7, ఆగస్టు 2017, సోమవారం

సమస్య - 2431 (నవమినాఁడు రక్షా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నవమినాఁడు రక్షాబంధనమ్ము వచ్చు"

75 కామెంట్‌లు:

  1. చక్కనయ్య రాముడు పుట్టె చైత్ర శుద్ధ
    నవమినాఁడు; రక్షాబంధనమ్ము వచ్చు
    నయ్య! శ్రావణ పున్నమి నాడు; కొనుము
    చెల్లెలి కొరకు సరిక్రొత్త చీర యొకటి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. తిథులు విధులును తెలియని తిక్కలయ్య!
      నవమినాఁడు రక్షాబంధనమ్ము వచ్చు
      పాత దానిని ముడివిప్పి పార వేసి
      క్రొత్త జంద్యము తగిలించు కొక్కెమునకు!

      తొలగించండి
  2. రామ కళ్యాణ సుమధుర ధామమనగ
    చూడ భద్రాద్రి వైకుంఠ శోభఁదెచ్చు.
    నవమినాడు;రక్షా బంధనంబు వచ్చు
    శ్రావణంబున పౌర్ణమి దీవెనలుగ

    రిప్లయితొలగించండి
  3. వేడ్క తోడను జరిపేరు విశ్వమందు
    జానకీరాములకు పెండ్లి చైత్ర శుద్ధ
    నవమినాడు, రక్షాబంధనమ్ము వచ్చు
    నయ్యె శ్రావణ పౌర్ణిమ నాడు గాదె.

    రిప్లయితొలగించండి
  4. "రక్ష" అనే పేరుగల ఆధునిక అమ్మాయికి చేసే హితోపదేశము:

    పెండ్లి యాడిన బంధాలు పెరుగుననుచు
    కలిసి యున్న స్వేచ్చయనుచు కలకనెదవు
    తోయజనయన!మరి వచ్చు తొందర పడి-
    న "వమి", నాఁడు రక్షా! బంధనమ్ము వచ్చు!!

    వమి = వాంతి

    రిప్లయితొలగించండి
  5. సకలసద్గుణగణముల చక్రవర్తి
    యైన రామయ్య పుట్టినవైన మెపుడు!
    శ్రావణంపు ఘనతయేమి!చైత్రశుద్ధ
    నవమినాడు; రక్షాబంధనమ్ము వచ్చు.


    రిప్లయితొలగించండి


  6. అష్టమి దినమది జిలేబి యహిరిపువున
    కు, మన రాముని జన్మము కుదిరెనమ్మ
    నవమినాఁడు; రక్షాబంధనమ్ము వచ్చు
    పున్నమి దినపు శ్రావణ పుణ్య వేళ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. శ్రావణమునందు శుక్లంపు షష్ఠినాడు
    పండుగెన్నడు చెల్లెలు వచ్చుననగ
    యన్న దెలిపెను నేటికి యక్షరాల
    నవమినాఁడు రక్షాబంధనమ్ము వచ్చు

    రిప్లయితొలగించండి
  8. దశమి యను కాంత సోదరిన్ తన్మయమున
    పిలిచి యొకసారి మిక్కిలి ప్రేమతోడ
    బలికె నేతెంచ శ్రావణ పౌర్ణమి తిథి
    నవమి! నాఁడు రక్షాబంధనమ్ము వచ్చు
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  9. తిథులు వారాలు తారలు తెలియ కుండ
    శుంఠయైయుండు వానికి శుభకరమగు
    విజయ దశమియు నేతెంచు విదియ నాడు
    నవమి నాఁడు రక్షాబంధనమ్ము వచ్చు

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  10. చవితి దినమున గణపతి జన్మ దినము,
    అష్టమి దినాన కృష్ణుడు , షష్టి నాడు
    శరవణుడు బుట్టె,జన్మించె సప్తమి తిది
    నాడు రవి, పుట్టె రాముడు నగవు తోడ
    నవమి నాడు , రక్షా బంధనమ్ము వచ్చు
    పున్నమి దినమున సతతము భూమి పైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. గురువు గారు క్షమించండి 6 వ పాదము లొ పొరబాటు జరిగినది పున్నమి దినాన సతతము భూమి పైన అని సరి చేస్తున్నాను.

      తొలగించండి
  11. కనకదుర్గ మహాకాళి కమల వాణి
    యనుచు తొమ్మిది దినములీ యాశ్వయుజపు
    పర్వదినముల నర్చించ పలుకు దేవి
    నవమినాడు, రక్షాబంధనమ్ము వచ్చు.

    రిప్లయితొలగించండి
  12. ఒక ఏడేళ్ళ బాలుడు తన తల్లిదండ్రులతో పలికిన మాటలుగా......

    పుడమి రక్షించు నెపమున భువిని హరియె
    జనన మందె శ్రీ రాముడై చైత్ర శుద్ధ
    నవిమి , నాడె రక్షాబంధనమ్ము వచ్చు
    నని దలచితినని పలికె నర్భకుండు.

    రిప్లయితొలగించండి
  13. బ్రాహ్మణునివెంట యాజ్ఞిక వస్తువులను
    బాధ్యతగ నెంచి మోసెడి వాడొకండు
    జనులు ప్రశ్నించ యోచించి యనియె నిట్లు
    నవమి నాఁడు రక్షాబంధనమ్ము వచ్చు.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  14. జనన మ య్యే ను రఘు రా మ చంద్రుడవ ని
    న వ మి నాడు :రక్షా బంధ నమ్ము వచ్చు
    శ్రావణoబున పౌర్ణమి న్ చక్క నై న
    బంధ నమ్ము లువర్ధిల్లువల పుపొంగ

    రిప్లయితొలగించండి
  15. *వెడలు చుంటిని వ్యాపార వేత్త నగుట*
    *దూరదేశము, తిథిజూడ, తోయజాక్షి*
    *నవమి నాడు, రక్షాబంధనమ్ము వచ్చు*
    *వేళ మరలెద చెల్లికి విందు నీయ*

    రిప్లయితొలగించండి
  16. ఆలు మగడితో సల్లాప మాడి నతివ
    చూలు బొoదెను ముదమున చూడ నoత
    నామె పుట్టిoటి బోయెను, నేడు రామ
    నవమి, నాడు రక్షా బoధన మ్ము వచ్చ
    టైపు పొరబాటు గలదు. మన్నించo డి
    నమస్సులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సల్లాపమాడి యతివ.. పుట్టింటి కేగెను... వచ్చు..." అనండి.

      తొలగించండి
  17. పయన మవ్వకు మందురు భయముతోడ
    నవమి నాడు; రక్షా బంధనమ్ము; వచ్చు
    దశమి దినమది శుభఫలదమ్మగుటను
    తరలి పొమ్మిక యాత్రకు త్వరగ నపుడు!

    రిప్లయితొలగించండి
  18. రాముడైపుట్టె ధనుజారి భూమిపైన
    నవమి నాఁడు, రక్షాబంధనమ్ము వచ్చు
    శ్రావణికమున ప్రతి వత్సరమ్ము, స్వయపు
    బ్రాతకనుజ కట్టును రక్ష బంధనమును

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులుకు నమస్సులు. నిన్నటి, మొన్నటి మఱియు 4వ తేది నాటి నా పూరణలను దయ యుంచి పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.

    తల్లి దండ్రి కుడువ తనయుడును సతము
    మాంస మిష్ట పడు సుమా! ద్విజుండు
    పరవశమున దినును పప్పు దప్పళముల,
    పంచ భక్ష్యములను, పాయసముల!

    కనగా నాటి సుబాహు చావుకు ప్రతీకారాగ్ని వేధింపులన్
    వినగన్ సోదరి పొందు వేదనల నావేశమ్ముగా దూలుచున్
    కనులన్ గానని యాగ్రహమ్ము రగులంగా రావణుండంత రా
    ముని పత్నిన్ గొని పోయి చచ్చెను గదా మోహాంధుడై యాజిలో!

    శుభము లిచ్చును సిరులతో శోభ గూర్చు
    క్రమము దప్పక పూజింప శ్రావణమున
    వాసితోడ శుక్లపు శుక్ర వారమందు
    రంగులలరు నిందిరను వరముల గోరి!

    రిప్లయితొలగించండి
  20. అందరికి శుభము లొసగు నంకెయేది?
    యేదినము నక్కచెల్లెళ్ళు వేడ్కమీర
    గారవింతురు సోదరు గాఢమైత్రి
    నవమి; నాడు రక్షాబంధనమ్ము వచ్చు!

    రిప్లయితొలగించండి
  21. పంచ ప్రాణముల్ పోగులై పరిఢవిల్లు
    హృదయ మద్దిన రాఖీని పదిలపరచి
    వెంటఁ దెచ్చెడు చెల్లి మా యింట దిగెడు
    నవమి నాడు రక్షాబంధనమ్ము వచ్చు!

    రిప్లయితొలగించండి
  22. శ్రావణి యగు నాఱవ దివసమ్ము గడవ
    నవమి, నాఁడు రక్షాబంధనమ్ము వచ్చుఁ
    బండుగే యది సంతాన మండలికినిఁ
    గాంచ రక్తసంబంధము గట్టిపడును

    [శ్రావణి= శ్రావణ మాసపు పున్నమి]

    రిప్లయితొలగించండి
  23. ……………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రాధ చెయ్యి బట్టుకొనియె రాము | డ౦త

    వాని చె౦ప ఛెళ్ళు మనియె , పాప | మతడు

    రాఖి జూపి౦చ బలికెను రాధ యిటుల :-

    " నవమినాడు రక్షాబ౦ధనమ్ము వచ్చు

    నా ? యిదియు తెలియని వె౦గళప్ప ! తెమ్ము

    వద్దనుట యేల కట్టెద పైస లిమ్ము "

    రిప్లయితొలగించండి

  24. పిన్నక నాగేశ్వరరావు.

    జానకీ రాముల వివాహ సంబరమ్ము

    జరుగు కన్నుల పండుగై చైత్ర శుద్ధ

    నవమినాడు; రక్షా బంధనమ్ము వచ్చు

    నెపుడు శ్రావణ పౌర్ణమిని గద నరయ.

    రిప్లయితొలగించండి
  25. వచ్చు రాముడు పుట్టినబ్రముఖ దినము
    నవమి నాడు ,ర క్షా బంధనమ్ము వచ్చు
    తిథియ శ్రావణ పూర్ణిమ దినము నాడు
    ముఖ్య మైనట్టివే యవి మురళి !మనకు

    రిప్లయితొలగించండి
  26. అన్న పలికెను నేడు నేనమెరికాకు
    తరలవలయును రాఖీని తక్షణమ్మె
    హస్తమున కట్టు సోదరీయచ్చెరువుగ
    నవమి నాడు రక్షాబంధనము వచ్చు
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  27. రావణాసురవధకు శ్రీరామజనన
    మవ్వగ?సురులు,బాధితుల్ మంచిదినము
    నవమినాడు|రక్షాబంధనమ్ము వచ్చు
    ననుచు భవితను గుర్తించి నవ్వుకొనిరి|


    రిప్లయితొలగించండి
  28. వచ్చు శుభముగ శ్రీరామ పరిణయమ్ము
    నమమినాడు, రక్షాబంధనమ్ము వచ్చు
    శ్రావణంబున పౌర్ణమిన్ సముచితముగ
    తోడబుట్టినవారికి వేడుకిడుచు!!!

    రిప్లయితొలగించండి
  29. గురువు గారు
    నమో వాకములు.
    సమస్యా పూరణ యoదు తేటగీతి లో నాలుగు
    పాదాలను మిoచి వ్రాసిన తేటగీతిక అని చెప్పవచ్చా?వృత్త
    పద్యాలను అలా వ్రాసిన వృత్త మాలిక అందురా?నా సo దేహమును తొలగిoచవలయునని మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్రాయవచ్చు.
      ఆటవెలది, కంద పద్యాలను మాత్రం ఆ విధంగా వ్రాయడానికి అవకాశం లేదు.

      తొలగించండి
  30. పామరుఁడు నేడు శ్రావణ పౌర్ణమి గద !
    రక్ష కట్టిన చెల్లికి రక్షణ యన ,
    చాలు మూర్ఖుడ ! యనె శాస్త్రి చైత్ర శుద్ధ
    నవమినాఁడు రక్షాబంధనమ్ము వచ్చు

    నిన్నటిసమస్యకు నా పూరణ

    1) శిక్ష వ్యాకరణంబు చెన్నరు ఛందస్సు
    తర్క శాస్త్ర సహిత తత్త్వ జ్ఞాని
    ధర్మ సంకటముల తప్పించు ఘనుడు మీ
    మాంస మిష్టపడు సుమా ద్విజుండు
    2) తాటి కల్లు త్రాగి తందనా లాడెడు
    శుంఠ నేడు గురువు శుక్రుడయ్యె
    శుద్ధ వైదికు డిల శోధించి మద్యము
    మాంస మిష్టపడు సుమా ద్విజుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'తత్త్వజ్ఞాని' అన్నపుడు 'త్త్వ' గురువై గణదోషం.

      తొలగించండి
  31. గురువు గారికి నమస్కారములు మీరు ఇచ్చిన సమష్య వృత్తములో పూరించాను పరిశీలించి తప్పులు తెలుప గలరు . ధన్యవాదములతో


    రక్షాబంధనమొచ్చునే, నవమినన్ రమ్యమ్ముగా యెల్లడన్


    కాంక్షల్బడయగా చతుర్దితిది విఘ్నమ్ములు రాకుండగా
    రక్షించున్ గణనా ధుదెప్పు డును, క్షీరాన్నంబు తోడన్ జగ
    త్సాక్షిన్పూ జలు జేయు సప్తమిన యుత్సాహంబుగా నెచ్చటన్,
    మోక్షంబిచ్చును శైవరాత్రి దినమున్ మోదంబుగా కొల్వగ పిం
    గాక్షుండున్,ఘనశ్రావణంబునెలలో కాంతుండు పూర్ణుండవన్
    రక్షాబంధనమొచ్చునే, నవమినన్ రమ్యమ్ముగా యెల్లడన్
    దీక్షల్సల్పక రామపూజ జరుపున్ దేవాలయం బెల్ల డన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
      కాని సమస్యలోనే దోషాలున్నవి. 'వచ్చు'ను 'ఒచ్చు' అన్నారు. 'నవమిన్' అనడం సాధువు. 'నవమినిన్' అనరాదు. 'రమ్యమ్ముగా నెల్లెడన్' అని ఉండాలి.
      పూరణలో 'కాంక్షల్బడయగా... విఘ్నములు' అన్నచోట గణదోషం.

      తొలగించండి
  32. గురువు గారు నమస్కారము. మీరు యిచ్చిన సమశ్య వృత్తములోకి నేను మార్చి పూరణము చేశాను సలహా ఈయండి తపులున్న సూచించండి .

    మాంసంబెప్పుడు గోరుచుండు నిలలో మాన్యుల్, సు సాత్విక్కులున్

    ఘాసం బెప్పుడు గోరుచుండు గద ఖేంఖాణంబు సౌఖ్యంబుగన్,
    కీశం బెప్పుడు గోరుచుండు నిలలో కేళంబు, శార్దూలమున్
    మాంసంబెప్పుడు గోరుచుండు నిలలో, మాన్యుల్ సుసాత్విక్కులున్
    దోషం బేమియు లేని శాక ,ఫలముల్ తోషమ్ముతో తిందు రే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాస మార్చారు. నారికేళమును కేళమన సరిపోదు. బిందుపూర్వ స కదా ప్రాస. మిగిలిన మూడు పాదములు బిందూత్తరములు.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారికి నమస్కారములు బహు కాలము తర్వాత మీ దర్శనము. బిందు పూర్వక స కారమునకు బిందు పూర్వక సకారమే నియమ మని నాకు తెలియదు. సవరించుకుంటాను ఉత్తరోత్తర మీ రామాయణ పారాయణము నిరాటంకముగా సాగినదా? ధన్యవాదములు

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు!

      తొలగించండి

  33. నవమినాడు,రక్షాబ౦ధనమ్ము వచ్చు
    పండుగయె కాదు శ్రావణపౌర్ణమి కద
    తనను రక్షి౦ప నన్నకు తరుణమిచ్చి
    భ్రాత చేతికి కట్టు సూత్రమును భగిని

    రిప్లయితొలగించండి
  34. కవిమిత్రులకు నమస్కృతులు. మియాపూరులో ఒక సాహిత్య కార్యక్రమానికి మధ్యాహ్నం వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. అందువల్ల మధ్యాహ్నం నుండి మీ పూరణ పద్యాలను చూడలేకపోయాను. ఇప్పుడు అలసట వల్ల చూడలేను. వీలైతే రేపు ఉదయం మీ పద్యాలను సమీక్షిస్తాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి


  35. దాశరథి యుదయించెను ధరణి యందు

    నవమినాడు !రక్షాబంధనమ్ము వచ్చు

    శ్రావణాన తోబుట్టువుల్ సంతసాన

    కట్టుచుందురు రాఖీలు కరములకును.


    శ్రీ రఘువరు పెండ్లి జరుగు సీతతోడ

    నవమి నాడు,రక్షాబంధనమ్ము వచ్చు

    శ్రావణమ్మున చెల్లెలు కట్టి సంతసాన

    బహుమతులను పొందుచునుండు వాసిగాను.


    ఇలను రాముని జననమదెపుడు జరిగె

    ముదమున సహోదరులకెల్ల మురిపెముగను

    కరములకు నేమి ప్రేమతో కట్టుదురన

    నవమినాడు రక్షాబంధనమ్ము వచ్చు

    నపుడు భువిలోన వారలు నాదరాన.


    మైథిలికివివా హంబగు మహిని రామ

    నవమి నాడు  రక్షాబంధనమ్ము వచ్చు

    నెపుడు శ్రావణ మాసాన నిండు పౌర్ణ

     మీ దినమునందు,చెల్లెళ్ళు మోదమంద.

    రిప్లయితొలగించండి