కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వనమా సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా"
కొప్పరపు సోదర కవుల పూరణము...ధనమానంబులఁ గొల్లవెట్టి కులగోత్రవ్యక్తి బోదట్టి దు
ర్వనితాసంగమ మెచ్చఁబెట్టి పవలున్ రాత్రుల్ నను న్మోహపా
శ నిబద్ధాత్ము నొనర్చె దేమిటికి? నీ సౌభాగ్య మెన్నాళ్ళు యౌ
వనమా! సాహస మింత చెల్లదు సుమా! బాగోలు లూహింపుమా.
ధనమే ముఖ్యమటంచు పోరి యదె ప్రా
రిప్లయితొలగించండిధాన్యంబుగా నెంచుచున్
తనదారిన్ దెలియంగలేక నిట శ్ర
ద్దన్వీడి స్వార్థంబుతో
తనవారి న్గనలేని నాడిటను నీ
దైరాదుగా తోడు! జీ
వనమా సాహసమింత చెల్లదుసుమా!
బాగోగులూహింపుమా!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధనవ్యామోహం గల తమ్ముడు ఇంటినే జూదగృహంగా మార్చదలచినప్పుడు (అద్దె బాగ వస్తుందని) అన్నగారు తమ్మునితో
రిప్లయితొలగించండిఅనుమానించితి నీదుభావముల, నీయాలోచనా ధోరణిన్
అనుజా! మారవె! నీకిటుల్ తగునె! సభ్యాసభ్యతల్ జూడకన్
మన వాసంబునె మార్చగా తలతువే? మానావమానాధిదే
వనమా? సాహస మింత చెల్లదు సుమా! బాగోగు లూహింపుమా
(అధిదేవనము=జూదగృహం)
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పార్వతి శివుని విషము గ్రోల వలదని వారించుట
రిప్లయితొలగించండివినకన్ మేనుకు బూడిదన్ యుసిమి వేడ్కన్ పర్యటించంగ నే
గనుచున్ బాధను సంతస మ్మనుచు కౌగిట్లో న బంధించితిన్,
వినుమా అమృత మొచ్చుగా యనుచు వేడన్గానె పాషాణ సే
వనమా! సాహస మింత చెల్లదు సుమా! బాగోలు లూహింపుమా.
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బూడిదన్+ఉసిమి = బూడిద నుసిమి' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "బూదినే యుసిమి" అనండి. 'వచ్చు'ను 'ఒచ్చు' అనరాదు. "వినుమా యమృతలాభమౌ ననుచు" అనండి. అలాగే "వేడన్ ఘోర పాషాణ..." అనండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
పశు వధ నిషేధ మమలులో నున్నందున
పెద్దలతో ముస్లిం యువకులు :
01)
_______________________
ధనమా తక్కువ , పెక్కు మంది కిట విం - దౌనంచు సొమ్మిచ్చినన్
అనఘుల్ చట్టము జేసినారు గద గో - హత్య్నన్నిషేధించుచున్
కనగా లేదొకొ వార్త పేపరున ? పా - కాగారమందుంచు గో
వన; మా సాహస మింత చెల్లదు సుమా - బాగోగు లూహింపుమా ?
_______________________
ధనము(ఖర్చని భావం)
అనఘుల్ (నిందాస్తుతి-పాపాత్ములని భావం)
సరిహద్దు వివాదముతో చైనాపై
తొలగించండివెంటనే దాడి సేయుడన్న ప్రధానితో త్రివిధదళాధిపతి :
02)
_______________________
క్షణమాత్రంబిక జాగు సేయకను, "మా * సైన్యంబు సంధించినన్
అణు యుద్ధంబదె సంభవించు నను నూ * హాపోహ సందిగ్ధతన్
వెనుకంజన్ మది వేయుచున్నయది"! చి * వ్విన్ వేగ నీగుండు; నీ
వన; మా సాహస మింత చెల్లదు సుమా * బాగోగు లూహింపుమా ?
_______________________
వఱద బాధితుల ప్రార్థన :
తొలగించండి03)
_______________________
ఘనముల్ కమ్మెను కాఱు చీకటు లవే - ఘస్రంబు, రాత్రంబులన్
మనుకందల్ చనె పెక్కు జీవుల కసా - మాన్యంపు నిట్టోధ్రృతిన్
చనుమా చాలును ప్రాణి హింస; ప్రజ గో- సన్ దీర్చి రక్షించు పా
వనమా, సాహస మింత చెల్లదు సుమా. - బాగోగు లూహింపుమా ?
_______________________
మనుకంద = ప్రాణము
నిట్ట = వఱద
పావనము = నీళ్ళు
మోహాంధకారమగ్న మానవుడు :
తొలగించండి04)
_______________________
అనగా నివ్వవు భక్తి కీర్తనల మో - హాంధంబు పోకార్చగన్
వినగా నివ్వవు భక్తి పాటలను పా - పిష్ఠుండ నన్ జేయగన్
కనగా నివ్వవు భక్తి ధామముల లో - కైకాద్యు సేవింప; యౌ
వనమా, సాహస మింత చెల్లదు సుమా. - బాగోగు లూహింపుమా ?
_______________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిదేవతలూ రాక్షసులూ మునులూ రక్షణ కోరుతూ శివునితో :
తొలగించండి05)
_______________________
ఘనమౌ, దైత్యుల దేవతాళదె మహా - కచ్ఛంబు త్రచ్చించగన్
ఘన మేఘంబును బోలె తీండ్రిలు మహా - కాలాగ్ని పాషాణమున్
ఘనపుష్పంబని యెంచి మించ గల లో - కైకార్త రక్షుండ, సే
వనమా, సాహస మింత చెల్లదు సుమా. - బాగోగు లూహింపుమా ?
_______________________
ఘనపుష్పము = నీరు
వసంత కిశోర్ గారూ,
తొలగించండిమీ ఐదు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.
'అసామాన్యంపు నిట్టోధ్రృతిన్'....?
శంకరార్యా ! ధన్యవాదములు !
తొలగించండినిట్ట = వఱద
"అసాధారణమైన వరద యొక్క ఉధృతికి " యని
నిట్ట దేశ్యపదం. 'నిట్ట+ఉద్ధృతి' అన్నపుడు యడాగమమే వస్తుంది. అక్కడ గుణసంధికి అవకాశం లేదు.
తొలగించండి(మకరికి చిక్కిన గజేంద్రుని అంతరంగవేదన)
రిప్లయితొలగించండిఘనమౌ దేహము నాదటంచు నరుదౌ గర్వంబు నిండారగా
గనులున్ నెత్తికినెక్క మెండయిన దుష్కామంబు పెంపొందగా
దనువంతన్ మనసంతయున్ ముసురుచున్ దర్జించు నోమోహభా
వనమా!సాహసమింత చెల్లదు సుమా!బాగోగు లూహింపుమా.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమనసున్మేనియుతూగగాను మగువల్ మత్తేభమై నాట్యమున్
తనువున్నర్పిచి జేయుచుండ వినకన్ స్థానమ్ము తప్పంగ, తె
వ్వనమా సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా,
మనుజుల్ జాలము బట్టి బంధనములన్ మగ్గింప గావించిరే !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అర్పిచి'...? యౌవనమనే అర్థంలో 'తెవ్వన' శబ్దం ఉంది. కాని దానికి ముప్రత్యయం రాదు.
తొలగించండికంది వారు,
అర్పిచి- అర్పించి
తెవ్వనమా - సౌందర్య మా !
సరి యే నా ?
జిలేబి
తనువు ల్ శాశ్వత మంచు మోహ వ శులై ధర్మం బు ల న్ వీ డి యు న్
రిప్లయితొలగించండిధన గర్వం బు న విర్రవీగు జనులై దై వా ల నిందించుచున్
మను టెన్నoడును మంచి దౌనె మ హి లో మాన్యoబుకా ద ట్టీ జీ
వనమా!సాహస మింత చెల్లదు సు మా !బాగోగు లూ హి oపమా
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనమా!కాదది-చూడ నీ మనసులో కల్లోలమై సంద్రమై
రిప్లయితొలగించండిపెనవేసెన్ చెడు భావనల్,తగదు-శోభిల్లంగ నుల్లంబు,జీ
వన మాధుర్యము గ్రోల దైవమికబ్రోవన్ దిక్కు నీవేఁగదా!నామ పా
వనమా!సహసమింత చెల్లదుసుమా బాగోగులూహింపుమా
సాహస
రిప్లయితొలగించండిప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనమై యొప్పెడి రాజమందిరమురా కన్నయ్య నామాటలన్
రిప్లయితొలగించండివినరా! స్వచ్ఛత కీప్రదేశము సదా విఖ్యాతి గాంచెన్ భటుల్
చనువారిం బరికించు చుందురుగదా సత్యంబురా యిందు ష్ఠీ
వనమా? సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా.
హ.వేం.స.నా.మూర్తి
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిష్ఠీవన శబ్దంతో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
చక్కటి సందర్భోచిత పూరణ! 👏👏👏🙏🙏🙏
తొలగించండిమరియొక భావన.
రిప్లయితొలగించండి(తోటమాలి యజమానితో)
నను దీనార్తుని తోటమాలి నధమున్ న్యాయంబు లేకుండ మీ
రనుకంపామతిలేక నాకొసగినారయ్యా!తోట పెంచంగ!నే.
మునుగన్ సర్వము- కోపమేల?మరి సాఫున్ జేయ మీరిత్తు రీ
వనమా!సాహసమింత చెల్లదు సుమా!బాగోగులూహింపుమా!!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండికనగా దీర్చిన నామముల్ నుదుట నాకారంబు విప్రుండవై
రిప్లయితొలగించండిమనము న్నేవిధ భక్తి శ్రద్దలును నీమంబుల్ నిరాకారమై
ఘన దుష్టాత్ముల కూడుచున్ మలిన దుష్కార్యమ్ములన్ జేయు సే
వనమా,సాహసమింత చెల్లదు సుమా బాగోగులూహింపుమా
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివినుమా! దేహము, బుద్ధిని మరచునే భీతిన్ గనంగాత్రుతన్
కనుమా! సంపదలన్నియు కరగు బింకంబోవగానేగతిన్
జనునే! గౌరవ మన్ననలుమరి నీసంసారమున్! మద్యసే
వనమా! సాహసమింత చెల్లదుసుమా! బాగోగులూహింపుమా!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మత్తేభంలో మూడు పాదాలలో రగణం ఉండవలసిన చోట భగణం వేశారు. "బుద్ధినిన్.. గన న్నాతృతన్... సంపద లన్నియున్... మన్నగ గౌరవంబులును...(గౌరవ మన్ననలు అంటే దుష్ట సమాస మవుతుంది)" అనండి.
గురువుగారికి నమస్కృతులు! తప్పక సవరిస్తాను! 🙏🙏🙏
తొలగించండివినుమా! దేహము, బుద్ధినిన్ మరచునే భీతిన్ గనన్నాత్రుతన్
తొలగించండికనుమా! సంపదలన్నియున్ గరగు బింకంబోవగానేగతిన్
జనునే! మన్నన గౌరవంబులును నీసంసారమున్! మద్యసే
వనమా! సాహసమింత చెల్లదుసుమా! బాగోగులూహింపుమా!
ధన్యవాదములు!🙏🙏🙏🙏
(శ్రీకృష్ణునికి అగ్రపుజ చేసిన ధర్మరాజుతో శిశుపాలుడు)
రిప్లయితొలగించండికనుమా ధర్మజ!యింతకంటెను మెరుంగౌవా డలభ్యుండటే!
చనుమా!యర్చన చాలు;మెట్లు దిగు;నీ చాదస్తమున్ వీడుమా!
ఘనులౌ వార లనేకులున్ గలరు;ధిక్కారార్హు డీకృష్ణు సే
వనమా!సాహసమింత చెల్లదు సుమా!బాగోగు లూహింపుమా!
అగ్రపూజ
రిప్లయితొలగించండిబాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తనువున్ జిక్కియు డస్సిపోవు మునుపే ధారుఢ్యముండంగనే
రిప్లయితొలగించండివనమాలిన్ మనమందు నిల్పి ధరణిన్ వ్యామోహమున్ వీడుచున్
కనుమా యాతని దివ్య రూపముమదిన్ కాలాన పోకాడు యౌ
వనమా సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఫణి కుమార్ గారు “వీడుచుం / గనుమా; మదిం గాలానఁ బోకాడు” అనండి వ్యాకరణ సమ్మతముగా నుంటుంది.
తొలగించండిపార్వతీ దేవితో తల్లి మేనకా సతి మాటలు:
రిప్లయితొలగించండికనలేమా వర దేవ షండము మదాగారమ్మునం బ్రీతినిన్
వినవే నీ పతికాంక్ష తీరఁగ నిటన్ వేడంగ నొప్పున్ మహా
నిన దాభీల భయాటవీ స్థల తపోనిష్ఠైక సంతప్త జీ
వనమా! సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎక్కడ లేరె వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుఁ గూన నీ
తొలగించండివెక్కడ ఘోర వీర తప మెక్కడ యీ పటు సాహసిక్యముల్
తక్కు శిరీష పుష్ప మవధాన పరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో విహగ మెక్కిన నోర్చునొ నిశ్చయింపుమా!
- శ్రీనాథ కవి సార్వభౌముఁడు
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పద్యం. మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు!
తొలగించండివనమా సాహసమింత చెల్లదుసుమా బాగోగు లూహింపుమా
రిప్లయితొలగించండివినకన్ మామొఱ నాలకింపకను నీ విద్వేషమున్ వీడకన్
తనకున్ దారినిచూపకున్న ప్రళయాంతంబౌను ఖాయంబుగన్
కనుమా రాముని బాణ శౌర్యమును నీ కాయంబు జీర్ణంబగున్
రామమోహన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిజన బాహుళ్యము పైకి వేగముగ సంయానంబు రాగా స్పెయిన్
రిప్లయితొలగించండియను దేశంబున ఎందరో జనులు యంతoబున్ విలోకిం చెనే,
కనగన్ చోదక వైఖరే జనత కాలoబున్ హరించెన్, యసే
వనమా! సాహస మింత చెల్లదు సుమా! బాగోలు లూహింపుమా.
నిన్న బార్సిలోన నగరమున వ్యాను దూసుకెళ్ళి ఎందరో మృతి చెందిన ఘటన ఆధారముగా
అసేవనము = నిర్లక్ష్యము సంయానము = వాహనము
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స్పెయిన్ + అను' అన్నపుడు యడాగమం రాదు. అక్కడ "స్పెయి। న్నను దేశంబున..." అనండి. అలాగే 'జనులు+అంతంబు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "జనుల కంతంబున్..." అందామా? యతికూడా సరిపోతుంది.
శంకరయ్య గురువు గార్కి నమస్కారములు
తొలగించండియడాగం సవరిస్తాను.హత్యాచారమే అన్నాను
సత్యాచారమంటే సరియైన మార్గ మౌతుంది ఇక్కడ కుదురదు
శంకరయ్య గురువు గార్కి నమస్కారములు
తొలగించండియడాగం సవరిస్తాను.హత్యాచారమే అన్నాను
సత్యాచారమంటే సరియైన మార్గ మౌతుంది ఇక్కడ కుదురదు
నేను సూచించింది 'అత్యాచారము' అది దాని ముందటి ద్రుతంతో కలిసి 'నత్యాచార' మయింది. అంతే కాని 'సత్యాచారము' కాదు.
తొలగించండికాని ఈ సూచన చేసింది ఏ పద్యానికి?
ధన మార్జింప ననేక మార్గములు యీ ధాత్రీ స్థలిన్ మెండుగా
రిప్లయితొలగించండితనయా! యుండగ నేల నీవిటుల హత్యాచార హింసా కృతుల్
వినుమా! చేయకు మయ్య దోషములు వేవేదించు, నీ దిట్టి జీ
వనమా! సాహసమింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మార్గములు+ఈ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "మార్గము లిటన్ ధాత్రీ..." అందామా? "నీ విటుల నత్యాచార.." అని ఉండాలనుకుంటాను.
నేను సూచించింది 'అత్యాచారము' అది దాని ముందటి ద్రుతంతో కలిసి 'నత్యాచార' మయింది. అంతే కాని 'సత్యాచారము' కాదు.
తొలగించండికాని ఈ సూచన చేసింది ఏ పద్యానికి?
ఘనమౌరూపముఁ గాంచి మోజుపడి యేకాంతమ్ముగా చెంతకున్
రిప్లయితొలగించండిజని వ్యామోహముతోడ చక్కనగు నాశంపాంగి వాసంపు జీ
వనమా! సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా
కనుమా శ్రీమతి ప్రేమమున్, తనమదిన్ కారించుటన్యాయమౌ
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వినుమా! జవ్వని ! నూత్నజీవనవిధుల్ విధ్వంశమార్గంబులే
రిప్లయితొలగించండిమనమున్ స్వేచ్ఛనుగోరగా కరమసామాన్యంబు దుర్నీతులన్
గొనుచున్ భద్రతలేకనే విలువలన్గోల్పోయి ప్రేమంపు జీ
వనమా! సాహసమింత చెల్లదు సుమా! బాగోగులూహింపుమా!
యువతీ యువకుల ఆధునిక సహజీవనము పై వ్యాఖ్య!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదములో చిన్న సవరణ!
తొలగించండి"విధ్వంస మార్గంబులే" యని చదువ ప్రార్ధన!
గురుదేవులకు ధన్యవాదములు, నమస్సులు!🙏🙏🙏🙏🙏
రిప్లయితొలగించండిధనమున్,ధాన్యము,సౌఖ్యముల్ నొసగు సంధానమ్ముచెట్లౌను|జీ
రిప్లయితొలగించండివనమా సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహించుమా
తినగా తిండియు గాలి నీరెటుల చింతించంగనెట్లబ్బు?యే
వనముల్ బెంచక ద్రుంచగా?బ్రతుకు సర్వస్వంబుగోల్పోవుటే|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనమౌ రీతి సృజించె ధాత మనుజున్ క౦జాక్షు సేవి౦పగన్
రిప్లయితొలగించండితనరెన్ లోచన కర్ణ బాహు చరణ ద్వంద్వమ్ములున్,వక్త్రమున్
వినుతింపన్ హరి, గాని కాముకునిగా పేట్రేగగా కాదు. యౌ
వనమా! సాహసమింత చెల్లదు సుమా,బాగోగులూహింపుమా.
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఒమరను పేరుతో యుగ్రవాదిగా మారిన సుబ్రమణ్యం తండ్రి వేంకటనరసింహారావు గారి ఆవేదన:
రిప్లయితొలగించండిపని నైపుణ్యత పెంచుకొమ్ము చెడు సావాసమ్ములేలంచు నే
నన నావాసము వీడి నీ'వొమరు'గన్నన్యాయముల్ జేసితే
కనలేకుంటిమి యుగ్రవాదిగ సుతా! కారుణ్యహీనంపు జీ
వనమా! సాహస మింత చెల్లదు సుమా! బాగోగు లూహింపుమా !!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తన శౌర్యమ్మునకంతు లేదననుచున్ దర్పించు చుండున్సదా!
రిప్లయితొలగించండిఅనయమ్మున్ తన సాటి లేరెవరనంచున్నాలింపదే సూక్తులన్
అనుచున్నీ పయి నిందలెన్నొ గలవే ఆలోచనన్ సల్పు;యౌ
వనమా!సాహస మింత చెల్లదు సుమా బాగోగులూహింపుమా !
(కొప్పరపు వారి పూరణ యింకా చూడలేదు.ఇది పోస్ట్ చేసి చూద్దామనుకున్నాను.)
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న బ్లూవేల్ గేమ్ నుద్దేశించి)
రిప్లయితొలగించండికనగానంతరజాలమందునకటా కాటేయు క్రీడావళిన్
మునిగెన్ బాల్యము వెర్రిమొర్రిపనులన్ మోదమ్ముతోజేయుచున్
తనవారల్ పెనుశోకమందు మునుగన్ త్యాగమ్ముజేయించు జీ
వనమా!సాహసమింత చెల్లదు సుమా బాగోగులూహింపుమా!
వీటూరి భాస్కరమ్మ గారూ,
తొలగించండికాలానుగుణమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనిలో గెల్వగ చెట్లు కొట్టుటకయో హైకోర్టునొప్పించిరే
రిప్లయితొలగించండికనుమా నీవటు కాంకిరీటు రథ ముల్ కంపించి వచ్చెన్నహో
వినుమా నీవు కృశింప తప్పదికనో బేచారివై జూబిలీ
వనమా! సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా!