వెంకట నారాయణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'శాస్త్ర జ్ఞానము' అన్నపుడు 'స్త్ర' గురువై గణదోషం. అక్కడ "శాస్త్ర విజ్ఞానమున కంటె సామెతలను" అనండి.
భాస్కరమ్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. (శ్యామల గారూ, భాస్కరమ్మ గారి పేర ఒక జీమెయిల్ ఖాతా ప్రారంభించి దానినుండి పూరణలను పంపిస్తూ ఉండండి. నేను తికమక పడడం, మీరు ప్రతిసారి పద్యం క్రింద 'వీటూరి భాస్కరమ్మ' అని టైపు చేయడం తప్పుతుంది.
నిత్యపరిణతి నందెడి నిఖిలజగతి
రిప్లయితొలగించండిపరమపురుషుని లీలగా వరలుచుండు,
ప్రగతికొరకు స్త్రీపురుషుల ప్రణయ మనెడి
మత్తుమందుసేవించుట మంచిదె కద.
బాపూజీ గారూ,
తొలగించండిమనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
ఎన్ని జన్మము లెత్తితి నిత్తనువును
రిప్లయితొలగించండిపొంద, ముక్తికై తపియింతు భోగమేల?
రహితమగు నట్లఘములెల్ల రామ జోగి
"మత్తుమందు సేవించుట మంచిదె కద"
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిరామజోగి మత్తుమందుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదాన్ని "రక్తి నఘరహితమ్మగు రామజోగి" అంటే బాగుంటుందేమో?
మధురమధురమునై మన మానసమును
రిప్లయితొలగించండిదోచు పాటలు,చల్లగా వీచుగాలి,
మరులుఁగొల్పెడు వీని నేమరకఁగొనుడు
మత్తుమందు సేవించుట మంఛిదెకద
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముదము లోనను వలపుల మోసమందు
రిప్లయితొలగించండివయసు లోనను తలపుల వయసుమీర
శంకరాభరణ మనెడి శంకలేని
మత్తుమందు సేవించుట మంచిదె కద!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిశంకరాభరణపు మత్తుమందు బాగా తలకెక్కినట్టుంది మీకు! చక్కని పూరణ. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిప్రస్తుతానికి సమస్య - 1036 నడుస్తోంది:
G P Sastry (gps1943@yahoo.com)ఆగస్టు 18, 2017 7:49 PM
కవి పెండ్లిచూపు లందున
రవిగానని కిటుకులొప్పి రసికత తోడన్
సవరమ్మా? కేశమ్మా?
"వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్!"
తొలగించండియువతీ! జిలేబి ! సరపణు
లువలయు ననుచున్ రుసరుస లుకలుక లేలా !
సవరము బంగారు ధరల
వివర మెఱుఁగ, లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్ :)
జిలేబి
డా।।జి.పి.శాస్త్రిగారికి, శ్రీ (మతి?) జిలేబిగారికీ
తొలగించండి👏👏👏👏👏👍👍👍👍
తొలగించండిమతిలేని వారలౌ శ్రీ
మతులెల్లను పడతి ! సీత! మగవా రలటుల్
నుతిజేయ తమ్ము, తనివిన్
బతుకుల నీడ్చు సుదతులు శుభాంగీ రమణుల్ :)
జిలేబి
🙏🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిప్రభాకర శాస్త్రి గారికి, జిలేబీ గారికి, సీతాదేవి గారికి అభినందనలు.
తొలగించండిజగతి యువత నశిoచును ఎగసి దినిన
రిప్లయితొలగించండిమత్తుమందు, సేవించుట మంచిదె కద
జగము నేలు వాని నెపుడు శాశ్వ తమగు
ముక్తి కోరుచు జగమున ముదిమి దాక
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నశించును + ఎగసి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "నశించు దా నెగసి" అనండి.
