సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. (నిన్న మా మిత్రుని కుమార్తె పెళ్ళికి అలకాపురి వచ్చాను. మిమ్మల్ని కలుద్దామని మీకు ఫోన్ చేశాను కాని మీరు గమనించనట్టున్నారు).
శ్రీ గురుదేవులకు నమస్సులు దేవకి వసుదేవసుతుడు, దివ్య చక్ర ధారి,మువ్వగోపాలుoడు ధర్మ తేజ నవతరిoచె ,నావులకున్ ,నాత డేన? విజయ సారథి జనిoచె, విపినమoదు. చిన్న సoదేహమును తొలగిoపుము. కoద పద్యము లో తొలుత ఆమని అని మొదలు పెట్టి తదుపరి పాదాల మొదటి పదము కాముడు, సోముడ ని పూరణ చేసారు.కoద పద్యము నియమము న కు సరి పోవునా?తెలుపుము నమస్సులు.
వెంకట నారాయణ గారూ, మీ పూరణ బాగుంది. మొదటిపాదంలో గణదోషం. భావం కొంత అస్పష్టంగా ఉంది. ఆమనితో మొదలు పెట్టి మిగతా పాదాలలో కాముడు, సోముడు అని వ్రాయడం సరైనదే.
కాంత నివసించు చోటు కుగ్రామమయ్యె.
రిప్లయితొలగించండికాన్పుకై పట్నమేగంగఁగడగె వారు
పల్లె దాటంగ ప్రసవించె-బాబుపుట్టె
విజయసారధి జన్మించె విపినమందు
విజయసారథి
రిప్లయితొలగించండిప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మధుర కారాగృహములోన మర్మ ముగను
రిప్లయితొలగించండివిజయసారథి జన్మించె; విపినమందు
చెట్టు క్రింద పున్నమి నాడు పుట్టె నతడె
బుద్ధ దేవుడు మతమును శుద్ధి చేయ
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మ సంస్థాపనార్థము ధరణి యందు
రిప్లయితొలగించండిసంభవించెను గద చెఱసాల యందు
విజయసారధి, జన్మించె విపిన మందు
పావని ధృతరాష్ట్రు సుతుల పట్టి చంప.
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బావమరదు లుభయులును భవ్యబలులు;
రిప్లయితొలగించండిచెరను బుట్టిన శ్యాముడు చెప్పుమెవరు!
అతని ముద్దుమరది పార్థు డలరె నెచట!
విజయసారథి;జన్మించె విపినమందు.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎవరు+అతని' విసంధిగా వ్రాయడం కంటె "చెప్పు మెవ్వ। రతని ముద్దుమరది..." అంటే బాగుంటుంది కదా!
అలాగేనండి.ధన్యవాదాలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆకయింటిన నడిరేయి యారు తెంచె
విజయసారథి ; జన్మించె విపిన మందు
భరతుడమ్మ ,జిలేబి, సభన తెలుపుము
జనులు మెచ్చ వలయునమ్మ చక్కగాను
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఇంటిని' అనడం సాధువు. ఇకారాంత పదాలకు 'న' ప్రత్యయం కాక 'ని' చేరుతుంది. అక్కడ "ఆకయింటిలో' అనవచ్చు. 'ఆరు తెంచె'...? అది "..యరుగు దెంచె"కు టైపాటా? 'సభను' అనండి. అకారాంత పదాలకు 'ను' చేరుతుంది.
తొలగించండికందిచారు
నెనరులు !
ఆరు అంటే పుట్టుక అని ఆంధ్రభారతి చెబ్తే యారు దెంచె అన్నా ; సరియేనా?
జిలేబి
*కంది వారు
తొలగించండివరద! వనమాలి! వినుమ భువన శతాంగ
రిప్లయితొలగించండివిజయ సారథి! జన్మించె విపినమందు
గాధి పుత్రుని మేనక కలిసి నపుడు
లలిత సుమ పేశల శకుంతలా తనూజ!
