2, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2427 (కాంతుఁడు లేనివేళ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో"

67 కామెంట్‌లు:

  1. స్వాంతమునందు ప్రాణపతి చల్లగ చక్కగ వేణువూద నే
    కాంతము నందు దానపుడు గాటపుకోపమునన్ శిరంబు నా
    సాంతము పాదతాడనము సల్పిన దృశ్యము జ్ఞప్తివచ్చి శ్రీ
    కాంతుడు లేనివేళ గలకంటి పకాలున నవ్వెనెందుకో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మనోహరమైన పూరణతో శుభారంభం చేశారు. అభినందనలు.

      తొలగించండి
  2. కాంతుడు లేనివేళ గలకంఠి ఫకాలున నవ్వెనెందుకో?!!
    వింతగ టీవిసీరియలు వేడుకగూర్చుచు జోకులేయగన్
    సంతనె చీరలేమొకడు చౌకగకేజిల చొప్పునమ్మగన్
    కాంతల కిట్టిపార్టినను కమ్మని లడ్డులు నారగింపగన్
    సంతస మందుచో ముదిత శంకలు లేకనె నవ్వెనందుకే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చీరలేమొ+ఒకడు' అన్నపుడు యడాగమం వస్తుంది. సంధి లేదు. 'చొప్పున నమ్మగన్' అన్నది సాధురూపం. అక్కడ "చీరలే యొకడు చౌకగ కేజిల లెక్క నమ్మగన్" అనండి.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు! వృత్తపూరణలను ఐచ్ఛిక ప్రశ్నగా కాక నిర్భంధ ప్రశ్నగామార్చినందున మాబోంట్లకు వృత్తాభ్యాసము( సరియేనా?) యగుచున్నది!
      ధన్యవాదములు! పద్యమును తప్పక సవరిస్తాను. వీలైనంత ఆంగ్లపదములు కూడ తొలగిస్తాను!🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    3. కాంతుడు లేనివేళ గలకంఠి పకాలున నవ్వెనెందుకో?!
      వింతగ దూరదర్శనిని వేడుకగూర్చుచు హాస్యమేలగన్
      సంతను చీరలేయెకడు చౌకగ తూకము లెక్కనమ్మగన్
      కాంతల చిన్నివిందునను కమ్మని లడ్డులు నారగింపగన్
      సంతస మందుచో ముదిత శంకలులేకనె నవ్వెనందుకే!!

      తొలగించండి
  3. అంతము లేని సీరియలు హాస్యము జూపెనొ! లేక యత్తపై
    పంతము నెగ్గెనో! మరిదిఁ బారగఁ ద్రోలెనొ! తోడి కోడలే
    చెంతకు దేహి యంచు దరి చేరి గులాముగ తాను మారెనో!
    కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో!!

    రిప్లయితొలగించండి
  4. స్వాంతము నందు మాధవుడు సాదర మొప్పగ ప్రీతి పాత్రుడౌ
    పంతము తోన రాధికయె పావన తీరము రాస క్రీడకున్
    చింతిల జేయుచున్ చిలిపి చేష్టల మోదము నందు ముంచగా
    కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    పరశురామునకే సాధ్యము కానిది మరొక జన్మలో
    నైనా తన వశమవ్వ బోతున్నందులకై
    ఈశ్వరానుగ్రహము పొందిన అంబ :

    01)
    __________________________

    కాంతుఁడు లేనివేళఁ గల - కంఠి పకాలున నవ్వె నెందుకో
    సాంతము జెప్పెదన్ వినుడు ! - సాళ్వుని ప్రేమను కోలుపోవ నా
    శాంతనవుండె కారకుడు ! - చంపగ వాని, గఠోర దీక్షమై
    కాంతుని బావ బావ నతి - గాఢపు వహ్నుల నొంటి కాలిపై
    స్వాంతము నిగ్రహించి, మన - సార భజించి వరంబు బొందుటన్
    స్వాంతము శాంతి నొంది, యతి - సంతస మొందుట నంబ యంతటన్ !
    __________________________
    కాంతుడు లేనివేళ = చంద్రుడు లేని వేళ(పగటి వేళ)

    రిప్లయితొలగించండి

  6. శుభోదయం


    స్వాంతము గూడి మేనియటు సాజము గోర, జిలేబి, యా ఉమా
    కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో ?
    వింతగ లోకమెల్ల సరి వీణియ జేర్చగ, కోకిలమ్మ యున్
    చెంతన జేర, చంద్రుడటు చీకటి దోలుచు నవ్వె నెందుకో ?


    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి నమస్కారములు నేను వ్రాసిన సెల్ ఫోన్ దండకము అవి ఇవీ వర్గములోనేడు ఉమ్చినందుకు ధన్యవాదములు కవి మిత్రులు మీ అమూల్య మైన సలహాలు ఈయ గలరని ఆకాంక్ష

    రిప్లయితొలగించండి
  8. కాంతుని రాక కై కనులు కాయలు కాయ గ నిరీక్షసే యు చున్
    కాంత యొక ర్ తు భర్త మది గాంచుచునూ హ లు చుట్టు ముట్టగ న్
    కాంతుని చేష్టల న్ ద ల చి కమ్మ ని యా య ను భూతి క య్యే డ న్
    కాంతుడు లేని వే ళ గ ల కం ఠిప కా లు న నవ్వే నెం దు కో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కాయలు కాయ నిరీక్ష..." అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  9. వింతగఁ గౌరవాధములు వీర్యము వీడి సభాంతరమ్మునం
    గాంతను నేక వస్త్రఁ బరకాంత వివస్త్రను జేయు చుండ గో
    త్రాంతక సన్నిభార్జున ఘనాగ్రజుఁ డాగ్రహ తప్త చిత్తుఁడై
    కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      పద్యం అద్భుతంగా ఉంది. కాని ఎన్నిసార్లు చదివినా పై మూడు పాదాలను చివరి పాదంతో అన్వయించుకోలేక పోతున్నాను. మన్నించి వివరించండి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      కౌరవులు సభలో నొకకాంత నేకవస్త్రను పరకాంతను వివస్త్రను జేయుచుండగా అర్జునిని అన్నగారు తన భర్త కోపము తో గూడిన చిత్తుఁడు కాని వేళ(మౌనముగా) ద్రౌపది (చిత్తవిభ్రమము) తో నవ్వింది! అని నాభావము.

      తొలగించండి
    3. హమ్మయ్య! ఇప్పటికి అర్థమయింది. అద్భుతం! 'కాంతుడు...చిత్తుడై లేని వేళ...' అన్న అన్వయంతో విశేషార్థాన్ని సాధించారు. ధన్యవాదాలు.

      తొలగించండి
    4. గురువుగారికి ధన్యవాదాలు! మీ విశ్లేషణ తర్వాత పద్యభావము నాకు సుబోధకమయింది!
      పూజ్యులు కామేశ్వరరావుగారి ప్రతిపూరణ ఒక కొత్తపాఠమే! వారికి నమోవాకములు!
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  10. వింతగనాదిశంకరులు వేగమె చేరెను రాజు బొందిలో
    నంతట రాణి వానినట నచ్చెరువందుచు వానిచర్య లా
    వంతయు మెచ్చదయ్యె;విధి చేతఁదలంచి విలాపమందుచున్
    కాంతుడు లేనివేళఁగలకంఠి పకాలున నవ్వెనెందుకో!

    రిప్లయితొలగించండి
  11. ఇంతలు కన్నులుండి మనసిచ్చిన నూర్వశిఁ గాదు గాదనెన్
    పంతముఁ బూనె నచ్చర సపర్యలు నచ్చకొ ? యంచు ద్రౌపదీ
    కాంతుడు లేని వేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?
    యింతిని పంచపాండవులు నేలుట గేలిగ తోచినందుకో!?

    రిప్లయితొలగించండి
  12. కాంతుడులేనివేళ గలకంఠి పకాలున నవ్వె నెందుకో
    కాంతుని చేష్టలే మనసు గ్రమ్మగ మాటికి నవ్వెనేమొసూ
    కాంతునిధ్యాసయే గలుగు కాంతుడుదూరమ యైనచోగదా
    కాంతలకెప్పుడున్మదిని కాంతుడె యుండును దండ్రిగంటెనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...దండ్రి గంటివే" అనండి.

      తొలగించండి
  13. స్వాతి ముత్యము సినిమాలో కమలహాసను రామచంద్రుని మంగళ సూత్రములు లాక్కొని రాధిక మెడలో తాళి కట్టి భర్త కాగ ఆతని వలన గర్భము దాల్చి వాంతులు చేసుకొనుచు అనుకున్న దృశ్యము (ఊహా జనితము సుమీ)


    స్వాంతము బాధతో నలుగ, సంతసమున్ తనకీయ నాతడున్
    శాంతపు మోముతో మెలిగి ,సంబర మందు జనమ్ములెల్ల వి
    భ్రాంతిన ముంచుచూ మెడన పావన మంగళ సూత్రమిచ్చి యీ
    వాంతికి కారకుం డుగద వల్లభు డేయను యోచనంబుతో
    కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నందుకే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భ్రాంతిని ముంచుచున్" అనండి.

      తొలగించండి
  14. గురువు గారికి నమస్సులు.వృత్త పద్యాల పూరణ కొన్ని చేసినాను.
    చిoతన లేనిప తికిని చిన్మయ ముద్రధ రిoచినాo గయే
    స్వాoతన నివ్వగ వరము సాదర మాయెను నాతడికిన్ సు ఖా
    సoతస మవ్వగ ,వలపు సoసార బoధన పూత నా కళా
    కాoతుడు లేనివేళ గలకoఠి ఫకాలున నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసింప దగినది, ప్రోత్సహించ దగినది. మీ మూడు పాదాలలోను గణదోషం ఉంది. కొన్ని అసాధు ప్రయోగాలున్నవి. సవరణకు లొంగే విధంగా లేదు. మరో ప్రయత్నం చేయండి. స్వస్తి!

      తొలగించండి
  16. వింతలు వేనవేలుగల వేదిక గాంచుచు ధార్తరాష్ట్రుడున్
    భ్రాంతిని దూలగాగనిన భామిని దేవర మేలమాడుచున్
    చింతలు గూర్చగా దనకుజేకురు నాపద లెంచకుండగన్
    కాంతుడు లేనివేళ గలకంఠి పకాలున నవ్వెనెందుకో!!

    రిప్లయితొలగించండి
  17. ఎంతయు గాసి చెందునటు లేర్పడ వేసవియందు నిప్పులే
    దొంతులు దొంతులై దొరల ధూర్తత ధారుణి గల్గు జీవులన్
    వంతల పాలుజేసి శలవాయని వీడ్కొనునట్టి పద్మినీ
    కాంతుడు లేని వేళ కలకంఠి పకాలున నవ్వె నెందుకో
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  18. కాంతుఁడు లేనివేళఁ గల కంఠి పకాలున నవ్వె నెందుకో?
    చెంతకు రాదు నిద్ర కలఁ జెల్వుడు వచ్చి చరించుచుండగన్
    స్వాంతములోన సంతతము స్వామి విలాసమె కానుపించెడిన్
    కాంతుని వర్తనమ్ము మదిఁ గల్గగజేసె ముదమ్ము కొమ్మకున్

    రిప్లయితొలగించండి
  19. ర గణము మూడు పాదాల లో సవరిoచినాను.
    పత్ని మొదటి పాదము
    నివ్వగన్ రెoడవ పాదము
    మవ్వగన్ మూడవ పాదము
    పూత నా వేర్వేరు గా చదువ మనవి.
    అసాధు ప్రయోగ లనగా ప్రయోగిoప కూడనవని నా సo దేహము.పై పద్యము లో వాటిని తెలిపిన నేను మరొక సారి ప్రయత్నం చేస్తాను.హృదయ పూర్వక నమస్సులు.

    రిప్లయితొలగించండి
  20. బoధన కు బదులు గా మోహపు వాడిన అర్థం ఏ విధంగా వుంటుంది?దయ చేసి తెలుపుము.

    రిప్లయితొలగించండి
  21. బoధన కు బదులు గా మోహపు వాడిన అర్థం ఏ విధంగా వుంటుంది?దయ చేసి తెలుపుము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      మిమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించండి. మీరు సూచించిన సవరణలతో కొన్ని గణదోషాలు తొలగిపోయాయి. కాని రెండవ పాదం చివర 'నాతడికిన్ సుఖా', మూడవ పాదంలో 'సంసార' అన్నచోట్ల గణభంగం అలాగే ఉన్నాయి. 'ముద్ర ధరించినాం గయే'.. అన్నది అర్థం కాలేదు. 'స్వాంతన' అన్న పదం లేదు. ఓదార్పు అనే అర్థంలో 'సాంత్వనము' ఉన్నది. గమనించగలరు.

      తొలగించండి
  22. ముంతలుముంతలేసి తనపూర్వులునేతులత్రాగిరంచుక
    ళ్ళింతలుజేసిజెప్పెతనపెళ్ళికిముందునఇల్లుజూడయే
    కాంతముజిక్కబోదుతనకాంతునిగల్వ యదేమిచిత్రమో
    కాంతుడులేనివేళగలకంఠిపకాలుననవ్వెయెందుకో !!!

