24, ఆగస్టు 2017, గురువారం

సమస్య - 2445 (రామభద్రునకున్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రామభద్రునకున్ ధర్మరాజు సుతుఁడు"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

71 కామెంట్‌లు:

  1. లవుడును కుశుండు కవలులయ్యె
    రామభద్రునకున్; ధర్మరాజు సుతుఁడు
    కుంతి దేవికి యముడికి; కూర్మి తోడ
    మంత్ర మొసగగ దూర్వాస మౌని వరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "లవుడును కుశుండు శుభముగ కవలులైరి"

      తొలగించండి
    2. ధన్యవాదములు సార్!

      ఇంక బుద్ధి రాదు నాకీ జన్మలో... తెలుగు చాలా కష్టమైన భాష. దేశ భాషలందు తెలుగు...

      తొలగించండి

    3. జీపీయెస్ వారు

      అట్లా అంతా ఏమీ లేదండీ ! నా లాంటి "గులకరాళ్ళే" విడవకుండా రాసేస్తా ఉంటే ( మా శ్యా‌మలీయం అయ్యవారు గదమాయిస్తే కూడా పట్టించుకోకుండా:)) మీకేమండి !

      బాగా రాస్తున్నారు ; కొనసాగించండి

      దేశ భాషలలో తెలుగు అప్పుడే లెస్స గా అవుతుంది

      చీర్ అప్
      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    4. మీ శుభాకంక్షలే కానీ, మీకు తెలిసినదేగా, నాకీ శంకరాభరణ వ్యసనం మ్రింగలేనిదీ కక్కలేనిదీ అయినది. సరే ఏంచేస్తాం. స్కూలులో అత్తెసరు మార్కులతో ఎలాగో గట్టెక్కించితిని. అరసున్నాలు నాకు ప్రాణాపాయం అయేవి. శంకర గురువులు వాటిని పట్టించుకోరు కాబట్టి సరిపోయినది.

      ప్చ్!!

      తొలగించండి
    5. అన్నయ్యా! నిరాశ తగదు! ఉలి దెబ్బలు తగిలితేనే గదా శిల శిల్పమయ్యేది! మలి వయసులో నేర్చుకోవాలనే తపనే గొప్ప సుగుణము! సాధనమున పనులు సమకూరు ధరలోన! కార్యసాధనకు ఉత్సాహమును మించిన మందులేదు! పడి లేచే కడలి తరంగం!! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    6. సంతోషం!

      ఊరుకోకుండా నీకు కూడా ఈ మత్తు మందును తగిలించితిని ;)

      సరదాకి వ్రాసాను గానీ శంకరాభరణం లేకుండా ఉండ లేను కదా.

      నేననేది ఇంగ్లీషు తేలిక అని... 25 మాత్రమే అక్షరాలు. సమ్యుక్తాక్షరాలు లేవు. సంధులూ సమాసాలూ లేవు. ఈ కాలం స్పెల్లింగులూ గ్రామరూ కూడా లేవు.

      కానీ కంద పద్యంలో ఉన్న మజా లేదుగా!!!

      తొలగించండి

    7. మజా కోరిన జీపీయెస్ గారి కోసం :)

      మలి వయసులోన పద్య
      మ్ముల నేర్చుకొనవలెననెడి ముమ్ముర యత్న
      మ్ముల విడువకుమన్నయ్యా!
      ఉలిదెబ్బల శిల్పమౌత యుర్విన్ శాస్త్రీ !

      జిలేబి

      తొలగించండి
    8. మాట్లాడితే కందం వ్రాస్తారు మీరు. ఇప్పటికి మీ బ్లాగులో కొన్ని వేల కందాలు ఉండి ఉంటాయి. శ్రీ శ్రీ గారేమో నాలుగు కందాలు వ్రాయలేని వారు పండితులై పలుకుచున్నారు అని ఒకచోట అనినట్లు జ్ఞాపకం.

      ఏది ఏమయినా కంది వారు అపూర్వమైన వ్యక్తిత్వం కల వారు. వారిని ఇప్పటికి మూడు సార్లు కలిశాను. మజా మజాగా ఉంటుంది ఆయన పరిచయం.

      తొలగించండి
    9. అలవోకగ కంద రచన
      పిలవక పలికెడు పదముల పేర్పును మీకే
      కలవుగ జిలేబి! నూతన
      కొలతల నిచ్చుచు ప్రతిభకు గూర్చగ శోభల్!

      తొలగించండి


    10. పదముల నటునిటు బేర్చుచు
      చదరంగపు పావులవలె చకచక మార్చ
      న్నదురచు జిలేబి కందము
      కుదురున్ ప్రాస యతిగణపు గుణముల లావై :)

      జిలేబి

      తొలగించండి
  2. భరత శత్రుజ్ఞుల్ సోదరుల్ తరచి చూడ
    రామ భద్రునకున్, ధర్మ రాజు సుతుడు
    పాండు రాజుకున్ ,రుక్మిణీ వల్లభుండు
    దేవకీ సుతుడగు వాసు దేవుడు గద

    రిప్లయితొలగించండి
  3. రామభారత కథలను రమ్యరీతి
    బల్కు కవి యనె "కుశలవద్వయము గలిగె
    రామభద్రునకున్; ధర్మరాజు సుతుడు
    పాండునరపాలవరునకు పడతి! వినుము."

    రిప్లయితొలగించండి

  4. తొల్లిటి కథల చదువుము తొందరేల !
    లవకుశలు తనయులు సూవె, లలితబాల,
    రామభద్రునకున్; ధర్మరాజు సుతుఁడు
    కుంతికి తెలుసుకొనుమమ్మ కుదురు గాను!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ధన్యవాదాలండీ జీపీయెస్ వారు మీ ప్రోత్సాహానికి !

      పదముల అతుకుల బొంతను
      మధురాతిమధుర మనిరి సమంచితముగనౌ
      విదురుల సభలో కవివర
      పదివేలదియేను మాకు పబ్బపు దినమున్ !

      జిలేబి

      తొలగించండి
  5. ధర్మవిగ్రహుడగుచును మర్మమెరిగి
    త్రేతయుగమునందు సుజన త్రాతయతడు
    ద్వాపరమున ధర్మము తలదాల్చి యాయె
    రామభద్రునికిన్ ధర్మరాజు సుతుడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ***************************

      గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ

      ధర్మరక్షణ జేయుటన్, దానమునను,
      సత్య వాక్పాలనమ్మున,శాంతమునను,
      సాధు సత్పురుషులసేవ, సంస్కరణల
      రామభద్రునకున్ ధర్మరాజు సుతుఁడు

      మురళీకృష్ణ గారికి ధన్యవాదములు🙏🏻

      తొలగించండి
  6. సతుల కలియ రాదంచును శాప మంద
    కొమరుల కొఱకు కుములగ కుంతి యపుడు
    పతి యనుజ్ఞతో సమవర్తి వరమున నిడ
    రామభద్రునకున్ ధర్మరాజు సుతుఁడు
    ( రామ=తెలుపు, భద్రుడు=పురుషుడు)

    రిప్లయితొలగించండి
  7. ఉర్వి ధర్మాత్ముడని చెప్పుటొప్పుటొప్పుఁగాదె
    రామభద్రునకున్;ధర్మరాజు సుతుడు
    సుదతి కుంతికి,ధర్మ వాచ్యుండతండు--
    ధర్మమిరువురిఁజేరగ ధన్యమయ్యె!

    రిప్లయితొలగించండి
  8. మంత్ర మహిమను కలిగెను పుత్రు డినుడు
    మోద మలరగ లవకుశల్ మురియు సీత
    రామ భద్రునకున్ , ధర్మరాజు సుతుఁడు
    కుంతి పొందెను కాలుని కూర్మి వలన

    రిప్లయితొలగించండి
  9. క్షాత్రవిద్యా విశారదుల్ సకలశాస్త్ర
    కోవిదులు చూడగా లవకుశలు సుతులు
    రామభద్రునకున్, ధర్మరాజు సుతుఁడు
    పాండుసామ్రాట్టునకు కురువంశజునకు

    రిప్లయితొలగించండి
  10. భార్య గాతా నెవనికయ్యె పడతి సీత
    పాండవులలోన నెవడగ్ర జుండు తెలుపు
    పార్వతికి స్కందు డగునేమి వరుస యనగ
    రామ భద్రునకున్ , ధర్మరాజు, సుతుడు.

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    వాడా రామభద్రుని కొడుకెహె ధర్మరాజు :

    01)
    ________________________

    ధర్మ పురినందు నివసించు - దంపతులగు
    రామభద్రుడు సంతాన - లక్ష్ము లకును
    బొట్టియడు పుట్ట పేరిడ - ముద్దుగాను
    పిలువ దొడగిరి ప్రజలంత - ప్రియము మీర
    రామభద్రునకున్ ధర్మ - రాజు సుతుఁడు !
    ________________________

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఇంకా జ్వరం తగ్గలేదు.
    దయచేసి ఈరోజు కూడా పరస్పర గుణ దోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  13. స్వీయ పత్నికి నొక డిట్లు చెప్పు చుండె
    రామ! భద్రునకున్ ధర్మరాజు సుతుఁడు
    వాని బ్రేమించె మనపుత్రి వాదులేల?
    తండ్రి నామిత్రుడని నీవు తలచ వేల?

