గురువు గారు ఈ దిగువ సoదేహాలను దూరము చేయు ము. క్రతువు పదము వివాహాలు మరియుయాగాల కోసం వాడుదురు.వ్రతము ల కు వాడుదురా? అసాధు ప్రయోగ మన నేమి?ప్రాస లో vagdhevi నాలుగవ పదము క తో వాడవచ్చా?.
వెంకట నారాయణ గారూ, నిజమే.. క్రతువు శబ్దానికి విస్తృతమైన అర్థం ఉంది. కాని ఈ న్యస్తాక్షరి కేవలం వినోదార్థం, పద్య రచనాభ్యాసానికే కనుక అంత లోతుగా వెళ్ళనవసరం లేదు. ఇక ప్రాసకు సంబంధించిన మీ ప్రశ్న అర్థం కాలేదు.
శిష్ట్లా వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. నిజానికి 'శుక్రవారం' అని వ్యావహారికాన్ని అక్కడ న్యస్తాక్షరిగా ఇవ్వడం నాకూ ఇష్టం లేదు. కాని కావలసింది నాలుగక్షరాలే. అందుకని ఇవ్వవలసి వచ్చింది.
కామేశ్వర రావు గారూ, మీరిచ్చిన ఉదాహరణతో 'లేక' అన్నది కళ అని రూఢి అవుతున్నది. శ్యామల రావు గారు ఈ విషయమై వివరంగా నాకు లేఖ వ్రాశారు. దానిని మీ మెయిలుకు పంపిస్తాను. చూడండి.
శుభములనొసగు శ్రావణ శుక్రవారం
రిప్లయితొలగించండిక్రమమున గొలువ కమలాంబ కార్యసిద్ధి
వారిజాక్షులకు వలసిన వాయనంబు
రంగరించిన శృంగార రాజ్యమేగ!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
కాని 'శుక్రవారం' అన్నచోట గణభంగం. "వారిజాక్షులకు వలయు..." అనండి. లేకుంటే గణభంగం. అలాగే "రాజ్యమె గద" అనండి.
వారిజాక్షులు వలచిన వాయనంబు గా చదువ ప్రార్ధన!
రిప్లయితొలగించండిఈ సవరణ బాగుంది.
తొలగించండిశుభములనొసగు శ్రావణ శుక్రవేళ
తొలగించండిక్రమమున గొలువ కమలాంబ కార్యసిద్ధి
వారిజాక్షులు వలచిన వాయనంబు
రంగరించిన శృంగార రాజ్యమదియె
శుభ్రవస్త్రపు వేదిక సొబగులొలయ
రిప్లయితొలగించండిక్రమ్ముకొనియెడి పరిమళకలన తోడ
వాలుకన్నుల వరలక్ష్మి వత్సలతను
రంజనమ్ముగ బడయంగ రండురండు.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
sebhaash baapUjee gaaru
రిప్లయితొలగించండిశుభము లిచ్చెడి దేవత శోభ గూర్చు
రిప్లయితొలగించండిక్రమము తప్పక పూజించ కాచి నిలుచు
వారి జాక్షుల పాలిట వరమ టంచు
రంగు రంగుల సుఖముల హంగు లిడగ
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
వరలక్ష్మి వ్రతము :
01)
________________________
శుక్ల పక్షపు శ్రావణ - శుక్రదినము
క్రమము దప్పక ప్రతి యేట - శమము గోరి
వారిజాక్షులు వరలక్ష్మి - బతము సలుప
రంజిలు గృహము సతతమా - లక్ష్మి కరుణ !
________________________
బతము = వ్రతము
వసంత కిశోర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(శు)క్ర వారంపు వరలక్ష్మి సుఖద యగుట
రిప్లయితొలగించండి(క్ర)మముగా నిచ్చు నైశ్వర్య సమితి నిలను
(వా)సి గూర్చును సౌభాగ్య వైభవ మిడు
(రం)డు సద్భక్తి గొలువంగ రమణు లార!.
హ.వేం.స.నా.మూర్తి
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిశుభమగునుగాక యెల్లరు సుఖము గాను
క్రతువుల నిట చేతురు గాక! కలిమి చెలియ
వాహినిగ వెలయవలయు వరము గాను
రండి! రారండి ! కొల్వగ రక్ష రక్ష!
శుభాకాంక్షలతో
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*శు*భద,శ్రీహరిదయిత, భాసురలతాంగి,
రిప్లయితొలగించండి*క్ర*మము తప్పక నేటేట కరుణఁజూపి.
*వా*సిగా ధనధాన్యము, ప్రవిలంపు.
*రం*గురంగుల భవిత చేరంగ నిడుత!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుభ ము సంతోష సౌ ఖ్యాలు శుద్దమతు లు
రిప్లయితొలగించండిక్రమ ము గా సాగు జీ వ న గ తి నొ సం గి
వాన లిచ్చి యు దాహార్తి వంత బాపి
రంజన oబును కలిగించ రమ్ము లక్ష్మి ।।।।।
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుక్ర వారపు వరలక్ష్మీ శుభము లిచ్చు
రిప్లయితొలగించండిక్రమము నకొలువ శ్రీదేవి క్రమ్ము కొనును
వాయనము గద ముదితకు వడువ లయ్యి
రoజిలునతివ మోముయె రoభ లాగ
పoడుగ శుభాకాoక్షలు మరియు నమస్సులు.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మోము+ఎ=మోమె' అవుతుంది. అక్కడ యడాగమం రాదు. "వదనమే" అనండి.
శుచికరముగ స్నానమొనర్చి శుభదినమున
రిప్లయితొలగించండిక్రమపు పద్ధతిఁ బూజించఁ గనుచుఁ బద్మ
వాస కలిగించు నిత్య సౌభాగ్యములఁ ది
రంబుగ మహిళా మణులకు రమణతోడ
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుక్రవారము గృహమును శుద్దిజేసి
రిప్లయితొలగించండిక్రమవిధానము వరలక్ష్మి వ్రతమొనర్చు
వారిజాక్షులకోరికల్ తీరుచుండు
రండుజూడమీకలలునూపండుచుండు!
పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కలలును" అనండి. దీర్ఘం ఎందుకు?
గురువర్యులుకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
రిప్లయితొలగించండిధన్యవాదములు.
రాధా హృదయ విహారిగ
మాధవుడే కీర్తి నందె! మదనాంతకుడై
శోధన విడి శివుడాయె ను
మా ధవుడట, హైమవతిని మనువాడంగా!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ వరలక్ష్మీవ్రత పర్వదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిశుభముఁ జేకూర్చి రైతన్న కభయ మీయ
క్రతువటంచును వరలక్ష్మి వ్రతముఁ జేయ
వాన గురియంగ వరుణున కానతీయ
రంగనాయకి! శుక్రవారాన రమ్మ !
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుక్రవారము శ్రావణశుక్ల తిథిని
రిప్లయితొలగించండిక్రమము తప్పక పంచ వర్షములు తమ వి
వాహ మయిన పిమ్మటను సౌభాగ్యసిధ్ధి
రంజిలగ రమణులు సేయు లక్ష్మి పూజ
తిమ్మాజీ రావు గారు,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గీ.శుభము నిచ్చియు జనులకు నభయ మిచ్చు
రిప్లయితొలగించండిక్రమము తప్పక శ్రీ దేవి కరుణ తోడ
వాసి,రాశియు పెంచును వరములొసగి
రంజిల మనము నాదేవి వ్రతము జేయ.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుభము,క్రమము పదములు చాలా పద్యాలలో వాడబడ్డాయి.
రిప్లయితొలగించండిఅవును.. నిజమే!
తొలగించండిశుభము లీయగ వచ్చును బ్రభలువెలుగ
రిప్లయితొలగించండిక్రమము దప్పక యేటేట కనక దుర్గ
వారి జాక్షులు నొసగెడు వాయనములు
రండు చూతము వేగమె రామలార!
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారు ఈ దిగువ సoదేహాలను దూరము చేయు ము.
రిప్లయితొలగించండిక్రతువు పదము వివాహాలు మరియుయాగాల కోసం వాడుదురు.వ్రతము ల కు వాడుదురా?
అసాధు ప్రయోగ మన నేమి?ప్రాస లో vagdhevi నాలుగవ పదము క తో వాడవచ్చా?.
వాగ్డేవి ప్రాసమైత్రి కరుణ వ్రాయ వచ్చా?
రిప్లయితొలగించండివెంకట నారాయణ గారూ,
తొలగించండినిజమే.. క్రతువు శబ్దానికి విస్తృతమైన అర్థం ఉంది. కాని ఈ న్యస్తాక్షరి కేవలం వినోదార్థం, పద్య రచనాభ్యాసానికే కనుక అంత లోతుగా వెళ్ళనవసరం లేదు.
ఇక ప్రాసకు సంబంధించిన మీ ప్రశ్న అర్థం కాలేదు.
వ్యాకరణ విరుద్ధమైన పదాన్ని ప్రయోగించడం సాధువు కాదు.
తొలగించండిశుభము సౌభాగ్యములనిచ్చు సూక్తమిదియె
రిప్లయితొలగించండిక్రమము వరలక్ష్మి దేవికి సుమము లొసఁగి
వాణి వాగ్దేవి రూపాన బదము బాడి
రంభ ఫలములు దేవికి వాయనంబు
కొరుప్రోలు రాధాకృష్ణారావు
రాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశుభము లిచ్చెడి వరలక్ష్మి విభవ మెంచి
క్రమము గూడుచు నీనాడు కాంత లెల్ల
వాటుగ రమను పూజించి వాయనమిడ
రంజనమ్మమరుచు పొనరార గలరు
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుభ దినంబిది వరలక్ష్మి శోభకొరకు|
రిప్లయితొలగించండిక్రమము దప్పక భక్తితో క్రతువులాగ
వారమందున వనితలు వ్రతముజేయ?
రంగ డైననుమెచ్చు|శ్రీరంగమందు|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తెలుప నపర్ణ యడిగె... వ్రతమాచరించంగ నిందు...దీవెన లంద...వాసికెక్కిన..." అనండి.
మిత్రులందఱకు వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిశుద్ధ హృదయాన శ్రావణ శుక్రవార
క్రమిక దినమున వరలక్ష్మి వ్రతము భక్తి
వారిజాక్షులు సలుప, సంపత్కరి రమ
రంజిలుచు మెచ్చి, వరమ్ములిడును!
సవరణతో...
తొలగించండి*శు*ద్ధ హృదయాన శ్రావణ శుక్రవార
*క్ర*మిక దినమున వరలక్ష్మి వ్రతము భక్తి
*వా*రిజాక్షులు సలుప, సంపత్కరి రమ
*రం*జిలుచు మెచ్చి, నచ్చు వరమ్ములిడును!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిశుభతర కటాక్ష లబ్దేంద్ర శుభ్రి హరుల
రిప్లయితొలగించండిక్రమము దనర శ్రీరంగ ధామ మలరంగ
వార్ధి సంజననంబు దేవ గణ సేవ
రంజిలు సిరినిఁ బూజింతు లక్ష్మి నెపుడు
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
తొలగించండిశుభ్రకరుని తోబుట్టువు ,శుభుడగు ఉరు
రిప్లయితొలగించండిక్రముని పట్టపు రాణియు, కడలి పుత్రి ,
వాక్కు తల్లి యత్త ,పంచ వదను డగు ని
రంజుని సహోదరి ఐన శ్రీ రక్ష నిచ్చు
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీ౹౹
రిప్లయితొలగించండిశుభములు సంపదల్ శోభిల్ల వలెనన
---వ్రతమేది తెలుపం చపర్ణ యడిగె
క్రమశిక్షణగ స్త్రీ క్రమముగాను రెండవ
---శ్రావణ శుక్రవారము శుచిగ సు
వాసినుల్ దోడ నా వరలక్ష్మి వ్రతమాచ
---రించంచు నిందుమౌళి వివరించె
రంధ్రపు గారె పూర్ణపు బూరె వాయనం
---బొసగి దీవెనలందె పుణ్యవతులు
తే౹౹
శుద్ధ చిత్తము చేతల శోభలీను
క్రయము లేనిదౌ యిల బుణ్యకార్య మిదియె
వాశికెక్కిన వ్రతమిది వరములిచ్చు
రండు లక్ష్మిని పూజింప రమణులార!
దీనిని రెండవసారి ఎందుకు ప్రకటించారు?
తొలగించండిపొరబాటునండి!
తొలగించండికoద పద్యం రెoడవ పాదము మొదటి పదము వాగ్డేవి
రిప్లయితొలగించండియతి లో కరుణ వ్రాయ వచ్చా?
నమస్సలు.
వ్రాయరాదు. పాదం మొదట 'వా' ఉన్నందున యతిస్థానంలో అ,ఆ,ఐ,ఔ లతో కూడిన ప,ఫ,బ,భ,వ లతో మొదలయ్యే పదమే ఉండాలి.
తొలగించండిముందు మీరు ప్రాస గురించి అడిగినట్టున్నారు!
శుభములొసగు శ్రావణ శుక్ల తిధిని
రిప్లయితొలగించండిక్రమముదప్పక వరలక్ష్మి వ్రతము జేసి
వాయనములిడి సిరులు సౌభాగ్యములను
రంగుగాకోరి వనితలు ప్రస్తుతింత్రు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిశుభములను గూర్చు శ్రీ దేవి ప్రభలు నిండి
క్రమ వికాసము బ్రతుకున కలన జేసి
వాసిగాంచెడి నాయమ వరములీయ
రమ్య ధన కనక గృహరాసి లభ్యమగుత
ముదిత వరలక్ష్మి దయచేత మోదమలర!
(రం...ను, ర-ము...గా స్వీకరించాను)
శిష్ట్లా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిజానికి 'శుక్రవారం' అని వ్యావహారికాన్ని అక్కడ న్యస్తాక్షరిగా ఇవ్వడం నాకూ ఇష్టం లేదు. కాని కావలసింది నాలుగక్షరాలే. అందుకని ఇవ్వవలసి వచ్చింది.
లేక తనర్చి
రిప్లయితొలగించండితే.గీ.
అంతరంగంబునం దొక యింత యేని
యలుకు లేక తనర్చి బ్రహ్మాస్త్రమునన
వేడుకకు మరలించిన విధము దోఁప
నద్భుతంబుగ వారించె నర్జునుండు. భార. ద్రోణ. 5. 299
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీరిచ్చిన ఉదాహరణతో 'లేక' అన్నది కళ అని రూఢి అవుతున్నది. శ్యామల రావు గారు ఈ విషయమై వివరంగా నాకు లేఖ వ్రాశారు. దానిని మీ మెయిలుకు పంపిస్తాను. చూడండి.
శుచిగ స్నానము చేసియు రుచిగ వండి
రిప్లయితొలగించండిక్రమము దప్పక శ్రావణ కాల శుక్ర
వారమందున చక్కగ వ్రతము జేయ
రంగనాధుని పత్నియు రహిన నుండు
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుభము గోరుచు భక్తి ప్రసూనములిడి
రిప్లయితొలగించండిక్రతువు పగిదిని సిరిపూజ కాంతజేయ
వారిజాక్షి కొసంగదే వరము లెన్నొ
రంజిలిన వరలక్ష్మియే రసధునియన
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
శుభము కలుగజేయు మనుచు శుద్ధ
మతిని
క్రమము తప్పక వరలక్ష్మి వ్రతము చేసి
వాయనమ్ముల నిత్తురు పడతులంత
రండు గైకొన మీరంత రమణులార !
నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుక్రవారము దినమున శోభమీర
రిప్లయితొలగించండిక్రమము తప్పక పూజింప ప్రమద మెసగ
వారిజాసని వరలక్ష్మి వరము లొసగి
రంజలంగను జేయదే రమణులలర
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రంజిలంగను' టైపాటు.
శుభకరము ప్రతీ దినముగ శుభములు కద
రిప్లయితొలగించండిక్రమము తప్పక తరుణులు కలశ పూజ
వాయనములు శనగలు సువాసినులకు
రంగ నాయకి లక్ష్మికిరంగ పూజ
రిప్లయితొలగించండిశుక్రవార మెల్లరకును శుభము లిచ్చు
క్రమము విడక స్తోత్రము చేయ కరుణ జూపు
వారి పైనసందియమది వలదు వలదు
రంజనమున వరమొసగు రమయు తాను.
శుభమునిచ్చును వరలక్ష్మి సుదతులకును
క్రమము దప్పక తనకు నర్చనలు చేయు
వారి కిలలోన మెచ్చుచు వదలకుండ
రంగుగ సకలసిరులిచ్చు రయము గాను.
శుకతరువు పూల తోడను గోమిని కిల
క్రమముగా పూజ లను చేయ కలిమి నొసగు
వారిజాక్షులకెల్లను వాసిగాను
రంధి తో నమ్మ నర్చించ రండు వేగ
రంధి=ఏకాగ్రత
శుఫరుకము నందు చక్కని శుకఫలమిడి
క్రన్నన వ్రతాచరణమును ఘనముగాను
వారిజకు చేసి నాపైన వాయనములు
రంగుగా రమణుల కిడ రమయు మెచ్చు.
శుఫరుకము=పెద్దపాత్ర
శుకఫలము=దానిమ్మపండు
రంగుగా=సొబగుతో
శుక్రవారము పూటను సొబగుతోడ
.క్రకచతో లక్ష్మికి జడను గట్టు చునుసు
వాసికత్తియ నటరాగ వలపు తోడ
రంభఫలముల నొసగుము రయముగాను.
క్రకచ=మొగలి రేకు
వాసికత్తియ=ఉన్నతురాలు
శుక్ర వారమందేనక శుభము లొసగ
క్రన్ననగ నరు దెంచనీ కమలగంధి
వాయనమ్ముల నొసగంగ వాసిగాను
రండు ముత్తైదువులు వేగ రమణతోడ.
శుక్ర వారమందు మనకు శుభము లొసగ
రిప్లయితొలగించండిక్రన్ననగ నరు దెంచనీ కమలగంధి
వాయనమ్ముల నొసగంగ వాసిగాను
రండు ముత్తైదువులు వేగ రమణతోడ.