    రిప్లయితొలగించండి
  23. క్రమాలoకార oలో------
    కాంత కు చింత మెండగు చుకాలము ముందు కు సాగదేప్పుడో?
    పొంతన లేని భంగి పతి మోహము తో పలుక oగనే మ గు న్ ?
    స్వాంతము మంచి దై తన రు వానిసమాజ ము నమ్మ దే మి టో ?
    కాంతుడు లే ని వే ళ_కలకంఠిప కా లు న నవ్వే _నె oదుకో ?

    రిప్లయితొలగించండి
  24. గురువు గారికి నమస్సులు.
    మీ లాoటి గురువులఆశీస్సులతో పద్య పూరణ ఆరoభ ములో వున్నాను.మన్నిoచoడి అనే పదము శిష్యుడి కి వ ద్దు. మీ సూచనలు ఎప్పుడు పాటిస్తాను. సదా మీ శి ష్యుడు .
    వoదనములతో

    రిప్లయితొలగించండి

  25. పిన్నక నాగేశ్వరరావు.

    కాంతుడు లేనివేళ గలకంఠి పకాలున
    నవ్వెనేలనో
    చింతన చేయుచుండ నొక చేడియ
    పల్కెను సాటివారితో
    యింతికి శోభనమ్ము జరిగెన్ గద యా
    మధురోహలందు తా
    నెంతయు మున్గి దేలినది నెమ్మి
    దలంచుచు భర్త చేష్టలన్.
    ****************************

    రిప్లయితొలగించండి
  26. . కాంతుడు లేనివేళ గలకంఠి పకాలుననవ్వెనెందుకో?
    “పొంతనలేనివింత గని?పువ్వుల చెంతన కీటకంబులే
    వింతగ జేరి పుప్పుడి వివేకము నందున గ్రోలుచుండ|రా
    ద్దాంతముచేత కట్నమని దగ్గర జేరని భర్త చేష్టకున్”|

    రిప్లయితొలగించండి

  27. కాంతుడు లేనివేళ గలకంఠి పకాలుననవ్వెనెందుకో?
    పంతము బూని ,విష్ణు పదభక్తుని నంబిని,శ్రీహరిన్ సదా
    చింతన సేయువాని,తన సేవయె ముక్తికి మార్గ మ౦చు వి
    భ్రాంతు నొనర్చి ,రంగని గళమ్మున హారము గోరినందుకా.?

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కాంతుడు లేని వేళ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?
    వింతలు గొల్పుచున్ వెలుగు పెమ్మిని గూడినవౌ ప్రదేశముల్
    పంతుగ జూపుచున్ననిన పాతివి పల్కులు దల్చుచున్ మదిన్
    పొంతువ పెంచినట్టివగు పూటలు గుర్తుకు వచ్చినందుకే!

    రిప్లయితొలగించండి


  29. కాంతుడు లేనివేళ గలకంఠి పకాలున
    నవ్వెనేలనో
    శాంతముగానుచెప్పమని సఖ్యత తోడను నెచ్చలి కోరగా ననెన్
    కాంతుడురానివేళగని కాంతిని జిమ్మెడినీముఖమ్ములో
    కాంతిని గాంచనెమ్మనముగాఢమునౌనను మాటతల్వగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "సఖ్యతతో చెలి కోరగా ననెన్" అనండి.

      తొలగించండి
  30. శ్రీమతి జి సందిత బెంగుళూరు

    స్వాధిష్ఠానంబాదిగ
    సాధకులకొసంగియోగశక్తులనటుయో
    గాధీనుడు సాంబశివుడు
    మాధవుడే కీర్తినందె మదనాంతకుడై

    శ్రీమతి జి సందిత బెంగుళూరు

    శివుడు +ఉమా ధవుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      ఈనాటి పూరణ నిన్నటి సమస్య క్రింద పెట్టారు. పరవాలేదు లెండి!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?
    వింతయిటేమియున్నదిర విప్పిన ప్యాంటున జేబులోనహా!
    చింతలబస్తిలో కొనిన చిప్పుల పల్కులు జీడిపప్పులున్
    దొంతర దొంతరుల్ దొరకె ధూపపు కట్టెల బీడిముక్కలున్ :)

    రిప్లయితొలగించండి
  32. కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో?...
    చింతలు జేయుచుండగను చేపలు లేవని ఫ్రిజ్జిలోనటన్
    కొంతయు నోపు లేదనుచు కోరిక తీరగ వంటచేయుటన్...
    వింతగ వచ్చెనింటికహ బిర్యని కల్లును వోట్లకోసమై :)

    రిప్లయితొలగించండి