తరలేక్షణలను కోరెడుగురువుల పదసేవ జేయకూడదు , శిష్యాధరణిన సతతము జ్ఞానపుసిరులను బోధించు వాని సేవించవలెన్
కృష్ణ సూర్యకుమార్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ధరణిని' అనండి.
ఆషాఢభూతి: విరిగిన చీపురు పుల్లను మరుక్షణమే ధారవోసి మన్నన తోడన్ బరువగు బొంతను మోయుచు గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
ప్రభాకర శాస్త్రి గారూ,ఆషాఢభూతి విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
👏👏👏👏👏👏👏
ధన్య వాదములు!
పరిపరి విధముల బోధక గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా పరుసపు పలుకులు వీడిన మెరుపుల పూదండ వోలె మేలగు ఒజ్జన్
అక్కయ్యా,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎరుకన చదువుచు చేయుముగురువుల పదసేవఁ, జేయఁ గూడదు శిష్యాచెరిపెడి చెలిమరు లచెలిమిచెరసా లలపా లుజేయు చేసిన నెపుడున్.
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువులమని చాటుకొనుచుసిరులకు వశులై సతతము చీకటిమతితోమరులకు లొంగెడి కుహనాగురువుల పదసేవ జేయగూడదు శిష్యా!
బాపూజీ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సరసత కొరవడి నిరతము సరళత సురుచిరతలేని చరితము తోడన్ తిరముగ నుండని వారగు గురువుల పదసేవఁజేయకూడదు శిష్యా
ప్రసాద రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరుపుల పైనన్ సుఖముగపరుండు కొని కులుకుచు సరపణుల కెలుకుచున్కరపోకరాయి కుహనాగురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!జిలేబి
*కరపోకరాయి చందపు
జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరుపమ మగు విశ్వాసమునిరతాసక్తియును శ్రద్ధ నేర్చుటలోనన్వరగుణములు లేకుండగగురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరగడపు పద్యములతోగురువుల పదసేవఁ జేయ, గూడదు శిష్యాపురటము, పనిజే యన్ వెడలు,రయ్యన గలుగును బంగరు భవిత సుమ్మీ !జిలేబి
కొండ మీద పరకామణి కి పోయినా నాలుగు కాసులు గిట్టు బాటవుతాయ్ :)పరగడపు పద్యములతోగురువుల పదసేవఁ జేయ, గూడదు శిష్యాపురట,పరకామణికి వెడల రయ్యన గలుగును మంగళాశాసనముల్ :)జిలేబి
జిలేబీ గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.'పురట(ము)'...?
పురట - బంగారు
కరమగు ధనకాంక్షఁ గలిగినిరతము చెడుమార్గమందు నివసించుచు తాసరిగా పాఠము చెప్పనిగురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
అన్నపరెడ్డి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరుదగు విద్యలు నేర్పక సుర ల కు దాసు లు గ మారి సో మ రు లగు చున్ పరమా వ ధి లే ని కు జ న గురువు ల పద సే వ జే య గూడ దు శిష్యా !
రాజేశ్వర రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువని ప్రతిమను దలచగ గురుదక్షిణ బొటన వ్రేలు కోరెడి గురువున్ మరుక్షణమే నిరసించుచు గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
Expensive Long Distance Education...
ప్రభాకర శాస్త్రి గారూ, మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
సరసపు భాషణ నెరుగక పరుషపు పలుకుల సతతము పలికెడి గురులన్ కరుణ యొకింతయు గాననిగురువుల పదసేవ జేయ గూడదు శిష్యా !
శ్రీనాథ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.బాపూజీ గారు, మీరు ఒకటేనా? వేరు వేరా? లేక సోదరులా?
ధన్యవాదములు. బాపూజీ గారి అబ్బాయిని.
