23, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2444 (పాలిచ్చిన తన జనకుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

64 కామెంట్‌లు:

  1. బాలుడు ఎడ్వడు సూషణ
    పాలిచ్చిన, తన జనకుని భజియింపవలెన్
    మేలుగ బుద్ధులు నేర్పుచు
    పాలకునిగతీర్చిదిద్ది పరిణితి నొసగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలుండే డ్వడు సూషణ
      పాలిచ్చిన, తన జనకుని భజియింపవలెన్
      మేలుగ బుద్ధులు నేర్పుచు
      పాలకునిగతీర్చిదిద్ది పరిణితి నొసగన్

      తొలగించండి
  2. ఆలముతో పనిలేకనె
    జాలము నేమాత్రము మది సరకుగొనక నే
    కాలము మెచ్చగ రాజ్యపు
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్.

    రిప్లయితొలగించండి
  3. బాలక సేంసను వోలెన్
    గాలికి నెగురుచును ధోని గళకము మీదన్
    రాలెడి, భుజములపై, జుల
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    సేంసను = Biblical Samson (of Delilah fame)

    గళకము = మెడ

    రిప్లయితొలగించండి
  4. వేలగు నిడుముల నొక్కడె
    లీలగ మోసియె,సుతుండు లెస్సగ బ్రతుకన్
    శ్రీలందును భళిరా! తగు
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  5. బాలలనవిరళ ప్రేమను
    మాలిమిజేయుచు సముచిత మార్గము నందున్
    లాలన నడిపించుచు మురి
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  6. జాలము చేయ తగదని స
    కాలమని సుతుని వివాహ కార్యము జేయన్
    ఏలా బ్రతుకుటనగ సగ
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్.
    (ఏలా=ఎటుల)

    రిప్లయితొలగించండి
  7. ఖేలన సంబరమునకై
    బోలెడు మోదమ్మునిచ్చు బొమ్మలనడిగే
    బాలిక, ఉయ్యాలను జం
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్ ||

    రిప్లయితొలగించండి
  8. ఆలించుచు ముదమున పరి
    పాలించుచు విద్యనొసగి వైనముతోడన్
    హాలికుడయి యాస్తియు మురి
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్!

    రిప్లయితొలగించండి
  9. తాలిమితో బాల్యంబున
    మేలగువిద్యలను నేర్పి మిక్కిలిప్రేమన్
    ఈలోకమునన్ కీర్తిన్
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  10. తాలిమి కలిగిన వాడై
    మాలిమి తో కన్న సుతుని మరులు గ తానే
    లాలించి పెంచి కడు మురి
    పాలిచ్చి న త న జనకుని భజియిoచవలె న్

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    తల్లీ తండ్రి అన్నీ తానై పెంచిన తండ్రిని :

    01)
    ___________________

    బాలుని గని జననియె జన
    మేలుగ మనసిచ్చి , మిగుల - మేటిని జేయన్
    కాలము గడపిన విధురుని
    పాలిచ్చిన తన జనకుని - భజియింపవలెన్ !
    ___________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ప్రేమిస్తే సినిమా స్ఫూర్తితో :
      (కళ్ళు లేవని పిల్ల నొదిలేస్తుందొక తల్లి)

      02)
      ___________________

      పోలియొ కాలని తల్లియె
      గాలికి త్యజించి మిండ - గానిని జేరన్
      కాలముతో పోటీ పడి
      పాలిచ్చిన తన జనకుని - భజియింపవలెన్ !
      ___________________
      మిండగాడు = వ్యభిచారి

      తొలగించండి
    3. భవిష్యత్తులో కొడుకును
      software engineerను చెయ్యాలని
      అక్షరాభ్యాసము నాడే నిశ్చయించు కొనిన జనకుడు :

      03)
      ___________________

      కాలములో పలు విధమగు
      జాలపు విద్యలను నేర్ప - జరుగురు పడుచున్
      జోలల బాడుచు, పలు బల
      పాలిచ్చిన తన జనకుని - భజియింపవలెన్ !
      ___________________
      జాలపు విద్య = Dot Net తదితర software చదువులు

      తొలగించండి
    4. గుండెలో రంధ్రముతో పుట్టిన బిడ్డను
      మురిపెముతో అన్నీ తానై పెంచిన తండ్రి :
      04)
      ___________________

      కాలుడు కక్షదె బూనన్
      వేలగు ఖర్చుకు వెరువక - వేసారుచునే
      మేలుగను బెంచ, మురిపెపు
      పాలిచ్చిన తన జనకుని - భజియింపవలెన్ !
      ___________________
      వేసారు = శ్రమపడు
      మురిపెము = ప్రేమ

      తొలగించండి
    5. శంకరార్యా
      మురిపాలు అనే పదం ఆంధ్రభారతి లో కనుపించలేదు
      ఆ పదం ఉన్నట్టా లేనట్టా

