26, ఆగస్టు 2017, శనివారం

సమస్య - 2447 (పార్థసారథి పరిమార్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పార్థసారథి పరిమార్చెఁ బాండవులను"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

82 కామెంట్‌లు:

  1. నిండు సభలోన నిందించు నీల్గుగాంచి
    వంద తప్పులు సైచిన వైనమెంచి
    యగ్నిచక్రంబు సంధించి యత్తసుతుని
    పార్ధసారధి పరిమార్చె, బాండవులను
    గౌగలించె యజ్ఞసమాప్తి గాగశుభము!

    రిప్లయితొలగించండి
  2. సీతా దేవి గారి దారిలోనే:

    తల్లి కొసగిన మాటను తప్ప లేక
    నూరు తప్పులు మన్నించి యూరు కొనక
    పార్థసారథి పరిమార్చెఁ;
    బాండవులను
    ప్రేమ తోడను రక్షించె రేయి పగలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శ్రీ శంకరయ్య గారి సవరణ:
      మొదటి పాదం:
      *"మాట తప్పక శిశుపాలు మాత వినతి"*

      🙏🙏🙏

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. తెలుగుబాలబాలికలార!తెలుపుడిపుడు
    దుష్టుడైనట్టి నరకుని దునిమె నెవడు?
    కృపను భగవాను డెవ్వరి బృథివి గాచె?
    పార్థసారథి పరిమార్చె ; బాండవులను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. విజయునకు జ్ఞానబోధ కావించెనవరు?
    కృష్ణుడనగ పార్థుడు కర్ణునేమి జేసె?
    భారతమున కృష్ణుండు కాపాడెనెవరి?
    పార్థసారథి, పరిమార్చెఁ, బాండవులను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. నిండు సభ లోన నిందించు నీచు గాంచి
    తన దు చక్రాయు ధ ము తోడ త ల ను నరికి
    పార్థ సారధి పరి మార్చే ;పాండవు ల ను
    అన్ని భంగు ల రక్షించె నచ్యు తుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  6. శుభోదయం!

    మానసంబున సంకల్ప మై వెలయగ
    మహిని దుష్టశిక్షణజేయ మసగు నరుల
    పార్థసారథి పరిమార్చెఁ ,బాండవులను
    గాచె నన్నది శిష్టముగద జిలేబి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. .హద్దు మీరెను శిశు పాలు డా గ్రహించి
    పార్థ సారధి పరిమార్చే ;పాండవు ల ను
    ధర్మ పరుల కు నండ యై ధైర్య మొ స గి
    ఆప్త బాంధవుడైహరి యాదు కొనియె

    రిప్లయితొలగించండి
  8. బాలు డైయుండి చనుబాలు గ్రోలి చంపె
    దనుజ సంహార మొనరించె జనుల కొఱకు
    పార్ధ సారధి పరిమార్చె, బాండ వులను
    గాచె నిరతము వెన్నంటి గారవ మున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరిమార్చె'కు అన్వయం?

      తొలగించండి
    2. బాలు డైయుండి చనుబాలు గ్రోలి చంపె
      దనుజ సంహార మొనరించె ధర్మ నిరతి
      పార్ధ సారధి పరిమార్చె, బాండ వులను
      గాచె నిరతము వెన్నంటి గారవ మున

      తొలగించండి
  9. సఖుని యవతార పర్యాప్తి సంగతి విని
    పాండు బుత్రులు బాగుగ వ్యధను జెంది
    భూమి వీడియు స్వర్గమ్ము బొందిరకట
    పార్థసారథి పరిమార్చెఁ బాండవులను

    రిప్లయితొలగించండి
  10. దుష్ట పన్నాగముల జూపి ద్రోహ బుద్ది
    కీడు దలపెట్ట యత్నించు పాడు పనుల
    పార్థ సారధి పరిమార్చె,పాండ వులను
    ధర్మపథమున నడుపుచు ధరణి నిలిపె

    రిప్లయితొలగించండి
  11. కుడిచి చనుబాలు పూతనఁ గడుముదమున (గూటమందు)
    పార్థసారథి పరిమార్చె, పాండవులను
    కాచి కాపాడె నిత్యముఁ గరుణతోడ
    నత్తకొడుకులఁ బ్రేమించి చిత్తమందు
    కూటముః ఇల్లు

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హీనులైనట్టి కంసాది దానవులను
    పార్థసారధి పరిమార్చె; పాండవులను
    వారి ధర్మపరత్వమ్ము బట్టిజూచి
    నిలిపియుండెను వెన్నుడు నెయ్యమమర


    రిప్లయితొలగించండి
  13. శి ష్ట రక్షణ కొఱకునై దుష్ట జనుల
    బా ర్ధ సారధి పరిమార్చె బాండవులను
    గంటికిని ఱెప్పయటు లను గాచి యెపుడు
    పక్ష పాతిగ బే రొం దె బాండ వులకు

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:
    నిన్నటి పూరణ:

    కలుగు జేరెడి కంచుకి గనుచు నుండి
    ఎలుక వడకె; వినాయకుడెక్కుననుచు
    మూరిన బగితి ననింద్య మూషికుండు
    డెంద మందున పరసించె పొందుగాను


    రిప్లయితొలగించండి
  15. శిష్ట పరిపాల నమ్మెంచి దుష్టులనట
    పార్థసారథి పరిమార్చెఁ, బాండవులను
    ధర్మ సంరక్షణార్థంపు మర్మమెఱిఁగి
    ఆత్మబంధువై కాపాడె నడుగడుగున.

