాటంబుగ చెరచుచు బలగర్వితులై
దేహాంతులుగా చేసెడి
ద్రోహుల శిక్షించుట ఘన దోషముగాదే!
మోహాంధతతో బాలల
రిప్లయితొలగించుబాహాటంబుగ చెరచుచు బలగర్వితులై
దేహాంతులుగా చేసెడి
ద్రోహుల శిక్షించుట ఘన దోషముగాదే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించువిభీషణుని ఉద్దేశించి రావణుడు
తొలగించుఓహో!సోదరుని విడచి
సాహసమున యరినిజేరె సంకుచితమతిన్
న్నీహీనున్వెలి వేయుడు
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే!!
ఆ హాలిక కష్టార్జిత
రిప్లయితొలగించుదేహ విదారక ఫలమ్ము ధృతిఁగొను వ్యాపా
రాహారాపహరణు లీ
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే
[కాదే = ఏమాత్రము కాదు]
.దేహులు వాడే నీటిని,
రిప్లయితొలగించుఆహారముకల్తి జేయు యాశాపరులన్
మోహపు మోసపు పరులున్
ద్రోహులశిక్షించుట ఘన దోషము గాదే?
2.బాహాటంబున కల్తీ
ఆహిష మాశించువారు,నత్యాసలతో
తాహతుకై దొంగలను
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే| {ప్రస్తుతముజరుగుచున్నపనులు}ఆహిషం=లంచం
…………………………………………………
రిప్లయితొలగించుగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,
మధ్యాక్కర
ద్రోహుల శిక్షి౦చుట ఘన
దోషము గా దేమియు | ధన
దాహముతో మన ప్రగతి
దైన్యస్థితిని జేర్చు నాయ
కాహితుల వెదకి వెదకి
కాల్చ వలయు గాని , నాయ
మా హి౦స వెట్టుట స్వల్ప
మైన నేరస్తుల బట్టి ?
( నాయకాహితులు = నాయక + అహితులు )
మోహము లేకయు దుర్గుణ
రిప్లయితొలగించురాహిత్యము గలిగి దుష్ట రాక్షస జనుల
స్నేహము వీడెడి మిత్ర
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే
బాహాట ము గా లంచ ము
రిప్లయితొలగించులాహా ర ము గామింగున సు రా ళిని సo
దేహిoచక సంఘ పువి
ద్రోహు ల శిక్షించుట ఘన దోష ము గాదే
సాహస కార్యమె దొరకని
రిప్లయితొలగించుద్రోహుల శిక్షించుట; ఘనదోషము గాదే
స్నేహితులన్ ప్రాణసముల
నాహూతుల, సాధుజనుల నంతము జేయన్?
స్నేహము నటియించుచు దు
రిప్లయితొలగించుర్వ్యూహము రచియించు గూఢ పురుషుడు పేర
మ్మైహానిని తలపెట్టిన
ద్రోహుల శిక్షి౦చుట ఘనదోషము గాదే
కవిమిత్రులారా,
రిప్లయితొలగించునమస్కృతులు.
ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని ఇంతకు ముందే నెలవు చేరాను. ప్రయాణపు బడలిక వల్ల మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి. రేపు ఉదయం వీలైతే సమీక్షిస్తాను.
రిప్లయితొలగించుమోహము తోడను పడతుల
నాహా యనిపించుచెల్ల నపహరణంబున్
స్నేహము పేరిట చేయు వి
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే ?
వ్యూహము పన్నగ కొందరు
రిప్లయితొలగించునాహవరంగమునపోరు సల్పక వారల్
మోహపరవశులయిన యా
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే ?