30, ఆగస్టు 2017, బుధవారం

సమస్య - 2451 (సరసీరుహనేత్ర కొక్క...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా"
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథం నుండి)

80 కామెంట్‌లు:

 1. సరసమ్ముగ సగభాగము
  పరమేశున కిచ్చి తాను పరవశ యవగా
  సురసుందరి పరమేశ్వరి
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. శాస్త్రి గారు చక్కగ నర్ధ నారీశ్వరుని నర్ధ పురుషేశ్వరి జేసి మీ మాతా భక్తిని చాటుకున్నారు!

   తొలగించండి
  3. పూజ్యులు కామేశ్వర రావుగారు:

   "సగము మీసము"

   అని సమస్య యున్నచో నా "మాతాభక్తి" గోవిందా గోవింద!

   మీరీసారి హైదరాబాదు వచ్చినపుడు నా ఈ-మైలుకు తెలుపవలెను. మిమ్ములను కలవాలని కోరిక చాలా రోజులుగా.

   తొలగించండి
 2. కరివదనుం డాకలిగొని
  మరిమరి గ్రోలగ పయస్సు మాతనుజుట్టన్
  కరిచర్మాంబరము దగిలె
  సరసీరుహ నేత్రకొక్క స్తనమే గనుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   చక్కని పూరణ. అభినందనలు.
   మీ పూరణ పెద్దన గారి "అంకము జేరి శైలతనయా..." అన్న పద్యాన్ని గుర్తుకు తెచ్చింది.

   తొలగించండి
  2. పార్టీ ఇవ్వడానికి మీ సోదరి ఇక్కడికి రావాలా? పార్టీ తీసుకొనడానికి మీరే అక్కడికి వెళ్తారా? మధ్యలో మూలకారకుణ్ణి... నన్ను మరువకండి! :-)

   తొలగించండి
  3. ఆర్యా!

   ఈ సారి సీతాదేవి హైదరాబాదు వచ్చినపుడు మిమ్ములను తప్పక కలిసి బ్రహ్మాండమైన పార్టీ...

   🙏🙏🙏

   తొలగించండి
  4. గురువర్యులకు నమస్కార శతములు!
   ధన్యవాదములు! నిజానికి నా పూరణ పెద్దనగారి యనుసరణే!
   యిందులో మా అన్నగారి కూడ భాగం ఉంది!
   యెలా పూరిద్దామా యని ఆలోచిస్తూ ఉండగా
   అన్నగారి పద్యం కనబడింది! వెంటనే పెద్దనగారి పద్యం జ్ఞాపకము వచ్చి పూరించాను!
   అంతా పెద్దల ఆశీస్సులు!🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  5. ఈ సారి హైదరాబాదు వచ్చినపుడు తప్పక నా సత్కారమును కూడ మీరు అందుకోవలసి యుంటుంది!!🙏🙏🙏🙏🙏

   తొలగించండి
 3. పురుషులు రమణుల వేసము
  ధరియించుచు తమ నటనను దండిగ జూపన్
  బొరపాటున గుచము తొలగె;
  సరసీరుహనేత్రకొక్క స్తనమే కనుమా!

  రిప్లయితొలగించండి
 4. సరసమ్మగు బిగి కౌగిలి
  పరమేశుని వక్ష మందు పార్వతి నలిగెన్
  పరవశ మున మైమరచిన
  సరసీరుహ నేత్ర కొక్క స్తనమే కనుమా

  రిప్లయితొలగించండి
 5. తరుణీ లలామ యొక్కతె
  పరీక్షకై భిషజుఁవేడఁ బరిశీలనగా
  నరుసుకు చూపి పలికె నీ
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా

  రిప్లయితొలగించండి
 6. భరియింపగ 'కాన్సరు'నున్-
  సరిచేసిరి వైద్యు-లొక్కచన్ను తొలంగెన్-
  వరమాయె నామెకయ్యది
  సరసీరుహనేత్రకొక్క స్తనమే కనుమా!

  రిప్లయితొలగించండి


 7. కరములు మోడ్చి జిలేబీ
  నిరతము సేవించెడు మన నిఖిల జగన్మా
  త, రజత గిరీశుని సతికి
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. తరుణికి కేన్సరు రాగా
  త్వరగానది ప్రాకకుండ వైద్యుండు పయో
  ధరమొక దానిని తీసెన్
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా

  రిప్లయితొలగించండి
 9. మొరకుడు వితండ వాదియు
  చరణంబులు మూడు నాదు శశమున కనువా
  డరయుడు మిత్రున కనె నీ
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 10. పుర జనులేల్లరు మేచ్చగ
  నరుడొక్క డు దాల్చే నర్ధ నారీ వేషం
  బు రసికు డ య్యే డ ననియేన్
  సరసీ రు హ నే త్ర కొక్కస్థన మే కనుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   టైపు దోషాలున్నవి.

   తొలగించండి
 11. వరదాయిని సురసుందరి
  కరుణను లోకముల గాచు కాలంజరియౌ
  పరమేశుని సగభాగిని
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే గనుమా!!!

  రిప్లయితొలగించండి
 12. ధర సంగీతము,సాహితి
  పరికించగ స్థనములుగ వాణియె నిల్వన్
  స్వరఝరి కోవిద యౌనొక
  సరసీరుహనేత్ర కొక్క స్థనమే కనుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "స్తనములుగను" అనండి.

   తొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  హరువగు రూపమ్మున్నను
  శరీరమందున వయసుకు సరి వర్థనమున్
  క్షరియించిన పాప మ్మా
  సరసీరుహనేత్రకొక్క స్తనమే కనుమా!

  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పరమేశుడర్థనారీ
  స్వరూపుడై యీశ్వరి సగ సంహతి నొందన్
  పరమేశ్వరి యా గిరిజా
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే గనుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సగ సంహతి'...?

   తొలగించండి
 15. మరువవ లదయ్య దర్జీ,
  కరివదనుని జనని కంచుకమ్ము గరుసుతో
  సరిగా గుట్టగ వలయున్
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   దర్జీకి చేసిన హెచ్చరికతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి 16. సురసకు నరమేనెవరన

  పరమేశ్వరుడే యటంచు పలికెడి వారల్

  పరికించి చూడ నచ్చో

  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా.


  నరుడొక్కడు దాల్చెను తా

  పరమేశునివేషమునట వాసిగ తానున్

  ధరియించగ నొకడనియెను

  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా.


  కరిముఖుడు పాలు త్రాగుచు

  కరమున నావలి కుచమును కానక యేడ్వన్

  గిరిజయు నవ్వగ హరుడనె

  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా.

  రిప్లయితొలగించండి
 17. ఒరిగి యొక ప్రక్కకును ని
  ద్దుర పోయెడి చిన్నదాని తోరపుఁ జిత్రం
  బరసినఁ గన్పడె నిట్టుల
  సరసీరుహ నేత్ర కొక్క స్తనమే కనుమా!

  రిప్లయితొలగించండి
 18. దరిసించఁగ వాఙ్మాతకు
  తిరముగ సంగీత, సాహితీ సుధలు పయో
  ధరముల్, కవితామృతమిడ
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా!

  రిప్లయితొలగించండి
 19. సరసుండగు నొక పెనిమిటి
  కరమున నొక చన్ను దాచి కాంతను బలికె
  న్నరసితె భామా ! యిపుడీ
  సరసీరుహ నేత్రకొక్క స్తనమే కనుమా


  రిప్లయితొలగించండి
 20. గురువు గారికి నమోవాకములు.
  వరమీ యగలరు ద్విజులు
  కరమోడ్చిన భక్త శ్రేణి కన్ ,కోటి శ రా
  భ ర ణ o బుపాద పద్మము
  సరసే రుహ నేత్ర కొక్క స్తనమా కనుమా
  వందనములు. దోషములు తెల్పు డు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "వరమీయం గలరు ద్విజులు" అనండి.'శ్రేణికన్, శరాభరణంబు' అర్థం కాలేదు.

   తొలగించండి
 21. గిరిరాజ కన్య శాంభవి
  మరకత మాణిక్య కంఠ మంగళ గౌరీ
  కరుణ శుభములు కలుగు నన
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా

  [నేత్రకు + ఒక్కు + అస్తు + అనమే =నేత్ర కొక్క స్తనమే; ఒక్కు = వృద్ధుఁడు; అస్తు = అగుఁ గాక]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. పోచిరాజు వారలకు ప్రణామములు. మాలాంటివారికై భావము వివరించ మనవి

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు

   సహదేవుడు గారు నమస్సులు. నా భావమిది:

   హిమవత్పర్వత పుత్రి, శాంభవి, మరకత మాణిక్య భూషణములు కలిగిన కంఠము గల మంగళ గౌరీ దేవి కరుణ వలన సరసీరుహనేత్రకు శుభములు కలుగునని ఒక్కు ( వృద్ధుడు) అనగా అస్తు (అగు గాక అని) అనమే (అంటాము).

   తొలగించండి
 22. అరుదగు శస్త్ర చికిత్స న్
  తరుణి కొక కుచమ ది పోవ దక్కి న దొ క టే
  నరులకు నవ దృశ్యoబది
  సరసీ రు హ నే త్ర కొక్కస్తనమే కనుమా !

  రిప్లయితొలగించండి
 23. సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీమతి జి సందిత (Sanditha)అనంతపురము

  తురకలటుదండయాత్రల
  నరికిరిశిల్పంబులకట నగరిన్ శిల్పం
  బరయగనెటులోమిగిలెను
  సరసీరుహ నేత్ర కొక్క స్తనమే కనుమా.

  రిప్లయితొలగించండి
 24. హరునకు సగభాగమ్మై
  నిరతమువసియించునట్టి నిర్మల వతియున్
  గిరిరాజు ప్రియపు పుత్రిక
  సరసీరుహనేత్ర కొక్కస్తనమే కనుమా

  రిప్లయితొలగించండి

 25. పిన్నక నాగేశ్వరరావు.

  అరయగ తప్పని స్థితిలో

  యొరు స్తనమును తొలగ జేయ నొక
  రోగముకై
  జరుపగ శస్త్ర చికిత్సను

  సరసీరుహ నేత్రకొక్క స్తనమే కనుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'స్థితిలో। నొరు...' అనండి.

   తొలగించండి
 26. గురువు గారు పొరపాటున ప్యాంట్ జోబులో బటన్ ప్రెస్ కాబడింది.కావున రెండవ సారి ముద్రిత మై న ది.
  వయసు కావర మే సరైన ప్రాయోగ మా తెల్పు డు.
  వందనములు.

  రిప్లయితొలగించండి
 27. . పెరుగక్యాన్సర్ ,రోగము
  తరుగుట కైవైద్యు డొక్క స్తనమును దీయన్?
  మరణము దప్పిన చాలను
  సరసీ రుహనేత్ర కొక్క స్తనమే కనుమా|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పెరుగగ క్యాన్సర్ రోగము' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
 28. పరికించు యర్ధనారీ
  శ్వరు నకు దరిజీ! పొసగఁగ వలువలటంచున్
  పురికొల్పుచు దర్శకుడనె
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా!

  రిప్లయితొలగించండి
 29. చిరు ప్రాయము లో షణ్ముఖు
  డరచుచు రోదించ తల్లి హత్తు కొని యనెన్
  హరుడే కారణమింతకు
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా

  రిప్లయితొలగించండి
 30. తరుగని కష్టము లందిన
  తరుణిని సినిమాలయందు తరచుగ జూడన్?
  మరుగున చీకటి-“వెలుగున
  సరసీ రుహ నేత్రకొక్క స్తనమే కనుమా”|

  రిప్లయితొలగించండి
 31. గిరిజ తనయుడ౦కమున నె
  లరారుచును స్తన్యములను ద్రావగ బూనన్
  యిరుగున గానడు స్తనమును
  సరసీ రుహ నేత్రకొక్క స్తనమే కనుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..బూన। న్నిరుగున..' అనండి. అక్కడ యడాగమం రాదు.

   తొలగించండి
  2. గురువుగారి సూచనతో సవరించిన పద్యము
   గిరిజ తనయుడంకమున నె
   లరారుచును స్తన్యములను ద్రావగ బూన
   న్నిరుగున గానడు స్తనమును
   సరసీ రుహ నేత్రకొక్క స్తనమే కనుమా

   తొలగించండి

 32. పిన్నక నాగేశ్వరరావు.

  ( సవరణ తరువాత....)

  అరయగ తప్పని స్థితిలో

  నొరు స్తనమును తొలగ జేయ నొక
  రుగ్మతకై
  జరుపగ శస్త్ర చికిత్సను

  సరసీరుహ నేత్రకొక్క స్తనమే కనుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగేశ్వర రావు గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 33. శి రా భ ర ణ ము మరియు శ్రేణికి న్ గ చ దు వ వలయునని ప్రార్థన.ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిరాభరణము సంధి సాధువు కాదు.
   శిరః + ఆభరణము = శిర ఆభరణము అవుతుంది. ఇది సంస్కృతమున లోప సంధి సంస్కృత భాషలో సాదువు.
   ఇది సిద్ధ సమాసము. కానీ తెనుగున నుపయోగించుటకు వ్యాకరణ మవరోధ మవుతుంది.
   ఏలన పద మధ్యమున “అచ్చు” తెనుగున నుండదు.
   శిర ఆభరణము న సంధి జరిగి విసర్గ లోపమయినది కాబట్టి యడాగమమునకు తావు లేదు.
   అందుచేత ఈ సిద్ధ సమాసమును తెనుగు లో వాడలేము.

   తొలగించండి
  2. శిరపుటాభరణము, శిరసుటాభరణము, శిరస్సుటాభరణములు సాధువులు.

   తొలగించండి
 34. సరసము లాడుచు నాహరి
  విరిబోణిని మురియుచు గని ప్రీతిగ పలికెన్
  తరుణికి ప్రక్కన నిలువగ
  సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా

  రిప్లయితొలగించండి
 35. గిరిజా మాతయె గూడిన
  పరమ శివునిది యగు చిత్ర పటముంజూడ
  న్నరెరే ! యేమి విచిత్రము !
  "సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా"
  ****)()()(****
  (అర్ధ నారీశ్వరుని చిత్ర పటమున)

  రిప్లయితొలగించండి