28, ఆగస్టు 2017, సోమవారం

సమస్య - 2449 (ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

73 కామెంట్‌లు:



  1. అర్జునుడు నాల్గు సోదరులనఘ! కట్టి
    రి గద మంగళ సూత్రము, రిత్త గాదు,
    ద్రౌపది మెడలోఁ! గృష్ణుఁడు తాళిఁ గట్టె
    జాంబ వతికి, జిలేబియ, చట్ట గాదు !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. బాధలందు మ్రొక్కె పరమ భక్తు రాలు
    ద్రౌపది; మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె
    సత్యభామ రుక్మిణులకు సంతసమున
    వేనవేల వనితలకు వేడు కొనగ

    రిప్లయితొలగించండి
  3. ద్రుపదుడు ప్రకటింపగ తన దుహిత నిత్తు
    మత్స్య యంత్ర భేదన జేయు మాన్యు నకును,
    విజయు డంత భేదించగ విజయ మంది
    ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె

    రిప్లయితొలగించండి
  4. మత్స్యయంత్రముఁగొట్టి బ్రాహ్మణుని రూప
    మందు పరిణయంబాడెనన్నైంద్రుడనగ
    ద్రౌపది, మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె
    గెలిచి యని రిపులనని రుక్మిణియు తెలిపె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊకదంపుడు గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      ద్రౌపదీ రుక్మిణీ సంవాద రూపమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. కృష్ణను(1)గెలిచెఁ గృష్ణుడు(2) కృష్ణు(3) కృపకు
    నిత్య పాత్రుడు పార్థుడై నిలుచుననగ
    కృష్ణు(4)డొప్పింప ద్రుపదుని, పృథ పలుకున
    ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె!!

    1. కృష్ణ = ద్రౌపది
    2. కృష్ణ = ఆర్జునుడు
    3. కృష్ణ = వాసుదేవుడు
    4. కృష్ణ = వ్యాసుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. సత్యనారాయణ గారు మనోహరమైన పూరణ. మన యిరువురి భావములు సాదృశ్యము లగుట ముదావాహము.

      తొలగించండి
  6. ఫల్గునుండును తక్కిన పాండవులును
    తాళిగట్టిరి ద్రుపదుని తనయయైన
    ద్రౌపది మెడలో; గృష్ణుడు తాళి గట్టె
    నష్టరమణుల కత్యంత మాదరమున.

    రిప్లయితొలగించండి
  7. పాండుపుత్రుల భార్యయై వాసిఁగాంచె
    ద్రౌపది; మెడలోఁగృష్ణుడు తాళిఁగట్టె
    తనకు తానె సమర్పణ తత్పరతను
    భక్తి నొప్పారు రుక్మిణి భామకపుడు

    రిప్లయితొలగించండి
  8. తల్లిపన్పున పాండవుల్ దాలిగట్ట
    ద్రౌపది మెడలోఁ గృష్ణుడు తాళిఁ గట్టె
    రుక్మినోడించి దురమున రుక్మిణిమెడ
    సంబరము సలుప యాదవుల్ సంతసమున

    రిప్లయితొలగించండి
  9. మత్స్య యంత్రమ్ము భేదించి మగువ నంది
    ఫలము దెచ్చితినన దల్లి పంచు మనగ
    అన్నదమ్ములతోఁ గూడి యానతి యని
    ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె
    ( కృష్ణుడు = అర్జునుడు)

    రిప్లయితొలగించండి
  10. పంచ పాండవు లకుభార్య పతివ్రత యన
    ద్రౌపది . మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె
    సత్యా రుక్మిణు లకుసర సమ్ము గాను
    సురలు మెచ్చగ శుభమంచు వరము లిడగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సత్యా' అన్నచోట గణదోషం. "సత్యభామ రుక్మిణి యను సతుల కపుడు" అనండి.

      తొలగించండి

    2. పంచ పాండవు లకుభార్య పతివ్రత యన
      ద్రౌపది , మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె
      సత్య భామరుక్మిణి యను సతుల కపుడు
      సురలు మెచ్చగ శుభమంచు వరము లిడగ

      తొలగించండి
  11. అంధురాలైన పత్నికి నచట జరుగు
    పెండ్లి విషయాల నొక్కడు విను మటంచు
    తెలుపు చుండెను మనపట్టి దీప్తి కదిగొ
    ద్రౌపది! మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  12. మత్స్య యంత్రమ్ము ఛేధి oచిమహి త శీలి
    వే సె వర మాల కవ్వడి వీ రు డ గుచు
    ద్రౌపది మె డ లో న ;గృష్ ణుడు తాళి గ ట్టీ
    సత్య దేహ ము పులకింప సంత స ము న

    రిప్లయితొలగించండి
  13. మత్స్య యంత్రము గొట్టిన మర్త్యమూర్తి
    వ్యాసునానతి తలదాల్చి బాండుసుతుడు
    యన్నదమ్ముల గూడి స్వాధ్యాయ విధిని
    ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె

    కృష్ణుడు = నల్లనివాడు = అర్జునుడు

    రిప్లయితొలగించండి
  14. సర్వ జీవుల పతియగు సర్వ వ్యాపి
    సకల భువనపు రక్షక సార్వభౌమ
    వరము లొసగుచు రక్షణ బంధ మనెడు
    ద్రౌపది మెడలో కృష్ణుడు తాళి గట్టె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సర్వ వ్యాపి' అన్నపుడు 'ర్వ' గురువై గణదోషం.

      తొలగించండి
  15. చేప యంత్రమ్ము శరముతో ఛేద నమ్ము
    చేసి, సభ లోన ముదముతో చెలువ పూల
    దండ గళమున వేయంగ, దల్లి యాజ్ఞ
    బడసి, పార్ధుడు వేసెను ముడులు మూడు
    ద్రౌపది మెడలో , కృష్ణుడు తాళి గట్టె
    సత్య భామ కుహరమందు సంత సముగ

    రిప్లయితొలగించండి
  16. రామ కల్యాణమును గాంచి పామరుడగు
    వ్యక్తి యొక్కరు డిట్లాడె పరవశుడయి
    జ్ఞాన మొక్కింత యైనను లేని కతన
    ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  17. తే.గీ. శాస్త్ర విషయాలు నాకును చాల యెరుకె
    కుంభ కర్ణుని భీముడు కుళ్ళ బొడిసె
    కీచకుడు శిశు పాలుని కీళ్ళు విరిచె
    ద్రౌపది మెడలో కృష్ణుడు తాళిగట్టె.
    ( ఓ పామరుని ప్రేలాపనలు)

    రిప్లయితొలగించండి
  18. తాళి గట్టిరి పాండవుల్దల్లి చెప్ప
    ద్రౌపది మెడలో, గృష్ణుఁడు తాళి గట్టె
    సత్య భామమొద లుగాగ సతుల కార్య !
    యష్ట మహిషుల బేరన నాఖ్యు లైరి

    రిప్లయితొలగించండి
  19. (జూదమున సర్వం ఓడి వనవాసం చేస్తున్న పాండవులను కృష్ణుడు సత్యభామ సందర్శించిన సందర్భాన సత్య పాంచాలిని ఇట్లడిగె)
    ద్రౌపది! మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె
    నా మదిని దోచె, నైననూ నాకు దాసు
    డెట్లగునొ? పంచభర్తృక! ఠీవి మెరయ
    గేస్తు నదుపున నుంచు యా కిటుకు దెలుపు౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురాం గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. 'ఐనను' అంటే చాలు. చివర దీర్ఘం సాధువు కాదు.

      తొలగించండి
  20. ……………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గాయకుల గీత మధురిమ హాయి గొలుప

    " ఒన్సు మోరుల " కేకల హోరు సాగ

    నూరిలో నాటకము వేయు చున్న వేళ

    ద్రౌపది మెడలో గృష్ణుడు తాళి గట్టె ! !

    ద్రౌపదిగ నటి౦చిన నటి ' రాధ ' కాగ

    కృష్ణునిగ నటి౦చిన వాడు ' కృష్ణు ' డగును


    ( ఒన్సు మోరు = once more ;

    కృష్ణుడు = అర్జునుడు ; )

    రిప్లయితొలగించండి
  21. ఈశ్వరుని కృపఁ గృష్ణ మునీశ్వరు నను
    మతినిఁ గంసారి గృష్ణ సమ్మతిని నెంచి
    కుంతి కృష్ణ యని యెఱుఁగ కుండ కోర
    ధర్మ జానిలజుల వెన్క ధర్మ మెంచి
    ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె

    [కృష్ణుఁడు = వ్యాసుఁడు, పార్థసారథి, అర్జునుఁడు; కృష్ణ = ద్రౌపది]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      కృష్ణ శబ్దానికి ఉన్న అర్థ వైవిధ్యాన్ని వినియోగించుకొని ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  22. పిన్నక నాగేశ్వరరావు.

    మత్స్య యంత్రమున్ పాండవ మధ్య
    ముండు
    నిండు సభయందు ఛేదించి దండ వైచె

    ద్రౌపది మెడలో; గృష్ణుడు తాళి కట్టె

    సత్యభామకు రుక్మిణీ సకియలకును.

    రిప్లయితొలగించండి
  23. పార్ధుని వరించు పుత్రికై పరితపించి
    ద్రుపదు డొనరింప తపమును కృపను గోరి
    యజ్ఞఫలముగ జనియించె యాజ్ఞసేని
    మత్స్యయంత్రమ్ము ఛేధించి మాన్యుడగుచు
    ద్రౌపది మెడలోకృష్ణుడు తాళి గట్టె!

    కృష్ణుడు= అర్జునుడు

    రిప్లయితొలగించండి
  24. మత్యయంత్రముఛేదించి మఘవసుతుడు
    మంగళమ్ముగ మనువాడి మాలవేసె
    ద్రౌపది మెడలో,కృష్ణుడు తాళిగట్టె
    భైష్మకినిపరిణయమాడి బాళితోడ!!!

    మఘవసుతుడు= అర్జునుడు, భైష్మకి =రుక్మిణి

    రిప్లయితొలగించండి
  25. అన్న,చెల్లెలు నాటకమాడు నపుడె
    వేషభాషలు ప్రేమను పెంపుజేయ|
    మమతలందించ వరునికి మగువనచ్చ?
    సంఘ సంస్కార వంతులు సాయబడగ
    ద్రౌపది మెడలోగృష్ణుడుతాళిగట్టె

    రిప్లయితొలగించండి
  26. మత్స్య యంత్రము ఛేదించి మహినినరుడు
    మాన్యతను గొనుచునె శతమాన ముంచె
    ద్రౌపది మెడలోఁ ; గృష్ణుఁడు తాళిఁ గట్టె
    రుక్మిణికి, సిగ గొఱుగఁగ రుక్మి యేడ్వ

    నిన్నటి సమస్యకు నా పూరణ

    నరులకు వానరులకు తమ
    తరమా ! నను గూల్చ ననుచు దర్పముతో నా
    పరమాత్ముని యెరుగని కా
    వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అండజమ్మును తునియించి నర్జునుండు
    తా స్వయంవరమ్మున గెల్చి దండ వేసె
    ద్రౌపది మెడలో; కృష్ణుడు తాళి గట్టె
    రుక్మిణికి రాక్షస వివాహ రూపు నందు




    రిప్లయితొలగించండి
  28. ప్రాపుగను మత్స్య యంత్రము
    తాపడ గొట్టంగ ప్రజలు తద్దయు పొగడన్
    శ్రీపతి మెచ్చగ మురియుచు
    ద్రౌపది మెడలో కృష్ణుడు తాళి గట్టె
    కృష్ణ శబ్దము అర్జునునికి వర్తిస్తుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మగారూ! సమస్యా పాదము కందము కాదు, తేటగీతి! గమనించ గలరు!

      తొలగించండి
    2. భాస్కరమ్మ గారూ,
      తేటగీతి సమస్యకు కందపద్యం పూరణ... మీ పూరణకు నా సవరణ...
      ప్రాపుగను తాను మంత్స్యయంత్రమ్ము గొట్ట
      ప్రజలు తద్దయు పొగడ శ్రీపతియె మెచ్చ
      ద్రుపదు డానంద మంద నెంతో మురియుచు
      ద్రౌపది మెడలో కృష్ణుడు తాళి గట్టె.

      తొలగించండి
    3. అర్జునుని కృష్ణ పాత్రల నాడె నొకడె,
      ద్రౌపది మెడలో కృష్ణుడు తాళి గట్టె
      సభికులు రభస జేయ మీసలు ధరించి
      చూడుడిపుడు నేనయితి నర్జునుడ టంచు

      తొలగించండి
    4. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. గురువు గారికి నమస్కారములు. పూరణలోని దోషములు తె ల్పుడు.
    మేటి విలుకాడు పార్థుడు మీన యం త్ర
    మును సులువు గ చే ది o ప ము చ్చ ట గ ను
    ద్రౌపది మెడలో కృష్ణుడు తాళి గట్టె
    నకుల సహదేవు నగ్రజుల్ న ను సరి o ప.
    వందనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. రెండవ పాదంలో గణదోషం. "ఛేదింపగ..." అనండి. 'అగ్రజుల్ + అనుసరింప' అన్నపుడు నుగాగమం రాదు. "అగ్రజ నకుల సహదేవు లనుసరింప" అనండి.

      తొలగించండి
  30. ద్రౌపదికి అర్జునుడు చెప్పడము:
    వినుము యాత్రర్థముగను నే చనిన వెంట
    అంగనలను మువ్వురిని పెళ్ళాడినాను
    పన్నుగను జేసితిన్ పలుకన్నెలకును
    ద్రౌపది! మెడలో కృష్ణుండు తాళికట్టె

    రిప్లయితొలగించండి
  31. పంచభర్తృకన నెవరు వసుధ యందు
    నాభరణముగ నెటదాల్చె నహిని శివుడు
    వలచి వచ్చిన భైష్మకి వలపు తోడ
    ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె"


    మత్స్య యంత్రముభేదించి మహిని నాడు
    గట్టె తాళిని ముదమున కవ్వడి వెస
    ద్రౌపది మెడలోఁ ;గృష్ణుఁడు తాళిఁ గట్టె
    సత్యభామాదులకు తాను సంతసాన.

    ధర్మరాజట ముదమున తాళిగట్టె
    ద్రౌపది మెడలోఁ ;గృష్ణుఁడు తాళిఁ గట్టె
    నష్ట భార్యల కవనిలో నాదరాన
    విస్మయంబగు నాకథల్ వినుచు నుండ.

    మత్స్య యంత్ర మేసి మహిలో మమత తోడ

    ద్రౌపది మెడలోఁ ;గృష్ణుఁడు తాళిఁ గట్టె

    తల్లి యానతి మేరకు తనయు లెల్ల

    పంచుకొనిరట యలనాడు పడతి నచట.

    భీముడు గట్టెను తాళిని భేషన ప్రజ
    ద్రౌపది మెడలోఁ ;గృష్ణుఁడు తాళిఁ గట్టె
    వలచివచ్చిన రుక్మిణి కిలను తాను
    ముదము గూర్చెనెల్లరకును మురహరుండు.

    కవలు ముదమున తాళిని కట్టి రచట
    ద్రౌపది మెడలోఁ ;గృష్ణుఁడు తాళిఁ గట్టె
    లక్షణ కలనాడు సభలో లలియు హెచ్చ
    మత్స్యయంత్రమున్ ఛేదించి మహిని నాడు.




    రిప్లయితొలగించండి
  32. ద్రౌపదికి అర్జునుడు చెప్పడము:
    వినుము యాత్రార్థముగను నే చనిన వెంట
    అంగనలను మువ్వురిని పెళ్ళాడినాను
    పన్నుగను జేసితిన్; పలుకన్నెలకును
    ద్రౌపది! మెడలో కృష్ణుండు తాళికట్టె

    రిప్లయితొలగించండి