11, సెప్టెంబర్ 2017, సోమవారం

సమస్య - 2461 (రంగని ఛీ యనిరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్!"
(ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు)

89 కామెంట్‌లు:

  1. ఎంగిలిబ్రతుకుల రంగుల
    హంగులపొంగులును మదికహంకృతి నేర్పన్
    క్రుంగుచు చెడు తలపులు చే.
    రం గని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

    రిప్లయితొలగించండి
  2. అంగము నలయగనీయక
    చెంగట దనవారి గనక చెడుమార్గములన్
    వెంగలియై తమ దరి జే
    రం గని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
  3. అంగన సాంగత్యమునకు
    దొంగగ భ్రష్టయి మసలుచు ధూర్తుల తోడన్
    చంగున నిగముడు గుడి చే
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్
    (చేరన్+కని) (చంగున=అకస్మాత్తుగా)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిగమశర్మను ఎవరు ప్రస్తావిస్తారా అని చూస్తున్నా... మీరు ఆ పని చేశారు. సంతోషం!

      తొలగించండి
  4. శృంగార పిపాసుండై
    బంగారమువంటి సతిని బాధించుచు వా
    రాంగనల జేరు ఖలుడౌ
    రంగని ఛీ యనిరి పాండు రంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
  5. వంగని మతవాదమునన్
    క్రుంగుచు ద్వేషమసహనము క్రోధమ్మునకున్
    లొంగిన వాడగునా బజ
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్!


    బజరంగ్ = బజరంగ దళ సభ్యుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (బజరంగ దళ్ సభ్యుని అల్లా, క్రీస్తు భక్తులు చీకొడతారు కాని పాండురంగని భక్తులు కాదు కదా!)

      తొలగించండి
    2. సార్!

      "వైష్ణవ జనతో..." భక్తుడైన మహాత్మా గాంధీ గారు సహించరు కదా!

      🙏🙏🙏

      ...ప్రభాకర శాస్త్రి

      తొలగించండి
    3. నిజమేనండోయ్... బాగుంది మీ సమర్థన. సంతోషం!

      తొలగించండి
  6. సంగము దుష్టాత్ములతో
    లొంగగ నార్గురు విరోధు లొక్కటికాగా
    తింగరి నారాయణు దూ
    రంగని ఛీయనిరి పాండురంగని భక్తుల్!

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. చెంగున వేశ్యను జేరగ
      పొంగెడు మదినిండ ప్రేమ పోటీ పడగన్
      బంగరు పూవుల గొలిచెడి
      రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. బంగారము,సంపదలును
    భంగ పరచ గలవె వారి భక్తిని నిష్ఠన్?
    అంగనల మలిన శృంగా
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శృంగారం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "అంగన శృంగారిగ జీ।రం గని..." ఆందామా? (చీరన్ = పిలువగా)

      తొలగించండి
    2. సవరణకు ధన్యవాదాలు!
      నాకూ అదే సందేహం మొదట తొలిచింది.

      తొలగించండి

  9. రంగీలా షోకులతో
    భంగుల దట్టించుచున్ సభలలోనన్ శ్రీ
    రంగపు నీతుల చెప్పెడు
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. చెంగల్వచేతిసామిని
    పొంగారెడి భక్తిఁ మ్రొక్కు పుణ్యాత్ములు త
    త్సాంగత్యవిముఖవాగ్ధా
    రంగని (ధారన్ + కని) ఛీయనిరి పాండురంగని భక్తుల్

    రిప్లయితొలగించండి
  11. సంగంబులు త్యజియించిన
    మంగళకర రూపధారి మగువల యెడలన్
    శృంగారి యౌట కనులా
    రం గని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  12. దొంగతనముజేసిన యా
    గంగడు రక్షక భటుండు గాంచగ నే వే
    గంగా పరుగిడి గుడిజే
    రంగని ఛీ యనిరి పాండు రంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేగంగా' అన్న వ్యావహారిక ప్రయోగాన్ని గురించి వాట్సప్ సమూహంలో చేసిన సూచన గమనించండి.

      తొలగించండి
  13. భంగముచేసి తలుపు శ్రీ
    రంగములోనిగుడిలోన రాతిరివేళన్
    దొంగలమృతపడిఁ గొన చే
    రం గని ఛీయనిరి పాండు రంగని భక్తుల్

    రిప్లయితొలగించండి
  14. ఇంగిత మింత యు లేక యు
    భంగు ను సేవించి దుష్ట వర్తను డ గు చున్
    రంగ న దె పుడు కొలువనే
    రం గని ఛీ యనిరి పాండు రంగని భక్తుల్

    రిప్లయితొలగించండి
  15. మంగళకరంబయెడు శ్రీ
    రంగని దరిసెనము చేసి రాకనె, తినగన్
    చెంగట నుంచిన ఫలహా
    రం గని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఫలహారం' వ్యావహారికం!

      తొలగించండి
  16. రంగని గుడిలో దూరుచు
    దొంగిలి తా విగ్రహమ్ము దొరుకక తృటిలో
    దొంగయె తప్పించుక పా
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
  17. రంగడు దైవమ ప్రజలకు
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్
    రంగని భక్తుల కిటులుగ
    భంగము గలిగించు మాట బలుకగ నేలా ?

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పొంగారెడి జవరముతో
    నింగము గూర్చని బడాయి నిడల ప్రలాపిం
    చంగన్నిల్చి చెలయు నా
    రంగని ఛీయనిరి పాండురంగని భక్తుల్

    రిప్లయితొలగించండి
  19. రంగా రంగా యనుచును
    మంగళ కైసికిని గొల్చు మాలగు దాసున్
    చెంగట నిల్వగ హీనపు
    రంగని ఛీయనిరి పాండురంగని భక్తుల్!

    హీనపు రంగని= హీనవర్ణము(జాతి) వాడని
    మాలదాసరి మేల్కొలుపు పాటలలో మంగళ కైసికి రాగాన్ని తనకు ధారబోయమని బ్రహ్మరాక్షసుడు అడుగుతాడు. అది తనకత్యంత ప్రియమైనదని దాసరి నిరాకరిస్తాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా. సీతా దేవి గారు “కౌశిక” రాగ మనుకుంటాను.
      "భైరవః కౌశికశ్చైవ హిందోలో దీపకస్తథా, శ్రీరాగో మేఘరాగశ్చ రాగాః షడితి కీర్తితాః" [భరతుడు]

      తొలగించండి
    3. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! అది మంగళ కైసికి రాగమేనండీ! ఇప్పుడే మా సంగీత గురువుగారిని యడిగి సందేహ నివృత్తి చేసికున్నాను! చాల పురాతన రాగమని, అన్నమాచార్యులవారు కూడ ఈ రాగములో కీర్తనలు చేశారని చెప్పారు!కౌశిక రాగము కూడ యున్నదని చెప్పారు!
      🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    4. చ. కలడొకరుండు పేరుకొనగాని కులంబు మదీయ భక్తు డి
      య్యిల మును వాడు వామనత నే వసియించిన పుణ్యభూమి యం దులకొక యోజనత్రయపు దూరపుటూర వసించి, బ్రాహ్మ వే
      ళల చనుదెంచి పాడు మము లాలస మంగళ నామ కైశికిన్


      http://varaprasadchaitanyabharathi.blogspot.in/2012/06/9.html?m=1

      తొలగించండి
    5. ధన్యవాదములు అన్నయ్యా!
      అయితే కైశికి ని కైసికి గా వ్రాసినందుకు చింతిస్తున్నాను!🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    6. ఓహో మంగళ కైశికి యను రాగము కూడ కలదా! ధన్యవాదములండి.
      కైశికి అంటే కేశములకు సంబంధించినది యని, కౌశిక (కౌశికీ) యన కుశికుని మనుమరాలు సత్యవతి (విశ్వామిత్రుని సోదరి) కౌశికీ నదియైన యామెకు సంబంధించిన రాగము.
      బహుశ మంగళ కైశికి, కౌశికి రెండూ ఒకే రాగమని నా యనుమానము. మీ సంగీత గురువు గారిని మఱి యొక సారి సంప్రదించండి.
      భృగు కుశిక వంశముల సంకరము పరశురామ జనన కారణము.

      తొలగించండి
    7. తప్పక సంప్రదిస్తాను! కొద్దిపాటి స్వర బేధముతో రెండు రాగాలు కూడ యుండవచ్చు! జనక జన్యరాగాలుగా కూడ యుండవచ్చు!

      తొలగించండి

    8. కైశిక మహాత్మ్యము/కైశిక రాగము గురించి
      Hope it triggers more interest



      https://archive.org/details/KaishikaMahatyamuMOHANPUBLICATIONS

      జిలేబి.

      తొలగించండి
  20. పొంగగ కామము వెలచెలి
    రంగని గుడి దరినె విటుని రమ్మని పిలువన్
    కొంగును జారిచి యా చీ
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
  21. శృంగార జలధిఁ దేలుచు
    నంగీకృత విష్ణుకీర్తనార్చన సేవల్
    భంగమొనర్చెడు నా సా
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

    రిప్లయితొలగించండి
  22. అంగాంగాభరణ విలసి
    తాంగ జగద్రక్షకుండు హరిని దురిత హీ
    నాంగిత నాస్తికులు వదర
    రంగని, ఛీ యనిరి పాండురంగని భక్తుల్

    [పదరు = ఆక్షేపించు]

    రిప్లయితొలగించండి
  23. మంగళమగుదేవళమున
    రంగడునాబేరబరగు రాక్షసుడొకడు
    న్నంగనల గించబరచగ
    రంగనిఛీయనిరి పాండురంగని భక్తుల్

    రిప్లయితొలగించండి
  24. లింగడు ఘనుడని శైవులు
    రంగని ఛీ యనిరి, పాండురంగని భక్తుల్
    ఖంగు తినక హరి ఘనుడని
    గంగాధరదూషణములు గావించెనటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ వైవిధ్యమైన భావంతో బాగున్నది. అభినందనలు.
      "గావించి రటన్" అనండి.

      తొలగించండి
  25. సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీమతి జి సందిత (Sanditha)అనంతపురము


    భంగున్ మద్యము ద్రాగుట
    చొంగల్ గారంగనోట సోయిచెడంగన్
    గంగులుతూలుచుదఱిచే
    రంగని ఛీ! యనిరి పాండురంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
  26. అంగన సింగారంబు గ
    నంగనె?లోబడెను విప్ర నారాయణుడే
    బంగము జరుగగనే దూ
    రం గనిఛీ యనిరి పాండురంగని భక్తుల్|

    రిప్లయితొలగించండి
  27. భంగును సేవించుచు వీ
    రంగము సృష్టించి యూర రాతిరి బవలున్
    కింగను వాడొక గుడి జే
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్!

    రిప్లయితొలగించండి
  28. గురువు గారికి నమస్సులు
    నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.
    శృంగా ది దే వత లను సు
    మం గ ళ భక్తి న కొలువ గ మదనా o కిత పతి
    కంగారు న కేళీ లో
    రంగని ఛీ య ని రి పాండు రంగ ని భ క్తుల్.
    వంద నములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పంచరత్నం మిత్రమా కుశలమా రెండవ పాదములో చివర గణము తప్పినది. ఒక్కసారి సవరించుము

      తొలగించండి
    2. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ అర్థం కాలేదు. 'శృంగ+ఆది దేవతలు'..? భక్తిని.. అనాలి. రెండవ పాదం చివర గణదోషం. 'కేళీలో'..?

      తొలగించండి
  29. గంగాది నదుల మునుగక
    శృంగారాంబుధిని మునుగ శీలము చెడగా
    నంగనలతో తిరుగు నా
    రంగని ఛీయనిరి పాండు రంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
  30. సింగార మొలుక వలువల్
    రంగనికి నలంకరింప ప్రతిపాదించ
    న్నంగడిఁ జూపఁగ నల్లని
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

    రిప్లయితొలగించండి
  31. కుశల ము గురువు గారు.పొరపాటు జ రి గి న ది.
    మదనాo కితు డౌ ఆ ని చదువ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  32. పొంగళి తిన కుకురము జే
    రంగని 'ఛీ'యనిరి పాండు రంగని భక్తుల్.
    యెంగిలి యౌనని తలచి,యె
    రుంగరు వచ్చినది శునక రూపున హరి యన్

    రిప్లయితొలగించండి

  33. పిన్నక నాగేశ్వరరావు.

    దొంగతనమె తన వృత్తిగ

    హంగుగ దుర్జనుల తోడ నాలయ
    మునకున్
    దొంగిలగా వచ్చిన యా

    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
  34. గురువు గారు దంప తు లిద్దరు కేళీ లో మునిగి తేలుతున్న సమయము లో వారిని చూచి ఛ ఆ న్నారని వము. భర్త పేరు లోరంగడు
    నా భావ ము. వందనములు.

    రిప్లయితొలగించండి
  35. గురువు గారు దంప తు లిద్దరు కేళీ లో మునిగి తేలుతున్న సమయము లో వారిని చూచి ఛ ఆ న్నారని వము. భర్త పేరు లోరంగడు
    నా భావ ము. వందనములు.

    రిప్లయితొలగించండి

  36. దొంగయు తానయ్యెన్ వా
    రాంగన కొసగంగ నగల నవనిని నొకడున్
    శృంగార పురుషుడౌ నా
    రంగని ఛీ యనిరి పాండు రంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి
  37. దొంగయు గ్రుంగిన గుడిలో
    జంగమ దేవరనుగూర్చి జక్కనిదగు వ్యా
    సంగము జేయగ దరి జే
    రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

    రిప్లయితొలగించండి