31, ఆగస్టు 2017, గురువారం

సమస్య - 2454 (గురువారమ్మని పిలువఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

86 కామెంట్‌లు:



  1. అర రే! తప్పుల జేయన్
    చురచుర లాడుచు జిలేబి చురుకులు వేయన్,
    బరబర లాగుచు కోర్టుకు
    గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుండయ్యెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. మురిపెముగా చీట్లాడగ
    మరియాదకు లోటుఁగాదు,మందున్ త్రావన్
    దొరబాబుల నప్పడుగుము
    గురువా!రమ్మని పిలువగఁగుపితుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  3. అరచుచు దేవుడు లేడని
    నరుడే నారాయణుడను నాస్తికుడతనిన్
    గురుపూజ నాడు భజనకు
    గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  4. మరిమరి వేడగ, రమ్మని
    వరనిశ్చయమునకు, సాయి బాబను కొలిచే
    హరినాథుండను మిత్రుడు
    గురువారమ్మని పిలువగ గుపితుండయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కొలిచే' అన్నది వ్యావహారికం. అక్కడ "సాయిబాబా భక్తున్" అందామా?

      తొలగించండి
  5. పరశువు దాల్చిన రాముని
    చరచర నంబ వశుజేయ జతురవచనముల్
    మరిమరి బలుకగ, భీష్ముడు
    గురువా!రమ్మని పిలువగ గుపితుందయ్యెన్.

    రిప్లయితొలగించండి
  6. అరువులు బెట్టుచు సొమ్ములు
    దొరకంగ పరులకునెప్డు దొరకని వానిన్
    కరమున పట్టి వసతి నా
    ర్గురు వారమ్మని పిలువఁగఁ గుపితుండయ్యెన్.
    (ఆరుగురు, వారు+అమ్మని, పిలువగ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమ్మని' అనడం సాధువు కాదు. "అమ్మను" అని కదా ఉండవలసింది.

      తొలగించండి
  7. పరిసరములు మైమరచియు
    సరసమ్ముగ జూద మందు సారా కొట్టున్
    నిరతము నెలవై యుండిన
    గురువారమ్మని పిలువఁగఁ గుపితుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  8. సరి చేయగ నా పద్యము
    గురువా! రమ్మని పిలువగ గుపితుండయ్యెన్
    మరియాద మరచి పెద్దల
    దరిరమ్మనిపిలువకూడ దనుచును పలికెన్

    రిప్లయితొలగించండి
  9. పొరుగు న వసిoచు మిత్రుడు
    పరదే శ ము నుండి తి రి గి వచ్చి యు సతి తో
    సరస ము లాడెడి వే ళ న్
    గురువా రమ్మని పిలువ గ గు పి తుం డ య్యే న్

    రిప్లయితొలగించండి
  10. శిరిడీసాయి భజించగ
    గురువారమ్మని పిలువగ గుపితుండయ్యన్
    నరుడేనారాయణుడని
    నిరతము వాదించునట్టి నిజనాస్తికుడే Asnreddy

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (మీ జీమెయిల్‍కు ఏమయింది?)

      తొలగించండి
  11. గిరియను నాస్తిక మిత్రుని
    మరియాదకు రమ్మటంచు మా గృహమునకున్
    షిరిడీ సాయిని గొలువగ
    గురువార మ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  12. తిరుమల దర్శనమునకై
    వరుసను దప్పించుకొనుచు పద్ధతి విడి చె
    చ్చెరఁ దమిళదేశపున్ ము
    గ్గురు "వా! ర" మ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.

    రిప్లయితొలగించండి
  13. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ.....

    పరివారముఁ గల బాబా
    తరుణులతో నాటలాడ, "తగునుర నీకున్
    చెరసాల" యనుచు భటులును
    "గురువా! ర"మ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరసింహ మూర్తి గారూ,
      ఇన్నాళ్ళకు మీ పూరణను చూసే అదృష్టం లభించింది! సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. సరికాదు సంధికనుచున్
    పరిమార్చఁగ జుట్టి కృష్ణ భగవానునటన్
    విరసాన గొల్లడనుచున్
    గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్
    ( కురువారము + అని=కౌరవ సమూహము యుద్ధమునకు)

    రిప్లయితొలగించండి
  15. పరుపుల పై పడక వలదు ,
    తరుణిని కూడoగవలదు, ,తాగవలదురా
    మరచితి వా పూజ ,దినము
    గురువార మ్మని పిలువ గుపితుండయ్యెన్

    రిప్లయితొలగించండి

  16. చండామార్కులతో ప్రహ్లాదుని సంవాదము

    పరమామృతమగు నామ
    స్మరణను ప్రీతిగ గొనుచును సన్మతి తోడన్
    సరగున హరిగొల్వ దనుజ
    గురువా! రమ్మని పిలువగ గుపితుండయ్యెన్!

    రిప్లయితొలగించండి
  17. గురువారమ్ముపవాసము
    సరి నీరే ముట్టుతాను, చాత్రుండొకడే
    మరియారోజే విందుకు
    గురువా!రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.

    రిప్లయితొలగించండి
  18. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    అంబను వివాహమాడుమని
    చెప్పిన పరశు రామునితో భీష్ముడు :

    01)
    ___________________

    కరములు మోడ్చెద మునివర !
    మరి యంబను నాదు తమ్ము - మనువున కొరకై
    చెరబడితిని; "యాపెకు మరి
    పెరిమయె మది సాళ్వుని పయి" ! - వివర మరయుటన్

    పరివారంబుల తోడను
    మరియాదగ వాని కడకు - మరలించితినే
    సరి రాజగు సాళ్వు డకట
    మురళించిన నాదు తప్పె - మునివర కనవే !

    పరపురుషుని ప్రేమించుట
    పరసతిగా దలచి విడితి - పరిణయ మాడన్
    మరణమునకు సంసిద్ధుడ
    కరివరదునె నమ్మినాను - కరుణను వినుమా

    పుర ప్రముఖుల సముఖంబున
    వర జనకుని పెండ్లి కొరకు - పంతము బడితిన్
    మరియాదల విడువ నగునె
    వరమౌనివి నీవె సుంత - భావింపు మయా !

    సరిగాదు మీదు యానతి
    నిరంతర బ్రహ్మచర్య - నియమము గొనుటన్ !
    దురమది సేయక తప్పదు
    గురువా, రమ్మని పిలువఁగఁ - గుపితుం డయ్యెన్ !
    ___________________
    దురము = యుద్ధము

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శరములిడు నేకలవ్యుని
    దరిసించి నితడు కిరీటి తలమీఱుండ
    న్నరయుచు శరగురు డాతడు
    గురువా! రమ్మని పిలువగ గుపితుండయ్యెన్


    రిప్లయితొలగించండి
  20. కం. గురువార మ్ముపవాసము
    గురువులు పాటింతు రనుచు గొంకక నేనే
    మరచియు కమ్మని విందుకు
    "గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్"

    రిప్లయితొలగించండి
  21. గురువునునేననుచుపిలిచి
    పరకాంతలనెల్లచెరిచిపాపపుపనుల
    న్నెరిపినతులువా!నీవొక
    గురువా!రమ్మనిపిలువగగుపితుండయ్యెన్!

    రిప్లయితొలగించండి
  22. గురువు గారికి నమస్సులు.
    కరువులు వచ్చెను తెలుగు క
    విరాజులకు గ ద! న న o త సాహితి విపణిన్
    బిరుదులు రాని కవివరా
    గురువా రమ్మని పిలువంగ గుపితుండయ్యెన్.
    వందనములు
    తెలుగు వధాన రo గ ము లో ల బ్ద ప్రతి ష్టు లు గలరు. ఒక సారి కూ డ పద్మశ్రీ అవార్డు రాలేదు. ప్రజాదరణ పొందిన కవితల కు కూడా ప్రభుత్వ గుర్తంపుకు
    నోచుకోలేదు. నా పూరణ లోని లోపాలను తెల్పు డు.

    రిప్లయితొలగించండి
  23. గురువారంబును బిలుతురు
    గురువారమె యనుచు జనులు కోమలి ! యవునా ?
    నరయగ నేలకొ మిత్రుడు
    గురువారమ్మని పిలువగ గుపితుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిరతము నాంగ్లము నందున
    పురటము లెంచుచు కదకొను బోధకు డతనిన్
    సరసము నాడుచు తెనుగున
    గురువా! రమ్మని పిలువగ గుపితుండయ్యెన్




    రిప్లయితొలగించండి
  25. సరసంపు హావ భావమ
    లరంగ నొక గాయకబ్రు వాధిపుఁ గనుచున్
    సరసన నున్నది గార్దభ
    గురు వారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

    [గురు = గొప్ప ; వారము = సమూహము]

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  27. పిన్నక నాగేశ్వరరావు.

    షిరిడీ సాయికి భక్తుడు

    హరితో మద్యమును త్రాగు నలవాటున
    నే
    మరచుచు నా దినము; హరిని,

    గురువారమ్మని; పిలువగ గుపితుం
    డయ్యెన్.
    ( హరి యను స్నేహితుడు)

    రిప్లయితొలగించండి
  28. వి ర హో త్కoఠిత యౌనొ క
    పరువాంగన వికలు డైన భర్త ను గను చున్
    పరిహాస పుప లు కు ల తో
    గురువా రమ్మని పి లు వ గ గు పి తుం డ య్యే న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరువాంగన'...?

      తొలగించండి
    2. ప రు వాంగన అంటే యోపన ము లో ఉన్న స్త్రీ

      తొలగించండి
    3. పరువము తెలుగు పదం. దానిని అంగన అనే సంస్కృత పదంతో సంధి చేయరాదు. అదీ నా అభ్యంతరం.

      తొలగించండి


    4. ఎంతటి పరువంబైనన్
      చెంతన యాంగన పదమును చేర్చ కుదురదోయ్ !
      వింతైన సంధులు గదా
      కొంతైనను సాయము సమ కూర్చవు సుమ్మీ :)

      జిలేబి

      తొలగించండి
    5. అతుకగ దుష్కర ప్రాసల
      మతిపోగొట్టెడి యతులను మచ్చిక జేయన్
      వెతకగ సాధుసమాసము
      సతమతమౌ నూత్నకవుల సంకట మౌరా!!

      తొలగించండి
  29. గురువును నింది౦చినచో
    పరమున నరకము యిహమున పతనము యనుచు
    న్నెరిగియు పరాభవించుచు
    "గురువా!రమ్మని",పిలువగ గుపితు౦డయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నరకము నిహమున పతనమ్మనుచున్" అనండి.

      తొలగించండి
  30. అరయక బుధ వారమ్మును
    గురువారమ్మని పిలువగ గుపితుండయ్యెన్!
    కొర కొర జూచుచు నాతడు
    వరుసగ వారము లెఱుగని బాలకు దిట్టెన్!

    రిప్లయితొలగించండి
  31. కరుణను విద్యల నన్నియు
    వరుసను వివరించి యస్త్ర పాటవ మివ్వన్
    దురమున ప్రజ్ఞను జూపగ
    గురువా రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  32. సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీమతి జి సందిత (Sanditha)అనంతపురము

    కం.
    బిరియానిభుజింపవెడలె
    నురుసునతనమగని జూచియురుకుచునిల్లా
    లరయతినరానిదినమిది
    గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  33. నరకాసురసంహారము
    కరమునుసంతసముతోడ గావించిరట
    న్నరయుదముమనము సైతము
    గురువా!రమ్మనిపిలువగ గుపితుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  34. సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీమతి జి సందిత (Sanditha)అనంతపురము

    కం.
    పరశుధరుండంబనుగని
    పరిణయమాడంగాంగభవునడుగంగన్
    కరుణనెఱుగ ప్రతిన వినగ
    గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది.
      వాట్సప్ లోని వ్యాఖ్యను గమనించండి.

      తొలగించండి
  35. (అర్జునుడు స్వయంవరమున ద్రౌపదిని గెలుచుకుని కుంతి వద్ద చెప్పి ద్రౌపదిని ఐదుగురూ పెళ్లి చేసుకొను సందర్భం)
    కం౹౹
    వరమిదని పాండవు లయిదు
    గురు వారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్
    మరుతసుతుడు, తలిదౌ యు
    త్తరవు విని యధర్మమనియె తలచెన్, వగచెన్ ౹౹
    (వారు + అమ్మని = వారమ్మని)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమ్మను' అనడం సాధువు.

      తొలగించండి
  36. సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీమతి జి సందిత (Sanditha)అనంతపురము

    కం.
    పరశుధరుండంబనుగని
    పరిణయమాడంగ గంగభవునడుగంగన్
    కరుణనెఱుగ ప్రతిన వినగ
    గురువారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      సవరించిన పూరణ బాగున్నది.
      'గంగాభవుడు' సాధువు కదా!

      తొలగించండి
  37. .. విరివిగ గంజాయమ్మెడి
    తరుణంబున శిష్యురాలు “దైవజ్ఞుడనిన్
    పరిణయ పత్రికనివ్వగ
    గురువా” రమ్మనిపిలువగ?గుపితుండయ్యెన్ {గురువుదేవునితోసమానమని కానిమోసపరుడు}
    2.అరచెనుశిష్యుడు మరచియు
    గురువారమ్మని పిలువగ గుపితుండయ్యెన్
    వెరువక “రమ్మ”ని గురువన
    పొరపాటున “బీరు”డుంచ?పోకడమారెన్ “ {మోసపుగురువల పోకడ}

    రిప్లయితొలగించండి

  38. కరమున బజ్జీలిడుకొని
    కరకర మని తినుచు నుండ కరుకగు ధ్వనితో
    త్వరితముగాసఖు డొక్కడు
    గురువా రమ్మని పిలువగ గుపితుండయ్యెన్.

    రిప్లయితొలగించండి
  39. గురువారంబునసాయిని
    గురుతరమగుభక్తితోడ గొలుతురు జనముల
    ల్లిరవుగ మనమును బోదమ?
    గురువా! రమ్మనిపిలువగ గుపితుండయ్యెన్

    రిప్లయితొలగించండి