16, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2437 (కాముఁడు వెన్నెలలు గురిసె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్"

68 కామెంట్‌లు:

 1. ఆమని కోయిల కూయగ
  నీమము తోకళ లనిండి నింగిని చేరన్
  కామము తీరగ రోహిణి
  కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 2. ఆమని హోలీ రాతిరి
  కాముని దహనమ్ము జేయ
  కన్నియలచటన్
  సోముడు, జూచుచు కాలగ
  కాముఁడు, వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్

  కంతుడు = అనంగుడైన కాముడు

  రిప్లయితొలగించండి
 3. ఆమునినుతిపాత్రుడు శివు
  డే మునివృత్తిని గడపగ నెవ్విధి నైనన్
  నీమము నరయక రోహిణి
  కాముడువెన్నెలలు గురిసె గంతుడు మెచ్చన్.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Bapuji garu మీరు కరుణశ్రీ గారి కుమారులా?

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరు కరుణశ్రీ గారి కుమారులన్న విషయం మహదానందాన్ని కలిగించింది.

   తొలగించండి
  3. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి కుమారలైన శ్రీ బాపూజీ గారికి మిక్కిలి ఆనందముతో చేయు నమస్కారములు. ఎంతటి అదృష్టవంతులు.

   తొలగించండి
 4. సోముని చల్లని కిరణము
  ప్రేమగ తనువంత ప్రాకి ప్రీతి నొసంగెన్
  నీమము దాటక వెలుగుల
  కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 5. దీమతి పార్వతి నందెను
  కాముడు, వెన్నెలలు కురిసె కంతుడు మెచ్చన్
  కోమల శశాంక మౌళికి....
  ప్రేముడి నెలరాజు.....గొప్పవిందులు చేయన్
  కాముడు = కామేశ్వరుడు

  రిప్లయితొలగించండి


 6. భామయు చేయగ పూరణ
  "కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్"
  సామి, సరిజేసిరి గదా
  "కాముడు తన్ను గురి జూడ కాంతయు మెచ్చెన్"!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. భామ నపర్ణన్ గైకొని
  వాముడు తారకు నణచెడు బాలుని పొందన్
  సోముఁడు తోడై కలువల
  కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్
  (వాముడు = శివుడు, సోముడు = చంద్రుడు)

  రిప్లయితొలగించండి
 8. *రాముని మదిలో చేరెను*
  *కాముడు, వెన్నెలలు గురిసె,కంతుడు మెచ్చన్*
  *ఆమని విరిసిన వనమున*
  *ప్రేమను జూపించె సీత ప్రీతిగ కోరన్*

  రిప్లయితొలగించండి
 9. వాముని శిరమున నుండగ
  సోముండని కీర్తి కలిగి సుందర కరమౌ
  ధామము కూర్చుండి యశో
  కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణి కుమార్ గారు యశః కాముడు సాధు రూపమనుకుంటాను. కొన్ని చోట్ల యశస్కరము క,ఖ ప,ఫ లు పరమైన విసర్గ యథాతథము.

   తొలగించండి
  2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

   పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ సూచనకు ధన్యవాదములు. నేను రాస్తున్నప్పుడే తర్జన భర్జన పడి చివరికి యశో కాముడు పదాన్ని ఆశ్రయించాను. ధన్యవాదములు.

   తొలగించండి
 10. కామిత ఫల దాయకు డై
  యా మ నికల్పించి శివుని యం త ఃక ర ణిన్
  మార్చంగ నెంచతారా
  కాముడు వెన్నెల లు కు రి సె గంతు డు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూడవ పాదము నందు ప్రాస దోషము!
   సవరించ గలరు!🙏🙏🙏

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో ప్రాసదోషాన్ని సవరించండి.

   తొలగించండి
 11. కౌమారి శివుని గోరగ
  నామారుడు వేడగాను నలుదెశలందున్
  న్నామని నిండగ తారా
  కాముడు వెన్నెలలు గురిసె కంతుడు మెచ్చన్!

  రిప్లయితొలగించండి
 12. సోముని చల్లని దీవెన
  భూమ్యానoదము నివ్వగ, పూరుషు వలపున్
  భామిని యoదున,శోభా
  కాముడు వెన్నెలలు గురిసె కాoతుడు మెచ్చెన్.
  నమస్సులతో

  రిప్లయితొలగించండి
 13. కామిత ఫల దా య కు డై
  యా మ ని కల్పించి శివుని యంతఃక ర ణిన్
  దా మార్చ నెం చ తారా
  కాము డు వెన్న ల లు కు రి సె గం తు డు మె చ్చన్

  రిప్లయితొలగించండి

 14. భామను గని భయమొందెడి
  సోముడు యువతులను గాంచి సొగసుల బొగడెన్
  సామర్థుడాయె గద ని
  ష్కాముడు,వెన్నెలలు గురిసె,కాంతుడు మెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 15. కాముడుగంతుడు నొకరే
  కాముడు వెన్నెనలు గురిసె గంతుడు మెచ్చన్
  గాముడు వెన్నెల గురియగ
  నేమీ కంతుండు మెచ్చె నెట్లుగ సామీ!

  రిప్లయితొలగించండి 16. ఆ మాధవు సుతుడెవ్వడు

  సోముండేమికురిపించుసొగసృగ తానున్

  కాముని పున్నమి యనగా

  కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 17. కామమడర మదిలో నా
  రామను చూసిన తదుపరి, రాగముతోడన్
  సోముడు, నిరతము తారా
  కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 18. ఆమని వేళ నొక సఖుడు
  భామాయని చెంతజేరి పరవశమొందన్
  సోముడును, సుధా ధాముడు,తొగ
  కాముడు వెన్నెలలు గురిసె గంతుడు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 19. ప్రేమికుల జంట చాటుగ
  కాముని పున్నమి నిశీధి కలియగ బూనన్
  వ్యామోహము బెంచ కలువ
  కాముడు వెన్నెలల గురిసె కంతుడు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 20. ఏమని చెప్పుదుఁ గుసుమా
  స్త్రామర సితభాను మైత్రి యద్భుతమె శర
  ద్యామిని నిండుగఁ గువలయ
  కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతము! కుసుమాస్త్ర సితభాను మైత్రి! 🙏🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   డా. సీతా దేవి గారు ధన్యవాదములు నమస్సులు.
   ప్రాస సాధనార్థము కుసుమాస్త్రునకు ముక్కోటి దేవతలలో మన్మధుడొకఁడు కాబట్టి “అమర” పద ప్రయోగము.

   తొలగించండి
 21. భామ నపర్ణన్ గైకొని
  వాముడు తారకు నణచెడు బాలుని పొందన్
  సోముఁడు తోడై కలువల
  కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్
  (వాముడు = శివుడు, సోముడు = చంద్రుడు)

  రిప్లయితొలగించండి
 22. శ్యామిక రాత్రి,శ్రవములకు
  దోమల పాటలు ,పెనిమిటి దుస్తులు తొలగన్

  స్ధామనముపైన పతియౌ
  కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్"


  కాముడను పేరుగల భర్త భార్య కోర్కె తీర్చెనని భావన

  రిప్లయితొలగించండి
 23. కోమలగాత్రి నపర్ణను
  నేమముతో తపము సలుప నెమ్మనమునసుం
  తేమరలేక కరుణ శివ
  కాముడు వెన్నెలలు గురిసె గంతుడు మెచ్చన్!

  కరుణ యనే వెన్నెలను గురిపించెనని భావన!

  రిప్లయితొలగించండి
 24. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆమని గూడిన సమయము
  నామనిచెలి చెలియలందు నడరెడి నపుడున్
  భూమముగా నాతారా
  కాముడు వెన్నెలలు గురిసె గంతుడు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 25. ఆ మగనికి నా యువిదకు
  ప్రేమగ జత గలుప నవమి రేయిని, తనలో
  నామని గొని సోముడు శుభ
  కాముడు వెన్నెలలు గురిసె గంతుడు మెచ్చన్!

  రిప్లయితొలగించండి
 26. సోమునికి శత్రువెవ్వడు
  యేమయె పూర్ణిమను నిశిని యీభువిలోనన్
  భామను శివుడు గనుంగొన
  కాముఁడు|వెన్నెలలు గురిసెఁ| గంతుఁడు మెచ్చన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  స్వపరిపాలన కోసమై సమరమందు
  జనులు తండోప తండాలు గాగ నిలిచి
  ప్రాణములు విచిత్ర గతిని బాయ , నేడు
  ముఖ్యమంత్రుల పుత్రులే మురియ గనమె

  అంతకు ముందు రోజు సమస్యకు పూరణము

  కుంతీ పుత్రుడు కర్ణుం
  డంతమ్మయె పోరు నందు నని శిష్యుడనన్
  సుంతగ నెరుగని గురువునె
  కుంతీపుత్రుఁడు వినాయకుఁడు గద శిష్యా?

  రిప్లయితొలగించండి
 27. శ్యాముడు వ్రజభామలతో
  యామవతిన్ రాసలీల లాడగ,మింటన్
  కామిను లాడిరి, కువలయ
  కాముడు వెన్నెలలు గురిసె, గంతుడు మెచ్చన్


  రిప్లయితొలగించండి