వలపు దారుల పయనించి చెలువు మీర
రిప్లయితొలగించండిమదన హరుని గెలిపించి మమత పెంచి
ప్రేమ సామ్రాజ్య మేలిన భామ కొఱకు
మత్తు మందు సేవించుట మంచిదె కద
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "హరుని గెల్పించియు" అనండి.
వలపు దారుల పయనించి చెలువు మీర
తొలగించండిమదన హరుని గెల్పించియు మమత పెంచి
ప్రేమ సామ్రాజ్య మేలిన భామ కొఱకు
మత్తు మందు సేవించుట మంచిదె కద
తల్లి నవమాసములు మోసి, తల్లడిల్లె
రిప్లయితొలగించండిప్రసవ సమయాన బిడ్డడు బయట పడక;
ఆపరేషను వైద్యపు అవసరాన
మత్తుమందు సేవించుట మంచిదె కద
శ్రీనాథ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వైద్యపు టవసరమున" అని అక్కడ టుగాగమం వస్తుంది.
సరిచేసి నందుకు ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిజల్దు కొనవమ్మ పూరణ చకచకయని
గాంచి చదువుమమ్మ యితర కవుల కైపు!
సహృదయుల హత్తుకొను పద్య సౌరభముల
మత్తుమందు సేవించుట మంచిదె కద !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిపద్యసౌరభాల మత్తుమందుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలువచెలి వెలుగీను యేకాంతమునను
రిప్లయితొలగించండిసకియతోఁ గూడు సరసపు సమయమందు
ననుఁగుఁగత్తియయిడు నధరామృతమను
మత్తుమందు సేవించుట మంచిదె కద
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేనెలొలికెడు తీయని తెనుగు భాష
రిప్లయితొలగించండివనము నందర విరిసిన పద్య విరుల
రసములైపారు నవ మకరంద మనెడు
మత్తుమందు సేవించుట మంచిదె కద
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శస్త్రవైద్య కర్మలయందు మిత్రువోలె
రిప్లయితొలగించండిమానసిక రోగులకు మంచి మందుగాగ
ముదిమి నిద్రలేమి నల్లాడు మోడులకును
మత్తుమందు సేవించుట మంచిదికద!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కాకుంటే రెండవ పూరణ సంతృప్తికరంగా లేదు.
శస్త్రవైద్య కర్మలయందు సఖునివోలె
తొలగించండిమానసిక రోగులకు మంచి మందుగాగ
ముదిమి నిద్రలేమిని వేగు మోడులకును
మత్తుమందు సేవించుట మంచిదికద!
శ్రీ భట్టారం రాధాకృష్ణయ్యగారి సవరణలతో
వారికి ధన్యవాదాలతో!🙏🙏🙏🙏
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారికి ధన్యవాదములు!🙏🙏🙏
తొలగించండిగురుభ్యోనమః
రిప్లయితొలగించండిచదువు సoధ్యలున్న జనులు చవట లైరి
శాస్త్ర జ్ఞానము కoటెను సామెతలను
తలచు వెoగళప్పకున్ ధర్మ సిoధు
మత్తు మoదుసేవిoచుట మoచిదెకద
పూరణ నoదు దోషము తెల్పుడు.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శాస్త్ర జ్ఞానము' అన్నపుడు 'స్త్ర' గురువై గణదోషం. అక్కడ "శాస్త్ర విజ్ఞానమున కంటె సామెతలను" అనండి.
మతము మత్తుమందని యొక మార్క్సు పలికె
రిప్లయితొలగించండిమతము లోక సమ్మతమై సుకృతమొసంగ
నట్టి విశ్వ హితమ్ముగ నలరు మతపు
మత్తు మందు సేవించుట మంచిదె కద
విజయ కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మంచి య ల వా టు కాదది యెంచి చూ డ
రిప్లయితొలగించండిమత్తు మందు సేవించుట ;మంచి దె క ద
భాత్రు భావా న మె ల గు చూ భరత జాతి
క ల సి మె ల సి యు నుండు ట ఘ న ము గాగ
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాదకపు ద్రవ్య ములవాడు మానవుండు
రిప్లయితొలగించండిమత్తులోనుండ వలదన మాన దలచి
తప్పు దెలిసి వైద్యుని గోరి తగను వీడ
మత్తు, మందు సేవించుట మంచిదె కద.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిదేహ స్వాస్థ్యము నంతయు తేర్చు చుండు
మత్తుమందు; సేవించుట మంచిదె కద
కాయమునకు ససిని గూర్చి కాయునట్టి
యౌషధమ్మునెపుడు వైద్యు నొడుగు మేర
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దేహ స్వాస్థ్యము' అన్నపుడు 'హ' గురువై గణదోషం.
