8, ఆగస్టు 2017, మంగళవారం

సమస్య - 2432 (భారతము వ్రాసి వాల్మీకి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భారతము వ్రాసి వాల్మీకి వాసికెక్కె"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

74 కామెంట్‌లు:

 1. కరివదనుని ఘంట మెపుడు ఘనత నొందె,
  రామ చరితను ఘనముగ రచన చేసి
  నట్టి మహర్షి పేరేమి , నల్ల డబ్బు
  పట్టు బడగ మోడీ కేమి ఫలిత మొచ్చె
  భారతము వ్రాసి, వాల్మీకి, వాసి కెక్కె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మహర్శి' అన్నచోట గణదోషం. "అట్టి మునిరాజు పేరేమి" అందామా?

   తొలగించండి
 2. వ్యాసముని మహాత్ముడు నాడు వాసికెక్కె
  భారతము వ్రాసి; వాల్మీకి వాసికెక్కె
  రామ చరితము ఘనముగ వ్రాసి మునుపు;
  ధర్మ శాస్త్రము లివిరెండు మర్మ మెరుగ!

  రిప్లయితొలగించండి
 3. భారతము = భరతుని చరిత

  అన్న లేని రాజ్యము జూడ సున్నయనుచు
  చెప్పిన తెఱగు తలదాల్చె చెప్పుల జత
  భరతుని మది పరమ భక్తిభరితమనగ
  భారతము వ్రాసి వాల్మీకి వాసికెక్కె!!

  రిప్లయితొలగించండి
 4. భారతము వ్రాసి వాల్మీకి వాసికెక్కె.
  రామచరితము వ్యాసుని గ్రంథమయ్యె.
  భాగవతమును మొల్ల చెప్పంగలేదె?
  ఇట్టి వింతలు కలియందు పుట్టునేమొ!

  రిప్లయితొలగించండి
 5. శోకమన్నది శ్లోకమై తాక మదిని
  ధర్మమూర్తిగ శ్రీరాము ధరణి దెలియ
  ఆది రామాయణమునంది మోదమంద
  ' భారతము' వ్రాసి వాల్మీకి వాసికెక్కె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరూ జిగురు వారి దారిలో 'భారతము' అంటే భరతుని కథ అనే అర్థాన్ని గ్రహించారా?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.
   భారతము =భారతదేశం

   తొలగించండి
 6. వ్యాసదేవుడు గురువాయె వంద్యుడగుచు
  భారతము వ్రాసి; వాల్మీకి వాసికెక్కె
  నాదికవిగాను రచియించి నాలపించ
  రమ్యమైన రసభరిత రామచరిత!

  రిప్లయితొలగించండి

 7. ఘనుడగుచును నా వ్యాసుడు గణుతి నందె
  భారతము వ్రాసి; వాల్మీకి వాసి కెక్కె
  మొదటి రామాయణము వ్రాసి యెదల నిలుప;
  బరగె నితిహాస కావ్యాలు భరత భూమి!


  రిప్లయితొలగించండి
 8. భవ్యమార్గంబు దెల్పె ద్వైపాయనుండు
  భారతము వ్రాసి;వాల్మీకి వాసికెక్కె
  సర్వజనసమారాధ్యమై సందడించు
  రామగాధను వెలయించి రమ్యరీతి.

  రిప్లయితొలగించండి
 9. భరత వంశపు రాజుల భవ్య చరిత
  భారతము వ్రాసి , వాల్మీకి వాసి కెక్కె
  రమ్య రసభరి తంబగు రామ చరిత
  పూజ నీయులు మనపాలి తేజ మలర

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   భారతము తరువాత కామా పెట్టండి. అన్వయం కుదురుతుంది.

   తొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  నేటి బడుల విపరీత స్థితి , దుస్థితి :

  01)
  _____________________

  పక్క వానిని నొక చిన్న - ప్రశ్న నడుగ
  పదవ తరగతి చదివెడు - బాలు డపుడు
  తడుము కోకుండ చెప్పెను - తన జవాబు
  "భారతము వ్రాసి వాల్మీకి వాసికెక్కె"

  తెలివి తక్కువ యధికార్ల - తెలివి వలన
  మంచి నేర్పు, మహత్తర - మైన పెక్కు
  పుస్తకములకు మత పూత - పులుము కతన
  నేటి బడులందు ఘ(మ)(గ)న విద్య - నిధన మయ్యె !