విజయకుమార్ గారూ,
తొలగించండివిజయసారథిని సంబోధనగా చేసి చెప్పిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
దేవకికి ఘనుడగు వసు దేవునకును
రిప్లయితొలగించండివిజయసారధి జన్మించె, విపినమందు
గడుప మని యాజ్ఞ చేసెను కైక రామ
చంద్రుని,వెడలె సీతతో సంత సముగ
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవ్యసాచియు రారాజు సాయమడుగ
రిప్లయితొలగించండినాయుధంబును దాఁ బట్ట ననుచు కృష్ణు
డనగ పార్థుని కోరిక నందు జూడ
విజయసారథి జన్మించె విపినమందు
ఫణికుమార్ గారూ,
తొలగించండిపూరణ బాగుంది. కాని కొంత అన్వయక్లేశం ఉన్నది.
ధర్మ సంస్థాప నార్థ మై ధరణి యందు
రిప్లయితొలగించండివిజయ సారధి జన్మించె ;వి పి న మందు
త ప ము వీ డి న తా ప సి తనయ గాగ
పుట్టె ను శకుంత లా ఖ్యయై పుడ మి యందు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మసంస్థాపనమ్ముకై ధరణియందు
రిప్లయితొలగించండివిజయసారథి జన్మించె, విపినమందు
నిష్టసఖునితో ననలుని కష్టములను
దీర్చె ఖాండవ దహనమ్ము గూర్చిధన్వి!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సకల భాషల తల్లిని సన్నుతించి
రిప్లయితొలగించండిసరళతరముగ జేయగ సంస్కృతమును
వాఙ్మయారణ్యమున జేరు పథము జూప
విజయసారధి జన్మించె విపినమందు
సంస్కృత భాషాపండితులు విజయసారధి గారి గురించి
రిప్లయితొలగించండిశ్రీరామ్ గారూ,
తొలగించండిమా గురువుగారు శ్రీభాష్యం విజయసారథి గారిని ప్రస్తావిస్తూ చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
దేవకీగర్భమందున కావ జనుల
రిప్లయితొలగించండివిజయసారథి జన్మించె, విపినమందు
పుట్టపుట్టువు జనియించె పుణ్యఫలము
వ్రాయ రామాయణమ్మును వాసిగాను
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండితే.గీ:బందిఖానలో నష్టమి యందు నిలను
విజయసారథి జన్మించె, విపినమందు
నడచి యావసుదేవుడు నందునింట
చేర్చె కృష్ణునానతి దాల్చి శీఘ్రముగను.
తే.గీ:వరమొసంగుచు సురలకు వసుధ యందు
విజయసారథి జన్మించె విపినమందు
వాసమున్న పాండవులకు నాసరాగ
నిలిచి నెల్లవేళలయందు నింపె కూర్మి.
తే.గీ: ధర్మము నిలుపుట కొరకై ధరణి యందు
విజయసారథి జన్మించె విపినమందు
గోవులను కాచె తా గోప బాలుడగుచు
పార్థునకు కూర్చె విజయము భారతమున.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సకల భాషల తల్లిని సన్నుతించి
రిప్లయితొలగించండిసరళతరముగ జేయగ సంస్కృతమును
వాఙ్మయారణ్యమున జేరు పథము జూప
విజయసారధి జన్మించె విపినమందు
శ్రీరామ్ గారూ,
తొలగించండిమా గురువు గారు శ్రీభాష్యం విజయసారథి గారిని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కటిక చీకటి గలయట్టి ఖైదు లోన
రిప్లయితొలగించండివిజయ సారధి జన్మించె, విపిన మందు
జంతు జాలము వసియించు వింత గొలుపు
రకరకంబుల గూతల రవళి తోడ
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(నిన్న మా మిత్రుని కుమార్తె పెళ్ళికి అలకాపురి వచ్చాను. మిమ్మల్ని కలుద్దామని మీకు ఫోన్ చేశాను కాని మీరు గమనించనట్టున్నారు).
ధర్మ స్ధాపన మొనరించ ధరణి యందు
రిప్లయితొలగించండిదేవకి సుతుడై చెరలోన దివ్యముగను
విజయసారధి జన్మించె,విపినమందు
గాధిజు సుత శకుంతల కలిగె భువిని!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధర్మస్థాపన' అన్నపుడు 'ర్మ' గురువై గణదోషం. "ధర్మమును స్థాపనము సేయ ధరణియందు" అనండి.
ఋషభ రాజమ కాని గౌరీపతికి ర
రిప్లయితొలగించండిథం బనఁగ లేదు దమయంతి నంబ కావఁ
దలచి చాటుగను గరుణార్ద్రహృదయ దయ
విజయ సారథి జన్మించె విపినమందు
[విజయ = పార్వతీ దేవి; స+అరథి = సారథి = రథము లేనివానితోఁ గూడి, ఇచట శివుఁడు]
ఇచట జన్మించుట యన నవతరించుట యని నా భావము.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఖాండవదహన యజ్ఞమ్ముఁ గాచ నెంచి
రిప్లయితొలగించండిఅభయ మీయంగ నగ్నికి నాహుతిఁ గొన
విజయసారథి, జన్మించె విపినమందు
జ్వాలలెన్నియొ పార్థుని సాయమంది
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏🙏🙏🙏
తొలగించండినాటి గాంధియె స్వాతంత్ర్య పోటికొరకు
రిప్లయితొలగించండివిజయ సారథిజన్మించె|”విపినమందు
జేర్చిరీనాడుకొందరుచింతలేక
ప్రజల బాగోగు లెంచని ప్రతినిధులుగ
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధరణి ఒక పెద్ద విపినమ్ము తఱచి చూడ
రిప్లయితొలగించండికామ క్రోధాది క్రూర మృగములు తిరుగు
వాని బారిని బడకుండ బ్రతుకు మనుచు
విజయ-సారధి జన్మించె విపినమందు
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅమతుల నడచి శిష్టుల నాదు కొనగ
విజయసారధి జన్మించె; విపిన మందు
తనదు యవతారమును వీడి దానవారి
యనిషి కేగె భువికి శాంతి నచ్చుకట్టి
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదం సవరించారు కదా! ఆ పద్యాన్ని పెట్టండి.
తొలగించండిశ్రీ గురుదేవులకు నమస్సులు
రిప్లయితొలగించండిదేవకి వసుదేవసుతుడు, దివ్య చక్ర
ధారి,మువ్వగోపాలుoడు ధర్మ తేజ
నవతరిoచె ,నావులకున్ ,నాత డేన?
విజయ సారథి జనిoచె, విపినమoదు.
చిన్న సoదేహమును తొలగిoపుము.
కoద పద్యము లో తొలుత ఆమని అని మొదలు పెట్టి
తదుపరి పాదాల మొదటి పదము కాముడు, సోముడ ని పూరణ చేసారు.కoద పద్యము నియమము న కు సరి పోవునా?తెలుపుము
నమస్సులు.
వెంకట నారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. మొదటిపాదంలో గణదోషం. భావం కొంత అస్పష్టంగా ఉంది.
ఆమనితో మొదలు పెట్టి మిగతా పాదాలలో కాముడు, సోముడు అని వ్రాయడం సరైనదే.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
ధర్మ సంస్థాపనము జేయ ధరణి లోన
విజయ సారథి జన్మించె; విపిన మందు
న, తుదకు రణము నందు తా నండ
నుండి
పాండవులకు,స్వధర్మమ్ము పాదుకొలిపె.
నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅమతుల నడచి శిష్టుల నాదు కొనగ
విజయసారధి జన్మించె; విపిన మందు
తనదు యవతారమును వీడి దానవారి
సత్యపురము జేరె భువిని శాంతి నిలిపి
రాజారావు గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విశ్వ విఖ్యాతుడగు శాస్త్ర వేత్త యతడు
రిప్లయితొలగించండిభరత వర్షపు ప్రథముడౌ పౌరుడయ్యె!
పేదగా పుట్టిన ' కలాము ' పెద్ద కాదె!
విజయ సారథి జన్మించె విపినమందు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్సులు. సవరిoచిన పూరణ లో దో షములు తెలుపుము.
రిప్లయితొలగించండిచక్రధారిగ నాతoడు చరితు డాయె
అష్ట భార్యలు,గలదేవ నాడ్యు డెవరు?
మురళి గానమెచ్ఛోటన మురిప మాయె?
విజయ సారథి జనిoచె విపిన మoదు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి