21, ఆగస్టు 2017, సోమవారం

సమస్య - 2442 (మానవుఁడే దానవుఁడును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

86 కామెంట్‌లు:

 1. దీనుల హింసించునపుడు
  మానవుఁడే దానవుఁడును; మాధవుఁ డయ్యెన్
  జానెడు బంగరు పాపను
  కానన మందున కనుగొని కరుగగ మనసే


  "బంగారు పాప" చలన చిత్రం(1954)

  మూలం : Sailas Marner by George Eliot

  రిప్లయితొలగించండి
 2. మౌని పరశు రాముడు తం
  డ్రానతి నివ్వగ జననిని యంతమొనర్చి తా
  నానక బ్రతికించుకొనియె
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పిత యానతి...' అంటె బాగుంటుందేమో?

   తొలగించండి
 3. ప్రాణుల హింసను గోరెడు
  మానవుడే దానవుడు; నుమాధవుడయ్యెన్
  మానము ప్రాణము జగతికి
  మీనాక్షిని మేనదాల్చి మ్రింగగ విషమున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   ఉమాధవుడన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ణ న ప్రాసను పరిహరింపుమనిన గురువుగారి సూచనతో చేసిన సవరణ:

   మానస మవ్వగ గరళము
   మానవుడే దానవుడు; నుమాధవుడయ్యెన్
   మానము ప్రాణము జగతికి
   మీనాక్షిని మేనదాల్చి మ్రింగగ విషమున్!

   ధన్యవాదములు!🙏🙏🙏🙏

   తొలగించండి

 4. కాననముల పడగొట్టెడి
  మానవుఁడే దానవుఁడును; మాధవుఁ డయ్యెన్
  వేణువు నూదుచు నందరి
  మానసమును దోచు విభుడు మహిలో సుదతీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మహిని జిలేబీ' అంటె మీ ముద్రకూడా ఉంటుంది కదా! సాధారణంగా మీ పూరణలలో మీ ముద్ర ఉంటుంది కదా!

   తొలగించండి
 5. కానగ నవతా రంబున,
  కానన మందు దనుజులెడ కాఠిన్యముతో,
  మానస మందున, రాముడు
  మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలసుభ్రహ్మణ్య శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దనుజుల+ఎడ = దనుజుల యెడ' అవుతుంది. సంధి లేదు. "కాననమున దనుజుల యెడ" అనండి.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్సులు. తమరి సూచనానంతరం సవరించినడి
   21.08.2017 శంకరాభరణం వారిచ్చిన సమస్య. కందము.
   “మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్”
   కానగ నవతా రంబున,
   కా ననమున దనుజుల యెడ కాఠిన్యముతో,
   మానస మందున, రాముడు
   మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్

   తొలగించండి


 6. మానసములోని యలజడి,
  యానందములన్ జిలేబి యరయగ మహిలో
  హానము, హితముల జేయుచు
  మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. ధ్యానమ్మును చేయగ భగ
  వానుని సాయుజ్య మొందవచ్చును గాదే
  దీనిని కనుగొన్నది యా
  మానవుఁడే, దానవుఁడును మాధవుఁ డయ్యెన్ ||

  రిప్లయితొలగించండి
 8. కానల దిరిగిన యాదిమ
  మానవుడే దానవుడును, మాధవుడయ్యెన్
  జ్ఞానిగ మారుచు తానే
  మానవతవిలువ లెరంగి మహిలో గాదే

  రిప్లయితొలగించండి
 9. దేనికి నలజడి పడెదవు?
  మానవుడా!మనసు గెల్చు మార్గము లేదా!
  పూనిక హరి మదిఁగొల్వగ.
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్

  రిప్లయితొలగించండి
 10. ప్రాణము తీతురు కొందఱు
  ప్రాణంబుల వైద్యులెల్ల రక్షణ సేయున్
  తాఁ నిజ కర్మల చేతను
  మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణికుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సాధ్యమైనంత వరకు 'న-ణ' ప్రాసను పరిహరించండి.

   తొలగించండి
  2. గురువుగారూ నమస్సులు. మీ సూచనకు ధన్యవాదములు. ఇకపై అలా వాడను.

   తొలగించండి
 11. మానిని గౌరవముఁ జెఱచు
  మానవుడే దానవుడును, మాధవుడయ్యెన్
  మానసమున హరిఁ గొలుచుచు
  మానవ సేవలను జలుపు మహితాత్ముండే

  రిప్లయితొలగించండి
 12. మానవ మనమున నిండెను
  దానవ, దైవిక, తలపుల ద్వైత గుణంబుల్
  కానగ పునరావృతమై
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్

  రిప్లయితొలగించండి
 13. మానినుల జె ర చ బూనె డు
  మానవు డే దా న వు డు ;ను మా ధవు డ య్యే న్ మానితు డు గ సు ర న రు ల కు
  దా నిల్పి విష ము గ ళ ము న దైన్యము బా ప న్

  రిప్లయితొలగించండి
 14. తానే ధర్మము దప్పుచు
  తానే ధర్మమ్ము నెరిగి దైవంబగుచున్
  తానే యిలపై దిరుగుచు
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్!

  రిప్లయితొలగించండి


 15. ఓ "నా " జిలేబి! వినవే !
  యా "ణా" ప్రాసగన సాటి యవ్వదు నీకున్ !
  దీనత్వము వలదు సఖీ !
  వీనుల విందుగ పదములు విరిసెను నీకై :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. మానని యధర్మనిరతిని
  బూనుచు కంసుడు మెలగెను;బూనిన ధర్మ
  జ్ఞానిగ కృష్ణుడు వెలిగెను;
  మానవుడే దానవుడును మాధవు డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 17. కాననమున వ సి యించుచు
  దా న వు ల ను సంహరించె దర్ప ము తో డ న్
  దీ ను ల కండ గ నిల్చి న
  మానవుడే దాన వు డు ను మాధవు డ య్యే న్

  రిప్లయితొలగించండి
 18. మౌని క్రతువు రక్షించగ
  మానవుఁడే దానవుఁడును, మాధవుఁ డయ్యెన్
  బూనుచు శివధనువున్ భువి
  సూన వరించఁగ రఘుకుల సోముండగుచున్

  రిప్లయితొలగించండి
 19. కానగ కొరియా నేతన్
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్
  మానవ గాంధీ భారత
  వాణిని నినదించి మరి నివారించి దొరల్

  రిప్లయితొలగించండి
 20. జ్ఞానము రవంత లేకను
  హానిని చేకూర్చి కొందరసురులు కాగన్
  మానుగ మాన్యులు కొందరు
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్

  రిప్లయితొలగించండి
 21. మానవులందరు నొకటన
  మానవుడౌ, స్వార్ధ మమర మారు నసురుడై
  మానము గాచిన వేల్పగు
  మానవుడే దానవుడును, మాధవుడయ్యెన్

  రిప్లయితొలగించండి
 22. దానవ స్త్రీల తర్జనము:

  జానకి రాముఁడు కేవల
  మానవుఁడే దానవుఁడును మా ధవుఁ డయ్యెన్
  మానుగ రావణు మది నభి
  మానింపుము నీదు శుభపు మనుగడ కొఱకై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా శ్రీమదాంధ్ర సుందర కాండ లోని పద్యము:

   మనుజుని దీనుని రాముని
   మనమున నెంచక వరించు మనుజాశన నా
   థుని దివ్య చందన సమం
   డన విలసిత యెల్లరకు నడరు మీశ్వరివై ...
   శ్రీ.సుం. 24. 20.

   మూలము:

   మానుషం కృపణం రామం త్యక్త్వా, రావణమాశ్రయ.
   దివ్యాఙ్గరాగా వైదేహి దివ్యాభరణభూషితా ...
   ৷৷5.24.25৷৷
   అద్యప్రభృతి సర్వేషాం లోకానామీశ్వరీ భవ.

   తొలగించండి
  2. అందమైన సరళమైన పద్యములు! మా బోంట్లకమృతము వలె సులభగ్రాహ్యముగా నున్నవి! 🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ, దానికి అనుబంధంగా ఇచ్చిన పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు
   డా. సీతా దేవి గారు ధన్యవాదములు.

   తొలగించండి

 23. పిన్నక నాగేశ్వరరావు.

  ౘానల మానము దోచెడు

  మానవుడే దానవుడును; మాధవు
  డయ్యె
  న్నానక పరివర్తనతో

  దీన జనోద్ధరణ జేయ దివ రాత్రంబుల్.

  రిప్లయితొలగించండి
 24. దీనుల కడు హింసించెడి
  మానవుడే దానవుడును, మాధవుడయ్యెన్
  మానక వారల నిరతము
  పూనియు రక్షించు జనుడె పుడమిని సుమ్మీ.

  రిప్లయితొలగించండి
 25. అందరికీవందనములు!
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  బోయ--->వాల్మీకి :
  01)
  __________

  ప్రాణుల జంపెడి బోయడు
  ధ్యానమునను రామ యనుచు - ధన్యత నొంధెన్ !
  గానము రామాయణ మని
  మానవుడే దానవుడును - మాధవు డయ్యెన్!
  __________

  రిప్లయితొలగించండి
 26. గురువు గారికి నమస్సులు. పూరణ లోని దోషములు తె ల్పుడు.
  జ్ఞానరుచిలేమి కాoతుడు
  దీనులను శిక్షిoచు హృదయ తీoడ్రము నెవడున్?
  ప్రాణము పోసిన వైద్యుడు
  మానవుడేదానవుడనుమాధవుడయ్యన్.
  నమస్సులు.

  రిప్లయితొలగించండి
 27. గురువు గారు
  షడ్జ మడ్జ కరాడ్జ పద్యమా? లేక శ్లోకమా?
  మొత్తము 4 పాదాలను తెలుగు లిపి లో ప్రచురిoచదరని
  మనవి. పై సoదేహమును వివరిoపుడు.
  వoదనములు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్యమన్నా, శ్లోకమన్నా అర్థం ఒకటే. కాకుంటే తెలుగులో పద్యం, సంస్కృతంలో శ్లోకం అంటున్నాము.
   షడ్జామడ్జ ఖరాడ్జ్య వీడ్జ్య వసుధాడ్జాలాంశ్చ మడ్ఖాకరే
   జడ్జట్కిట్కు ధరాడ్ధరేడ్పునఘనః ఖద్యోత వీడ్యడ్భ్రమా
   వీడ్యా లుట్ప్రయ లుట్పయట్రయపదా డడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
   పాదౌ టేట్ప్రట టట్ప్ర టట్ప్ర టరట ప్రఖ్యాత సఖ్యోదయా.

   నాకు తెలిసిన శ్లోకం ఇది.. ఇందులో కొన్ని అక్షరదోషా లుండవచ్చు.

   తొలగించండి
  2. బాబోయ్! చదవడానికే నోరుతిరగడములేదు! గురువుగారూ! యీయద్భుత శ్లోకమునకు
   అర్ధవివరణ యివ్వ ప్రార్ధన!🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  3. నాకు తెలిసిన కాళిదాసు చాటువు. నేను 6 వ తరగతి చదువు చున్నప్పుడు మా తెలుగు గురువు గారు చెప్పినది:

   శార్దూల విక్రీడితము.
   షడ్జామడ్జ కరాడ్జ వీడ్జన సుధా డ్జాలంబు ధడ్జాఖరే
   యధ్యః ఖడ్గ ధరే ధరే ఖణఖణే ఖర్జూర లుడ్భ్రాడ్భ్రమః
   లుడ్భ్రాయాస్పద యడ్గ్ర డడ్గ్ర డడడా షడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
   షడ్జానః పురచాతురస్సుర గణేశద్యోతి విద్యోదయః

   తొలగించండి

  4. దీని గురించి గరికిపాటి వారి కథాకమామీషు :) వారి శైలి లో -) ఈ క్రింది లింకులో వినవచ్చు

   Shadja Madja Karadja !

   https://youtu.be/JAUMW4iozGQ?t=227   జిలేబి

   తొలగించండి
  5. జిలేబిగారికి మంచి సమాచారమిచ్చినందుకు ధన్యవాదములు! 🙏🙏🙏🙏

   తొలగించండి

 28. దానవులు దల్లి దండ్రులు,
  కానీ హరిజపముతోడ కైవల్య మొందన్
  మానిసి దిండి ప్రహ్లాదుడు
  మానవుడే, దానవుడును, మాధవుడయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   రెండవ పాదం చివర, మూడవ పాదంలోను గణదోషం. సవరించండి.

   తొలగించండి
 29. కానని దౌష్ట్యము జేసెడు
  మానవుడే దానవుడు, నుమాధవుడయ్యె
  న్నానళిన దళాయ తాక్షి
  గానగనే బెండ్లి యాడు కారణ మగుటన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది.
   మూడవ పాదం చివర బేసి గణంగా జగణం (యతాక్షి) వేశారు. సవరించండి.

   తొలగించండి
 30. తెలుగు లిపి లో పై కాళిదాస శ్లోకము ను ప్రచురిoచినo దులకు శత సహశ్ర వoదనములు.

  రిప్లయితొలగించండి
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ మూడు పూరణలు క్రమాలంకారంలో బాగున్నవి. అభినందనలు.
   రెండవ పద్యం మూడవపాదం...?

   తొలగించండి
 32. 1)దానవులు దల్లి దండ్రులు
  కానీ ప్రహ్ల్లాదుడు హరి కరుణన్ బొందెన్,
  మానిసిదిండి సుతుడిచట
  మానవుడే, దానవుడును, మాధవుడయ్యెన్


  2) దానవుడు గాను మురళీ
  గానపు లోలుడుగ యిమిడె ఘటికుడు సినిమా
  లోనందమూరి, సతతము
  మానవుడే, దానవుడును, మాధవుడయ్యెన్
  (సీతారామ కళ్యాణములో Sr.NTR రావణ బ్రహ్మ, శ్రీకృష్ణ పాండవీయములో కృష్ణుడు ),


  రిప్లయితొలగించండి
 33. గురువు గారికి నమస్కారములు. దయతో నినంటి పూరణను గూడా పరిశీలించగలరు.
  నిన్నటిపూరణ:

  వినయమ్మేమియులేని వైనమున కావేషమ్ముతో నార్యుల
  న్ననిశమ్మంతట థిక్కరించి బ్రతుకన్నంతన్ వృథాపర్చుచున్
  చని నీనాటికి నిక్కమున్ తెలిసి పశ్చాతాప్తుడన్నైతి, జీ
  వనమా! సాహసమింత చెల్లదుసుమా! బాగోగులూహింపుమా!

  నేటి పూరణ:

  మౌనుల యాగము లడచెడి
  దానవులను గూల్చి నిలచి దలగాచిన యా
  మానిసి ధరణికి రాముడు
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్

  రిప్లయితొలగించండి
 34. 17క్రమాలంకారము సవరించినపూరణ
  మానవతత్వము నింపగ?
  దీనుల రక్షించ బోక ధీరత జూపన్?
  ప్రాణులె పరమాత్ముండన?
  మానవుడే,దానవుడను,మాధవుడయ్యెన్.
  2.తానొక వైద్యుండనగా?
  దీనులరొక్కంబు గుంజు దీక్షగ మెలగన్?
  మానవరోగులరక్షక?
  మానవుడే;దానవుడును;మాధవుడయ్యెన్?
  3.మానవ మంత్రియు నైనా?
  మానిని మత్తందు దేలి మర్యాదణచన్?
  దానము ధర్మము బెంచగ?
  మానవుడే:దానవుడును;మాధవు డయ్యెన్?


  రిప్లయితొలగించండి
 35. మానవదార్యులకైనను
  దానంబులఁ పాతకములఁ త్రైగుణ్యాజ్ఞన్
  తా నటియంపగ
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్

  రిప్లయితొలగించండి
 36. మానవదార్యులకైనను
  దానంబులఁ పాతకములఁ త్రైగుణ్యాజ్ఞన్
  తా నటియంపగ తలపగ
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్

  రిప్లయితొలగించండి
 37. మానినుల మానము నడచు
  మానవుడే దానవుడును! మాధవుడయ్యెన్
  మానసముల తా జేరుచు
  గానముతో వేల గోపికల నలరించన్!

  గురువర్యులుకు నమస్సులు. మొన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదములు.

  మనుజ జన్మమె బుద్బుద మనుచు నెంచి
  బ్రతుకు సాగించు రీతుల భావ మెఱిగి
  తనివి తీర నాధ్యాత్మిక తత్త్వ మనెడి
  మత్తు మందు సేవించుట మంచిదె కద!

  రిప్లయితొలగించండి 38. మానినుల ను నేడ్పించెడి

  మానవుడే దానవుడును;మాధవు డయ్యెన్

  మానిని యాపద బాపుచు

  మానుగ గృహమునకు పంపి మహిలో తానున్.


  మానవుడై పుట్టినను నభి

  మానము విడియమ్మఁజంపి మరలన్ భువిలో

  తానేమయ్యెనొ వినుమా

  మానవుడే దానవుడును;మాధవు డయ్యెన్.

  (పరశు రాముడు)


  కానను గాంచుచు సుదతిని

  మానవుడే దానవుడును;మాధవు డయ్యెన్

  మానిని నటగని మరియొక

  మానవుడచ్చో వెరవక మానము గాచెన్.

  రిప్లయితొలగించండి
 39. మానవ మేధకసాధ్యము
  గానము హననమణుశక్తి గైకొని నొకచో
  దానము జేయగ జీవము
  మానవుడే దానవుడును మాధవుడయ్యెన్!

  జీవనదాన్ ద్వారా అవయవాల మార్పిడి!

  రిప్లయితొలగించండి
 40. కానని దౌష్ట్యము జేసెడు
  మానవుడే దానవుడు, నుమాధవుడయ్యె
  న్నానగరాజు దుహిత నట
  గానగనే మరులు గొనగ గా రణ మగుటన్

  రిప్లయితొలగించండి
 41. మానవుడే మహనీయుడు
  మానవులే నిరతముగను మానవ సేవలు
  మానవ జన్మము సార్ధక
  మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్

  రిప్లయితొలగించండి
 42. మానవ సేవే మాధవ సేవ మానవులకు సేవ చేసిన దైవమునకు సేవ చేసినట్లే

  రిప్లయితొలగించండి
 43. కానల నరుడయి పాంధుల
  దీనులుగా జేసి దోచ దిరిగి యసురుడై
  తా నుడివెను రామ కథను
  మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్

  నిన్నటి సమస్యకు నా పూరణ
  ధనసంపాదన కోసమై విటులకున్ తార్పించుచున్ కాంతలన్
  ఘనమౌ కానల పొంచి పాంధుల నిధుల్ గద్దించి వే దోచుచున్
  మన గోమాతను మాంస భక్షకులకున్ మ్రదించి యందించు జీ
  వనమా సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా

  రిప్లయితొలగించండి
 44. ఈనాటకరంగములో
  ఆనాటకసూత్రధారియచ్చరువొందన్
  తానేరాజునుభటుడును
  మానవుడేదానవుడునుమాధవుడయ్యెన్..

  రిప్లయితొలగించండి
 45. కానగ వైరుధ్యమ్ములు
  మానవ నైజమున కలిసి మలుగుచు నుండున్
  జ్ఞానులు చెప్పగ వింటిమి
  "మానవుఁడే దానవుఁడును మాధవుఁ డయ్యెన్"

  రిప్లయితొలగించండి