సంతోషం! శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
ధరణిని జనులకు కీడునువిరివిగ కలిగించు క్షుద్ర విద్యల గొనుచున్కరమున పుఱ్ఱెలు దాల్చెడిగురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
ఫణికుమార్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
ధరణిని మాతా పితలున్దరిఁజూపెడు గురువు, నతిథి దైవసమానుల్వరలక త్రికరణశుద్ధియెగురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. వాట్సప్ లో తమరి సూచన మేరకు సవరించిన పూరణ:ధరణిని మాతా పితలున్దరిఁజూపెడు గురువు, నతిథి దైవసమానుల్మరచుచు త్రికరణశుద్ధినిగురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
నిరతము జేయుటవ శ్యము గురువుల పదసేవ, జేయ గూడదు శిష్యా !గురుపత్నిని మోహించుట నెరపుమ యీరెండు నీవు నిరతము భువినిన్
సుబ్బారావు మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నెరపును+ఈ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
*ధర వరములిడును చేసిన**గురువుల పదసేవ, చేయగూడదు శిష్యా**సరికాని పనుల నెప్పుడు**దొరికిన సద్గురువు ముందుద్రోహమ్మవగన్*
శ్రీరామ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరుదగు విద్యలు నేర్పక సుర కు న్ దాసు లు గ మారి సోమరు ల గు చున్ పర మా వ ధి లే ని కుజ న గురువు ల ప ద సే వ జే య గూడ దు శిష్యా !
రాజేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ గురుదేవులకు నమస్సులుసరసపు భాషణ సేయుకవివరుల్ కొలుతురు శారద విపoచినిగదా!విరసపు భావన కలిగినగురువుల పదసేవ జేయగూడదు శిష్యచివర పదము టైపు పొరబాటు. మన్నన.
వెంకట నారాయణ గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం.రెండవ పాదంలో ప్రాస, యతి రెండూ తప్పాయి. సవరించండి.
పిన్నక నాగేశ్వరరావు.మరువకు విజ్ఞాన మిడినగురువుల పద సేవచేయ; కూడదుశిష్యాపర కాంతలపై మోహముచరియించకు చెడ్డవారి సాంగత్యమునన్.
నాగేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరిశుద్ధమనము తోడనుపరి ప్రశ్నలజేతనేమి పనిజేయవలెన్?పరమార్ధము విడచి పనులగురువుల పదసేవ; సేయకూడదు శిష్యా!
సీతాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదమునకు మెరుగైన మార్పు!"పరివర్తన, ప్రణిపాతము""తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా"
బాగుంది!
గురువుగారికి నమస్సులు,ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏🙏
శిరసున దాల్చుము తోయముగురువుల పద సేవజేయ.కూడదు శిష్యా,పరిహాసమ్మొనరించుచు పరాభవము సేయ గురుని,పతనమె నీకున్
తిమ్మాజీ రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురు వితరణ గుణ మగు నేతరులకు నెన్నండు నీవు, దాన మిడ వలెంబరులకు నన లంఘించరెగురువుల, పదసేవఁ జేయఁ గూడదు శిష్యా[గురువు = వేగపు పరుగు; ఏతరి = లోభి]
ఆహా!! 🙏🙏🙏🙏🙏
కామేశ్వర రావు గారూ,మీ పూరణ విలక్షణంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.డా. సీతా దేవి గారు ధన్యవాదములు. నేటి సమస్య మీ సన్మనోజాతమే కదా యభినందనలు.
స్ధిరమగు శుభములు గలుగునుగురువుల పదసేవజేయ, కూడదు శిష్యాధరణికి విద్యను గరపెడు గురువుల నిందించి కారుకూతలు గూయన్!!!వరమగు విద్యను గరపకసరసపు సంభాషణముల సమయము వృథగన్నిరతము గడిపెడు కుహనాగురువుల పదసేవజేయ కూడదు శిష్యా!!!
శైలజ గారూ, మీ రెండు విధాలైన పూరణలు బాగున్నవి. అభినందనలు.
సిరులం గోరుచు చదువుల పరమార్థము నేర్వనట్టి వారలగుదురే గురువులు! యిల దుర్మతులౌ గురువుల పద సేవ జేయ కూడదు శిష్యా!
శ్రీధర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు
తిరమ గు మోక్షము కలుగును గురువుల పద సేవ జేయ ;గూడ దు శిష్యా !పరిహాస పుచేష్టల తో గురువుల నొప్పించి మను ట కుత్సి స బుద్ది న్
పెరుగును శిష్యుల యాయువుగురువుల పదసేవ జేయ, కూడదు శిష్యాపరుషపు మాటలు ఎపుడును తరగని పెన్నిధి గురువును తలచుకొ నిత్యం
రామమోహన్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు."మాటల నెపుడును... తలచుకొ సతమున్" అనండి.
మంచిదండి.
వర పుత్రుఁడవీవని మాహిరణ్యకశిపులు బనుపఁగ నెరుఁగగ విద్యల్హరి భజనల వీడకనేగురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
సహదేవుడు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమోవాకములు.సవరిoచిన పూరణ యo దు దోషములు తెల్పుము.సరసపు భాషణ నిరతముదరహాసమగున్ విశారదకరుణ చేతన్విరసపు భావన కలిగినగురువులపద సేవ జేయకూడదు శిష్యా
గురువు గారని యంటూ “తెల్పుము” అని యనడము సమంజసము గాదు. “తెల్పుఁడు” అన గౌరవప్రదము.
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వెంకట నారాయణ రావు గారూ,సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మరచియు మానవతత్వముకరుణయు లేనట్టిమనసు,కల్మష మందేమరిగిన మందున దొరలెడిగురువుల పదసేవ జేయ గూడదు శిష్యా.
ఈశ్వరప్ప గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మరో పూరణ చేశాను.దయచేసి దోషములు తెల్పుము.హరియును పొగడును శివకృతిన్సారమతులు శుభకార్యము సలుపన్ ప్రాoశాకరతేజమునిoడ, కుటిలగురువులుపద సేవ జేయకూడదు శిష్యా.వoదనములు.
వెంకట నారాయణ రావు గారూ,మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
వరమగునె యతుల, లఘువుల,గురువుల పద సేవ జేయ! గూడదు శిష్యాపరుల కవనమును గొని తన పరముగ చేసికొన జూడ పాపమ్మె యగున్!
శ్రీధర రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పెద్దలు కామేశ్వరరావు గారికినమస్సులు. మీ సూచన సదా పాటిస్తాను. ధన్యవాద ములు.
హరిని కడు నింద జేయుచు హర నామము బల్కుడంచు నాగ్రహవరులైకరము భయపెట్టి చెప్పెడి గురువుల పద సేవ జేయ గూడదు శిష్యా!
లక్ష్మినారాయణ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: నిరతము చిఱచిఱ లాడుచు పురువడి గూడని పలుకుల బోధకులౌచున్ మురియుచు నుండెడి గర్విత గురువుల పదసేవ జేయగూడదు శిష్యా! జరుపుము బుద్థిని గఱపెడి గురువుల పదసేవ; జేయగూడదు శిష్యా నిరతము చిఱచిఱ లాడుచుపురువడి నేర్పని గురువుల పూజల నెపుడున్
రాజారావు గారూ,మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పరులకు హానిని గూర్చుచుచెరుపును కలిగించు క్షుద్ర చేష్టల నెపుడున్మరి మరి చేసెడి నీచపుగురువుల పదసేవ చేయగూడదు శిష్యావీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తరలేక్షణలను కోరెడు
రిప్లయితొలగించండిగురువుల పదసేవ జేయకూడదు , శిష్యా
ధరణిన సతతము జ్ఞానపు
సిరులను బోధించు వాని సేవించవలెన్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధరణిని' అనండి.
ఆషాఢభూతి:
రిప్లయితొలగించండివిరిగిన చీపురు పుల్లను
మరుక్షణమే ధారవోసి మన్నన తోడన్
బరువగు బొంతను మోయుచు
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఆషాఢభూతి విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
👏👏👏👏👏👏👏
తొలగించండిధన్య వాదములు!
తొలగించండిపరిపరి విధముల బోధక
రిప్లయితొలగించండిగురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా
పరుసపు పలుకులు వీడిన
మెరుపుల పూదండ వోలె మేలగు ఒజ్జన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎరుకన చదువుచు చేయుము
రిప్లయితొలగించండిగురువుల పదసేవఁ, జేయఁ గూడదు శిష్యా
చెరిపెడి చెలిమరు లచెలిమి
చెరసా లలపా లుజేయు చేసిన నెపుడున్.
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువులమని చాటుకొనుచు
రిప్లయితొలగించండిసిరులకు వశులై సతతము చీకటిమతితో
మరులకు లొంగెడి కుహనా
గురువుల పదసేవ జేయగూడదు శిష్యా!
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సరసత కొరవడి నిరతము
రిప్లయితొలగించండిసరళత సురుచిరతలేని చరితము తోడన్
తిరముగ నుండని వారగు
గురువుల పదసేవఁజేయకూడదు శిష్యా
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపరుపుల పైనన్ సుఖముగ
పరుండు కొని కులుకుచు సరపణుల కెలుకుచున్
కరపోకరాయి కుహనా
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
జిలేబి
రిప్లయితొలగించండి*కరపోకరాయి చందపు
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరుపమ మగు విశ్వాసము
రిప్లయితొలగించండినిరతాసక్తియును శ్రద్ధ నేర్చుటలోనన్
వరగుణములు లేకుండగ
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపరగడపు పద్యములతో
గురువుల పదసేవఁ జేయ, గూడదు శిష్యా
పురటము, పనిజే యన్ వెడ
లు,రయ్యన గలుగును బంగరు భవిత సుమ్మీ !
జిలేబి
తొలగించండికొండ మీద పరకామణి కి పోయినా నాలుగు కాసులు గిట్టు బాటవుతాయ్ :)
పరగడపు పద్యములతో
గురువుల పదసేవఁ జేయ, గూడదు శిష్యా
పురట,పరకామణికి వెడ
ల రయ్యన గలుగును మంగళాశాసనముల్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
'పురట(ము)'...?
తొలగించండిపురట - బంగారు
కరమగు ధనకాంక్షఁ గలిగి
రిప్లయితొలగించండినిరతము చెడుమార్గమందు నివసించుచు తా
సరిగా పాఠము చెప్పని
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరుదగు విద్యలు నేర్పక
రిప్లయితొలగించండిసుర ల కు దాసు లు గ మారి సో మ రు లగు చున్
పరమా వ ధి లే ని కు జ న
గురువు ల పద సే వ జే య గూడ దు శిష్యా !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువని ప్రతిమను దలచగ
రిప్లయితొలగించండిగురుదక్షిణ బొటన వ్రేలు కోరెడి గురువున్
మరుక్షణమే నిరసించుచు
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
Expensive Long Distance Education...
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
సరసపు భాషణ నెరుగక
రిప్లయితొలగించండిపరుషపు పలుకుల సతతము పలికెడి గురులన్
కరుణ యొకింతయు గానని
గురువుల పదసేవ జేయ గూడదు శిష్యా !
శ్రీనాథ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాపూజీ గారు, మీరు ఒకటేనా? వేరు వేరా? లేక సోదరులా?
ధన్యవాదములు. బాపూజీ గారి అబ్బాయిని.
తొలగించండిసంతోషం! శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
తొలగించండిధరణిని జనులకు కీడును
రిప్లయితొలగించండివిరివిగ కలిగించు క్షుద్ర విద్యల గొనుచున్
కరమున పుఱ్ఱెలు దాల్చెడి
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిధరణిని మాతా పితలున్
రిప్లయితొలగించండిదరిఁజూపెడు గురువు, నతిథి దైవసమానుల్
వరలక త్రికరణశుద్ధియె
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. వాట్సప్ లో తమరి సూచన మేరకు సవరించిన పూరణ:
తొలగించండిధరణిని మాతా పితలున్
దరిఁజూపెడు గురువు, నతిథి దైవసమానుల్
మరచుచు త్రికరణశుద్ధిని
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
నిరతము జేయుటవ శ్యము
రిప్లయితొలగించండిగురువుల పదసేవ, జేయ గూడదు శిష్యా !
గురుపత్నిని మోహించుట
నెరపుమ యీరెండు నీవు నిరతము భువినిన్
సుబ్బారావు
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నెరపును+ఈ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
*ధర వరములిడును చేసిన*
రిప్లయితొలగించండి*గురువుల పదసేవ, చేయగూడదు శిష్యా*
*సరికాని పనుల నెప్పుడు*
*దొరికిన సద్గురువు ముందుద్రోహమ్మవగన్*
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరుదగు విద్యలు నేర్పక
రిప్లయితొలగించండిసుర కు న్ దాసు లు గ మారి సోమరు ల గు చున్
పర మా వ ధి లే ని కుజ న
గురువు ల ప ద సే వ జే య గూడ దు శిష్యా !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ గురుదేవులకు నమస్సులు
రిప్లయితొలగించండిసరసపు భాషణ సేయుక
వివరుల్ కొలుతురు శారద విపoచినిగదా!
విరసపు భావన కలిగిన
గురువుల పదసేవ జేయగూడదు శిష్య
చివర పదము టైపు పొరబాటు. మన్నన.
వెంకట నారాయణ గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం.
రెండవ పాదంలో ప్రాస, యతి రెండూ తప్పాయి. సవరించండి.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
మరువకు విజ్ఞాన మిడిన
గురువుల పద సేవచేయ; కూడదుశిష్యా
పర కాంతలపై మోహము
చరియించకు చెడ్డవారి సాంగత్యమునన్
.
నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరిశుద్ధమనము తోడను
రిప్లయితొలగించండిపరి ప్రశ్నలజేతనేమి పనిజేయవలెన్?
పరమార్ధము విడచి పనుల
గురువుల పదసేవ; సేయకూడదు శిష్యా!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదమునకు మెరుగైన మార్పు!
తొలగించండి"పరివర్తన, ప్రణిపాతము"
"తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా"
బాగుంది!
తొలగించండిగురువుగారికి నమస్సులు,ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిశిరసున దాల్చుము తోయము
రిప్లయితొలగించండిగురువుల పద సేవజేయ.కూడదు శిష్యా,
పరిహాసమ్మొనరించుచు
పరాభవము సేయ గురుని,పతనమె నీకున్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురు వితరణ గుణ మగు నే
రిప్లయితొలగించండితరులకు నెన్నండు నీవు, దాన మిడ వలెం
బరులకు నన లంఘించరె
గురువుల, పదసేవఁ జేయఁ గూడదు శిష్యా
[గురువు = వేగపు పరుగు; ఏతరి = లోభి]
ఆహా!! 🙏🙏🙏🙏🙏
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ విలక్షణంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిడా. సీతా దేవి గారు ధన్యవాదములు. నేటి సమస్య మీ సన్మనోజాతమే కదా యభినందనలు.
స్ధిరమగు శుభములు గలుగును
రిప్లయితొలగించండిగురువుల పదసేవజేయ, కూడదు శిష్యా
ధరణికి విద్యను గరపెడు
గురువుల నిందించి కారుకూతలు గూయన్!!!
వరమగు విద్యను గరపక
సరసపు సంభాషణముల సమయము వృథగన్
నిరతము గడిపెడు కుహనా
గురువుల పదసేవజేయ కూడదు శిష్యా!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు విధాలైన పూరణలు బాగున్నవి. అభినందనలు.
సిరులం గోరుచు చదువుల
రిప్లయితొలగించండిపరమార్థము నేర్వనట్టి వారలగుదురే
గురువులు! యిల దుర్మతులౌ
గురువుల పద సేవ జేయ కూడదు శిష్యా!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు
తిరమ గు మోక్షము కలుగును
రిప్లయితొలగించండిగురువుల పద సేవ జేయ ;గూడ దు శిష్యా !
పరిహాస పుచేష్టల తో
గురువుల నొప్పించి మను ట కుత్సి స బుద్ది న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పెరుగును శిష్యుల యాయువు
రిప్లయితొలగించండిగురువుల పదసేవ జేయ, కూడదు శిష్యా
పరుషపు మాటలు ఎపుడును
తరగని పెన్నిధి గురువును తలచుకొ నిత్యం
రామమోహన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మాటల నెపుడును... తలచుకొ సతమున్" అనండి.
మంచిదండి.
తొలగించండివర పుత్రుఁడవీవని మా
రిప్లయితొలగించండిహిరణ్యకశిపులు బనుపఁగ నెరుఁగగ విద్యల్
హరి భజనల వీడకనే
గురువుల పదసేవఁ జేయఁ గూడదు శిష్యా!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమోవాకములు.సవరిoచిన పూరణ యo దు దోషములు తెల్పుము.
రిప్లయితొలగించండిసరసపు భాషణ నిరతము
దరహాసమగున్ విశారదకరుణ చేతన్
విరసపు భావన కలిగిన
గురువులపద సేవ జేయకూడదు శిష్యా
గురువు గారని యంటూ “తెల్పుము” అని యనడము సమంజసము గాదు. “తెల్పుఁడు” అన గౌరవప్రదము.
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు గారికి నమోవాకములు.సవరిoచిన పూరణ యo దు దోషములు తెల్పుము.
రిప్లయితొలగించండిసరసపు భాషణ నిరతము
దరహాసమగున్ విశారదకరుణ చేతన్
విరసపు భావన కలిగిన
గురువులపద సేవ జేయకూడదు శిష్యా
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మరచియు మానవతత్వము
రిప్లయితొలగించండికరుణయు లేనట్టిమనసు,కల్మష మందే
మరిగిన మందున దొరలెడి
గురువుల పదసేవ జేయ గూడదు శిష్యా.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మరో పూరణ చేశాను.దయచేసి దోషములు తెల్పుము.
రిప్లయితొలగించండిహరియును పొగడును శివకృతిన్
సారమతులు శుభకార్యము సలుపన్ ప్రాoశా
కరతేజమునిoడ, కుటిల
గురువులుపద సేవ జేయకూడదు శిష్యా.
వoదనములు.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
వరమగునె యతుల, లఘువుల,
రిప్లయితొలగించండిగురువుల పద సేవ జేయ! గూడదు శిష్యా
పరుల కవనమును గొని తన
పరముగ చేసికొన జూడ పాపమ్మె యగున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపెద్దలు కామేశ్వరరావు గారికి
రిప్లయితొలగించండినమస్సులు. మీ సూచన సదా పాటిస్తాను. ధన్యవాద ములు.
రిప్లయితొలగించండిహరిని కడు నింద జేయుచు
హర నామము బల్కుడంచు నాగ్రహవరులై
కరము భయపెట్టి చెప్పెడి
గురువుల పద సేవ జేయ గూడదు శిష్యా!
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినిరతము చిఱచిఱ లాడుచు
పురువడి గూడని పలుకుల బోధకులౌచున్
మురియుచు నుండెడి గర్విత
గురువుల పదసేవ జేయగూడదు శిష్యా!
జరుపుము బుద్థిని గఱపెడి
గురువుల పదసేవ; జేయగూడదు శిష్యా
నిరతము చిఱచిఱ లాడుచు
పురువడి నేర్పని గురువుల పూజల నెపుడున్
రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పరులకు హానిని గూర్చుచు
రిప్లయితొలగించండిచెరుపును కలిగించు క్షుద్ర చేష్టల నెపుడున్
మరి మరి చేసెడి నీచపు
గురువుల పదసేవ చేయగూడదు శిష్యా
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.