3, ఆగస్టు 2017, గురువారం

సమస్య - 2428 (మాధవుఁడే కీర్తి నందె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై"
ఈ సమస్యను పంపిన గుర్రం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

88 కామెంట్‌లు:

 1. రాధయు రుక్మిణి సత్యలు
  బాధలు లేకనె ప్రణయపు పంపక మొందన్
  గోధూళి నుండి ప్రొద్దుకు...
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై?

  రిప్లయితొలగించండి
 2. సాధనమితండనుచు దే
  వాధిపుఁడే పంప వచ్చి యలరుల కోలల్
  వేధింప వేసినంతను
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై!!

  రిప్లయితొలగించండి
 3. రాధా మాధవ ప్రణయము
  గాధలుగా మిగిలి పోయె కలవర పడగన్
  బాధించగ మదిని దలచి
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై

  రిప్లయితొలగించండి
 4. మాధవుని పుత్రుని ఘన శ
  చీధవుడడుగ రతిధవుడు చెలరేగుచు గం
  గాధరుని పైకినెగయను
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై!!

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  మదనాంతకము :

  01)
  ___________________

  ఆ దివ్యుల కోరిక పై
  పూధన్వుడు, తన సమాధి - పూవుల నడచన్
  క్రోధేక్షణాజ్వలనము, ను
  మాధవుఁడే కీర్తి నందె - మదనాంతకుఁడై !
  ___________________
  సమాధి = తపస్సు

  రిప్లయితొలగించండి
 6. (గౌతముడు బుద్దుడైనాడని విని యశోధర తన చెలి మాధవితో)
  మాధవి! కరుణుని ప్రేమస
  నాథుని మారుని వనితలు నానాగతులన్
  శోధన జేసిన జెదరక
  మాధవుడే కీర్తినందె మదనాంతకుడై.

  రిప్లయితొలగించండి
 7. క్రోధము జెంది త్రినేత్రుడు
  బాధించెడి మన్మధుణ్ణి భస్మము జేసెన్
  సాధన జేయగ తపము ను
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై

  రిప్లయితొలగించండి


 8. బాధా తప్తుల గావుచు
  మాధవుఁడే కీర్తి నందె, మదనాంతకుఁడై
  శోధన జేసె నసురులకు
  రాధనమును జేర్చి, యౌర ! రన్తృ విభుండే!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...గాచుచు" అనండి. "అసురులకు రాధనమును జేర్చి..." అర్థం కాలేదు.

   తొలగించండి

  2. కంది వారికి

   అసురులు కోరిన కోరికలన్నీ తీర్చి వారికి రాధనము( సంతోషము) చేర్చు మదనాంతకుడు (శివుడు- భోళా శంకరుడు)

   సరియేనాండి ?

   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   నేను నా సందేహాన్ని వెలిబుచ్చే ముందు ఒకసారి ఆంధ్రభారతిలో రాధనము అర్థం చూసుకుంటే సరిపోయేది. తొందర పడ్డాను. మన్నించండి.

   తొలగించండి
 9. క్రోధము,శోకము,మోహము,
  బాధలు,సంశోధనల ప్రభావము నడపన్
  బోధలఁజేయు మహాత్ముడు
  మాధవుఁడే కీర్తినందె మదనాంతకుఁడై

  రిప్లయితొలగించండి
 10. బాధించ కామదేవుడు
  శోధించుచు హరికొరకు స్తోత్రముఁ జేయన్
  మోదముతోతాపమడచి
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "శౌరి కొరకు" అనండి.

   తొలగించండి
 11. రాధిక కేప్రియుడంచును
  మాధవుడే కీర్తినందె, మదనాంతకుడై
  బాధలు బాపెడి యా గం
  గాధరుడేనిల్చె జగతి గాదన గలరే,

  రిప్లయితొలగించండి
 12. భూ ధ ర శి ఖ రా న శివుని
  క్రోధాగ్ని కి మన్మథుoడుకూలె ను మ సి యై

  శ్రీ ధ రు డ య్యే డ పొ గ డ ను
  మా ధ వు డే కీర్తి నందె మ ద నా oతకు డై

  రిప్లయితొలగించండి
 13. రాధా వల్లభుడెవ్వరు
  రాధేయుo డేమిబడసె రణభూమిన, గం
  గాధరుడెటుల మెరయు నో
  మాధవుఁడే. కీర్తి నందె. మదనాంతకుఁడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్య కుమార్ గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. శ్రీధర సూనుండల గం
  గాధరుపై బాణమిడగ ఖరువుని దృక్కున్
  బూదిగ మారుఁడు మారె ను
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై

  రిప్లయితొలగించండి
 15. రాధయు ,రుక్మిణియున్, బిం
  బాధర సత్యయును,జాంబవతి,భద్ర గృహ
  మ్మేధిని సహస్ర పతియౌ
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై
  పదహారు వేల ఎనిమిది భార్యల మదన తాపము తీర్చిన కృష్ణుడు కీర్తి నందెను అను భావన

  రిప్లయితొలగించండి
 16. బాధలనుదీర్చు వాడుగ
  మాధవుడే కీర్తినొందె, మదనాంతకుడై
  శోధననాత్మను గనుగొను
  సాధకుల మనంబులకును స్వాంతనగూర్చున్!

  రిప్లయితొలగించండి
 17. కం. వ్యాధుయె గదరా కామము
  బాధించు నదెవరి నైన బంధించుచు;నా
  బాధాతీత మతి గల యు
  మాధవుడే కీర్తి నందె మదనాంతకుడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వ్యాధియె"... టైపాటు.

   తొలగించండి
 18. సమస్య ప్రచురించిన మాన్యశ్రీ కంది శంకరయ్య గారికి ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 19. శ్రీ జీ.పీ. శాస్త్రి గారి పూరణలో రెండవ పాదంలో "లేకనె" అన్నది వ్యావహారికము, "లేకయె" అన్నది గ్రాంథికము అని నా భావన. విజ్ఞులైన పెద్ద లేమంటారో ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సార్! బాగున్నారా? బహుకాల దర్శనం...

   తొలగించండి
  2. శ్రీ జనార్దన రావు గారు:

   (సరదాకి) ఈ క్రింది శంకరాభరణ పద్యం (సమస్య - 1928), వ్యాఖ్య చూడండి:


   రాజేశ్వరి నేదునూరిజనవరి 29, 2016 4:50 AM

   లవలేశము తిలకించని
   వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
   భవితను మరచిన యువకులు
   వివరణ లేకుండ యలజడి భీభత్స ముగన్
   ప్రత్యుత్తరం
   ప్రత్యుత్తరాలు

   కంది శంకరయ్యజనవరి 29, 2016 8:02 AM

   రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాల్గవపాదంలో గణదోషం. ‘వివరణ లేకనె యలజడి...’ అనండి.

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ వ్యాఖ్య చూసిన తర్వాత నాకు సంధేహం కలిగింది. 'అక ప్రత్యయాంత అవ్యయం కళ' అన్నారు కదా! చూడక, చేయక, తినక మొదలైనవి. ఇప్పుడీ 'లేక' అన్నది అక ప్రత్యయాలలో చేరుతుందా లేదా అని సందేహం. చేరితే 'లేకయె' కావాలి. చేరకుంటే 'లేకనె' కావాలి. కొంత పరిశోధించాలి.

   తొలగించండి
  4. పూజ్యులు గురుదేవులకు నమస్సులు! ఈ సందర్భమున మా చిన్నాయన శ్రీ భట్టారం రాధాకృష్ణయ్యగారి వివరణ యిది:

   తొలగించండి
  5. 03/08/17, 4:04:26 PM: Chinnayana: లేకన్ ప్లస్ ఎ .... లేకనె సరియే.
   ఐనా లేకే. Or లేకయె అర్థభేదం ఏమైనా సున్నిత భేదం తో ఆరూపం శ్రవణ సుభగం గ తోస్తున్నది.
   లేకన్మానవు హాని వృద్ధులు మహారణణ్యంబులో డాగినన్ ....
   ప్రయోగం కలదు. లేక ద్రుతమే . సున్నితార్థ భేదంతో లేకయె ఉందేమో. . తెలియదు నాకైతే.

   తొలగించండి
  6. పొరపాటు దొర్లినది! పద్యము సరయైన పాఠము: లేకన్మానవ వెంత జాలిపడినన్ లేముల్సిరుల్ భార్గవా!

   తొలగించండి
  7. సీతాదేవి గారూ,
   మీరిచ్చిన ఉదాహరణంలో యతి తప్పింది. ఆ పాదం "రాకన్ మానవు హానివృద్ధులు మహారణ్యంబులో దాగినన్" అయి ఉంటుంది.
   సీతాదేవి గారూ,
   'లేక' అన్నది కళయే. ద్రుతప్రకృతికం కాదు. కనుక 'లేకయె' అన్నది సాధువు. ఈ విషయంలో శ్రీ తాడిగడప శ్యామల రావు గారి క్రింది వివరణ ఇచ్చారు. చూడండి....
   కొన్ని ఉదాహరణలు.
   "వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు
   నెలతతోఁ బొందఁడె నీ గురుండు?" (శశాంకవిజయము - 3-80)
   "ఎంతకాల మున్న నెఱుక లేకయె జీవి
   చచ్చి పుట్టుచుండు సహజముగను" (వేమన)
   "కలగి యెరుక లేకయే - చెలియ జీరెనంట!" (సామికి సరియెవ్వరే? అన్న పదంలో క్షేత్రయ్య)
   "ఉపాసన వలన బ్రహ్మలోకంబునకు పోయి బ్రహ్మదేవుని యొక్క సముఖంబు లేకయే ఒక ప్రదేశమందుండి సమస్త భోగంబులు ననుభవించుట సామీప్యముక్తి." (వాసుదేవ మననము)
   ఇత్యాదుల వలన లేకయె అన్నదే సాధువని అనిపిస్తున్నది. లేకనె అన్న ప్రయోగం జనబాహుళ్యంలో కనిపిస్తున్నా అది గ్రాంధికం కాదని నా ఉద్దేశం. కవిత్రయంలో ఈవిషయం పరిశీలించటం ఇంకా మంచిది.
   (శ్యామల రావు గారికి ధన్యవాదాలతో...)

   తొలగించండి
  8. సీతాదేవి గారూ,
   మీరిచ్చిన పాఠం ఏ కావ్యంలోనిది?

   తొలగించండి
  9. 03/08/17, 4:39:15 PM: Chinnayana: పూర్తి పద్యం
   పోకన్మానదు కాయమే విధమునన్ పోషించి రక్షించినన్
   రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యంఋలో డాగినన్
   కాకన్ మానవు పూర్వ జన్మ కృతముల్ కాగల్గు కార్యంబులున్
   లేకన్ మానవవెంత జాలిపడినన్ లేముల్ సిరుల్ భార్గవా.

   తొలగించండి
  10. సోదాహరణ వివరణ యిచ్చినందులకు గురువుగారికి ధన్యవాదములు!🙏🙏🙏🙏

   తొలగించండి
 20. ఆ ధాత సృష్టికి, స్థితికి
  మాధవుఁడే కీర్తి నందె, మదనాంతకుఁడై
  వేదన బాపెడు లయమున
  కాధారమగుచు త్రిమూర్తు లందజుఁడొప్పెన్!

  రిప్లయితొలగించండి
 21. వేదములను గాచియిలను
  మాధవుఁడే కీర్తి నందె, మదనాంతకుడై
  సాధన భగ్నము జేసిన
  మాధవసుతు నడచివేసె మందరమణియే!!!

  రిప్లయితొలగించండి
 22. ఆధూర్జటి, యల దేవా
  రాధిత కారణ భవుండు ప్రద్యుమ్నునకున్
  యోధునకు జన్మ నీయఁగ
  మాధవుఁడే, కీర్తి నందె మదనాంతకుఁడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   అహా! ఏమి అన్వయం. మీ సమయోచిత ప్రజ్ఞాదురీణతకు జోహార్లు. అద్భుతమైన పూరణ.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. ధన్యోస్మి.

   తొలగించండి
 23. బాధితుల కండ నగుచును
  మాధ వుడే కీర్తి నందె , మదనాంతకుడై
  గాధల యందున మిగులను
  మాధవుగావాసికెక్కె మనకందఱకున్

  రిప్లయితొలగించండి
 24. రాధా ప్రియుడని జగతిని
  మాధవుఁడే కీర్తి నందె; మదనాంతకుఁడై
  సాధన కొనసాగించు ను
  మాధవుడే తపసు నాపి మగువను పొందెన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  అంతము చేయ దానవుని యచ్యుతు డేలకొ జాగుచేసె, బల్
  వింతగ తేరు పై నిలచి విద్యను జూపక గురుచుండెనా!
  కొంత విరామమున్ గొనెన కోరిక దీరును సత్య కనుచు!, శ్రీ
  కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'దానవుని నచ్యుతు.. గూరుచుండెనా.. గొనిన కోరిక ... సత్య కంచు..." అనండి.

   తొలగించండి
 25. శ్రీమతి జి సందిత బెంగుళూరు

  స్వాధిష్ఠానంబాదిగ
  సాధకులకొసంగియోగశక్తులనటుయో
  గాధీనుడు సాంబశివుడు
  మాధవుడే కీర్తినందె మదనాంతకుడై

  శ్రీమతి జి సందిత బెంగుళూరు

  శివుడు +ఉమా ధవుడు

  రిప్లయితొలగించండి
 26. పూజ్యులు మరియు గురువు గారికి నమస్సులు.
  బాధా తప్త హృదయునికి
  రాధా మాధవుల ప్రణయ రాజ్య మధురమేఁ
  శ్రీధార్మకత పెoచిన
  మాధవుడే కీర్తి నoదె,మదనాoతకుడై
  Dharmi mariyu madhuramow గ చదువ మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో (ఉన్నదీ, సవరించినదీ) గణదోషం. సవరించండి.

   తొలగించండి
 27. సాధన జేసిడి శివుడిని
  యా ధవళాచల కుమారి యర్చింపగన్
  వే ధనువు నెత్తు వేళను
  మాధవుడే కీర్తి నందె మదనాంతకుడై
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శివుడిని। నా..." అనండి. దానికంటే "..జేసెడి శంకరు। నా ధవళాచల..." అంటే ఇంకా బాగుంటుంది.

   తొలగించండి
 28. మాధవుని యాడె మను వప
  రాధిగ కీర్తి, మనసు ననురక్తుడు మదనా
  రాధన నెగడ, సహింపక
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై

  (మాధవ, కీర్తి, మదన్ - వీరు మనుషులు)

  రిప్లయితొలగించండి
 29. ఆధారం బవనికిల|”ను
  మా”|ధవుడే కీర్తినందె|”మదనాంతకుడై
  సాధించె తారక వధను
  సాధారణ జనులకెల్ల సంతసమొసగన్.

  రిప్లయితొలగించండి
 30. బాధించ మన్మథుండు యు
  మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై
  భేదించి శరీ రమ్మును
  క్రోధముతోడుతను వాని, గోత్రముపైనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మన్మథుడు+ఉమా' అన్నపుడు 'మన్మథు డుమా' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "బాధించ పుష్పధన్వు డు।మా..." అనండి.

