9, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2433 (రూపసినిఁ జూచినట్టి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

67 కామెంట్‌లు:

 1. ముక్కు ముచ్చట కోల్పోయి ముగ్ధ యొకతె
  నవ్వుచున్నట్టి సీతను కెవ్వు మనుచు
  చూడు నీపని పట్టించి చూతు
  ననుచు...
  రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె

  రిప్లయితొలగించండి
 2. రామచంద్రుడు కోసల రాజగునని
  సంబరముగను కైకేయి చాటిచెప్ప
  కపటమెంతయు లేనట్టి గాఢప్రేమ
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మంధర విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. ఇంతి దమయంతి వరియింప నేగుదెంచు
  భావభవు సాటి బంగరువన్నెవాడు
  నలుని గాంచి కలి యసూయ వెలికిరాగ
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   కలిపురుషుడు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  సాధ్వి సుమతి - కాముకుడు కౌశికుడు :

  01)
  _______________________

  పణము నంతయు గణికల - పాలు జేసి
  కుష్ఠు రోగము పాలైన - కుమతి, పాపి
  పాడు నర్తకి పసిమికి - పరవశించి
  రూపసినిఁ జూచినట్టి కు - రూపి నవ్వె !

  తార్చ మని కోరె భార్యను - దాని పొంద
  స్త్రీపరున కుండ దిల లోన - సిగ్గు నెగ్గు
  మౌని శాపము నను జచ్చి - మరల బ్రతికె
  సాధ్వి శక్తికి నిల న - సాధ్య మేది ?
  _______________________
  స్త్రీపరుడు = కాముకుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   సతీ సుమతి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణదోషం. "సాధ్వి శక్తికి పుడమి నసాధ్యమేది" అందామా?

   తొలగించండి
 5. లేపనములు తీసుకెడలు లేమ కాంచి
  నల్లనయ్య యడుగ, మోహనాంగుడైన
  "రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె,
  ముదముతోలేపనమ్ములు, మురళి గాన
  లోలుడు బలరాముని కూడి యోలములకు
  పులుము కొనిన వెన్వెంటనే సులువు గాను
  కుబ్జ కోమల రూపాన గోచరించె


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   కుబ్జ విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వెడలు'ను 'ఎడలు' అన్నారు.

   తొలగించండి
  2. "లేపనము తీసుకొని పోవు లేమ..." అందామా?

   తొలగించండి
 6. అరుణాచలము మాది అరయ సిక్కిము మాది
  **** కాదన్న మీతోడ కలహమగును
  కాశ్మీరు మాది డోక్లాము సైతము మాది
  **** కాదన్న మీతోడ కదనమగును
  మంది బలము మాది మందుగుండును మాది
  **** కాదన్న మీతోడ కయ్యమగును
  సాగరమ్మును మాది సకలమ్ము మరి మాది
  **** కాదన్న మీతోడ కలను గలుగు

  గతము మరవక నిలువుము మితము తోడ
  చీని ముందర నీవిక చిన్న యనెడి
  చీని దేశపు నవ్వుల చెన్నుఁ జూడ
  రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   కురూపులైన చైనీయులు కుబుద్ధిని వివరిస్తున్న మీ సీసపద్య పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 7. మసక మసక చీకటిలోన మల్లె తోట
  వెనుక మాపటి వేళన వెక్కి వెక్కి
  కర్మ కారణ మనియేడ్చు కామనీయ
  రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పాత చిత్రగీతాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు!

   తొలగించండి
 8. వింత జగతిని యందాలు వెల్లి విరియ
  స్వప్న లోకాన విహరించి సౌరు లనుచు
  రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె
  రోత గలిగించు కామిని భీతి గొలుప

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జగతిని నందాలు...' అనండి.

