29, ఆగస్టు 2017, మంగళవారం

సమస్య - 2450 (గాజులు గల్లనగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్"
లేదా...
"గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై"

79 కామెంట్‌లు:

 1. రాజులు రణరంగములో
  రోజుల వారిగ బలియగు రోదనములలో
  నాజూకౌ మహరాణుల
  గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మహా' అన్నపదాన్ని 'మహ' అనరాదు. అక్కడ "నాజూకు మహారాణుల" అనండి.

   తొలగించండి
  2. 🙏🙏🙏

   ఆంధ్ర భారతి: ప్రాసావేదన:

   మొదటి రెండు పాదములు ఇబ్బంది లేకుండెను ("రాజు", "రోజు"). మూడవ పాదములో "నాజూకు" సందేహముగనుండెను. ఆంధ్రభారతిలో ఆ పదం దొరకగనే హమ్మయ్య అని సంతోషించితిని. "మహరాణి"ని అడిగితే కొట్టినంత పని చేసినది. "మహరాజు" మాత్రం బ్రహ్మాండముగ దొరికినది. సరిసరి అని స్త్రీలకు అన్యాయం జరుగ కూడదని ఎంచి వాడితిని. అదీ సంగతి.

   తొలగించండి


  3. ప్రాసా వేదన లన్ "సా"
   స్త్రీ సాధించితిరి గాద తీరుగ మీరున్
   హా! సరిపోయె సమానత
   ఓ సారూ మీకు, మాకు ఒద్దిగ గానౌ :)

   జిలే‌బి

   తొలగించండి
  4. 👌👌👌

   ఈ పప్పులో కాలు వేయడం కొత్త గాదు. చిన్నప్పుడు (1952 లో) మా నాన్నగారు రెండు వేద మంత్రాలు కంచు కంఠంతో చదివేవారు. ఎవరినో అడిగితే ఒకటి "పురుష సూక్తం" అని చెప్పిరి. రెండవది "స్త్రీ సూక్తం" అయి ఉంటుందని అనేసుకున్నాను...

   తొలగించండి
 2. రాజుల గుండె ఝల్లన,శరంబు కరంబున తేజరిల్ల,నే
  నాజి పరాక్రమింతు,వినుమాతని సైంధవుఁద్రుంతునంచు,వి
  భ్రాజితు,పుత్రు,నిర్భయు,శుభాంగునిఃదల్చుచు నుత్తరాంగనా
  గాజులు గల్లుగల్లనగఁగవ్వడి గాండివమెత్తెఅఁగ్రుద్ధుడై  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 3వపాదంలో విసర్గ ఎక్కువ పడింది.క్షమించండి

   తొలగించండి
  2. రాజుల గుండె ఝల్లనగ క్రమ్మిన దుఃఖదవాగ్ని రేగ,నే.
   అని మొదటి పాదం చదువ ప్రార్ధన పొరపాటుకు క్షంతవ్యుడను

   తొలగించండి
  3. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. తేజము హెచ్చిన భీష్ముని
  నాజిని గొట్టగ శిఖండి నంగనపురుషున్
  మోజుగ ముందిడుకొనుచున్
  గాజులు గల్లనగ గ్రీడి గాండివమెత్తెన్.

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  ప్రమీలార్జునీయము :

  01)
  ________________________

  రాజదె యశ్వమేధమును - రాణ నొనర్ప, కిరీటి వెంట వే
  రాజస మొప్ప నేగ హయ - రక్షకుడై, మళయాళరాణి యా
  వాజిని బట్టి కట్టి, యొడ - బాటుకు నొప్పక విర్రవీగినన్
  గాజులు గల్లుగల్లనఁగఁ - గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై !
  ________________________
  రాజు = ధర్మరాజు
  ఒడబాటు = సంధి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుభద్రా పరిణయము :

   02)
   ________________________

   మోజును వెల్లడించ జని , - మోహన కృష్ణుని యానతిన్, బలే
   భాజన మొప్ప, ద్వారకను - ఫాలుని పట్టున, పట్టునన్పరి
   వ్రాజక రూపు నన్, ప్రియ, సు - భద్రను చేకొన, పాణి నందె వే
   గాజులు గల్లుగల్లనఁగఁ !- గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై
   నాజికి సిద్ధమై తొడరు - నగ్రగులంగని భార్య మెచ్చగన్ !
   ________________________
   ఫాలుడు = బలరాముడు
   పట్టు = విడిది
   పట్టు = పట్టుదల
   చేకొను = పెండ్లాడు
   తొడరు = అనుసరించు
   అగ్రగుడు = బంట్లు

   తొలగించండి
  2. ద్రౌపదీ స్వయంవరము :

   03)
   ________________________

   "ఆ జలపుష్పమున్ చమర - నా సుత నిత్తును యంత్ర మధ్యము
   న్నే జనులైన పోటి పడి " - హేలగ బల్కగ యఙ్ఞసేనుడే
   భూజకు సాటియౌ ద్రుపద - పుత్రిక ద్రౌపది చేతికున్న నా
   గాజులు గల్లుగల్లనఁగఁ !- గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై
   తేజము తోడ గొట్టి, పలు - ద్వేషుల నడ్డగ నిశ్చయాత్ముడై !
   ________________________
   చమరు = కొట్టు
   యజ్ఞసేనుడు = ద్రుపదుడు
   భూజ = సీత

   తొలగించండి
  3. వసంత కిశోర్ గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. సీజను మొదలయి నంతనె
  తేజము తోనాడెదరు బహు ధీరత్వము నన్
  మోజున గెలుపును బొందగ
  గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "తేజముతో నాడెదరట ధీరత్వమునన్" అనండి.

   తొలగించండి

 6. కైజార నీయకు ధృతిని,
  రాజా,ఉత్తర కుమార, రథము నడుపుమా !
  జాజర లాడుచు చివ్వన
  గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 7. రాజులు వీరులెల్లరన రావడి ఉత్తరు డచ్చటన్ గనన్
  తేజము ధైర్యమున్విడచి తేకువ ముప్పిరవన్ రథంబునన్,
  హా!జమలించి,యాతనికి హావడి బోవ బృహన్నలే సుమా,
  గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి, గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. రాజులు రాజకుమారులు
  మోజుగ గోగ్రహణమందు మొహరింపంగన్
  తేజము హెచ్చగ గ్రుద్ధత
  గాజులు గల్లనగ గ్రీడీ గాండివ మెత్తెన్

  రిప్లయితొలగించండి
 9. రాజుల గుండెలు ఝల్లన
  నాజిని శం ఖ oబునూ ది య రి భీ క రు డై
  మో జుగ గాంచె డు రాణుల
  గాజులు గల్లన గ గ్రీడి గా oడివ మె త్తేన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కం. ఆజిని విజయముకొరకై
   పూజలు సలుపు తన సతులు బుద్ధిని మెదల
   న్నాజలజ నేత్ర లవియగు
   "గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్"
   ****&&&&****

   తొలగించండి
  3. క్రీడి అగ్నిదేవుడి నుండి గాండివం పొందిన తర్వాతి సందర్భాలే (ఘట్టాలే) పూరణకు ఎంచుకో వలసి ఉంటుందన నా భావన! విజ్ఞులేమంటారో ?

   తొలగించండి
  4. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. ఆజిని నుత్సాహంబున
  రాజుల గర్వo బు లుడుగ రహితో జెలగన్
  రాజుల పత్నుల హస్తపు
  గాజులు గల్లనగ గ్రీడి గాండివ మెత్తెన్

  రిప్లయితొలగించండి
 11. తేజము తోడుత నా కురు రాజ చమూసంచయములు రణమున నిలువన్ బూజుదులిపి శస్త్రములకు గాజులుగల్లనగ గ్రీడి గాండివ మెత్తెన్ Asnreddy

  రిప్లయితొలగించండి
 12. రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యోగ జ్ఞాన' మన్నపుడు 'గ' గురువై గణదోషం.

   తొలగించండి
  2. ఆజిని వీడెద నన్నన్
   నైజమిదని ధర్మములగు నడతలెరుంగన్
   రాజిత 'గీత' కరములన్
   గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్!

   తొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆజానము మారిన వడి
  గాజులు గల్లనగ గ్రీడి గాండివ మెత్తెన్
  దా జమ్మిని డాయించగ
  నోజించెను విరటు గొల్వు నొందెడి నపుడున్
  రిప్లయితొలగించండి
 14. ఆజిని శత్రు సైన్యములనందరి పీకలు గత్తిరించగా
  రాజుల భార్యలున్స మర ప్రాంగణ మందున నేడ్వ నత్తఱిన్
  గాజులు గల్లుగల్లనగ గవ్వడి గాండివ మెత్తె గృద్దుడై
  వాజిని వేగవంతముగ బర్వులు బెట్టగ జేసె నయ్యెడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇంతకూ అర్జునుడు పరుగులు పెట్టించింది శత్రురాజులనా? వారి భార్యలనా?

   తొలగించండి
  2. 'వాజిని' అన్న పదాన్ని గమనించలేదు. అర్జునుడు పరుగులు పెట్టించింది గుఱ్ఱాన్ని కదా! మన్నించండి.

   తొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. రాజిత యశోవిరాజితు
  డాజిని గెలువగ నుపాయ మాదేశింపన్
  కూజిత శిఖండి కరముల
  గాజులు గల్లనగ గ్రీడి గాండివ మెత్తెన్

  రిప్లయితొలగించండి
 17. జాజుల వేణి యు హారతి్
  మోజున నివ్వగ తన పతి మొనగాడవ్వన్
  నాజిన గెలుపును శుభమై
  గాజులు ఘ ల్లుమ ను క్రీ డి గా o డీ వ మెత్తెన్
  గురువు గారి కి న మ స్కా ర ము లు. దోషములు తెల్పు డు.

  రిప్లయితొలగించండి
 18. హారతి గ చ దువ ప్రార్థన. బస్సు లో ని ల్చొని పూరణ
  చే సి నా ను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మొనగా డైన। న్నాజిన..." అనండి.

   తొలగించండి
  2. బస్సులో నిల్చొని ప్రయాణిస్తూ సమస్యను పూరించిన మీ ఉత్సాహాన్ని, ఆసక్తిని, అభిరుచిని అభినందిస్తున్నాను.

   తొలగించండి
 19. తేజవిలాసముల్లలరి ధీరత జూపుచు పోరు నిల్వగా
  నైజము వీడి శత్రుమూకలు వినాశముదప్పక పర్వులెత్తగన్
  రోజులు దగ్గరయ్యెనను రూఢిగ, పత్నుల చేతు లందులన్
  గాజులు గల్లుగల్లనగ గవ్వడి గాండివమెత్తె గ్రుద్దుడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విలాసముల్+అలరి' అన్నపుడు లకారద్విత్వం రాదు. ఆ సౌకర్యం ఒక్క నకారానికే. అక్కడ "విలాసమే యలరి" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 20. ఆజి నరిసూదనుఁడు కన
  దోజో బల సంయుత సమరోత్సాహ సువి
  భ్రాజితుఁడు ప్రతిధ్వనిత న
  గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్

  [ఆజి =1. యుద్ధము, 2. తిట్టు; ప్రతిధ్వనిత నగ+ ఆజులు = ప్రతిధ్వనిత నగాజులు : మారుమ్రోగిన పర్వతములు గల తిట్లు]


  ఆజిని గెల్వ సూచితము నద్భుత రీతిని నయ్యె యుద్ధమే
  యోజము ప్రజ్వ రిల్ల నట నుత్తర గోగ్రహణమ్ము నందు వి
  భ్రాజితుఁ డా ధనంజయుఁడు బంగరపుం గడియమ్ము లైన యీ
  గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా, సర్వశ్రేష్ఠాలై ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు

   తొలగించండి
 21. పిన్నక నాగేశ్వరరావు గారి పూరణ.......

  ఆజిని యుత్తరుడు భయము

  నన్ జనగా తేరును దిగి,యభయంబిడె
  నా
  రోజున బృహన్నలగ తా

  గాజులు గల్లనగ గ్రీడి గాండివ మెత్తెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగేశ్వరరావు గారూ,
   పూరణ బాగున్నది. కాని రెండవ పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

   తొలగించండి
 22. .నైజము యన్.టి.యార్.నటన నచ్చునుపార్థునిపాత్ర యందునన్
  మోజుగ పెంపునింపగల ముగ్దమనోహర రూపురేఖలున్
  తేజము బంచగా సినిమ దీయగ?చెప్పటలుంచ?కన్యలున్
  గాజులుగల్లు గల్లనగ గవ్వడి గాండివ మెత్తె గ్రుద్దుడై|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెప్పటలుంచి'...?

   తొలగించండి
 23. గురువు గారు మదకావర మే ఆ నునది దుష్ట సమాసమవుతుo దా? దయచేసి తెల్పు డు.
  పద్యము లో ప్రయోగము చేయవచ్చా?
  వందనములు

  రిప్లయితొలగించండి
 24. రాజులు సభకే తెంచిరి
  మోజు పడిరి మత్స్య యంత్రమును ఛేదించన్
  వే జని తృటి లో ద్రౌపది
  గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్

  రాజస మొప్పఁగా దృపద రాజ కుమార్తెను బెండ్లియడగా
  వే జని రాజులా పురికి, విహ్వలు లై వెను దిర్గు నంత లో
  రాజ కుమారి ద్రౌపది, పరాభవమున్గని గేలి జేయగా
  గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై

  రిప్లయితొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. రాజిలగనుపురుషత్వము
  నాజూకు తనమ్ము పో,ధనంజయుడయ్యెన్
  తేజోనిధి. తన చేతుల
  గాజులు గల్లనగ క్రీడి గాండివ మెత్తెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


  2. రాజౌ విరటుని కొలువున

   రాజ సుతకునర్తనమును రాగము తోడన్

   నోజను నేర్పెడి గురువే

   గాజులు గల్లనగ గ్రీడి గాండీవమెత్తెన్.


   ఆజికి రమ్మనిపిలువగ

   గాజులు దాల్చిన రమణల కరముల చేతన్

   నాజూకులునేర్పుదునని

   గాజులు గల్లనగ గ్రీడి గాండీవమెత్తెన్.


   వాజినదల్చుచు కరమున

   గాజులు గల్లనగ గ్రీడి గాండీవ మెత్తెన్

   నాజిన భీరువు కాకని

   తేజము చూపుచు కదిలెను తీరుగ తానున్.

   తొలగించండి
  3. ఆజిని తన నెదిరించిన
   రాజిత చిత్రాంగద కొమరాలనితెలియన్
   గాజాలక, ప౦దనుకొనె
   గాజులు గల్లనగ,గ్రీడి గాండివ మెత్తెన్

   తొలగించండి
 27. గురువు గారికి మరియు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నారాయణరావు గారు మీ వ్యాఖ్యాలన్ని యొకే చోట రావడానికి ముందు మీరు ప్రచురించిన పూరణ క్రింద నున్న” ప్రత్యుత్తరము” మీద నొక్కితే అక్కడ మీ వ్యాఖ్యలను ప్రచురించ వచ్చును. అపు డన్నీ యొకే చోట వస్తాయి.

   తొలగించండి
 28. ఆజిన్ మౌర్విని మీటగ,
  రాజుల శ్రోత్రద్వయమున రంభాదిస్వా
  రాజీవాక్షుల కరముల
  గాజులు గల్లనగ, క్రీడి గాండివమెత్తెన్

  రిప్లయితొలగించండి
 29. .
  పిన్నక నాగేశ్వరరావు.

  ( సవరణ తరువాత......)

  రాజ సుతుండుత్తరుడు

  న్నాజిని భీరువుగ పాఱ, యభయంబిడె
  నా
  రోజున బృహన్నలగ తా

  గాజులు గల్లనగ గ్రీడి గాండివ మెత్తెన్.

  రిప్లయితొలగించండి
 30. వేజనిరెల్లవీరులును వీకతొ దక్షిణ దిక్కు నుత్తరుం
  డే జనుదేరగా రిపుల ఢీ కొన నుత్తర దిక్కు కేగి తా
  రాజసమొల్కగా కదనరంగము నందున కాలుదువ్వగన్
  గాజులు గల్లు గల్లు నగ గవ్వడి గాండివ మెత్తెగ్రుద్ధుడై

  రిప్లయితొలగించండి
 31. అర్జునుడు సుభద్రను ద్వారకనుండి గొనిపోవు సందర్భం........
  రాజిలు సవ్యసాచి జవరాలు సుభద్రను పెళ్ళియాడగా
  తా జపమాల చేతనిడి తాపసి వేసము దాల్చినయ్యడ
  న్నాజగదేక వీరుడల!నాతిని వే గొనిపోవునంతలో
  యాజికుపక్రమించి పలు యాదవ వీరులు నడ్డగింపగన్
  తేజము తోడబాణములు దీయుచునుండ సుభద్ర చేతికిన్
  *గాజులు గల్లుగల్లనఁగఁ! గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై*

  రిప్లయితొలగించండి
 32. హరునకు సగభాగమ్మై
  నిరతమువసియించునట్టి నిర్మల వతియున్
  గిరిరాజు ప్రియపు పుత్రిక
  సరసీరుహనేత్ర కొక్కస్తనమే కనుమా

  రిప్లయితొలగించండి
 33. ఆజిని వీడెదో? సతిని యారడి బెట్టిన తీరుఁ దల్చవో ?
  రాజుల వంశగౌరవము రాజిలఁ జేయవొ? చిత్తమేమనన్
  బ్రాజిత బోధనమ్ము, సభఁ బత్ని విలాపము, చిట్ల నాటివౌ
  గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై!

  రిప్లయితొలగించండి
 34. ఆజిని వీడెదో? సతిని యారడి బెట్టిన తీరుఁ దల్చవో ?
  రాజుల వంశగౌరవము రాజిలఁ జేయవొ? చిత్తమేమనన్
  బ్రాజిత బోధనమ్ము, సభఁ బత్ని విలాపము, చిట్ల నాటివౌ
  గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై!

  రిప్లయితొలగించండి
 35. గాజుల నెప్పుడో విడెనుఁ గవ్వడి మారగ పూరుషుండుగా
  పోజులు కొట్ట పృచ్ఛకుడు బొత్తిగ వ్రాసెను తప్పుతడ్కెలే:👇
  "గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై" ❎
  "రాజులు గొల్లుగొల్లనఁగఁ గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై" ✅

  రిప్లయితొలగించండి