గురువుగారూ నమస్సులు. పాత సమస్యలో బుద్ధి కౌశతన్ అని వ్రాసి యున్నాను. కౌశత అన్న పదం లేదు అన్న విషయాన్ని మీరు ప్రస్తావించినా నేను గమనించక పోవడం వలన సవరించలేదు. కుశలత కి కౌశత రూపాంతరమని భావించాను కానీ ఆ పదం లేదని గమనించలేదు. ప్రసాదరావు గారి పుణ్యమా అని ఈ రోజు పునఃసమీక్ష జరిపే అవకాశం కలిగింది. మీ సూచనకు ధన్యవాదములు. సవరించాను.
గురువు గారికి మనవి. నిన్నటి పూరణలో గల దోషములు తెలిపి సవరిoప విన్నపము.Sraahyasree అనే పదము వాడినాను. పద్మశ్రీ పొoదిన కుకవుల విద్రోహులను శిక్షిoచాలి అనే భావన తో పూరిoచాను.
కవిమిత్రులు మన్నించాలి... రవీంద్రభారతిలో తెలుగు భాగవతం.ఆర్ద్ కార్యక్రమంలో పాల్గొని ఇంతకు ముందే నెలవు చేరాను. ప్రయాణపు టలసట వల్ల ప్రస్తుతం మీ పూరణలను సమీక్షించలేను. రేపు ఉదయం చూస్తాను. శుభరాత్రి!
నమస్కారాలు, నేను రెండు విధాలుగా పూరించాను. శాకుంతీ అంటే ఆడపక్షి అను ఉద్దేశ్యముతో మొదటిపద్యమును, భారతార్థములో రెండవ పద్యమును పూరించాను. సంతతకరుణాహృదయుడు చెంతకువచ్చెడి యిడుముల చెండు ప్రభుడు భ క్తాంతర్నీడస్థితశా కుంతీపుత్రుడు వినాయకుడు గద శిష్యా!
చింతలతో కర్ణుండౌ
రిప్లయితొలగించండికుంతీపుత్రుఁడు; వినాయకుఁడు గద శిష్యా!
వింతైన ముఖము తోడన్
కొంతయు కోపమ్ము లేక కోర్కెలు తీర్చున్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చింతింపగ కర్ణుండౌ" అనండి.
కొంతేనిన్ సంభావ్యత
రిప్లయితొలగించండిసుంతైనన్ కానరాని శుంఠలు చేరన్
వింతల్బల్కుదురిటులన్
కుంతీపుత్రుడు వినాయకుడుఁగధ శిష్యా!
వినాయకడుఁగద శిష్యా
రిప్లయితొలగించండిటైపాటుకు మన్నంచండి
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాంతా! యేనారి సుతుడు
రిప్లయితొలగించండిశాంతనవుని గూల్చె ? నెవడు సామజ ముఖుడో
యింతీ! తెలుపవె నాకన
కుంతీపుత్రుడు, వినాయకుడు గద శిష్యా.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంతము పట్టియు విఘ్నము
రిప్లయితొలగించండినంతము జేయంగ సాటి నరునకు గలరే
సాంతము పరికింపగనా
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు గద శిష్యా!
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వినాయకుడు - అర్జునుడు, వీరిరువురు శివుని ఎదిరించి, శివుని కృపకు పాత్రులైనవారె-- కావున
రిప్లయితొలగించండిదంతి ముఖుడు పోరె మునుపు
పంతము పట్టె విజయుండు పంది కొఱకు, దృ
ష్టాంతములఁ జూడ నిజముగ
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు గద శిష్యా!
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిశాంతము! ధర్మజుడు సుమా
కుంతీపుత్రుఁడు! వినాయకుఁడు గద శిష్యా
యంతకహరునికి యంబకు
నెంతయు ముద్దుల తనయుడు! నెరనమ్ముమురా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..హరునికి నంబకు' అనండి.
వింతగ మంత్రము జపియించ
రిప్లయితొలగించండికుంతీపుత్రుఁడు , వినాయకుఁడు గద శిష్యా
సంతసమున ప్రదక్షిణము
తంతుగ గావించె నంట తలిదండ్రుల చుట్టూ
అక్కయ్యా,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసింపదగినదే. కాని సమస్యాపాదం తప్ప మిగిలిన పాదాలలో గణదోషం. సవరించండి.
సంతతము చెప్పుచుండిన
రిప్లయితొలగించండిసుంతయు తా నేర్వనట్టి శుంఠకు ననె నా
పంతులు పరిహాసంబుగ
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు గద శిష్యా!
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంతక సుతుoడు సతతము
రిప్లయితొలగించండి"కుంతీపుత్రుఁడు, వినాయకుఁడు గద శిష్యా!"
అంతక హరునిస తివలన
సంతసముగ కరి ముఖుడుగ జన్మం బొందెన్
అంతక సుతుడు = ధర్మరాజు
అంతక హరుడు = శివుడు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాంతారంబున గౌరీ
రిప్లయితొలగించండికాంతునిచే పాశుపతము గాంచినదెవరో?
సంతోషి జనకుడెవరో?
కుంతీపుత్రుడు; వినాయకుడు గద శిష్యా!
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంతోషీమాత వినాయకుని కూతురా? నాకు తెలియదు!
ధన్యవాదములు.అవునండి
తొలగించండిధన్యవాదములు.అవునండి
తొలగించండిఆర్యా!ఈసమస్య 20-6-2017 న ఇచ్చినదే!
రిప్లయితొలగించండికుంతీ పుత్రుడు వినాయకుడు సత్యమిదే
పసాద రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు! మతిమరుపు మరీ ఎక్కువయింది. ఇప్పటికే పెక్కురు కవులు పూరణలు పంపారు. కనుక ఇప్పుడు మార్చడం కుదరదు. ఉండనివ్వండి...
Namaste
తొలగించండిపంతము పట్టి యు కీచకు
రిప్లయితొలగించండినంత ము చేసి న దె వ oడు?ఆటంకము ల న్
చెంతకు రానీ య డే వ డు ?
కుంతీ పుత్రుడు 'వినా య కు డు గ ద శిష్యా !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చింతిత మతియౌ పంతులు
రిప్లయితొలగించండినెంతో శ్రద్ధగ నడుగగ నేమరుపాటున్
వింతగు దైవంబెవరన
కుంతీపుత్రుడు వినాయకుడు గదశిష్యా!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుభ్యోనమః
రిప్లయితొలగించండిపూరణ ను పరిశీలిoప ప్రార్థన.
శాoతిని బొoదినదిఎవరు?
విoతవదనముగలసురప్రవిశిష్టుడెవరు?
వoతుల వారిగ చెపుదును
కుoతీపుత్రుడు వినాయకుడేగదా శిష్యా?
నిన్నటి పూరణ అక్కడ పోస్టు చేర్చబడింది.
వoదనములు.
వెంకట నారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వింతగ బుట్టిన కొమరుడె
రిప్లయితొలగించండికుంతీ పుత్రుడు ,వినాయకుడు గద శిష్యా !
కంతుని శత్రువు కొడుకే
వింతేమీ లేదురమ్య! వివరణగోరన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంతి తన నారవపతిగ
రిప్లయితొలగించండిసంతసమున స్వీకరించు సంగతి కృష్ణుం
డంతగ జెప్పె, నినజుడన
కుంతీపుత్రుఁడు వి నాయకుఁడు గద శిష్యా!
(వినాయకుఁడు = విశేష నాయకుడు )
నమ్మిన వారి కష్టముల నార్తిగఁ దీర్చెడి సాకతంబునన్,
రిప్లయితొలగించండివెమ్మున పెద్దలందరిని పెంపున గొల్చు విధేయతన్, సకా
లమ్మున కార్యదీక్ష నచలంబుగ నుండెడి ధీబలంబునన్
నమ్ముఁడు కుంతి పుత్రుఁడు వినాయకుఁడే జనులార చెప్పితిన్
గురువుగారూ నమస్సులు. పాత సమస్యలో బుద్ధి కౌశతన్ అని వ్రాసి యున్నాను. కౌశత అన్న పదం లేదు అన్న విషయాన్ని మీరు ప్రస్తావించినా నేను గమనించక పోవడం వలన సవరించలేదు. కుశలత కి కౌశత రూపాంతరమని భావించాను కానీ ఆ పదం లేదని గమనించలేదు. ప్రసాదరావు గారి పుణ్యమా అని ఈ రోజు పునఃసమీక్ష జరిపే అవకాశం కలిగింది. మీ సూచనకు ధన్యవాదములు. సవరించాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికమలార్చిత పద కమలము
తొలగించండికమలాసనున కభయంపు కరములు కరమా
ల మరులు కొనియెడి సుమములు
సుమ దామ విలసిత కంఠు సుందరు గొలుతున్
కరివర వరదు మకరి హరు
హరినిభకటి మురహరి నరహరి ఘనకిటినిన్
హరిగణ విభునుతు భవభయ
హరు ముదముగ గొలుతు హరిని హరిఫణ శయనున్
సంతత దానరత మహా
తొలగించండిద్వాం తారా త్యాత్మజుండు ఫల్గుణ రిపుఁడున్
దంతిపుర నాథ మిత్త్రుఁడు
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు గద శిష్యా
[వి నాయకుఁడు = ప్రతి నాయకుఁడు]
ఇంతి తన నారవపతిగ
రిప్లయితొలగించండిసంతసమున స్వీకరించు సంగతి కృష్ణుం
డంతగ జెప్పె, నినజుడన
కుంతీపుత్రుఁడు వి నాయకుఁడు గద శిష్యా!
(వినాయకుఁడు = విశేష నాయకుడు )
వింతగు జననములెంచగ
రిప్లయితొలగించండికుంతీ పుత్రుడు,వినాయకుడుగద?శిష్యా
చింతించగ రవి, శక్తిగ
పంతంబున పిండిబొమ్మ పార్వతిసుతుడే|
2.చింతేలకర్ణ మీరే
కుంతీ పుత్రుడు,వి-నాయకుడుగద|శిష్యా
పంతంబున దుర్యోధన
కాంతిగ ,లోకాన దాన కర్ణుడువినగా|
గురువు గారికి మనవి.
రిప్లయితొలగించండినిన్నటి పూరణలో గల దోషములు తెలిపి సవరిoప విన్నపము.Sraahyasree అనే పదము వాడినాను.
పద్మశ్రీ పొoదిన కుకవుల విద్రోహులను శిక్షిoచాలి అనే భావన తో పూరిoచాను.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినిన్నటి పూరణ:
ద్రోహము కాదెన్నటికిన్
ద్రోహుల శిక్షించుట; ఘన దోషము గాదే
దేహము నర్పించిన సతి
సౌహార్ధము నెల్ల వీడి చరియించుటదిన్?
నేటి పూరణ:
వింతగ విరటుని కొలువున
కాంతలకు నృతిని కఱపిన కపిరధు డెవరో?
శాంతికి నందను డెవరో?
కుంతీపుత్రుడు, వినాయకుడు గద శిష్యా!
అంతమ్మొనరించె బకుని
రిప్లయితొలగించండికుంతీపుత్రుడు.వినాయకుడు గద,శిష్యా
దంతమ్ము పెరికి వ్రాసె ను
దంతమ్మును భారతమును తాపసి తెలుపన్
కవిమిత్రులు మన్నించాలి... రవీంద్రభారతిలో తెలుగు భాగవతం.ఆర్ద్ కార్యక్రమంలో పాల్గొని ఇంతకు ముందే నెలవు చేరాను. ప్రయాణపు టలసట వల్ల ప్రస్తుతం మీ పూరణలను సమీక్షించలేను. రేపు ఉదయం చూస్తాను. శుభరాత్రి!
రిప్లయితొలగించండినమస్కారాలు,
రిప్లయితొలగించండినేను రెండు విధాలుగా పూరించాను. శాకుంతీ అంటే ఆడపక్షి అను ఉద్దేశ్యముతో మొదటిపద్యమును, భారతార్థములో రెండవ పద్యమును పూరించాను.
సంతతకరుణాహృదయుడు
చెంతకువచ్చెడి యిడుముల చెండు ప్రభుడు భ
క్తాంతర్నీడస్థితశా
కుంతీపుత్రుడు వినాయకుడు గద శిష్యా!
శాంత్యాదిపర్వసహితము
వింతగు భారతమునందు విఖ్యుడెవడు తా
దంతమున వ్రాసెనెవడన
కుంతీపుత్రుడు వినాయకుడు గద శిష్యా!
లలిత్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.