    రిప్లయితొలగించండి
  16. తే.గీ. పాండు సుతుల కెవరు సాయ పడిరి యనిని?
    రాఘవుండు ధీరుడనిని రావణుడిని
    ధార్త రాష్ట్రు డెవరిని తాగడించె?
    పార్థసారథి ; పరిమార్చె ; పాండవులను.
    తాగడించు = బాధించు.

    రిప్లయితొలగించండి
  17. కంటకులునగు నా మధు,కైటభులను
    పార్థసారథి పరిమార్చె; పాండవులను
    ప్రేమ మీరగ రక్షించి విజయమిచ్చె-
    కృష్ణుడవతారమూర్తియై కృపనుఁజూపె

    రిప్లయితొలగించండి
  18. విజయునకుఁ దా నిలిచి దయ విజయ మీయ
    రణత లాజయ్య మంతఁ గౌరవ విభునకు
    భారత రణస్థలినిఁ దలపడుట కొఱకు,
    బార్థసారథి పరి మార్చెఁ, బాండవులను

    [పరి = సేన; మార్చు = వడ్డించు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      పద్యం అద్భుతంగా ఉంది. కాని అస్వస్థత కారణంగా కావచ్చు పూరణలోని నారికేళపాకాన్ని ఆస్వాదించలేక పోతున్నాను. దయచేసి వివరించండి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      పార్థసారథి దయతో విజయము చేకూర్చుటకు విజయుని పక్షమున నిలిచి, భారత రణ రంగమునఁ బాండవుల నెదిరించుటకు రణమున నజేయమైన తన సేన (దశ సహస్ర గోపాలురు) ను కౌరవ నాథునికి సమర్పించెన(వడ్డించెను) ని నా భావము.
      “పరి” యన సేన యని “మార్చె” నన వడ్డించెనని(ఇచ్చెను) యర్థమును గ్రహించి చేసిన పూరణము.

      మంచి చెడులఁ దెలుపఁ గోర్తాను.

      తొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.

    నూరు తప్పులు క్షమియించి యూర
    కుండ
    క శిశుపాలుని తనదు చక్రాయుధమున

    పార్ధసారథి పరిమార్చె; పాండవులను

    కంటికిన్ రెప్ప వోలె వెన్నంటి యుండి

    జీవితాంతము కాపాడె స్నేహితుడిగ.

    ****************************

    రిప్లయితొలగించండి
  20. ……………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    " అచ్యుతా ! హరి ! దైత్యగణా౦తకా ! మ

    హేశ నుత ! యదు వ౦శాన్వయేశ ! కృష్ణ !

    పార్థసారధి ! పరిమార్చె > పా౦డవుల ను

    లిమెడు నిడుముల నెల్ల కిరీటి , దుష్ట

    కౌరవాధములను గూల్చి కదన మ౦దు

    తావక కృప చేత " ననియె ధర్మజు౦డు

    { నులుము = వ్రేళ్లతో త్రిప్పు , చ౦పు ,

    " బా ధ వె ట్టు "
    ********* }

    రిప్లయితొలగించండి
  21. వందతప్పులన్ జేయగ వరము ముగిసి
    బావ శిశుపాలు పాపము పండెననుచు
    పార్థసారధి పరిమార్చె,బాండవులను
    సర్వ వేళల రక్షించె సంతసముగ!!!

    రిప్లయితొలగించండి
  22. నా రెండవ పూరణ.
    కామ,క్రోధాది వైరి సంఘముల బలిమి
    పార్థసారథి పరిమార్చె; పాండవులను
    ఆత్మతత్త్వముఁదెల్పి సమాదరించె
    దైవలీలల వారి నెంతయునుఁబ్రోచె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాండవులను + ఆత్మ..' అన్నపుడు సంధి నిత్యం కదా! మీరు విసంధిగా వ్రాశారు.

      తొలగించండి
  23. కంసు నెదుట చాణూర గర్వ మణచి
    పార్ధ సారధి పరిమార్చె, బాండవులను
    లక్క యింటిలో నగ్ని జ్వాలలుకు గాల
    కుండ పార్ధ సారధి గాచె కూర్మి తోడ

    రిప్లయితొలగించండి
  24. దానవత్వ మెంచికంస ధర్మ మార్గామంతయున్
    మాన”?పార్థ సారధి పరిమార్చె|”బాండవులనుతా
    జ్ఞాన మార్గమందునిలిపి జన్మ సార్థకంబుగా
    దానధర్మ పరులజేసె ధక్షతందు కీర్తికై”|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      ఛందో వైవిధ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ శంకరయ్య గారూ ! శ్రీ కె.ఈశ్వరప్ప గారి పూరణ, మీ వ్యాఖ్యానము రెండూ అర్థం కాలేదు.శ్రమ అనుకోక వివరిస్తారా ?

      తొలగించండి
  25. నీరస పడఁ జేసెడు మాటలారడించి
    కదనమున కర్ణుడు బరోక్ష గతిని వగచ
    పార్థ! సారథి పరిమార్చెఁ, బాండవులను
    ధర్మ మీరీతి కాపాడె దయను జూపి.

    రిప్లయితొలగించండి
  26. గురువు గారి కి న మో వాకములు.ప ద్య పూరణ లో లోపాలను తెల్పుడు.
    విజయు ని కి గీత చెప్పిన విజ్ఞు డె వ రు?
    కంశనరకాసురారిపులన్ కృష్ణ నేమి
    జేసె? ధ ర్మ రక్షణంబు జేయు వారు
    పార్థసారథి పరిమార్చె పా o డ వు ల ను
    కం స న ర కా సు ర చ దు వ ప్రార్థన.
    నమస్సులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      క్షమించాలి. మీ పూరణ పద్యంలో గణదోషాలు, యతిదోషం, అన్వయదోషం ఉన్నవి. జ్వరం కారణంగా వివరంగా తెలుపలేకున్నాను. సవరించండి.

      తొలగించండి
  27. భారతాహవమందున పార్థునకును
    రథము నడపి చంపించె కౌరవ బలమ్ము
    పార్థసారథి,పరిమార్చె పాండవులను
    తలచి యుప పాండవుల నిశి ద్రౌణి యకట

    రిప్లయితొలగించండి
  28. భారతాహవమందున పార్థునకును
    రథము నడపి చంపించె కౌరవ బలమ్ము
    పార్థసారథి,పరిమార్చె పాండవులను
    తలచి యుప పాండవుల నిశి ద్రౌణి యకట

    రిప్లయితొలగించండి
  29. దుష్ట పన్నాగముల జూపి ద్రోహ బుద్ది
    కీడు దలపెట్ట యత్నించు పాడు పనుల
    పార్థ సారధి పరిమార్చె,పాండ వులను
    ధర్మపథమున నడుపుచు ధరణి నిలిపె

    రిప్లయితొలగించండి
  30. నూరు తప్పులు మీరగ నోరు పడగి
    తగని వాచాల చైద్యుని తాళ లేక
    పార్థసారథి పరిమార్చెఁ బాండవులను
    కూలురై రాజసూయము కూడి జేయ

    రిప్లయితొలగించండి
  31. అంధుడైనట్టి ధృతరాష్ట్రుడవ ధరింప
    పలికె గాంధార పుత్రుండు పరమ కుటిల
    ముగను నీచంపు వాక్యంబు ముదము మీర
    పా‍ర్థసారథి పరిమార్చె బాండవులను

    రిప్లయితొలగించండి
  32. నరునియరదమ్ము చక్కగా నడిపెనెవడు?
    ఏమిజేసెను తా మేనమామ నపుడు?
    తోడు వీడకరక్షించె వాడెవరిని?
    పార్థసారథి-పరిమార్చె- పాండవులను.

    రిప్లయితొలగించండి
  33. చెనటియవుకంసు నీచుడౌ ఛేదిపతిని
    పార్థ సారథి పరిమార్చె , పాండవులను
    ప్రాజ్ఞ్జు లందరి ముందట ప్రస్తుతించి
    అండగా నుండి వారికి యాహవమున
    సిరియు విజయంబు చేకూర్చె చేవ జూపి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెనటియగు...చేదిపతిని...' అనండి.

      తొలగించండి
    2. అండ యవరుండె నరునకు యాహవమున ?
      మూర్ఘ శిశుపాలు కేరీతి ముక్తినిచ్చె ?
      ఆనయ మెవ్వరి కుశలంబు య భిలషించె ? పార్ధ సారథి , పరిమార్చె , పాండవులను విష్ణు లీలలు చింతించ నెరుగ గలమె !




      !

      తొలగించండి
    3. మధుసూదన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని టైపు దోషాలు... "యెవరుండె నరునకు నాహవమున...మూర్ఖ... కుశలంబు నభిలషించె" అనండి. "విష్ణు లీలలు చింతించ నెరుగ గలమె" అన్న చివరిపాదంలో యతి తప్పింది. సవరించగలరు.

      తొలగించండి
    4. కంది శంకరయ్య కవన ప్రోద్బలమున
      పద్య కుసుమ సరళి పరిఢవిల్లె
      తెలుగు కవన పటిమ వెలిదీయు మీకివే
      వంద వేల బృంద వందనములు

      తొలగించండి
    5. శంకరయ్య గారికి .. వందనములు
      మీ సూచనలు అమూల్య మైనవి . తప్పక అనుసరిస్తాను. హృదయ పూర్వక ధన్యవాదములు ... మధుసూదనరావు

      తొలగించండి