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  14. క్రమాలం కా రం లో ___ _
    దర్ప ము ను జూ పి రాముడు ధనువు విరచ
    సీత సతి యయ్యే నేరి కి చిత్త మ ల ర ?
    జ ము ని వర ము న కుంతి కి జ న న మయ్యే ?
    రామ భ ద్జ్రుని కి న్ "ధర్మ రాజు పుట్టె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర్ రావ్ గారికి, సమశ్య మార్చినారు. అది నిషిద్ధమని అనుకుంటాను ఒక్కసారి యోచన చేయండి

      తొలగించండి
    2. చి వ రి పాదం లో చి వ రి గణము పుట్టె బదులు గా సు తు దు గా చదవాలి అని మ న వి

      తొలగించండి
    3. చి వ రి పాదం లో చి వ రి గణము పుట్టె బదులు గా సు తు దు గా చదవాలి అని మ న వి

      తొలగించండి
  15. యమునియంశనధరణి నియతినిజూపి
    ధర్మ మార్గమున నడచి దయను కలిగి
    సత్సదాచారసేవన సాధు పథము
    రామభద్రునకున్ ధర్మరాజు సుతుడు

    రిప్లయితొలగించండి
  16. యమునియంశనధరణి నియతినిజూపి
    ధర్మ మార్గమున నడచి దయను కలిగి
    సత్సదాచారసేవన సాధు పథము
    రామభద్రునకున్ ధర్మరాజు సుతుడు

    రిప్లయితొలగించండి
  17. తే.గీ. రామ భక్తియె పెంపొంద ( బ్రేమ మీర
    ప్రియము గూర్చిన తనతండ్రి పేరు మీద
    రత్న హారము జేయించె రయము తోడ
    రామ చంద్రునకు ధర్మ రాజు సుతుడు.
    (ధర్మరాజు అనే వాని కొడుకు రామ భక్తుడు.తన తండ్రి పేరుమీద ఆ దేవదేవునికి రత్న హారమొకటి జేయించినాడు.)

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. రామభద్రుడు ధర్మ విగ్రహుడనంగ,
    ధర్మరాజు ధర్మువు నకు తనయుడుగద.
    చింత యేల,సమస్యలో వింత లేదు
    రామభద్రునకున్ ధర్మరాజు సుతుడు

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.

    అరయ జనకుని కూతురెవరికి భార్య ?

    పాండు పుత్రులయందు జ్యేష్ఠుండు
    నెవరు ?
    నర్జునున కభిమన్యుడే మగు వరుసకు?

    రామభద్రునకున్; ధర్మరాజు; సుతుడు.

    రిప్లయితొలగించండి
  21. దక్షిణ దిశాధినాథుఁడు ధర్మమూర్తి
    దండ ధరుఁడు సంయమనీ సుమండన సమ
    వర్తి కాలుండు తారకాధ్వ చల నావి
    రామ భద్రునకున్ ధర్మరాజు సుతుఁడు

    [తారక+అధ్వ+చలన+అవిరామ భద్రుఁడు = తారకాధ్వచలనావిరామ భద్రుఁడు: సూర్యుఁడు]

    రిప్లయితొలగించండి
  22. SHARED FROM WHATSAPP :
    బట్టతలపై పద్యము.
    శ్రీ ఆముదాల మురళి,
    సంస్కృతాంధ్రాచార్యులు, తిరుపతి విశ్వవిద్యాలయం

    సీసము.
    *తలనూనె రాసెడు తగులాటముండదు-*
    *క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు/*
    *పేలు కొంపలు గట్టు పెనుబాధ తప్పును-*
    *చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు/*
    *పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ-*
    *జుట్టింత దొరకదు పట్టుకొనగ/*
    *అద్దంబు దువ్వెన లవసరమే లేదు-*
    *పర వనితలు వెంటబడుట కల్ల/*
    తేటగీతి.
    *కడకు కుంకుడు, శీకాయ ఖర్చు మిగులు/*
    *తలకు స్నానంబు చేయుట సులభమౌను/*
    *ఇన్ని గణనీయ లాభంబు లెంచి చూడ/*
    *బట్టతల గల్గు వాడె పో భాగ్యశాలి.*

    రిప్లయితొలగించండి
  23. మాన్యులు కామేశ్వర రావు గారు విన సొంపైన చక్కని సమాసంతో సమస్యను పరిష్కరించారు. హార్థికాభినందనలు !

    రిప్లయితొలగించండి
  24. రామ భద్రునకు న్ ధర్మ రాజు సుతుడు
    పొసగునే యిది పుడమిని పుణ్య చరిత !
    వేరు వేరైన యుగములు వారివికద
    చింత జేయగ మనకిది వింత గొలుపు

    రిప్లయితొలగించండి
  25. లవుడు కుశుడును సుతులుగ రహినిదెచ్చె
    రామభద్రునకున్, ధర్మరాజు సుతుడు
    కుంతికి, యముని నెనరుగ కూర్మితోడ
    బుట్టి ధర్మమూర్తిగ వెలు గొందె ధరను!!!

    రిప్లయితొలగించండి
  26. “సురభినాటక పాత్రలు దరచిచూడ?
    రామచంద్రునకున్ ధర్మరాజు సుతుడు”
    భీష్మచెల్లియె సీతగాపేరుగాంచె|
    కృష్ణ తమ్ముడేభరతుడుకీర్తిబొందె|

    రిప్లయితొలగించండి
  27. దశరథుండయోధ్యకు రాజు తండ్రి సుమ్ము
    రామభద్రునకున్, ధర్మరాజు సుతుఁడు
    కుంతికి, యముని వరమున కువలయమున
    బుట్టె, ధర్మమార్గముఁ జని పొందె పేరు

    రిప్లయితొలగించండి
  28. కానలందున వాసంపు కష్టమేమొ
    అనుభవమ్మున దెలసిన నినకులేంద్ర!
    యండదండగ కాపాడమనుచు మ్రొక్కె
    రామభద్రునకున్ ధర్మరాజు సుతుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యడాగమ నుగాగమములకుఁ జక్కటి యుదాహరణ మీ పూరణలో లభ్యము.


      అనుభవమ్మునఁ దెలిసిన నినకులేంద్ర : “తెలిసినచో – ఇనకులేంద్ర” అని.
      అనుభవమ్మునఁ దెలిసిన యినకులేంద్ర: “తెలిసి నట్టి - ఇనకులేంద్ర” అని.

      తొలగించండి

  29. పట్టము వలదని యరణ్య వాసమన్న
    రామభద్రునకున్! ధర్మరాజు! సుతుడు!
    మ్రొక్కి తండ్రికి కైకమ్మ కొక్క సారి
    జనకజా లక్ష్మణులవెంట సాగి పోయె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుఁడు గారు చాలా బాగుంది. “జనకజానుజన్ముల” అంటే బాగుంటుంది. “జనకజ లక్ష్మణుల” సాధువు.

      తొలగించండి
    2. ధన్యవాదములు సర్. సవరించిన పూరణ :

      పట్టము వలదని యరణ్య వాసమన్న
      రామభద్రునకున్! ధర్మరాజు! సుతుడు!
      మ్రొక్కి తండ్రికి కైకమ్మ కొక్క సారి
      జనకజానుజన్ముల వెంట సాగి పోయె!

      తొలగించండి
    3. పోచిరాజు వారలకు ప్రణామములు.

      సందేహం :

      సీతారాములు అంటున్నపుడు, జనకజా లక్ష్మణులు
      అనివ్రాయవచ్చని వ్రాశాను. వివరించ ప్రార్థన.

      తొలగించండి
    4. సీత ఆకారాంత స్త్రీలింగము జనకజ అకారాంత
      పదము

      తొలగించండి
  30. అరయఁ కుశలవులిద్దరు అనుగుసుతులు
    రామచంద్రునకున్ ధర్మరాజు సుతుడు
    పాండుభూపాలుకున్ శిఖిబర్హమౌళి
    సుతుడు దేవకీదేవికిన్ చూడ భువిని

    రిప్లయితొలగించండి


  31. కుశలవులిరువురు సుతులు కువలయాన

    రామభద్రునకున్ ధర్మరాజు సుతుడు

    నయ్యె కూరిమి తోడను యముని వరము

    వలన కుంతిదేవికి మరి పాండునకును.


    దశరథుండు ముదంబున తండ్రియయ్యె

    మునివరంబున కుంతికి ముదము కూర్చె

    పార్థుడేమగు జగతిన పాండు నకును

    రామభద్రునకున్ ధర్మరాజు సుతుడు.


    జనకజ సతియు నయ్యెతా సంతసాన

    పాండవాగ్రజుండెవ్వడు భారతాన

    దేవదేవుడేవరసగు దేవకికిల

    రామభద్రునకున్ ధర్మరాజు సుతుడు.

    రిప్లయితొలగించండి