      తొలగించండి
    6. స్వయంకృషి సినిమా స్ఫూర్తితో :

      (దుష్టుడైనా పాపిష్ఠి యైనా తండ్రిని
      పూజించమని గదా శాస్త్ర వాక్కు)

      05)
      ___________________

      వేలను సముపార్జించగ
      కూళుడు జారుడు పెనుకలి - కుత్సిత మదితో
      వ్యాళము బోలుచు, మద్యపు
      పాలిచ్చిన తన జనకుని - భజియింపవలెన్ !
      ___________________
      పెనుకలి = వర్ధిల్లునది
      వ్యాళము = పాము

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి

    8. మురి,మురిపము- నడక యందలి కులుకు

      యిది మురిపాలవుతాయా తెలియదండి :)

      జిలేబి

      తొలగించండి
    9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    10. మురిపెము = ప్రేమ
      ముద్దు మురిపాలు అనేమాట ఎన్నోసార్లు చదివి విని యున్నాము గదా
      దానిని దృష్టి నిడుకొని....

      తొలగించండి
    11. అన్నీ అమర్చి, ఆస్తిలో వాటా కూడా యిచ్చి చివరకు
      వృద్ధాశ్రమం జేరిన ప్రతీ తండ్రియు పూజనీయుడే :

      06)
      ___________________

      మేలగు తిండియు విద్య, స
      కాలములో కూర్చి, పెంచ - కటకట పడుచున్
      బోళాతనమున నాస్తిని
      పాలిచ్చిన తన జనకుని - భజియింపవలెన్ !
      ___________________
      పాలు = భాగము
      కటకటపడు = లేమితో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొను

      తొలగించండి
    12. తండ్రి వలన భీష్మున కెంత అన్యాయం ! అయినా.....

      07)
      ___________________

      స్త్రీ లోలపు జనకునికై
      బాలను నందివ్వ కఠిన - బాసను మగ్గెన్
      లోలాక్షుల ప్రేముడి విడి !
      పాలిచ్చిన తన జనకుని - భజియింపవలెన్ !
      ___________________
      బాస = ప్రతిజ్ఞ

      తొలగించండి
    13. యవ్వనము దోచుకొన్నా-
      పూరుణ్ణి చక్రవర్తిని చేసిన యయాతియు పూజనీయుడే !

      08)
      ___________________

      స్త్రీ లాలస గల తండ్రికి
      లాలిత్యపు పడుచుదనము - రయమున నిచ్చెన్
      బాలుడు పూరుడు ప్రేమన్ !
      పాలిచ్చిన తన జనకుని - భజియింపవలెన్ !
      ___________________

      తొలగించండి
    14. బెత్తాలతో చితక బాదినా పూజనీయుడే :

      09)
      ___________________

      ఏలాగైనా విద్యను
      గోలయు గగ్గోలు వెట్ట - కూర్చెడి తలపున్
      బాలుని వృద్ధికి పలు య
      ర్పాలిచ్చిన తన జనకుని - భజియింపవలెన్ !
      ___________________
      అర్పము = బెత్తము

      తొలగించండి
    15. మురిపము, మురిపెము రెండు రూపములు కలవు. మురిపములు బహువచనము కాబట్టి నిఘంటువులలో కనిపించదు.
      లులనల సంధి యనుసరించి మురిపాలు , మురిపేలు రెండు రూపములు రావచ్చును. అయితే ఒకానొకచో నన్న కారణమున మురిపేలు తరచు వాడరు. వీనికి కావ్య ప్రయోగములు చాలా యరుదు.
      వజ్రాలు, పగడాలు, పాపాలు యిత్యాది ప్రయోగములు కనిపించును. సర్వంబునకు ననుటచే ముందున్న యే స్వరమున కైనా దీర్ఘము వచ్చును (మురిపేలు).

      బాల. వ్యా. తత్స. 43
      లు ల న లు పరంబులగునపు డొకానొకచో ముగాగమంబునకు లోపంబును,
      దత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాష నగు.
      వజ్రాలు - వజ్రాలను - వజ్రాన, పగడాలు - పగడాలను - పగడాన.
      ఒకానొకచోట ననుటచే నీ కార్యంబునకుం బ్రయోగ వైరళ్యంబు సూచింపంబడియె.

      తొలగించండి
    16. వసంత కిశోర్ గారు మీరే వాడారు కదా “అర్పాలు, బెత్తాలు” పదములు.

      తొలగించండి
    17. కామేశ్వరరావుగారూ ధన్యవాదములు
      అయ్యా బహువచనమును నిఘంటువులో వెతికిన వాడిని ......
      ఆ క్షణం లో అంతే ............అదొక అఙ్ఞానం

      తొలగించండి
  12. నేలన్నటునిటు పొర్లెడు
    బాలునికొసగె టపాసులు,బాంబుల్,
    పూల మతాబులు పలు స
    ర్పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి

  13. బేలా! కర్రుచ్చుకొనుచు
    నాలుగు దెబ్బలటు మొత్తినను మన నలికే!
    లాలించి, జిలేబీ, మురి
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. లాలనలో పాలనలో
    మేలిమి జీవన గమనపు మేలును గూర్చన్
    శ్రీలను,ననురాగము,తగు
    పాలిచ్చిన తన జనకుని భజియింప వలెన్

    రిప్లయితొలగించండి
  15. లాలనలో పాలనలో
    మేలిమి జీవన గమనపు మేలును గూర్చన్
    శ్రీలను,ననురాగము,తగు
    పాలిచ్చిన తన జనకుని భజియింప వలెన్

    రిప్లయితొలగించండి


  16. గోళీ లాటల జోడుగ
    పాళీ బట్టెడు చతురిమ పద్యపు సొబగుల్
    భోళా శంకరుడై గ
    ప్పాలిచ్చిన తన జనకుని భజియింప వలెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. మూలకు మ్రొక్కు మటన్నన్
    గేలిగఁ దలఁచి పడగొట్ట గృహమందున నా
    మూలయె పెన్నిధి, నిక్షే
    పాలిచ్చిన, తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  18. హేలగ సకల భువనముల
    మేలగు రీతిని సృజించి మీరగ ప్రేమన్
    లీలగ జగదంబకు సగ
    పాలిచ్చిన మన జనకుని భజియింపవలెన్!

    అన్వయము కొరకు తన ను మన గా మార్చినందుకు క్షమార్పణలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇటువంటి మార్పులు లోగడ కూడా గమనికకు వచ్చాయి. సమస్యను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క అక్షరం కూడా మార్చకూడదు. ఉన్నవి రెండే స్వతంత్రాలు. ఒక్మట్టిి - అక్షరమో చివరి అక్షరమో సంధికార్యంలోనికి త్రోసివేయటం రెండు - సమస్యాపాదాన్నో పదస్మూహాన్నో పద్యంలో యధాక్రమంగా యధేఛ్ఛగా ఎక్కడన్నా వినియోగించుకోవటం (ఒకసారి అని ఏమీ లేదు ఎన్నిసార్లయినా వాడుకోవచ్చును. కాని ఒక్క సారైనా సరే ఇచ్చిన క్రమంలోనే వాడి చూపాలి). సమస్యలోని అక్షరాలో పదాలో మార్చితే పూరణ చెల్లదు.

      తొలగించండి
    2. పూజ్యులు శ్యామలరావుగారికి నమస్సులు ధన్యవాదములు!🙏🙏🙏🙏

      పోనీ సమస్యను యధాతథముగ తన జనకుని యని పూరించిన సరియగునా?
      యెవరికి వారికి ఆయనయే యసలు జనకుడు కదా! సూచించ మనవి!

      తొలగించండి

    3. ద్వారపాలకః ఆగచ్చసి :)

      జిలేబి

      తొలగించండి
  19. పాలన భాగము తెనుగున
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్
    బా లీయని తన జనకుని
    చాలరు పోషింప భువిని సంతృప్తిగగన్

    రిప్లయితొలగించండి
  20. పిన్నక నాగేశ్వరరావు.

    పాలిడె సీసాతో, బల

    పాలను వ్రాయుటకిడె, మురిపాలను
    పంచెన్
    లాలించుచు, కలిమిన్ సగ

    పాలిచ్చిన తన జనకుని భజియింప
    దగున్.



    రిప్లయితొలగించండి
  21. మూలకు మ్రొక్కు మటన్నన్
    గేలిగఁ దలఁచి పడగొట్ట గృహమందున నా
    మూలయె పెన్నిధి, నిక్షే
    పాలిచ్చిన, తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  22. కాలాను గుణముగా సల
    హాల నొసఁగుచుఁ గలహాల నన్నింటి మహా
    హాలాహలా లనుచు మురి
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  23. కవిమిత్రులారా, నమస్కృతులు.
    రాత్రి నుండి జ్వరం. పైగా తలనొప్పి. దయచేసి ఈరోజు పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారు:

      నా వలన ఏదైనా ప్రయోజనం ఉన్నదని తోచినచో నాకు వెంటనే ఫోను చేయవలను. నిస్సంకోచముగా.

      నమస్సులు!

      తొలగించండి
  24. గురువర్యులకు నమస్సులు! మీ యనారోగ్యము కలవర పరచుచున్నది! ఆశ్రమములో తగిన సేవలు దొరకునా? శ్రద్ధ వహించ వలసినది! త్వరగా కోలుకొనవలెనని అభిలషిస్తున్నాము!!🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  25. కాలంబంతయు శ్రమపడి
    మేలగు విద్యలను నేర్పి మేటిగ జూడన్
    తాలిమితో బెంచుచు మురి
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్!!!