   తొలగించండి
 31. క్రొవ్విడి వెంకట రాజారావు:
  నిన్నటి పూరణ:
  కాంతుడు లేని వేళ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?
  వింతలు గొల్పుచున్ వెలుగు పెమ్మిని గూడినవౌ ప్రదేశముల్
  పంతుగ జూపుచున్ననిన పాతివి పల్కులు దల్చుచున్ మదిన్
  పొంతువ పెంచినట్టివగు పూటలు గుర్తుకు వచ్చినందుకే!

  నేటి పూరణ:

  రాధిక కనురతి బంచుచు
  మాధవుడే కీర్తినందె; మదనాంతకుడై
  ప్రథనొందెను చంద్రధరుడు
  పూధన్విని బూది జేసి బులుపు నులుముచున్

  రిప్లయితొలగించండి
 32. గురువు గారికి నమస్కారములు ఈ రోజు పూరణములలో కొన్ని పద్యాలలో మిత్రులు ప్రాస (ధ) బదులు (ద)వాడటము జరిగినది. అది ఆమోద యోగ్యమేనా సలహా ఈయగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   స్వవర్గజ ప్రాస -
   ఏకవర్గానికి చెందడం వల్ల, బాహ్యప్రయత్నంలో మహాప్రాణాలుగా ఉండడం చేత థ, ధలు, ఘోషాలు అవడం వల్ల ద,ధలు ప్రాసమైత్రికి చెల్లుతాయి.
   ఉదా.
   (అ).
   సింధురము మహోద్రేక మ
   దాంధంబై వచ్చులీల నాచార్యునిపై
   గంధవహసుతుఁడు గవియ న
   మంథరగతి నెవ్వఁ డాఁగు మనయోధులలోన్. (భార. ద్రోణ. 1-88)
   (ఆ).
   కా దన కిట్టిపాటి యపకారముఁ దక్షకుఁ డేకవిప్రసం
   బోధనఁ జేసి చేసె నృపపుంగవ .... (భార. ఆది. 1-124)
   (ఇ).
   బాంధవసౌహృదప్రణయ భక్తివిశేషము లొప్ప నీమనో
   గ్రంథి యడంగఁ జేయ నెసకంబునఁ బూనినవారు ... (భార. ఆర. 4-160)

   తొలగించండి
  2. నమస్కారము నాకు కొత్త విషయము చెప్పారు ధన్యవాదములు

   తొలగించండి
 33. వేధి౦చగ సుమశరముల
  క్రోధితుడై,తపము చెడగ రోయుచు,తెరచెన్
  గోధిని గల నేత్రమ్ము, ను
  మాధవుడే కీర్తి నందె మదనా౦తకుడై

  రిప్లయితొలగించండి

 34. బాధ


  భూధర పుత్రిక పార్వతి
  వేదన గని శివు తపస్సు విఫలము చేసెన్
  క్రోధముతోడన్నఫ్పు డు
  మా ధవుడేకీర్తి నందె మదనాంతకుడై?

  రిప్లయితొలగించండి
 35. సాధువులకు దిక్కై యిల
  మాధవుఁడే కీర్తి నందె, మదనాంతకుఁడై
  బాధించియు పార్వతి గొని
  యా ధూర్జటి యాశుతోషు డని యశమందెన్.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 36. శ్రీ జీ.పీ.శాస్త్రి గారికి ధన్యవాదాలు ! బాగున్నాను సర్!మీరు బాగున్నారా ?

  రిప్లయితొలగించండి


 37. వేధయు నింద్రుడు పంపగ

  బాధింపగ వచ్చెమరుడు బాణము తోడన్

  క్రోధముతోకాల్చుచునట ను

  మాధవుడే కీర్తినందె మదనాంతకుడై.  రాధా మనోహరుండా

  మాధవుడే,కీర్తి నందె మదనాంతకుడై

  మాధవు సుతునచ్చోటనె

  క్రోధముతోచంపెగాదె గోపతి యపుడే

  రిప్లయితొలగించండి