   తొలగించండి
 9. వసుధ నారోగ్యమే కద భాగ్య మనగ
  నందచందాలు కావని యార్యు లనరె
  యనుచు రోగాల యూబిలో మునిగియున్న
  రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 10. రూపు మారెడు రోగ ము దాపురింప
  సతి కురూపి గ నున్న ను పతి యు తనను
  ప్రేమ లొ లి కించుతరు ణాన కామిత ము గ ను
  రూ ప సి ని చూచి న ట్టీ కురూపి న వ్వే

  రిప్లయితొలగించండి
 11. కుబ్జ,సుందరు,సుకుమారు,కువలయాక్షు,
  కృష్ణు సద్భక్తి మనసున గీలుకొల్పి
  తనదు వంకరలను మాన్పు ఘనుడవనుచు
  రూపసినిజూచినట్టి కురూపి నవ్వె.

  రూపసి=రూపరి=సుందరుడు. బ్రౌణ్యం

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. మానసాంతర సౌందర్య మహిమ నెఱిగి
  సతత పరహితార్థ బాట సాగు మనుచు
  అందమైశ్వర్య మనుచును నహము జూపు
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పరహితార్థ పథము సాగు..." అనండి.

   తొలగించండి
 14. స్వీయలోపoబు లెరుగుట శివుని వరము
  సుoదరభావసoపుటిన్ సుజన మమత
  శీలి,మధుర సుధ గుణ శీల గరిమ
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వ
  వoదనాలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో (సుందరభావ), మూడవ పాదంలో (మధుర సుధ గుణ) అన్నచోట్ల గణదోషం. సవరించండి.

   తొలగించండి
 15. ………………………………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గరువు గారికి వ౦దనములు . ము౦దు
  -------------------------- ---------- ప౦పి౦చిన పూరణ తీ సి వే సి న౦ దు వలన
  --------------------------------------------
  మ ర ల ప౦ పి స్తు న్నా ను
  ----------------------- క్ష మి ౦ చ ౦ డి
  :::::::::::::::::::::::ె

  వసుధ స౦తోషి కన్న రూపసి కల౦డె ?

  కాని , కలి యనెడు కురూపి వాని విడడు |

  ఘనుని నలుని దుస్థితి సు౦త గా౦చు మీవు

  రూపసిని జూచి నట్టి కురూపి నవ్వె

  రిప్లయితొలగించండి
 16. ముద్దుగుమ్మకు మున్ముందు పొందురూపు:
  'వంగి, తలనెరిసి, ముడతల్ వదనమందు
  బోసి నోటను చొంగతో బోలె కలను'
  రూపసినిఁ జూచి 'నట్టి కురూపి' నవ్వె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగున్నది సార్!

   కండ్లు మసకలు బొత్తిగ పండ్లు లేవు
   తోలు ముడుతలు జుత్తంత రాలి పోయె
   బోసి నవ్వుల చిన్నారి బొమ్మ నెత్తి
   రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె

   తొలగించండి
  2. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ************
   ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. రూపసిని జూచి నట్టి కురూపి నవ్వె
  రూపసిని జూచినట్టి కురూపి యేడ్చె
  రూపసికి యందము దనకు రూపులేమి
  తనరు గుణము ప్రధానమందమును గంటె

  రిప్లయితొలగించండి
 18. తె.గీ. మంచి నడతయే సొగసను మాట మరచి
  మోహ భ్రాంతిలో నెపుడును మునిగి పోయి
  బుడగ వంటి రూపము జూపి మిడిసి పడెడి
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె !

  రిప్లయితొలగించండి
 19. కట్నకానుకలనొసంగి కరముబట్టి
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె
  చక్కనయ్య పెనిమిటిగా చిక్కెననుచు
  తండ్రి యిచ్చిన బహుమతిఁ దలచుకొనుచు

  రిప్లయితొలగించండి
 20. ఆలినొదలియు వెలయాలి యాశచేత
  సుఖము నన్ సుఖరోగాలుచుట్టుముట్ట?
  కంటకంబనకను భార్య కలసిమెలుగు
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె|
  2.ఆలియాంతర్య మెరుగని నాశపరుడు
  రూపు రేఖల వెలయాలి దాపుజేర?
  ఆస్తు లడుగంట రోగాలునాదరించ?
  అంతరంబున సౌంధర్యచింతన స్వ
  రూపసిని జూచి నట్టి కురూపి నవ్వె| {భార్య}


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'వదలి'ని 'ఒదలి' అన్నారు.
   రెండవ పూరణలో "..మెరుగని యట్టివాడు" అనండి. సమాసంలో 'ఆశాపరుడు' అవుతుంది.

   తొలగించండి
 21. వనము నందున భీముని వలచి దనుజ
  కాంత యగుహిడింబిబలికె కామరూపి
  ని, నను జూచి రోత బడక నీదు ధర్మ
  పత్ని గన్ కొనుమని గాడ్పు పట్టి యైన
  రూపసినిఁ జూచి నట్టికురూపి నవ్వె!!!

  రిప్లయితొలగించండి
 22. సవరిoచిన పూరణ ఈ క్రింది విధoగ గలదు.
  స్వీయ లోపoబు లెరుగుట శివుని వరము
  సుoదరకళల సoపుటిన్, సుజన మమత
  శీలి, మృదుమధురసుగుణ శీల గరిమ
  రూపసిని జూచునట్టి కురూపి నవ్వె
  గురువు గారి పాద పద్మాలకు నమస్సులు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ గారూ,
   మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 24. కానలందున భర్త తో గడుపు సతిని ,
  రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె
  రాము కౌగిలి గోరగా రాము డంప
  లక్ష్మణుడు శిక్షింపగా లంక కేగె

  నిన్నటి సమస్య కు నా పూరణ

  వ్యాసు డను ముని పేరొందె వసుధ లోన
  భారతము వ్రాసి; వాల్మీకి వాసికెక్కె
  రామ గాధను రచియించి రమ్య గతిని
  వ్యాస వాల్మీకి మునులను ప్రజనుతింత్రు

  రిప్లయితొలగించండి
 25. చదివి రిరువురు పల్లెలో చక్కగాను
  చిత్ర సీమలో చేరిన చిన్నదాని
  కట్టు బొట్టు నడత మారి నట్టి కొత్త
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె!

  రిప్లయితొలగించండి
 26. గురువుగారికివందనము సవరించిన పూరణ
  9.8.17.ఆలి వదలియు వెలయాలి యాశచేత
  సుఖము నన్ సుఖరోగాలుచుట్టుముట్ట?
  కంటకంబనకను భార్య కలసిమెలుగు
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె|
  2.ఆలియాంతర్య మెరుగని నట్టివాడు
  రూపు రేఖల వెలయాలి దాపుజేర?
  ఆస్తు లడుగంట రోగాలునాదరించ?
  అంతరంబున సౌంధర్యచింతన స్వ
  రూపసిని జూచి నట్టి కురూపి నవ్వె| {భార్య}

  రిప్లయితొలగించండి
 27. చిత్త మందు ఘోరమ్ముగఁ జిలుకు నట య
  నయము పాపపు టాలోచనలు సుదతికి
  మానసమ్మతి మలినమ్ము మేను నరయ
  రూపసినిఁ జూచి నట్టి కురూపి నవ్వె

  రిప్లయితొలగించండి
 28. జనకు పుత్రిని జూచి శూర్పణఖ పలికె
  'తగదు భార్యగ నీకు నా సొగసు జూడు
  విడిచిపుచ్చుము శ్రీరామ వ్రీల్తుననుచు
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె.

  రిప్లయితొలగించండి
 29. చూపునకె ముదము గూర్చెడి పాపియొకడు
  వెగటు రూపంపు సద్గుణ విదుడొకండు
  ఏరగ నిర్వురు తారస పడిన వేళ
  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి 31. కరిని జంపిన కృష్ణుండు కంసు జూడ

  వచ్చు చుండగ ముదమున బాటయందు

  లేపనములతో నరిగెడు లేమ తమిని

  రూపసిని జూసినట్టి కురూపి నవ్వె.


  లక్ష్మణుడచట తాను నలకను బూని

  ముక్కు చెవులను కోయంగ ముదిత రూపు

  మారిపోవంగ కనలుచు మత్సరమున

  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె.

  మంథర పలుకులు వినుచు మనమునందు

  నీసు పెరుగంగ రాముపై నింతి తలచె

  సుతుని రాజు చేయ,గనుచు చోద్యముగను

  రూపసిని జూచినట్టి కురూపి నవ్వె.

  రిప్లయితొలగించండి