మోక్ష గామిగ ప్రతిమకు మోకరిల్లి
రిప్లయితొలగించండిభారతము భాగవతమును పఠన జేసి
చక్రి యవతార మహిమల స్మరణ యనెడి
మత్తుమందు సేవించుట మంచిదె కద
నిన్నటి సమస్యకు నా పూరణ
1 ఒరులకు దెలిపెడి దొకటియు
కరమది తనదగు స్వలాభ కార్యార్థంబై
జరిపెడి దొకటియు గలిగిన
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా
2 వరమని దలచుచు జేయుము
గురువుల పదసేవఁ ; జేయఁ గూడదు శిష్యా
కఱవయి జ్ఞానము భోధన
బిరుదులకే ప్రాకులాడు భీలుల కెపుడున్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివైద్యులాచరించెడి శస్త్రవైద్యమందు
వ్యాధిపీడితులకునెల్ల వంతలేక
పరిమితమ్ముగనిడు నిరపాయమైన
మత్తుమందు సేవించుట మంచిదెకద!
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
క్షణమె యానందమిడు విచక్షణను
చంపు
నాస్తి,యారోగ్యముల నాశన మొనరించు
మత్తు మందు; సేవించుట మంచిదె గద
పోషక ద్రవ పదార్థముల్ పుష్కలముగ.
నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నాస్తి'కి అన్వయం?
మత్తు మందు సేవించుట మంచిదె కద
రిప్లయితొలగించండిమంచి దెన్నటికినిగాదు మత్తు మందు
హేయమైనది సేవన మార్య ! నిజము
దాని జోలికి బోయిన దారితప్పు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిత్తమందున దిగులేల స్నేహితుండ
రిప్లయితొలగించండిసత్తువనిడ సరసకేళి సలుపు నపుడు
నిత్తునోమందునానందమిడెడియా గ
మత్తుమందు సేవించుట మంచిదె కద
సూర్యనారాయణ గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రమా - తేటగీతి లోప్రాసనుకూడా పాటించిన మీ ప్రజ్ఞ అమోఘం. అభినందనలు.
తొలగించండివెంకట రెడ్డి గారూ,
తొలగించండిమీరు చెప్పేదాక ఆ విశేషాన్ని నేను గమనించలేదు. ధన్యవాదాలు.
తొలగించండిఅవునండోయ్ ! ఈశ్వరప్ప గారు కూడాను!
జిలేబి
క్లిష్టమైనట్టి రోగమ్ము కీడొనర్చు
రిప్లయితొలగించండినంచు శస్త్రచికిత్సకు నానతీయ
వ్యాధిపీడితు రక్షించు వ్యాపకమున
మత్తుమందు సేవించుట మంచిదె కద
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(శ్యామల గారూ, భాస్కరమ్మ గారి పేర ఒక జీమెయిల్ ఖాతా ప్రారంభించి దానినుండి పూరణలను పంపిస్తూ ఉండండి. నేను తికమక పడడం, మీరు ప్రతిసారి పద్యం క్రింద 'వీటూరి భాస్కరమ్మ' అని టైపు చేయడం తప్పుతుంది.
రోగములు రామి మదినెంచి వేగ మంచి
రిప్లయితొలగించండిమందు నెన్నుకొని సుఖము నొంద, ముందు
చూపు గల వాని వీనినిఁ జూడు మప్ర
మత్తు, మందు సేవించుట మంచిదె కద
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిరామ నామ మంత్రంబను రక్షనిడెడి
రిప్లయితొలగించండిమత్తుమందు సేవించుట మంచిదికద
చిత్తమందు చిన్మాత్రము చింత జేయ
వాడు వందనీయుడు ఘన వంశకరుడు
రామమోహన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిమత్తు గమ్మత్తు గాజేరి చిత్త మందు
రిప్లయితొలగించండిహత్తుకొను వెలయాలి మోహమ్మునందు
విత్త రోగాలు దేహాన విధులుద్రుంచ?
“మత్తు మందు సేవించుట మంచిదె కద
యనెడిమంచి మిత్రుడుశత్రు వనుట తప్ప”?
బాల్యమందున తలిదండ్రి,భార్యయవ్వ
రిప్లయితొలగించండినంబున,కౌమార దశలందు నమ్మిసంతు,
వృద్దు లవ్వ?పుత్రుండును”విశ్వ మందు
మత్తుమందు”|సేవించుట మంచిదె కద”| {వారిని=తలిదంద్రిని,భర్తను,సంతు,పుత్రుడు}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురువుగారు దోషములు సవరిoచినoదులకు ధన్యవాదము లు.
రిప్లయితొలగించండిపాపముల బారద్రోలెడి ప్రభువు విమల
రిప్లయితొలగించండిరఘుకులోన్నతుడైన శ్రీరామ రసపు
మత్తు మందు సేవించుట మంచిదె కద
సకల శుభముల నొనగూర్చు సామి యతడు
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధనమదమ్మును రూపయౌవనము,బలము,
రిప్లయితొలగించండిపారుపత్తెము గల్గిన పదవొసంగు
కైపు కన్నను రాముని ప్రాపు జేర్చు
మత్తు మందు సేవించుట మంచిది కద
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
త్రాగుడలవాటు లేకున్న తప్పదనఁగ
రిప్లయితొలగించండివిందు మర్యాద పాటించ విజ్ఞతనుచు
పెక్కు నీళ్లతో లోటాకు చుక్కవైచి
మత్తుమందు సేవించుట మంచిదె కద!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివలలునితో సైరంధ్రి :
రిప్లయితొలగించండిమదిర నొసఁగి కీచకునకు మరులు గొలిపి
ప్రభువ! నర్తనశాలకు రమ్మనంటి
చావఁ బోవుచు మీ చేత శత్రువతఁడు
మత్తుమందు సేవించుట మంచిదె కద!
తత్తరంబు చెందంగక తా ను వైద్య
రిప్లయితొలగించండిముత్తమా వైద్యులంజేరి ముదమునకద
మత్తుమందు సేవించుట మంచిదె కద
తత్తరం పాటు వీడిన తాను జేరు
వాస్తవంగా నొకానొక మిత్రుడు నాతో అన్నమాట:
రిప్లయితొలగించండిమహిని నూరేళ్లు బ్రతుకుచు మనుమలు ముని
మనుమలు ముసలోడాయని సణగు మునుపె
బకెటు తన్నంగ ముదమున బాధ మఱువ
మత్తుమందు సేవించుట మంచిదె కద!
రిప్లయితొలగించండిసత్వరముగ నాశమొనర్చు సరుకిది యని
యెంచకుండగ సేవింప నిన్ను గూల్చు
మత్తుమందు,సేవించుట మంచిదెకద
సాత్త్వికమగు నాహారము చయ్యనగను.
రామ నామమె పావన మీమహినని
రామదాసు తా చెరలోన రహితోడ
పరవశంబున తలచెను భక్తి యనెడి
మత్తుమందు సేవించుట మంచిదె కద.
మదికి నాహ్లాదము నొసగుమహితమైన
తెనుగు పద్యములనునట్టి తీయనైన
మత్తుమందు సేవించుట మంచిదెకద
కాన సేవించెద సతము ఘనము గాను.