  వింత దుస్థితి గమనింప - చింత గలుగు
  యెటుల రక్షించుటో వాని - నెవరి కెఱుక ???
  కాలధర్మము కామోసు - కర్మ కర్మ
  కలికి రావలె నేమొకో - కలిని నణచ ?
  _____________________

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   మీ పూరణ, దానిని సమర్థిస్తూ వ్రాసిన రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి


 11. వ్యాసుడుచ్చరింపగ యాఖు వాహనుండు
  ఘంటముగ దంతమునుగొన గణుతి కెక్కె
  భారతము; వ్రాసి వాల్మీకి వాసికెక్కె
  రామ చరిత సీతకథను రమ్యముగను !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. రామ చరితమ్ము సన్మోక్షధామ మగుచు
  వెలుగు చున్నది భువిలోన విజ్ఞులార!
  శ్లోక విస్తృతి ననిపించు సుందర మగు
  భారతము, వ్రాసి వాల్మీకివాసి కెక్కె.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 13. గురుడు చెప్పిన పాఠాలు కోర్కి మీర
  శ్రద్ధ బూనుచు నిత్యంబు చదువనట్టి
  వాడు చెప్పును వ్యాసుండు పలుకుచుండ
  భారతము, వ్రాసి వాల్మీకివాసి కెక్కె.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. వేద వ్యాసుడు రచియించె విపులముగను
  భారతము, వ్రాసి వాల్మీకి వాసికెక్కె
  రమ్య మైనట్టి సుమధుర రామగాథ
  ఘనమని కొలిచెడితిహాస కావ్యములవి.

  రిప్లయితొలగించండి
 15. వేద వ్యాసుడు రచియించె విపులముగను
  భారతము, వ్రాసి వాల్మీకి వాసికెక్కె
  రమ్య మైనట్టి సుమధుర రామగాథ
  ఘనమని కొలిచెడితిహాస కావ్యములవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'వేదవ్యాసు' డన్నపుడు 'ద' గురువై గణదోషం.

   తొలగించండి
 16. వేద సారమై వ్యాసుడు వెలుగు లీన
  భారత ము వ్రాసే:వాల్మీకి వాసి కేక్కే
  ఆది కావ్య మై నుతు లం ది య ల రు న ట్లు
  రామ చరిత ము వ్రాసి యు రమ్య ము గ ను

  రిప్లయితొలగించండి

 17. "ఎవడి భారతంబైన మాకెఱుక లేదొ"
  యనుట కథయగు 'భారతా'ర్థంబు నరయ
  ప్రథిత శోకోద్భవమ్ము, శ్రీరామ 'పుణ్య
  భారతము' వ్రాసి వాల్మీకి వాసికెక్కె

  రిప్లయితొలగించండి
 18. వాసికెక్కిరిముగ్గురుపండితులిల
  భారతమువ్రాసి,వాల్మీకివాసికెక్కె
  రామచరితమురచియించి రమ్యముగను
  సంస్క్రుతంబున జక్కటి శబ్దతతిని

  రిప్లయితొలగించండి
 19. గురువు గారికి వoదన శతము
  దేనిని రచించి వ్యాసుడు దేశ మoదు
  ఖ్యాతి నొoదె?రామచరితకవితిలకుడు
  నెవరు?సoక్షేమమోదికి నేది ఫలము?
  భారతమువ్రాసి వాlmeeki వాసి కెక్కె
  టైపు నoదు పర భాష వాడి నoదుకు మన్నిoచoడి.
  క్రమాలoకారమున మొదటి పూరణ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. ……………………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  నిన్నటిపూరణ స్వీకరి౦చ ప్రార్థన

  రాధ చెయ్యి బట్టుకొనియె రాము | డ౦త

  వాని చె౦ప ఛెళ్ళు మనియె , పాప | మతడు

  రాఖి జూపి౦చ బలికెను రాధ యిటుల :-

  " నవమినాడు రక్షాబ౦ధనమ్ము వచ్చు

  నా ? యిదియు తెలియని వె౦గళప్ప ! తెమ్ము

  వద్దనుట యేల కట్టెద పైస లిమ్ము "

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఈ పూరణను చదివి నా స్పందనను తెలిపినట్లున్నానే!?

   తొలగించండి
 21. సకల గుణనిధి, నిరతము సత్య వాక్కు
  బల్కువాడు, సీతా మనోవల్లభుని క
  థా కుసుమ విరివనమున తలిరు సౌర
  భారతము! వ్రాసి వాల్మీకి వాసి కెక్కె!
  (అరతము = తృప్తి లేనిది)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 22. రాము నిక్ష్వాకు వంశవర్ధను చరిత్ర
  సరళ రామాయణ మనగ సన్నుతముగ
  దిక్కు లన్నిట నమర కీర్తి గడియింప
  భారతము, వ్రాసి వాల్మీకి వాసికెక్కె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 23. మిత్రులందఱకు నమస్సులు!

  భారతమ్మున వ్యాసుండు పావనుఁడయె
  భక్తి భావన నిడు భాగవతము మఱియు
  భారతము వ్రాసి! వాల్మీకి వాసికెక్కె
  ఘనత రామాయణము వ్రాసి జనులకిడియు!!

  రిప్లయితొలగించండి
 24. హరవిలాసము శ్రీనాధ విరచితమ్ము,
  మను చరిత పెద్ద నార్యుండు మధుర గతిన
  యల్లె, ఘన కళా పూర్ణోద యమ్ము వ్రాసె
  సూర నార్యుండు, కూర్చె కేయూర బాహు
  చరిత మంచన, ధూర్జటి సంతరించె
  కాళ హస్తీశ శతకము, కాళిదాసు
  మేఘ సందేశము రచించె, మేలు కావ్య
  ములను ఎందరో వ్రాసెను సులువు గాను
  వ్యాస ముని జెప్ప గణపతి వాసి కెక్కె
  భారతము వ్రాసి, వాల్మీకి వాసికెక్కె
  రామ చరితను విరచించ రమ్య గతిన


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "గతిని నల్లె... కావ్యముల మరెందరో వ్రాసిరి..." అనండి. (కావ్యములను+ఎందరో... అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు).

   తొలగించండి

 25. అవని భారము ద్రుంచగ నవత రించి,
  నిగమ శ్రేష్ఠుడయినయట్టి యుగపురుషుని
  భారతము వ్రాసి! వాల్మీకి వాసికెక్కె
  వినుడు జనులార భువినిది వింతగాదు.

  రిప్లయితొలగించండి
 26. పేరు పొందెను వ్యాసుడు పృథ్విపైన
  భారతము వ్రాసి, వాల్మీకి వాసి కెక్కె
  భవ్య రామాయణము వ్రాసి, దివ్య పురుషు అం
  లీయిరువురు భరతజాతి కిష్ట రుషులు.

  రిప్లయితొలగించండి

 27. పిన్నక నాగేశ్వరరావు.

  వ్యాస భగవాను డానాడు వాసిగాంచె

  భారతము వ్రాసి; వాల్మీకి వాసికెక్కె

  రామ కథను సంస్కృతమున రచన చేసి

  రెండు నితిహాసములుగ నిలిచి జగతిని

  ప్రజల నడిపించుచుండె సత్పథము
  నందు.

  రిప్లయితొలగించండి
 28. రాజ్య గర్వము మనసునరంకుబెంచ?
  నారినవ్వుకు కౌరవుల్ నాశ కథగ
  భారతము”వ్రాసి వాల్మీకి వాసికెక్కె
  సహన సామ్రాజ్య మేలినసచ్చరిత్ర
  రామచరితములిఖియించి రక్షగూర్చె”|

  రిప్లయితొలగించండి
 29. గంధవతిపట్టి వ్యాసుడు ఖ్యాతి గాంచె
  భారతము వ్రాసి, వాల్మీకి వాసికెక్కె
  రామచంద్రుని చరితను రమ్యముగను
  సంస్కృతమ్మున రచియించి జగతిలోన!!!

  రిప్లయితొలగించండి
 30. వ్వాసుని జయసంహిత గద వసుధ యందు
  భారతము, వ్రాసి వాల్మీకి వాసికెక్కె
  రాముని మధుర గాధను, రమ్యమైన
  యిట్టి యితిహాస కావ్యాలె యిలను ఘనము.

  రిప్లయితొలగించండి
 31. తే.గీ. నిత్య పారాయణమ్మౌచు నిష్ఠ గలిగి
  రమ్య మైనట్టి మహనీయ రామ గాథ
  వ్యాసు డెవ్విధి నింపుగ వ్రాసినాడొ
  భారతము ; వ్రాసి వాల్మీకి వాసికెక్కె.

  రిప్లయితొలగించండి
 32. వ్యాసు డందె నెంతొ ఘనత పద్మనాభు,
  పాండు సుతుల కౌరవులతో భాగవతము
  భారతము వ్రాసి! వాల్మీకి వాసి కెక్కె
  రామచరితము సుమనోహరముగ దెలుప!

  రిప్లయితొలగించండి
 33. వ్యాసుడుగొనెఁ బేరు భువిలో నద్భుతముగ
  భారతము వ్రాసి, వాల్మీకివాసి కెక్కె
  వ్రాసి రామాయణమ్మును భవ్యమతిని
  నిలుచు వారియశమిలలో నిశ్చలముగ

  రిప్లయితొలగించండి
 34. అరయ నన్నయ తిక్కన మరియు నెర్ర
  ప్రగడ రచియించె నలనాడు మిగుల వేడ్క
  రామ చంద్రుని కధ తొల్లి రంజిలంగ
  భారతము వ్రాసి వాల్మీకివాసి కెక్క
  క్రమాలంకారంలో పూరించాను
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 35. నారద ముని బోధ వలన నామమేతి
  రగబడి మరామరాయని రామ నామ
  జపమువలనన్కవిత్వముజా తికెల్ల
  భారతము వ్రాసి వాల్మీకి వాసికెక్కె

  రిప్లయితొలగించండి
 36. దైత్య,దానవుల్,మనుజులై, ద్వాపరమున
  ధర్మ హానిని కలిగించు మర్మమెరిగి
  వ్యాసుడై యవతరించి సత్పథము కొరకు
  భారతము వ్రాసి వాల్మీకి వాసి కెక్కె

  రిప్లయితొలగించండి
 37. ఊడుత భక్తి యన్నట్లు నా ప్రయత్నం చిత్తగించండి.
  పేరుగొనె వ్యాసుడు పంచమ వేదమైన
  భారతము వ్రాసి వాల్మీకి వాసికెక్కె
  వేదవేద్యుని చరితమ్ము విస్తరించి
  వేదమును వేదవేద్యుని ప్ర్రీతి గొనరె

  ఖ్యాతికెక్కెను వ్యాసుడు ప్రీతిమీఱ
  భారతము వ్రాసి వాల్మీకి వాసికెక్కె
  రామకథ వ్రాసి భరతోర్వి ప్రజలకెల్ల
  రెండు నితిహాసములు కావు రెండు కళ్ళు

  రిప్లయితొలగించండి
 38. తప్పనిసరి సవరణ: 'పేరుగొనె వ్యాసుడు పంచమ వేదమైన' అన్నప్పుడు గణభంగం! ఈ పాదాన్ని సవరించి 'పేరుగొనె వ్యాసు డైదవ వేదమైన' అని చదువుకొన గలరు.

  రిప్లయితొలగించండి
 39. పదు నెనిమిది పురాణముల్ వ్రాసి నట్టి

  గంధవతి పట్టియు ఘనుడై ఖ్యాతి నందె

  భారతమ్ము వ్రాసి,వాల్మీకి వాసికెక్కె

  జానకమ్మ కాశ్రయ మిచ్చి జగతి యందు.


  2.శక్తి పౌత్రుడై వ్యాసుడు భక్తి తోడ
  భారతమ్ము వ్రాసి,వాల్మీకి వాసికెక్కె
  తాను రామాయణంబును ధరణిలోన
  వ్రాసి చరితార్థు డైనందె రాము కృపను.

  3.సత్యవతిసుతుం డలనాడు శాంతుడయ్యె
  భారతమ్ము వ్రాసి,వాల్మీకి వాసికెక్కె
  బోయవాడైనప్పటికిని పుడమి యందు
  వ్రాసె రఘురామ చరితను భక్తి తోడ.

  4.శక్తి పౌత్రుండేరీతిగ జగతియందు
  ఖ్యాతు డయ్యెతా,నెవ్వరి కావ్యరచన
  వల్ల నెవ్వారి చరితమ్ము ప్రతిథమయ్యె
  భారతమ్ము వ్రాసి,వాల్మీకి వాసి కెక్కె.

  రిప్లయితొలగించండి