12, సెప్టెంబర్ 2017, మంగళవారం

సమస్య - 2462 (తద్దినమే శుభమిడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ"
(లేదా...)
"తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై"
(ఈ సమస్యను పంపిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు)

100 కామెంట్‌లు:

  1. రామకృష్ణ పరమహంస కాళీ మాయితో:

    ప్రొద్దున రాత్రియు పగలున్
    నిద్దుర మెలకువను లేక నిన్ను భజింతు
    న్నెద్దినము నిన్ను గాంచిన
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  2. ఒద్దిక మీరగ గృష్ణుడు
    ముద్దియ సత్య న్నిడుకొని మోహరమందున్
    మొద్దగు నరకుని నరకిన
    తద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. పెద్దలు జెప్పగ వింటిని
      ముద్దుగ కన్నియ లంత మోజగు నాటల్
      చద్దిని నూయల లూగిన
      తద్దినమే శుభ మిడునట తధ్యము సుమ్మీ .


      తొలగించండి
    2. అక్కయ్యా,
      అట్లతద్దెను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "ముద్దుగ కన్నియలు చేరి మోజగు..." అందామా?

      తొలగించండి
    3. పెద్దలు జెప్పగ వింటిని
      ముద్దుగ కన్నియలు చేరి మోజగు నాటల్
      చద్దిని నూయల లూగిన
      తద్దినమే శుభ మిడునట తధ్యము సుమ్మీ .


      తొలగించండి


  4. మిద్దెల్ స్మారక మేడల్
    శుద్ధగ దండగ జిలేబి సూక్ష్మము గనుమా
    పెద్దనిదురగన నాత్మకు
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పెన్నిద్దురను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. జీపీయెస్సు వారికి, కంది వారికి

      నమో నమః !

      వేమన తాతేమో వేరేలా అన్నాడు :)

      జిలేబి

      తొలగించండి
    3. ప్రేయసి ముఖవర్చస్సును పొగుడుతూనే...
      కళ్ళు, నాసిక, బుగ్గలు, పెదవులు, పలువరుస, గడ్డము...
      వీటిని అన్యార్ధంలో వాడాలి.
      ఈ సమస్యని పూరించమని అడుగగలరా?

      తొలగించండి

    4. సరసంలో విరసం - పెండ్లామా దరి నేర రావెే :)


      ఓనా! సికరాణి! మురిసి
      నానిల్లాపె! దవులేల ! నాపలు వరుసే
      నేను? యురల గడ్డ ముఖం
      బైనాడన! నోట బుగ్గ బడ పొక్కళ్ళై !

      జిలేబి

      తొలగించండి
    5. జిలేబిగారూ! మీకసాధ్యమైనదేదీ లేదు! నమోనమః! 🙏🙏🙏🙏

      తొలగించండి
    6. జిలేబీ గారూ:

      శంకరాభరణం: సమస్య - 1173

      మిస్ చేసారు:

      "పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్"

      తొలగించండి

    7. A cage is a cage golden or wooden :)

      బంజారా హిల్స్ లోనన్
      వింజామర ఛాయలనరవిందంబని యా
      కంజదళముఖి యనుకొనన్
      పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్!

      జిలేబి

      తొలగించండి
    8. గంజాయి త్రాగి దొర్లుచు
      పంజాబీ యువతి నవ్వి పండ్లికిలించన్
      కంజాక్షి మోము జూచుచు
      పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్

      తొలగించండి
    9. ముంజలు తినుటకు రాదని
      యంజలి తానాశ వీడి యలుక వహించెన్
      గింజలు తినగను పక్షులు
      పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్

      తొలగించండి
  5. ముద్దుల గుమ్మయౌ సుతకు ముద్దుగ గొప్పగ పెండ్లి జేయతా
    ప్రొద్దున పట్టణంబునకు పోయెను జోస్యుని నిర్ణయంబుకై
    శ్రద్ధగ చూచి దైవి యనె శ్రావణ పంచమి మించరా దయా
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై

    రిప్లయితొలగించండి


  6. మిద్దెలు గట్టి పెద్దలకు మిక్కుట మై పరమోన్నతిన్నిడ
    న్నద్దరి చేర దయ్య ! విను నమ్ము, నిమీలనమున్ మహాశయా
    శుద్ధము గాను పిండముల సూక్ష్మము జేర్చ సహాయమౌ, గనన్
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. అద్దపు సమాజము నెఱిగి
    గుద్దెడు నైలయ్యవంటి గురుమూర్తులనే
    దిద్దన్ దగు దినమేదో?
    తద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  8. ఎద్దినమున విప్రులకున్
    పద్ధతిగా భుక్తినిచ్చి భక్తి తలిర్పన్
    సద్ధర్మమాచరించిన
    తద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  9. ఒద్దికతో మానవుడిల
    పెద్దలు పిన్నలకు మధ్య భేదము గనుచున్
    ముద్దుగ నుండంగా నే
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ

    హ.వేం.స.నా. మూర్తి.

    రిప్లయితొలగించండి
  10. ముద్దియ లెల్లరు మోదక
    తద్దెను ఘనముగ జరిపి యుదయమున వేడ్కన్
    చద్ది కబళమును దినగా
    "తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      ఉండ్రాళ్ళ తదియను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మోదక తద్దె' దుష్టసమాసం.

      తొలగించండి
  11. పెద్దల యాశీర్వాదము
    సిద్ధింపగ శ్రద్ధతోడ చేయగబూనన్
    పద్ధతి తెలియగ పితరుల
    తద్దినమే శుభమగునట తథ్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  12. యెద్దానిని గనుగొనినన్
    సిద్ధించునొ ముక్తి కాంత సిద్ధాన్నముగన్
    తద్ధామము జేరుకొనిన
    తద్దినమే శుభమగునట తథ్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణను యడాగమంతో ప్రారంభించారు. "ఎద్దానిని" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్సులు, ధన్యవాదములు! తప్పక సవరిస్తాను!🙏🙏🙏🙏

      తొలగించండి
    3. ఎద్దానిని గనుగొనినన్
      సిద్ధించునొ ముక్తి కాంత సిద్ధాన్నముగన్
      తద్ధామము జేరుకొనిన
      తద్దినమే శుభమగునట తథ్యము సుమ్మీ!

      తొలగించండి
  13. వద్దిక విదియలు,తదియలు
    పద్దతిగా పనులజేసి ఫలమును బొందన్
    ముద్దుగ సిద్దిని బొందెడు
    తద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  14. ప్రొద్దుననే లేచి నిదుర
    శుద్ధిగ నా పరమ శివుని స్తోత్రంబిడుచున్
    ఒద్దికగానొదిగుండిన
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఒదిగి+ఉండిన అన్నపుడు యడాగమం వస్తుంది. "...బిడుచు। న్నొద్దిక నొదుగుచు నుండిన..." అందామా?

      తొలగించండి

    2. మాస్టరుగారూ! ధన్యవాదములు.

      ప్రొద్దుననే లేచి నిదుర
      శుద్ధిగ నా పరమ శివుని స్తోత్రంబిడుచు
      న్నొద్దిక నొదుగుచునుండిన
      తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ.

      తొలగించండి
  15. ముద్దుగ పెంచినా దనకు మోదము తోడ గుమారు డెప్పుడున్
    ముద్దను బెట్టలేక దన ముప్పున వృద్ధుల యాశ్రమమ్మునన్
    వద్దుర యన్ననూ వినక వాదన జేయుచు జేర్చ, యాయువున్
    ప్రొద్దు కుమారుడొచ్చి గొని బోవగ యేడ్చుచు, యాస్తి గోరి యీ
    తద్దిన మేశుభం బిడుట తథ్యమ టంచువ చించె వి జ్ఞుఁడై"


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పెంచినన్... వద్దుర యన్న దా వినక... జేర్ప నాయువున్... (ఒచ్చి అనడం సాధువు కాదు)... బోవగ నేడ్చుచు నాస్తి గోరి..." అనండి.

      తొలగించండి
    2. గురువు గారు అనుమానము వచ్చింది తప్పు వ్రాస్తున్నాను అని సరి దిద్దు కుంటాను

      తొలగించండి
  16. మద్దతు మంచి కొసం గుచు
    నోద్దికగా కృషి చేయ దేశ మున్నత మగుచు న్
    తద్దయు వెలుగుల జిమ్మేడు
    తద్దినమే శుభ మిడు నట తథ్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "...నొద్దిక కృషి చేయ..." అనండి.

      తొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ముద్దుగ పెరిగిన తనయుడు
    విద్దియతో రాణకెక్కి పెంపొందుచు తా
    పెద్దల కాదృతి గూర్చెడి
    తద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ!


    రిప్లయితొలగించండి
  18. పెద్దలు చూపిన పథమున
    నొద్దికగా జనులు నడవ నొనగూడు సిరుల్
    యద్దిన మది మొదలగునో
    తద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పూరణలోని 'యద్దిన' మన్నది "యద్దినం తద్దినం నాస్తి తద్దినం మమ తద్దినమ్" అని ఒక బ్రాహ్మణుడు వాపోయిన శ్లోకభాగం గుర్తుకు తెచ్చింది.

      తొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ముద్దుగ బెర్గుచు న్నెఱినమోఘముగా నిడు చక్కనైన స
    ద్విద్దియలన్నియున్ కఱచి పెంపరియైన కుమారుడున్ తమ
    న్నొద్దిక తోడ నాదుకొను యోగ్యత కూడినచో తండ్రియే
    తద్దినమే శుభంబిడుట తథ్యమటంచు వచించె విజ్ణుడై


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లో మీ పద్యంపై కొన్ని సూచనలు చేశాను. గమనించండి.

      తొలగించండి
  20. ఎద్దినము సూర్యుడుండునొ
    తద్దినమే శుభమిడునట తధ్యము సుమ్మీ
    యద్దినము పనులు చక్కగ
    నొద్దికగా జేయవచ్చు నుర్విని మనమున్

    రిప్లయితొలగించండి
  21. ఎద్దిన ముండునో రవియు నిద్ధర నెప్పుడు జింతజేయగన్
    తద్దినమే శుభంబి డుట తధ్య మటంచు వచించు విజ్ఞుడై
    మద్దుల గోపీనాథుడట మాన్యుడు ,పెద్దలు గానిపించగా
    నొద్దిక తోడదా నెపుడు నుండును సాదర మొప్ప నత్తఱిన్

    రిప్లయితొలగించండి
  22. ఎద్దినమున రవిగనమో
    తద్దినమది దుర్దినమని తాత్వికులనగన్
    ప్రొద్దును ప్రొద్దున పొడగన
    తద్దినమే శుభమగునట తథ్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  23. అద్దానవాంతకుఁ బుడమి
    ముద్దియ భారక్షయకరు మురరిపుఁ బొగడన్
    సుద్దుల మొద్దుల కైనను
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ


    అద్దిర యే మనంగ వలె నాద్విజ సత్తము చింతనమ్ములన్
    విద్దెలఁ దద్దయున్గరిమ పృధ్విని నొందిన నేమి లాభమో
    యెద్దిన ముండ నోపును మదీప్సిత తద్దిన భోజనమ్మికం
    దద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తం(నిజానికి రెండవ పూరణ అద్భుతం)గా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  24. ముద్దులప్రియురాలే వెస
    తద్దయు ప్రేమమ్ముతోడ దరికేతెంచన్
    హద్దులు లేకుండ చెలగు
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  25. ముద్దుల మూట గట్టు నొక పుత్రుని యిచ్చిన దంచు మెచ్చుకన్
    ముద్దియ నేగి పండితుని మూర్తము కోరగ పేరు పెట్టగా
    తద్దిని మంచిదే శిశువు తారకు నప్పును ముందు కేగు డే
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై.

    రిప్లయితొలగించండి
  26. .శ్రద్దాసక్తత జేరిన
    బద్దకమే పారిపోవు|బాధ్యత బెరుగన్?
    “నిద్దుర పగలే బట్టని
    తద్దినమే శుభమిడునట”| తథ్యము సుమ్మీ|
    2.శ్రద్దగ సైనికోత్తముడు సర్వ విధాలుగ శత్రు మూకనే
    గ్రద్దయు చూపునన్ తరుమ గల్గినరోజున ?దేశ సేవయౌ
    తద్దినమే శుభంబిడుట తథ్యమటంచు వచించె విజ్ఞుడై|
    బుద్ధి వివేకమున్ బ్రతుక?”పుట్టినజన్మకు సార్థ కంబగున్.”

    రిప్లయితొలగించండి
  27. ఒద్దికతోడుతన్ మరియు నోరుపుతోడుత నింటిలక్ష్మియై
    పెద్దల గౌరవించుచును బిడ్డలనిత్యము సంస్కరించుచున్
    తద్దయు ప్రీతి భర్తఁగను దార లభించిన వానిజీతమ్మునన్
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువు గారికి నమస్కారములు. తమరి సూచనల మేర పద్యాన్ని సవరించాను. దయతో పరిశీలించండి.
    ముద్దుగ బెర్గుచు న్నెఱినమోఘముగా నిడు చక్కనైన నా
    విద్దియలన్నియున్ కఱచి పెంపరియైన కుమారుడున్ తమ
    నొద్దిక తోడ నాదుకొను యోగ్యత కల్గినపుండు తండ్రియే
    తద్దినమే శుభంబిడుట తథ్యమటంచు వచించె విజ్ణుడై

    రిప్లయితొలగించండి
  29. గురువు గారికి నమస్సులు
    నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు
    ఒ ద్ది క వద్దని సచివు లు
    శుద్దులతో పొడ్డుగడప జూ డ క నె o తే
    విద్దె ల నేర్చిన బుద్ధుని
    త ది న మే శు భ మ గు న ట త thyamu సుమీ
    మొదటి పాదం లో హల్లు తో ప్రా రం భి o చా ల ని
    , సుద్దులు , ఆ o గ్ల ము లో టైప్ చే సి నా ను
    చివరి పాదము లో ద వత్తు లేదు. టైపింగ్ పొరబాటు.
    వందనములు.

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వు,వూ,వొ,వో'లతో మొదలయ్యే తెలుగు పదాలు లేవు.
      మీరు టైపు చేస్తున్నపుడు అక్షరాల మధ్య వ్వవధానం ఎందుకు వస్తున్నది? మీరు ఏ కీబోర్డును ఉపయోగిస్తున్నారు?

      తొలగించండి

  31. పెద్దలు ప్రాణహీనులకు ప్రీతిని పిండప్రదానమిచ్చినన్.
    హద్దులు లేని దీవెనలనందగఁజేతురు పితృదేవతల్.
    దిద్దగ తప్పులన్నియును తేకువ;జాగొనరింపనేలొకో!!
    తద్దినమే శుభంబిడుట తథ్యమటంచు వచించె విజ్ఞుడై

    రిప్లయితొలగించండి
  32. సుద్దుల జెప్పె దండ్రి దొలి చూలున బుట్టిన రాకుమారుతో
    నెద్దినమందు సాధువుల నీశ్వర భక్తుల మోక్షగాములన్
    సిద్ధుల సేవ జేసి పరిశీలన జేయుచు శీలమందెదో
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై

    రిప్లయితొలగించండి
  33. హద్దులు మీరిన లంచము
    నిద్ధరపైనుండి తరమి యీభరతోర్విన్
    దిద్దెడి ధీరుడు పుట్టిన
    తద్దనమే శుభముగను తథ్యము సుమ్మీ.


    రిప్లయితొలగించండి
  34. వద్దన దార, తమ్ముడును పావని సీతను బాధఁ బెట్టుటన్
    నిద్దుర నైన వీడడని, నేర్పున లంకను జేరి రాముఁడే
    పెద్దగ రావణాసురుని వేటుకు లగ్నమడుంగఁ గూర్చుచున్
    దద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై!
    ( వాల్మీకి రామాయణం లో యుందో లేదో ఓ సినిమాలో ఇలాగే చిత్రించారు.)

    రిప్లయితొలగించండి
  35. హద్దులు మీరిన లంచము
    నిద్ధరపైనుండి తరమి యీభరతోర్విన్
    దిద్దెడి ధీరుడు పుట్టిన
    తద్దనమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

    రిప్లయితొలగించండి


  36. విద్దెలు నేర్వక భువిలో

    మొద్దుల వలెతిరుగుచుండ మరిపెము తోడన్

    ముద్దుగ తల్లియు నేర్పన్

    దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.


    ఎద్దిన మదిమంచి దనుచు

    నొద్దిక గానడుగ పంతులొప్పగ ననె దా

    నిద్ధరలో  ముదమొసగెడు

    దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.


    నిద్దుర తిండియు మానుచు

    నిధ్ధరలో సతము శ్రీశు ని కొలుచు ప్రజకు

    న్నద్దినమేతిథియైనను

    దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.


    తద్దినముననే సుతునకు

    నొద్దిక యౌకొలువు దొరక నుత్సాహముతో

    ముద్దుగ పలికెను సతితో

    దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  37. ఎద్దినమందున మనుజులు
    యొద్దిక భేదములులేక నొకరు నొకరితో
    పొద్దులు హాయిగ నుందురొ
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ

    ఎద్దిన మందు మానవత కెంతయు భంగము గల్గకుండునో
    యెద్దినమందు మానవులు హింసను మాని చరించు చుందురో
    యెద్దినమందు నింతులను నెంతయు మన్ననసేయ నేర్తురో
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మనుజులు+ఒద్దిక' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. అక్కడ "మానవు। లొద్దిక..." అనండి.

      తొలగించండి

  38. పిన్నక నాగేశ్వరరావు.

    ఒద్దికగా పై చదువుకు

    ముద్దుల కొడుకున్ విదేశమునకున్
    జనగా
    పెద్దలకున్ ముదము కలుగు

    తద్దినమే శుభమిడునట తథ్యము
    సుమ్మీ!

    రిప్లయితొలగించండి


  39. వద్దన్నపనులు చేయక
    హద్దులలో తిరుగ యువత యానందముతో
    నిద్ధరలోమేలగునౌ
    దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

    బద్దకమునువిడి పిల్లలు
    ముద్దుగ తమపనులుతామె మురిపెము తోడన్
    నొద్దకగా చేసుకొనెడి
    దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  40. గురుదేవుల సూచనతో సవరించిన పద్యములు
    ఎద్దినమందున మానవు
    లొద్దికభేదములులేక నొకరు నొకరితో
    పొద్దులు హాయిగ నుందురొ
    తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ

    ఎద్దిన మందు మానవత కెంతయు భంగము గల్గకుండునో
    యెద్దినమందు మానవులు హింసను మాని చరించు చుందురో
    యెద్దినమందు నింతులను నెంతయు మన్ననసేయ నేర్తురో
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  41. గురువు గారు గూగుల్ తెలుగు కీబోర్డు వాడుచున్నాను.ఈ రోజు నాలుగు సార్లు పూరణ పూర్తీ చేయడము ప్రచురిం చు ఆ నే బటన్ క్లిక్ చే యు లోపు పూర్తి గా తొలగి పోయింది. విలువైన సమాచారాన్ని అందిం చి న మీకు మ రొక్క మా రు నమస్సు లు

    రిప్లయితొలగించండి
  42. గురువు గారు గూగుల్ తెలుగు కీబోర్డు వాడుచున్నాను.ఈ రోజు నాలుగు సార్లు పూరణ పూర్తీ చేయడము ప్రచురిం చు ఆ నే బటన్ క్లిక్ చే యు లోపు పూర్తి గా తొలగి పోయింది. విలువైన సమాచారాన్ని అందిం చి న మీకు మ రొక్క మా రు నమస్సు లు

    రిప్లయితొలగించండి
  43. ముద్దుగ ముందు రాతిరిని ముచ్చట పిల్పులు వచ్చి చేరగా
    నిద్దురలో మహా వడల నింపుగ గాంచుచు స్వప్నమందునన్
    ప్రొద్దున లేచి పూజలది పుస్తక మొక్కటి ధూళి దుల్పెడిన్
    తద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై...

    రిప్లయితొలగించండి