    మేలగు పలకను విరచిన
    గోలను మరి జేయుచున్న కోపించకనే
    లాలనము జేయుచును బల
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్!!!

    రిప్లయితొలగించండి
  26. మేలగు కవలలు బుట్టగ?
    తాలిమిచే తల్లిదండ్రి ధర్మము చేతన్
    జాలిగ డబ్బుల డబ్బా
    పాలిచ్చిన తనజనకుని భజియింప వలెన్.
    2.మేలగు పొలమునునొకనికి
    వేలుపువలె విద్య నేర్పె వేరొకనికి యీ
    లోకులు మెచ్చగనే సమ
    పాలిచ్చిన తనజనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  27. గురువు గారు మీకు ఆశ్రమము లో సరియగు వసతులు గలవా?
    కాలమున పరిగెడు తెలుగు
    నాలు మగలు బొoదిరిగద నవజాత శిశున్
    బాలికకు హాస్యరస మురి
    పాలిచ్చనతనజనకుని భజియిoపవలెన్
    నమస్సులు.

    రిప్లయితొలగించండి
  28. కాలాను కూలముగ నన్
    మేలిమి చదువు జదివించె మేలును పొందన్
    జాలిగొని తనార్జనలో
    పాలిచ్చిన జనకుని భజయించవలెన్.

    రిప్లయితొలగించండి
  29. పాలకమండలి కోరగ
    మేలగు పూజలను సలిపి మృడునకుఁ బురి దే
    వాలయమందున దృతి న
    ప్పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  30. పాలిచ్చి శరీర మొసగు
    పోలిక లేనట్టి జనని పూజింపదగున్
    తాలిమి నా మేనికి ను
    త్పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్౹౹

    రిప్లయితొలగించండి
  31. శీలము పెంపొనరింపగ
    కాలంబున నుపనయనపు కర్మను గడపిన్
    మేలుగ యాగము లందున
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  32. లోల త చేసిన బొమ్మ యె
    మే ల గు విఘ్నాలు బాపిమే టి సురుoడై
    లాలించి న మాత కు స గ
    పాలిచ్చి న త న జ న కు ని భజి యించవ లె న్

    రిప్లయితొలగించండి
  33. కం. లాలనతో పోషించియు,
    హేలగ బాల్యమ్ము జేసి హితమును గూర్పన్
    మేలుగ సంపదలో సగ
    పాలిచ్చిన తన జనకుని భజియింప వలెన్.

    రిప్లయితొలగించండి
  34. దాలిచి హిరణ్యుఁడా గద
    వేలుపుఁ గన కంబమందు వ్రేటొకటిడుచున్
    తేలఁగ నృశింహు నొడి మురి
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురిపాలు అన్నది వాడుక పదమే గాని పద్యంలో మురిపెములు అని వాడవలెనని నా అభిప్రాయం. పైన వసంత కిశోర్ గారు కూడా ఇదే మాట అడిగారు.

      తొలగించండి
    2. పద్యాల్లో మురిపాలు అని నిక్షేపంగా వాడవచ్చును.

      తొలగించండి
  35. ఏల సుతకు భాగమనక
    మేలిమి తలపులు నుడివిన మేరకు జనుచున్
    చేలమ్మిన ధనమున సగ
    పాలిచ్చిన తన జనకునిభజియింప వలెన్!

    గురువర్యులుకు నమస్సులు. 19, 21 వ తేదీల నాటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.
    మనుజ జన్మమె బుద్బుద మనుచు నెంచి
    బ్రతుకు సాగించు రీతుల భావ మెఱిగి
    తనివి తీర నాధ్యాత్మిక తత్త్వ మనెడి
    మత్తు మందు సేవించుట మంచిదె కద!

    నినుల మానము నడచు
    మానవుడే దానవుడును! మాధవుడయ్యెన్
    మానసముల తా జేరుచు
    గానముతో వేల గోపికల నలరించన్!

    రిప్లయితొలగించండి
  36. కాలము మారిన వేళను
    శ్రీ లవి యన్నకును మరియు చెన్నలరారన్
    మేలుగతనకును చెరిసగ
    పాలిచ్చిన తనజనకుని భజియింప వలెను

    రిప్లయితొలగించండి


  37. మాలిమితో పెంచుచు మురి
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్
    మేలుగ ప్రేమను జూపుచు
    నీలోకమునందు సతము నింపగు రీతిన్.

    బాలిక యనిభావించక
    లాలించుచుననవరతము లాస్యము తోడన్
    లాలిని పాడి సతము మురి
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్.

    ఆలియు దేవుని చేరగ
    జోలలు పాడుచు ముదమున సూడిద లిడుచున్
    లాలించుచును సీసా
    పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి